పులివెందులలో హింసకు టీడీపీ పన్నాగం | Sakshi
Sakshi News home page

పులివెందులలో హింసకు టీడీపీ పన్నాగం

Published Mon, May 13 2024 3:47 AM

TDP plot for violence in Pulivendula

కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి కడప: హింసకు తావు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పోలింగ్‌ జరిగేలా ఎన్నికల కమిషన్‌(ఈసీ) చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పోలింగ్‌లో హింసకు టీడీపీ కుట్ర చేస్తోందని తెలిపారు. పోలింగ్‌ ప్రారంభంలోనే వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మొదటగా హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గలాటాలు చేయాలని ప్రణాళిక రూపొందించుకుందన్నారు.

ఇప్పటికే చంద్రబాబు దీనికి సంబంధించి డైరెక్షన్‌ ఇచ్చారని, వారి అనుకూల అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు యత్నిస్తోందని తెలిపారు. అనుకూల మీడియాలో ఆ ఘటనలకు విస్తత ప్రచారం కల్పించి, వైఎస్సార్‌సీపీనే చేయించినట్లుగా తప్పుడు ప్రచారానికి కుట్ర జరిగిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ఈ వ్యూహం రచించారన్నారు. స్వేఛ్చగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమని, అందుకే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement