Pulivendula
-
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
అధైర్యపడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ శ్రేణులు, అభిమానులతో మమేకమయ్యారు. ఉదయం 9.15 గంటల నుంచి ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనికి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరుల వెంట వెళ్లిన కేడర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిన ఇప్పట్ల గ్రామానికి చెందిన శ్రుతిలయ తన దీననగాథను కుటుంబ సభ్యుల ద్వారా వివరించారు.ఆర్థికంగా కుటుంబం చితికిపోయిందని వారు జగన్ వద్ద వాపోయారు. అదేవిధంగా కడపకు చెందిన ముస్లిం మైనార్టీ దంపతులు వారి కుమార్తె అనారోగ్యాన్ని వివరించి, వైద్య సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన జగన్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆదేశించారు.పెద్దనాన్నతో కాసేపు..వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ బుధవారం వెళ్లారు. ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డితో పాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.నూతన జంటలకు ఆశీర్వాదంఇటీవల వివాహాలైన నూతన జంటలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. దొండ్లవాగు వైఎస్సార్సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం ఇటీవల జరిగింది. విద్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ నూతన జంట మాధురి, నరేంద్రరెడ్డిని ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
పులివెందులలో రెండో రోజు జనంతో జగన్
-
పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్ జగన్‌తో ప్రజలు, అభిమానులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఉల్లి రైతులు.. అన్నదాతల ఆవేదన
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు. -
ఎనలేని అభిమానం.. జగన్‌తో సెల్ఫీలు
-
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
పులివెందులలో వైఎస్ జగన్.. కష్టాలు వింటూ.. నేనున్నానంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
-
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
వైఎస్ఆర్ జిల్లాలో డిటోనేటర్ల పేలుడు కలకలం
-
AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్ టీడీపీ నేత బైరెటీస్ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా -
పులివెందులలో బీటెక్ రవి అనుచరుల దాష్టీకం
-
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. అండర్‌టేకింగ్ ఇవ్వకపోయినప్పటికీ ఎన్ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. -
ధైర్యంగా కష్టాలు ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప : ‘కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులొస్తాయి. ఎవరూ అధైర్యపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రెండోరోజు పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉంద’ని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలి.. పులివెందుల వెంకటప్ప మెమోరియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్–18 గ్రూపు కింద రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సంతోషాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకునేందుకు పులివెందుల క్యాంపు కార్యాలయంలో వారంతా జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ఆయన.. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని, అందుకు ప్రత్యేకంగా తరీ్ఫదు పొందాలని సూచించారు. కష్టపడితే సాధించలేనిది లేదన్న విషయాన్ని జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఉద్భోదించారు. దీంతో.. ‘మీ ఆకాంక్షను నెరవేరుస్తాం సార్’ అంటూ విద్యార్థులు ధీమాగా చెప్పారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. -
జగన్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
-
జగన్‌కు జన నీరాజనం
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల పర్యటనకు వచ్చి న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రాక కోసం రహదారి వెంబడి గంటల తరబడి వేచి ఉండి అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ జగన్ సైతం గ్రామ గ్రామానా ప్రజానీకంతో మమేకం అవుతూ, వారిని పలుకరిస్తూ ముందుకు కదిలారు. ఎక్కడ కూడా ఇసుమంతైనా విసుగు లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందులకు వచ్చారు. వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల చేరుకునేందుకు ఆయనకు 9 గంటల సమయం పట్టింది. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్ రాత్రి 8.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. తొలుత తోళ్లగంగనపల్లె వద్దకు పెద్దఎత్తున చేరుకున్న ప్రజానీకం పలకరింపుతో మొదలైన పర్యటన పులివెందుల వరకూ కొనసాగింది. అండగా ఉంటా.. అధైర్యపడొద్దుకడప నుంచి మాచునూరుకు వెళ్లిన వైఎస్ జగన్.. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీకి ఆ కుటుంబం అందించిన సేవలు గుర్తున్నాయని, దివంగత మాచునూరు చంద్రారెడ్డి తనకు అండగా నిలిచారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటాను, అధైర్యపడొద్దని మాచునూరు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌ను చూడగానే చంద్రారెడ్డి సతీమణీ లక్ష్మీనారాయణమ్మ బోరున విలపించారు. ఆమెను ఓదార్చిన జగన్.. ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చేరదీసి చంద్రారెడ్డి సేవలు గుర్తుచేసుకున్నారు. చంద్రారెడ్డి కుమారులు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి, కోడలు, పెండ్లిమర్రి ఎంపీపీ వరలక్ష్మిలను పలకరించి.. అధైర్యపడొద్దు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. నూతన జంటకు ఆశీస్సులు ఇటీవల వివాహమైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రహాసరెడ్డి కుమార్తె, అల్లుడికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు. చంద్రహాసరెడ్డి స్వగ్రామం గొందిపల్లెలో నూతన జంట ఆశా, శివారెడ్డిలకు వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న వివిధ గ్రామాలకు చెందిన నాయకులను పేరుపేరునా పలుకరించి, ఫోటోలు దిగారు.ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతంకడప ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ దాసరి సు«ధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు జగన్‌కు స్వాగతం పలికారు.