
Pulivendula Vontimitta ZPTC Election.. Polling Updates:
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
భారీగా దొంగఓట్లు వేసిన జమ్మలమడుగు టీడీపీ గూండాలు
రిగ్గింగ్‌కు పాల్పడ్డ కమలాపురం,మైదుకూరు టీడీపీ గూండాలు
క్యూలైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేసిన వైనం
అసలు ఓటర్లకు బదులు దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు
ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున రిగ్గింగ్
టీడీపీ గూండాలకు కొమ్ముకాసిన పోలీసులు
ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్
క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటువేసేందుకు అవకాశం
భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను తరలించనున్న అధికారులు
పులివెందులపై పోలీసులు పగబట్టారు: అవినాష్‌రెడ్డి
పులివెందులలో భారీ రిగ్గింగ్ జరిగింది
ప్రతీ గ్రామంలోనూ టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారు
పోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్ చేశారు
ఈ ఎన్నికలను బర్తరఫ్ చేయాలి
కేంద్ర బలగాలతో రీ పోలింగ్ నిర్వహించాలి
కార్యకర్తలు సంయమనం పాటించాలి
పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు
ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి
అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందాం
ఓటర్ ప్లిప్‌లు లాక్కోని బయటకు పంపారు
టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారు
ఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు
కనంపల్లి గ్రామస్తులను ఓట్లు వేసుకోనివ్వలేదు
మా ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో లేకుండా చేశారు
బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారు
పార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణం : అంబటి
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారు
వారికి పోలీసులు సహకరిస్తున్నారు
పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారు
టీడీపీ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారు
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణం
ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.
డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు
ఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది.
జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదు
జమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు
అలాంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పడం డీఐజీ కోయ ప్రవీణ్ దివాలాకోరుతనానికి నిదర్శనం
పులివెందుల
పులివెందులలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 71.36శాతం
మొత్తం పోలింగ్ స్టేషన్లు:15
మొత్తం ఓటర్లు:10,601
పోలైన ఓట్లు:7,565
ఒంటిమిట్ట
ఒంటిమిట్టలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 66.39 శాతం
మొత్తం పోలింగ్ స్టేషన్లు:30
మొత్తం ఓటర్లు:24,606
పోలైన ఓట్లు:16,336
టీడీపీ మూకల దౌర్జన్యం.. ఓటర్లు భయభ్రాంతులు
మా ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదు: మెట్‌నూతనపల్లి గ్రామస్థులు
ఓటు వేయడానికి వస్తే ఓటర్ స్లిప్ తీసుకుని తరిమేశారు
బయట వ్యక్తులు వందలాదిగా వచ్చి ఓట్లు వేస్తున్నారు
మేము చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నాం
వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టు
వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తున్న అన్నమయ్య జిల్లా పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతలు అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
రహస్య ప్రదేశానికి తరలిస్తున్న పోలీసులు
ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష
దాడి చేసిన అధికార పార్టీ నేతలు కాకుండా వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేయడం దారుణం
మంత్రి రాంభూపాల్ రెడ్డి యదేచ్ఛగా పోలింగ్ బూతులకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురి
అయినా వారిపై చర్యలు లేవు
ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
పోలీసులు పచ్చ పార్టీ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారు
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మంచిది కాదు
దుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి :గోరంట్ల మాధవ్
ప్రజా స్వామ్యం అపహాస్యం చేస్తూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు చేశారు
పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్నారు
పోలీసులు కాళ్లకు ఓటర్లు మొక్కుతున్నారు
దొంగ ఓటర్లు గ్రామాల్లో యదేచ్ఛగా ఓట్లు వేస్తున్నారు
స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఇంట్లో నిర్బంధించారు
దుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి పాండవులే గెలిచారు
ప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు
పోలీసు అధికారులకు నా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది
జడ్పీటీసీ ఉప ఎన్నికలు పై కోర్టుకు వెళ్తాం, రీపోలింగ్ కోరతాం
జమ్మలమడుగు ,కమలాపురం చెందిన వారితో దొంగ ఓట్లు వేయించారు
పులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలు నిర్వహణ తీరు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టు
చంద్రబాబు కుట్ర పూరితమైన ఎన్నికల తీరుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు
పోలిసులు, ఈసీ కూటమి ప్రభుత్వానికి లొంగి ఊడిగం చేయడం బాధాకరం
ఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తుల భేటీ
తమను ఓటు వేయనీయకుండా టిడిపి గుండాలు అడ్డుకున్నారు.
ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారు
కర్రలు కత్తులతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు
పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు
వచ్చిన వాళ్లంతా ఇతర ప్రాంతాల నుంచి మా గ్రామంలోకి వచ్చారు
మా గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గుండాలను మోహరించారు
మా ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరు ఇచ్చారు
గతంలో ఎన్నడు ఇటువంటి దౌర్జన్యాలు జరగలేదు.
మహిళలను కూడా చూడకుండా బూతులు తిట్టారు..
చంపుతామని బెదిరించారు
ఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తులు
ఒంటిమిట్టలో అరగంట పాటు నిలిచిన పోలింగ్
పోలింగ్ కేంద్రంలో దొంగఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు
పోలింగ్ బూత్ లోపల టీడీపీ నేతల్ని నుంచి ఉంచి గడియపెట్టిన పోలీసులు
పోలింగ్ కేంద్రం గేటు బయటే వైఎస్సార్‌సీపీ శ్రేణులు
పోలింగ్ కేంద్రంలో టీడీపీ దొంగఓట్లు వేయిస్తోందంటూ ఆందోళన
లోపలికి రానివ్వకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు
గందరగోళంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ నిలిపివేత
ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్
ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశాం
ఐదు గంటల వరకు అదుపులోనే ఉంటారు
రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి
ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జడ్పిటిసి అభ్యర్థి అరెస్టుకు యత్నం
ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జెడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆఫీసుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
ఎస్పీతోపాటు సుమారు 150 మంది పోలీసులు
సుబ్బారెడ్డి ఆఫీస్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్ర నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అమ్జాద్ భాష, కొరుముట్ల శ్రీనివాసులు
వైఎస్సార్‌సీపీ నేతలతో మాట్లాడుతున్న ఎస్పీ
వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం
పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్‌సీపీ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులు
లోపలి వారిని బయటకు, బయటి వారిని లోపలికి అనుమతించని వైనం
గేటు వద్ద మహిళలు ఆందోళన
మా కార్యాలయంలోకి పంపడానికి ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు..
పులివెందుల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పోలీసుల వీరంగం
పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న పోలీసుల వీరంగం
పార్టీ గేటు వద్ద లోపలికి కార్యకర్తలను ఎవరినీ రానివ్వకుండా గేట్లు వేసి అడ్డుకుంటున్న పోలీసులు
మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న పోలీసులు
తమ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లాలంటూ పోలీసులతో వాదనకు దిగిన మహిళలు
అయినా అడ్డుకుంటున్న పోలీసులు..
ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తత
టీడీపీ నేతలను లోపలికి పంపి ఓట్లు వేయిస్తున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు
గేట్లు తోసుకొంటూ లోపలికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు
కనంపల్లిలో పోలీసుల ఓవరాక్షన్
సర్పంచ్ రామాంజనేయులు ఇంట్లో గన్ ఉంచి బెదిరిస్తున్న పోలీసులు
కనంపల్లిలో ఓట్లు వేయనియకుండా ఓటర్లును తిప్పిపంపిస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం
పులివెందులపై పోలీసులు పగబట్టారు: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు
ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి
అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం
కార్యకర్తలు సంయమనం పాటించాలి
కలెక్టర్‌కు పులివెందుల జడ్పీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థుల లేఖ
పులివెందులలో అరాచకం చేసి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది
ఏ ఒక్క ఏజెంటునూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన అభ్యర్థులు
రీపోలింగ్ జరపాలని కలెక్టర్‌ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థులు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆఫీస్‌కు భారీగా పోలీసులు
పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దూషించిన పోలీసులు
పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నినాదాలు
ఉదయం 11 గంటల వరకు 38.64 శాతం నమోదు
పులివెందుల:
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15
మొత్తం ఓటర్లు: :10,601
పోలైన ఓట్లు: 4803
ఓట్ల శాతం: 45.31
ఒంటిమిట్ట:
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 30
మొత్తం ఓటర్లు: 24,606
పోలైన ఓట్లు: 9057
ఎర్రగుంట్లలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ ర్యాలీ
పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన
పులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్: వైఎస్ అవినాష్‌రెడ్డి
జమ్మలమడుగు టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారు
కొత్తపల్లిలో బీటెక్ రవి అనుచరులు రిగ్గింగ్ చేశారు
మా పార్టీ ఏజెంట్లను కొట్టి బయటకు పంపారు
ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న పట్టించుకోలేదు
పులివెందుల మండల ఓటర్లతో రిగ్గింగ్ చేయించడం అసాధ్యం
అందుకే బయట నుంచి దొంగ ఓటర్లను దింపారు
పులివెందులలో దౌర్జన్యాలతో ఎవరూ గెలవలేరు
దాడులు చేసి గెలిచామనకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు
ఎర్రిపల్లిలో బీటెక్ రవి తమ్ముడు మహిళలను కొట్టాడు
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ బయటకు తీయాలి
తప్పు చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరుల వీరంగం
చిన్న కొత్తపల్లిలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకున్న టీడీపీ నేతలు
ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులు
కట్టెలతో కొడుతున్నారంటూ వాపోతున్న ఓటర్లు
ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలు
బూతు పురాణం అందుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఓటర్లను ప్రలోభపెట్టేలా మంత్రి పర్యటన
ఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన మంత్రి
దొంగ ఓటు వేసిన జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్
నల్లపురెడ్డి బూత్ క్యూలైన్‌లో వైఎస్ ఛైర్మన్
మరో బూత్ క్యూలైన్‌లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరు
క్యూ లైన్‌లో జమ్మలమడుగు వాసులను గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు
ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు
క్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్న వైనం
క్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు అయినా పట్టించుకోని పోలీసులు
పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను పంపుతున్న టీడీపీ నాయకులు
దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు, వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదని పంపుతున్న టీడీపీ నాయకులు
నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు
గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని టీడీపీ నేతలు
కర్రలు, రాడ్లతో పహారా, పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర
ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగింత...గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలు
మీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలు
ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్...దొంగ ఓటర్లతో నిండిపోయిన పోలింగ్ బూత్‌లు
టీడీపీ అరాచకాల ఆధారాలను ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు
విజయవాడ: ఎస్‌ఈసీ కార్యాలయానికి వైఎస్సార్‌సీపీ నేతలు
పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు
తక్షణమే స్పందించాలంటూ ఈసీ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్..
మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి
మొండితోక అరుణ్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి
ఎస్పీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదు
పులివెందుల జడ్సీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహం
మా ఇంటి చుట్టూ 150 పోలీసులను పెట్టారు
మా ఏజెంట్లు వస్తే కాళ్లు చేతులు విరిచేస్తామంటూ బెదిరించారు
ఇంటి నుంచి 100 మీటర్ల దూరంలో 100 మందిపైగా టీడీపీ రౌడీ మూకలు
ఇక్కడ ఉండేది 1200 ఓట్లు.. బయట నుండి వచ్చి 900 మంది రౌడీలు తిరుగుతున్నారు
144 సెక్షన్ ఉందన్నా.. బయటకు వాళ్ళకు వర్తించదా?
పోలీసులు దగ్గరుండి ఓట్లు వేయించిస్తున్నారు
నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి
గెలుపు ఓటములు సహజం
పులివెందులను భ్రష్టు పట్టిస్తున్నారు
తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తున్నారు
ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి
ఎస్పీకి ఫోన్ చేసిన ఇంతవరకు రెస్పాన్స్ లేదు
పోలీసుల తీరుపై ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆగ్రహం
పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా జడ్పీటీసీ ఎన్నికలు
రాయచోటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీ మూకలను తరలించి ఎన్నికలకు అంతరాయం కలిగిస్తున్నారు
ప్రతి బూత్ వద్ద బయటి వ్యక్తులు 50కి పైగా ఉన్నాకానీ.. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు
ఆ బయట వ్యక్తులు ఉన్నారని పేరుతో సహా చెప్పిన పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారు..
పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు
ప్రజాస్వామ్యం పద్ధతులకు విరుద్ధంగా ఎన్నికలు జరిగితే దానికి ఎస్పీఏ బాధ్యులవుతారు
ఉదయం 9 గంటల వరకు 14.87 శాతం నమోదు
పులివెందుల:
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15
మొత్తం ఓటర్లు: :10,601
పోలైన ఓట్లు: 2,222
ఓట్ల శాతం: 20.96
ఒంటిమిట్ట
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 30
మొత్తం ఓటర్లు: 24,606
పోలైన ఓట్లు:3,658
మహిళల అడ్డగింతతో.. వెనుదిరిగిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా తుమ్మలపల్లి లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు
ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులు
‘‘మీరు టీడీపీ వారికే కాపలా.. పోండి’’ అంటూ అడ్డుకున్న మహిళలు
ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారా? అని ఆగ్రహం
అసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడి వచి నీతులు చెప్తారా? అంటూ అడ్డగింత
మహిళల అడ్డగింతతో వెనుతిరిగిన పోలీసులు
ఆ పది మంది టీడీపీ వాళ్లే!
పులివెందుల ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం
పోలింగ్ బూత్ ల నుంచి ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలు
పోలింగ్ బూత్ లను ఆక్రమించిన టీడీపీ నేతలు.
పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్న వైనం
టీడీపీ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు
ఓన్లీ ఎల్లో మీడియా చానల్స్ ను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతి
పదిమంది టీడీపీ ఓటర్లను క్యూ లైన్‌లో నిలబెట్టి వీడియోలు తీయిస్తున్న టీడీపీ
ఎన్నిక సక్రమంగా జరిగిందంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
పులివెందుల-నల్లపురెడ్డి గ్రామానికి చెక్ పోస్ట్
ఓటర్లకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నో ఎంట్రీ
టీడీపీ నాయకుల కార్లు అయితే రైట్ రైట్
ఒంటిమిట్టలో టీడీపీ అరాచకం
కొనరాజుపల్లి కి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు
10 జీపుల్లో బయట నుండి వచ్చిన టీడీపీ శ్రేణులు
భారీ ఎత్తున రిగ్గింగ్ కోసం ప్రయత్నాలు
ఒంటిమిట్టలో టీడీపీ అరాచకం
గొల్లపల్లి , నరసనగారి పల్లి పోలింగ్ బూత్ హేండ్ ఓవర్ చేసుకున్న టీడీపీ శ్రేణులు
ఓట్లు వేసుకొంటున్న టీడీపీ శ్రేణులు
పోలింగ్ బూతుల నుండి వైఎస్సార్సీపీ ఏజెంట్‌లను బయటికి లాగేసిన టీడీపీ శ్రేణులు
చోద్యం చూస్తున్న పోలీసులు
టీడీపీ రిగ్గింగ్‌పై ఆగ్రహజ్వాలలు
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్
కనంపల్లిలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ ఇష్టారాజ్యం
ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళల గ్రహం
పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఓటర్లు
పులివెందుల నల్లగొండు వారి పల్లె లో ఓటర్ల ఆందోళన
ఓటు వెయ్యనివ్వండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న ఓటర్లు
టీడీపీ నేతలు రిగ్గింగ్ చెయ్యడం తో నిజమైన ఓటర్ల ఆందోళన
పోలీసులు కి వేడుకుంటున్న ఓటు హక్కు వినియోగించుకొని దుస్థితి
ఓటరు స్లిప్పులు లాక్కుంటున్న టీడీపీ నేతల పై ఓటర్ల ఆగ్రహం
👉లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: ఎస్వీ సతీష్‌రెడ్డి
వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్
నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: ఎస్వీ సతీష్‌రెడ్డి
లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు
లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడు అయ్యాడు
ప్రజాస్వాయం అవహేళనకు గురవుతుంటే చంద్రబాబు లోకేష్ ఆనందిస్తున్నారు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
పులివెందులలో ఉన్న పోలీసులకు ఖాకి చొక్కా వేసుకునే అర్హత లేదు
నేటి పోలింగ్ జరుగుతున్న తీరుతో ప్రజాస్వామ్యం మీద ఆందోళన కలిగిస్తోంది
పరిస్థితి ఈ విధంగా ఉన్నాక పోలింగ్ నిర్వహణ ఎందుకు?
👉పులివెందులలో మహిళా ఓటర్ల ఆవేదన
ఓటేయకుండా అడ్డుకుంటున్నారు
ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు
మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారంటూ నానా హంగామా చేశారు
ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు
ఓటేయడానికి వెళ్లే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారు
ఈస్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదు
వందల మంది స్థానికేతర రౌడీలు మా ఓట్లను వేస్తున్నారు.
👉పులివెందులలో టీడీపీ ఇష్టారాజ్యం
అన్ని పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్‌చేస్తున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల చేతిలో నల్లపురెడ్డి పోలింగ్ స్టేషన్
జమ్మలమడుగు నుంచి మనుషుల్ని పిలిపించి రిగ్గింగ్
అందరి ఓట్లు వాళ్లతోనే వేయిస్తున్న పచ్చగూండాలు
👉కనంపల్లిలో గ్రామస్తులను ఓట్లు వేయనివ్వని పోలీసులు
ఓటు వేయనివ్వండంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లు
ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు: స్థానికులు
దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారు
బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాలకే సపోర్ట్ చేస్తున్న పోలీసులు
👉పులివెందుల మండలం కనంపల్లి గ్రామంలో ఉద్రిక్తత
పోలింగ్ బూత్‌లకు వెళ్ల నియ్యకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలు
ఓటు వేయడానికి వెళ్తున్న మహిళ ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ మూకలు
తమ ఓటు హక్కును అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ పచ్చ మూకలపై తిరగబడ్డ మహిళలు
కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానివ్వకుండా బెదిరిస్తున్న పోలీసులు
👉నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలు
విచ్చలవిడిగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు
👉ఆర్. తుమ్మలపల్లిలో అరాచకం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు
ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్న టీడీపీ
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా
ఎస్ఫీకి కాల్ చేసినా కనిపించని ఫలితం
హేమంత్ గన్‌మెన్‌ని ఉన్న పళంగా మార్చేసిన అధికారులు
నిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపిన అధికారులు
బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ నేతలు
టీడీపీ గూండాలకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
👉టీడీపీ గూండాల అరాచకాలపై పట్టించుకోని పోలీసులు
పులివెందుల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహం
దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు
ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు
నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు
కర్రలు, రాడ్‌లతో ఓటర్లను భయపెడుతున్నారు
దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు
ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు
👉ఈ కొత్తపల్లిలో రెండు పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలు
ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యం
టీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించని టీడీపీ నేతలు
ఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్న టీడీపీ గుండాలు
నిస్సహాయంగా వెనక్కి తిరిగిపోతున్న ఓటర్లు
ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాము
దౌర్జన్యంగా వెనక్కి పంపించేశారు
గతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదు
పోలింగ్ బూత్‌ల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరు
బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోలింగ్ బూత్‌ల్లో ఉన్నారు
పోలీసులు వారికే కొమ్ము కాస్తున్నారు
ఒక్క బూత్‌లో కూడా పోలీసులే లేరు
మా గ్రామాల్లో ఓటు వేయకుండా, పక్క గ్రామంలో బూత్‌లు మార్చారు
ఎప్పుడు బూతులు మార్చిన దాఖలాలు లేవంటున్న ఓటర్లు
👉పులివెందులలో మీడియాపై దాడికి దిగుతున్న కూటమి నేతలు
పోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని అల్లరి మూకలు
ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్న టీడీపీ మూకలు
ప్రతి గ్రామంలో 300 మందికి పైగా అల్లరి మూకలు
మీడియాను సైతం వదలని టీడీపీ మూకలు
మీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్న వైనం
సాక్షి ప్రతినిధులపై దాడికి దిగిన టీడీపీ గూండాలు
వైఎస్సార్సీపీ ఏజెంట్లను అసలు బూత్ లోపలికి వెళ్లనివ్వని టీడీపీ

👉పులివెందుల, ఒంటిమిట్లలో ప్రజాస్వామ్యం ఖూనీ
పోలింగ్ బూత్‌ల్లో టీడీపీ గూండాల స్వైర విహారం
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలు
మీడియా ప్రతినిధులపైనా టీడీపీ గూండాల దాడులు
టీడీపీ గూండాల అరాచకాలను పట్టించుకోని పోలీసులు

👉పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యం
అచ్చివెల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుక్ను టీడీపీ గూండాలు
ఎర్రిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో భయాందోళనలు
నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లు
టీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారని ఆవేదన
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్న ఓటర్లు
పోలింగ్ బూత్‌ల్లో బయటి వ్యక్తులు ఉన్నారంటున్న ఓటర్లు
ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా పోలీసులు లేరంటున్న ఓటర్లు

👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్
ఎక్కడికక్కడే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు
గ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్న పచ్చ మూకలు
👉పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తత
పోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలు
పోలీసులను సైతం తరిమేస్తున్న టీడీపీ మూకలు
గ్రామంలో మహిళలపై దాడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలు
గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ

👉పులివెందుల మండలంలో భయానక పరిస్థితులు
వైఎస్సారసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్‌అరెస్ట్
వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
మౌన ప్రేక్షక పాత్రలో వందలాది మంది పోలీసులు
గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు

👉ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్
తెల్లవారుజామున అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంటికొచ్చి బలవంతంగా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఎన్నికలు జరిపే విధానం ఇదేనా?: అవినాష్‌రెడ్డి
మా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు
కేవలం వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారు
పోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారు
ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
👉వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.
👉ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.
👉ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.