ZPTC Election
-
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
AP: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కలకడ.. వైఎస్సార్సీపీదే ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్‌కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. -
నేడు విశాఖ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ ఎన్నిక
-
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
4 జిల్లాలు క్లీన్ స్వీప్: వైఎస్సార్సీపీ విజయ ఢంకా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. జిల్లాలవారీగా చూడగా ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి విజయఢంకా మోగించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు జిల్లాలో 52 స్థానాలను సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయ నాదం మోగించింది. -
విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు: సజ్జల
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు పార్టీ, సీఎం జగన్మోహన్రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల విజయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన స్పందించారు. ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆశీస్సులు ఇచ్చారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన నిమ్మగడ్డ, కోర్టులకు వెళ్లి ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి కూడా కృతజ్ఞతలు. ఏ రాజకీయ పార్టీ వ్యవహరించని రీతిలో టీడీపీ డాంభికాన్ని ప్రదర్శిస్తోంది. అచ్చెన్న దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. అంటున్నాడు.. 2019లో బొక్కబోర్లా పడ్డా బుద్ధి రాలేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పరిశీలించి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. బడుగుల జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్న కృషికి ప్రజలు శభాష్ అని తీర్పు ఇచ్చారు. విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో స్పష్టంగా కనిపించింది. కొన్ని పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవడానికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయి. నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే... అన్ని రకాల పేదరికాన్ని పారద్రోలగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో కనిపించాయి’ అని సజ్జల తెలిపారు. ‘2020లో మొదలైన ఈ ప్రక్రియ 2021 సెప్టెంబర్ 19వ తేదీన ముగియడం వారి పుణ్యమే. 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి జనం ఛీ కొడతారని చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు. 2014లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలకు మేము చంద్రబాబులా భయపడలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలై ప్రజల్లో స్పందన చూసి వాళ్లకి దిక్కు తెలియలేదు. అభ్యర్థుల భవిష్యత్తును వీరి దుర్మార్గపు కుట్రల వల్ల ఇబ్బంది పెట్టారు. మీరు పదిసార్లు వాయిదా వేసినా మళ్లీ మేమే వస్తామని ఆనాడే చెప్పాం. ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలో తెలుసుకోకుండా కుట్రలపై కుట్రలు చేశారు’ అని సజ్జల మండిపడ్డారు. -
ZPTC MPTC ఎన్నికల ఫలితాల మీద స్పెషల్ డిబేట్
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
-
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 40 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 57 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 55 స్థానాల్లో 55 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 33 వైఎస్సార్సీపీ గెలుపు. టీడీపీ ఒకటి, సీపీఎం ఒకచోట గెలిచింది. విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 28 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 62 స్థానాల్లో 60 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. ఒకటి టీడీపీ, ఇతరులు మరో చోట గెలిచారు. చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 46 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 20 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ కైవసం. -
పుట్టపర్తిలో 6 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీ వశం
సాక్షి, అనంతపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్‌గా మారింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలనకు మరోసారి ప్రజలు అఖండ విజయం అందించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
వైస్సార్సీపీ హవా..!
-
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’
సాక్షి, చిత్తూరు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే విజయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: ‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’ గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారు: జోగి రమేష్ -
ఎన్నికల కౌంటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
-
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. -
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య! సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ -
MPTC ZPTC ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టు లో పిటిషన్లు
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై ఏపీ హైకోర్టులో పిటిషన్లు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరారు. కోర్టు దీనిపై తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్
-
హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్
సాక్షి, అనంతపురం: హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలను టీడీపీ నేతలు ధిక్కరించారు. బాబు ఆదేశాలను లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి అశ్విణికి టీడీపీ నేతలు ప్రచారం మొదులుపెట్టారు. అదీకాకుండా చంద్రబాబు బహిష్కరణ ఆదేశాలు పట్టించుకోమని హిందూపురంకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబుకు చుక్కెదురు పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపుని తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేశారు. ఎంపీటీసీ, జెడ్పిటీసీ అభ్యర్థుల తరపున టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో టీడీపీ జెడ్పిటీసీ అభ్యర్థి వట్టూరి వెంకట రాంబాబు, ఎంపీటీసీ అభ్యర్థి సరిపల్లి పద్మ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ ఇంచార్జి వలవల బాబ్జి ప్రచారం చేస్తున్నారు. బయటపడ్డ టీడీపీ లోపాయకారి ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటన చేసినా లోపాయకారిగా టీడీపీ అభ్యర్థిలు పోటీలో కొనసాగాలని అంతర్గత ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయాన్ని సొంతపార్టీ అభ్యర్థులే చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ఎన్నికలు బహిష్కరించామని చెబుతునే మరోవైపు ఎన్నికల ప్రచారం చేస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు జడ్పిటీసీ అభ్యర్థి బీరం శిరీష ఎన్నికలకు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు సూచన మేరకే పోటీలో కొనసాగుతున్నామని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో ఉంటామని అంటున్నారు. చదవండి: దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ -
పశ్చిమ గోదావరి జిల్లా లో జోరుగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
ప్రభుత్వ పథకాలే అభ్యర్థుల గెలిపిస్తాయిని ధీమా
-
జనం ఓటేయరనే ఎన్నికల బహిష్కరణ
సాక్షి, అమరావతి: టీడీపీకి ఎలాగూ ప్రజలు ఓటేయరని తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందినవారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆట ఆడారని, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఈసీగా వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేర్ని నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నారా వారి పుత్రరత్నం లోకేశ్ ఎల్ బోర్డ్ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇంకో 30 ఏళ్లయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై లోకేశ్ మాట్లాడుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారని నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతానికిపైగా అమలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ దాగుడుమూతలు
సాక్షి, అమరావతి: గతేడాది మధ్యలో నిలిపివేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాగుడుమూతలాడుతున్నారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ సమాచారమిచ్చి ముఖం చాటేయడం గమనార్హం. ఏడాది క్రితం మధ్యలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిఉన్న ఆ ఎన్నికలను పూర్తి చేసేలా ఆదేశించాలని సీఎస్ కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ఆరు రోజుల్లో ముగిసిపోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టవచ్చని ప్రభుత్వం తరపున సీఎస్ నివేదించారు. ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకే తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. సెలవు కాదు.. విధుల్లోనే ఉన్నా నిమ్మగడ్డ శుక్రవారం సెలవులో లేరని, అధికారికంగా ఆయన విధుల్లోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా నిమ్మగడ్డ హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, 18న జరిగిన మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలను ఆయన అక్కడ నుంచే పర్యవేక్షించారని పేర్కొన్నాయి. కాగా ఈ నెల 22 నుంచి 24వతేదీ వరకు ఎల్టీసీపై తమిళనాడులోని మధురై, రామేశ్వరం పర్యటనకు వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. కలవకపోవడం ధిక్కారమే.. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా అధికార యంత్రాంగం అంతా ఈ ప్రక్రియలో నిమగ్నమైనందున ఈ ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ వైద్య ఆరోగ్య శాఖ నివేదికతో సహా ఎస్ఈసీకి తెలియచేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆగమేఘాలపై నిర్వహించి ఏడాది క్రితం మధ్యలో ఆపేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం పట్టించుకోలేదు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ ఎన్నికల నిర్వహణకు సుముఖత చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ ఆదేశించినా ఏవో సాకులు చెప్పి రాకపోవడం నిమ్మగడ్డ ధిక్కార ధోరణికి నిదర్శనమనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.