
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. జిల్లాలవారీగా చూడగా ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి విజయఢంకా మోగించింది.
ప్రకాశం జిల్లాలో జరిగిన 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు జిల్లాలో 52 స్థానాలను సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయ నాదం మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment