clean sweep
-
స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లను ఎదుర్కోలేక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మ్యాచ్ మాత్రం చేజారింది! దీంతో 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే’ అని కెప్టెన్ అంటే... అభిమానులు కూడా అతడికి అండగా నిలిచారు.సిరీస్‌లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్టు కోసం పుణేలో స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసింది. అది ముందే పసిగట్టిన న్యూజిలాండ్ పేసర్లను పక్కన పెట్టి స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితం రాబట్టింది. మామూలు స్పిన్నర్లను సైతం ఎదుర్కోలేకపోయిన టీమిండియా... ఈసారి తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌట్ కాగా... మరో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది.కనీసం మూడో టెస్టులోనైనా భారత జట్టు విజయం సాధించక పోతుందా అని ఆశపడ్డ అభిమానులకు వాంఖడే స్టేడియంలోనూ గుండెకోత తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 121 పరుగులకే పరిమితమై సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఒకవైపు మ్యాచ్ మ్యాచ్‌కూ పరిణతి చెందుతూ ముందుకు సాగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఒకటి చొప్పున ఘనతలు ఖాతాలో వేసుకుంటే... టీమిండియా మాత్రం చెత్త రికార్డు లిఖించుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అంతకుమించిన పొరబాటు మరొకటి ఉండదు! సాక్షి క్రీడా విభాగం విదేశాల్లో ప్రదర్శనల సంగతి పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. పుష్కరకాలంగా దీనికి మరింత బలం చేకూర్చుతూ భారత జట్టు... ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరుస సిరీస్‌లు గెలుస్తూ వస్తోంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇలా ప్రత్యర్థులు మారుతున్నారు తప్ప ఫలితం మాత్రం మారలేదు. ఈ జోరుతోనే వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన భారత్... ముచ్చటగా మూడోసారీ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయమే అనిపించింది. 12 ఏళ్లుగా స్వదేశంలో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా... ఈ క్రమంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందనుకుంటున్న దశలో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శనతో చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్‌ను భారత్‌లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్‌తోనే టీమిండియాను ఎలా దెబ్బకొట్టవచ్చో న్యూజిలాండ్ అచరణలో చూపింది. శ్రీలంకలో క్లీన్‌స్వీప్‌నకు గురై... కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనే స్థితిలో భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే... అదే సమయంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ టీమిండియా 91 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్... అత్యుద్భుత ప్రదర్శనతో టీమిండియాపై సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. తమ ప్రధాన ఆటగాడు కేన్ విలియమ్సన్ లేకుండానే భారత్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చితే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా మాత్రం నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది. ఆ ఏకాగ్రత ఏది? సుదీర్ఘ ఫార్మాట్లో సంయమనం ముఖ్యం అనేది మరిచిన భారత ప్లేయర్లు... క్రీజులోకి అడుగు పెట్టడంతోనే భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకోవడం చూస్తుంటే మనవాళ్లు టి20ల మాయలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇదే నిజం అనుకుందాం అంటే ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యఛేదనలో తలా రెండు భారీ షాట్లు ఆడిన టీమిండియా గెలవాల్సింది కానీ అదీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్‌లో అసలు నిలిచే ప్రయత్నం కూడా చేయలేకపోగా... రెండు ఫోర్లు బాదిన రోహిత్ అదే జోష్‌లో మరో చెత్త షాట్ ఆడి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాట పటిమ చూపిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతికి బౌల్డ్ కాగా... యశస్వి వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్లో ఆకట్టుకుంటాడనుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. పంత్ ఒక్కడే సిరీస్ మొత్తం నిలకడ కనబర్చాడు. పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని పంత్ నిరూపించాడు. ఇక మన స్పిన్నర్లు విజృంభిస్తారు అనుకొని సిద్ధం చేసిన పిచ్‌లపై ప్రత్యర్థి అనామక స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే... అనుభవజ్ఞులైన మనవాళ్లు మాత్రం కింద వరుస బ్యాటర్లను సైతం అడ్డుకోలేక ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎలాంటి పిచ్‌పైనైనా మొండిగా నిలబడి పోరాడగల చతేశ్వర్ పుజారా, రహానే వంటి ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్‌తో స్పష్టం కాగా... ఆ్రస్టేలియా పర్యటనకు ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా పాఠాలు నేరి్పంది. ఈ జట్టుతోనే ఆసీస్ టూర్‌కు వెళ్లనున్న టీమిండియా... లోపాలను అధిగమించకపోతే ‘బోర్డర్–గవాస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
బంగ్లాతో రెండో టెస్టు.. టీమిండియా ధనాధన్ గెలుపు
భారత జట్టు లెక్క తప్పలేదు. చివరి రోజు బంగ్లాదేశ్‌ను సాధ్యమైనంత వేగంగా ఆలౌట్ చేసి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైన టీమిండియా సరిగ్గా అదే చేసి చూపించింది. భారత బౌలింగ్ దెబ్బకు నిలబడలేకపోయిన బంగ్లా ఆట ఒక్క సెషన్లోనే ముగియగా... లంచ్ విరామం తర్వాత గంట వ్యవధిలో రోహిత్ బృందం పని పూర్తి చేసింది. వర్షంతో ఏకంగా ఎనిమిది సెషన్ల పాటు ఆట తుడిచి పెట్టుకుపోయినా... ఆరు సెషన్ల ఆటలోనే ఫలితం రాబట్టి భారత్ తమ స్థాయిని ప్రదర్శించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం కోసమే ఆడతామంటూ నిరూపించిన జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. కాన్పూర్: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఫలితం వచ్చే అవకాశం కనిపించని మ్యాచ్‌నూ తమ సాహసోపేత ఆటతో మలుపు తిప్పిన జట్టు చివరకు తాము అనుకున్న ఫలితం సాధించింది. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 26/2తో తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. షాద్మన్ ఇస్లామ్ (101 బంతుల్లో 50; 10 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 37; 7 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. బుమ్రా, జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 95 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి భారత్ విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 51; 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సునాయాసంగా జట్టును గెలిపించారు. అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది. తొలి టి20 మ్యాచ్‌కు గ్వాలియర్ ఆతిథ్యమిస్తుంది. సమష్టి వైఫల్యం... నాలుగో రోజు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముగించేందుకు భారత్‌కు 36 ఓవర్లు సరిపోయాయి. షాద్మన్, నజు్మల్ హసన్ (19) నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించి కొద్దిసేపు ప్రతిఘటించడం మినహా బంగ్లా బ్యాటర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఆట మొదలయ్యాక మూడో ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మోమినుల్ హక్ (2)ను అశ్విన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. ఈ దశలో షాద్మన్ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అశ్విన్, సిరాజ్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే జడేజా తన తొలి ఓవర్లోనే నజు్మల్ను వెనక్కి పంపి ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షాద్మన్ తర్వాతి ఆకాశ్‌దీప్ వేసిన తర్వాతి ఓవర్లో పెవిలియన్ చేరాడు. అంతే... ఆ తర్వాత మిగిలిన ఐదు వికెట్లు టపటపా పడిపోయాయి. బంగ్లా ఆశలు పెట్టుకున్న ప్రధాన బ్యాటర్లు లిటన్ దాస్ (1), షకీబ్ (0) ఒకే స్కోరు వద్ద అవుటయ్యారు. జడేజా తాను వేసిన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున తీయడం విశేషం. మిరాజ్ (9), తైజుల్ (0) విఫలం కాగా... మరో ఎండ్‌లో ముషి్ఫకర్ చివరి వరకు పోరాడాడు. అయితే బుమ్రా అద్భుత బంతితో ముషి్ఫకర్ స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. జైస్వాల్ జోరు... ముగ్గురు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి బంగ్లా తమ వంతుగా కొంత ప్రయత్నం చేసినా భారత్ ముందు అది పనికి రాలేదు. స్వల్ప ఛేదనలో రోహిత్ శర్మ (8), శుబ్‌మన్ గిల్ (6) విఫలమైనా... జైస్వాల్ మరోసారి తనదైన శైలిలో బౌండరీలతో దూసుకుపోయాడు. షకీబ్, మిరాజ్ ఓవర్లలో రెండేసి ఫోర్లతో అతను జోరు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో కోహ్లి అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 58 పరుగులు జత చేశారు. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన జైస్వాల్ విజయానికి మూడు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. తైజుల్ వేసిన బంతిని మిడాన్ దిశగా ఫోర్ కొట్టి రిషభ్ పంత్ (4 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. 18 సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయం. 2013లో ఆ్రస్టేలియాను 4–0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇది మొదలైంది. చివరిసారి భారత జట్టు 2012లో స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోయింది. 13 బంగ్లాదేశ్‌పై ఆడిన 15 టెస్టుల్లో భారత్‌కు ఇది 13వ విజయం. మిగిలిన 2 మ్యాచ్‌లు ‘డ్రా’ కాగా, భారత్ ఒక్క టెస్టు కూడా ఓడలేదు.11 టెస్టుల్లో అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. మురళీధరన్ (11)తో సమంగా అతను అగ్రస్థానంలో నిలిచాడు.నాలుగో రోజు ఆట మొదలవడానికి ముందు బంగ్లాదేశ్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేసి ఆ తర్వాత బ్యాటింగ్‌తో ఏం చేయగలమా అని ఆలోచించాం. మేం పరుగులు సాధించడంకంటే వారిని పడగొట్టేందుకు ఎన్ని ఓవర్లు అవసరం అవుతాయి అన్నట్లుగానే మా లెక్క సాగింది. పిచ్ బౌలింగ్‌కు పెద్దగా అనుకూలించకున్నా మా బౌలర్లు మంచి ఫలితం సాధించారు. రెండున్నర రోజుల ఆట కోల్పోయాం కాబట్టి ఇకపై సాహసోపేతంగా ఆడి ఫలితాన్ని రాబట్టేందుకు బ్యాటర్లంతా సై అన్నారు. ఇలాంటప్పుడు జట్టు కుప్పకూలే అవకాశం కూడా ఉంటుంది. అయినా సరే 100–120 పరుగులకు ఆలౌట్ అయ్యేందుకు కూడా సిద్ధపడే దూకుడు ప్రదర్శించాం. కోచ్ గంభీర్‌తో గతంలో కలిసి ఆడిన అనుభవం ఉంది కాబట్టి అతని శైలి గురించి బాగా తెలుసు. ఇప్పటి వరకు అంతా బాగుంది. ద్రవిడ్ ఉన్నప్పుడు కూడా చక్కగా కలిసి పని చేశాం. అయితే జీవితం సాగిపోతూ ఉంటుంది. అలాగే జట్టు కూడా ముందుకు సాగిపోవాలి. – రోహిత్ శర్మ, భారత కెప్టెన్ షకీబ్‌కు కోహ్లి బ్యాట్ బహుమతికాన్పూర్: త్వరలో రిటైరవుతున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబుల్ హసన్‌కు భారత స్టార్ విరాట్ కోహ్లి తన బ్యాట్‌ను కానుకగా అందజేశాడు. షకీబ్ టెస్టు ఫార్మాట్‌పై ఇది వరకే తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్‌బై చెబుతానన్నాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పే యోచన లో ఉన్నాడు. రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లి స్వయంగా బంగ్లాదేశ్ జట్టు వద్దకు వెళ్లి తన గుర్తుగా బంగ్లా మేటి క్రికెటర్ అయిన షకీబ్‌కు బ్యాట్‌ను బహూకరించాడు. ఈ సందర్భంగా ఇరు జట్ల హేమాహేమీలు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. షకీబ్ స్టార్ ఆల్‌రౌండర్. బంగ్లాదేశ్‌కే కాదు... మన ఐపీఎల్ అభిమానులకు చిరపరిచితుడు. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున 71 మ్యాచ్‌లాడాడు.స్కోరు వివరాలుబంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 233; భారత్ తొలి ఇన్నింగ్స్: 285/9 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 50; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 2; నజ్ముల్ హసన్ (బి) జడేజా 19; ముషి్ఫకర్ (బి) బుమ్రా 37; లిటన్ దాస్ (సి) పంత్ (బి) జడేజా 1; షకీబ్ (సి అండ్ బి) జడేజా 0; మిరాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 9; తైజుల్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖాలెద్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–18, 2–26, 3–36, 4–91, 5–93, 6–94, 7–94, 8–118, 9–130, 10–146. బౌలింగ్: బుమ్రా 10–5–17–3, అశ్విన్ 15–3–50–3, ఆకాశ్‌దీప్ 8–3–20–1, సిరాజ్ 4–0–19–0, జడేజా 10–2–34–3. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) మహమూద్ (బి) మిరాజ్ 8; జైస్వాల్ (సి) షకీబ్ (బి) తైజుల్ 51; గిల్ (ఎల్బీ) (బి) మిరాజ్ 6; కోహ్లి (నాటౌట్) 29; పంత్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–18, 2–34, 3–92. బౌలింగ్: మెహదీ హసన్ మిరాజ్ 9–0–44–2, షకీబ్ 3–0–18–0, తైజుల్ 5.2–0–36–1. -
వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్.. కర్నూల్ లో టీడీపీకి బిగ్ షాక్
-
భారత్ క్లీన్‌స్వీప్
బెంగళూరు: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (57 బంతుల్లో 61; 7 ఫోర్లు), తజీ్మన్ (38; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (2/36), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (2/27) రాణించారు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసి గెలిచింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 11 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 42; 2 ఫోర్లు) రాణించడంతో భారత్ 56 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. -
ప్రకాశంలో ఫ్యాన్ గాలి ఉధృతం
సాక్షి, ఒంగోలు ప్రతినిధి : ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఐదేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విజయానికి పునాదులుగా మారాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబి్ధదారుల ఖాతాల్లో వందల కోట్లు జమయ్యాయి. అదే సమయంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. విజయ ‘భాస్కరు’డే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంపీఅభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క టీడీపీ తరఫున బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ తరఫున పోటీ చేయడం మాగుంటకు రివాజుగా మారింది. తరచూ పార్టీలు మారడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు దేశాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో ఈయన కుమారుడు అప్రూవర్‌గా ఉన్నారు. ప్రజల మనిíÙగా పేరొందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీగా భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. బాలినేనికి సిక్సర్ ఖాయం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి విడదీయరాని బంధం. ఇప్పటికే ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు విడతలు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.230 కోట్లతో 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోనుంది. బాలినేనికి టీడీపీ అభ్యర్థి దామచర్ల ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా çగెలిచిన దామచర్ల ఆ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు పిలిచినా పలికే నేతగా పేరు తెచ్చుకున్న బాలినేని మళ్లీ విజయం సాధించి సిక్సర్ కొట్టనున్నారు. దర్శి బూచేపల్లి అడ్డాదర్శి టీడీపీ తరఫున నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలోకి దించింది. కానీ రెండు దశాబ్దాలుగా దర్శిని అడ్డాగా మార్చుకున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి గొట్టిపాటి లక్ష్మి ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏడాదిగా దర్శిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న బూచేపల్లి ఏ ఇంటికి వెళ్లినా తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న బూచేపల్లి కుటుంబం ఈ విడత భారీ మెజారీ్టతో విజయం సాధిస్తుందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి కొత్త అభ్యర్థి కావడం, జనసేన, టీడీపీల నుంచి పలువురు టికెట్లు ఆశించి భంగపడిన వారు వెన్నుపోటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంతనూతలపాడులో నాగా‘అర్జునుడే’ సంతనూతలపాడు నుంచి మంత్రి మేరుగు నాగార్జున బరిలో దిగుతున్నారు. ఇక్కడ మేరుగు కొత్త అయినా మంత్రిగా ఆయన అనుభవం మరోసారి విజయాన్ని అందించనుంది. 24 సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగురలేదని ఇటీవల చీమకుర్తిలో జరిగిన యువగళంలో కూడా లోకేశ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న బీఎన్ విజయకుమార్ ఇప్పటికే రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి మేరుగు అనుభవం మరోసారి విజయాన్ని అందించనున్నాయి. ఆదిమూలపుసురేష్ దూకుడు కొండపి నుంచి ఈ సారి మంత్రి ఆదిమూలపు సురేష్ బరిలో దిగుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విద్యావంతుడిగా పేరుగాంచిన సురేష్‌కు కొండపిలో విజయం నల్లేరుపై నడకేనంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్వామి బరిలోకి దిగుతున్నారు. మరుగుదొడ్లు, నీరు–చెట్టు, ఇంకుడుగుంతల పథకాల్లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన డోలా బాల వీరాంజనేయస్వామికి ఈ విడత ఘోరంగా ఓటమి ఖాయమంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతవరం, కొణిజేడు గ్రామాల్లో ఎదురైన చేదు అనుభవాలే స్వామి ఓటమిని ఖరారు చేశాయి. గిద్దలూరు గెలుపు తథ్యం వైఎస్సార్సీపీకి గిద్దలూరు కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 80 వేల మెజారీ్టతో రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గం సంచలనం సృష్టించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ముత్తుల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి పారీ్టకి నమ్మకద్రోహం చేశాడని నియోజకవర్గంలో అతనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విడత ముత్తుముల బరిలో ఉన్నా అతన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న కేపీ నాగార్జునరెడ్డి ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి. దీంతో కేపీ నాగార్జునరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే.మార్కాపురంలో ప్రభంజనమే గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యరి్థగా అన్నా రాంబాబు మార్కాపురం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో 80 వేల మెజారిటీ సాధించిన చరిత్ర ఆయనది. విద్యాదాతగా అన్నా రాంబాబు పేరుగడించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 13 క్రిమినల్ కేసులతో పాటు భూకబ్జాలు, అనేక ఆరోపణలు ఉండటంతో ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో అన్నా రాంబాబుకు మరోసారి భారీ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిగిరిలో కొత్త చరిత్ర దద్దాల నారాయణ యాదవ్ వైఎస్సార్సీపీ కనిగిరి నుంచి చరిత్ర సృష్టించనున్నారు. సామాన్యుడికి టికెట్ కేటాయించి జగనన్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిపై పోటీకి దించారు. దద్దాలపై కనిగిరి ప్రజలకు ఎనలేని అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన కక్ష సాధింపు చర్యలను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. దీనికి తోడు టీడీపీ బీజేపీ కూటమిలో ఉండటంతో ముస్లింలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 22,500 ఓట్లు ఉన్న ముస్లింలు దద్దాల వైపే ఉన్నారు. దీంతో ఇక్కడ ఆయన విజయం తథ్యమంటున్నారు. యర్రగొండపాలెం ఏకపక్షం యర్రగొండపాలెం ఎప్పుడూ ఏకపక్షమే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ ఎరిక్షన్‌బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదు. లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఎరిక్షన్‌బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాటిపర్తి చంద్రశేఖర్ కొత్త వ్యక్తే అయినప్పటికీ గత మూడు నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో తాటిపర్తి భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. -
యూపీలో క్లీన్ స్వీప్ చేస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీ 2014 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన న్యూస్ 18 సదస్సులో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. యూపీలో 80 సీట్లకు గాను 2014లో బీజేపీ 71 గెలుచుకుంది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్ రెండు స్థానాలు దక్కించుకుంది. ఒడిశాలో పొత్తులపై అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ)తో చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని షా తెలిపారు. ఒంటరిగా పోరాడాలనుకుంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకే ప్రయతి్నస్తామని స్పష్టం చేశారు. పంజాబ్‌లో అకాలీ దళ్‌తో పొత్తు విషయంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. బెంగాల్లో తమ పార్టీ 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, పంజాబ్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అధిక సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలకు సుప్రీంకోర్టు సెప్టెంబర్ వరకు గడువిచి్చందని, అంతకుముందే వాటిని నిర్వహిస్తామని అమిత్ షా చెప్పారు. -
మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం
అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రహమాన్ (64) హాఫ్ సెంచరీ చేయగా, షాహిదుల్లా (37), రియాజ్ హసన్ (34) మాత్రమే కొద్దిగా పోరాడారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. -
జగన్ దెబ్బకు ఆశలు వదిలేసిన చంద్రబాబు, పవన్...!
-
ఈటీజీ-టైమ్స్ నౌ సర్వేలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం
-
ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సంక్షేమ ప్రభుత్వం వైఎస్సార్సీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనుందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మొత్తం 25 సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. ఏపీలో వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని, 51.3 శాతం ఓట్ల శాతంతో మొత్తం 25 ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే తెలిపింది. టీడీపీ ఒక్క ఎంపీ సీటు దక్కితే దక్కొచ్చని, వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం టీడీపీ ఖాతా నిల్ అని విషయాన్ని చెప్పేసింది ఈటీజీ టైమ్స్ నౌ సర్వే. ఇక ఈ సర్వేలో జనసేన ఖాతాకు ఒక్క సీటు కూడా దక్కదని ప్రస్తావించింది. ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలో ప్రభంజనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 25 లోక్ సభ స్థానాలకు గానూ.. వైఎస్సార్సీపీ 22 స్థానాలను కైవసం చేసుకుని జయకేతనం ఎగరేసింది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్..!
-
ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు -
వరల్డ్ ఛాంపియన్స్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ (ఫొటోలు)
-
ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా
టి20 ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు టి20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమికి బంగ్లా బదులు తీర్చుకున్నట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్‌దాస్(57 బంతుల్లో 73, 10 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. షాంటో 47 పరుగులు, రోనీ తలుక్దర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మలాన్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్ 40 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరు మినహా మిగతవారు రాణించడంలో విఫలం కావడం.. బంగ్లా బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్విర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌లు తలా ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో రాణించిన లిటన్‌దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. నజ్ముల్ హొసెన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. Modhumoti Bank Limited T20i Series: Bangladesh vs England: 3rd T20i A Glimpse of Bangladesh's Bowling ✨#BCB | #Cricket | #BANvENG pic.twitter.com/VhGahbohNe — Bangladesh Cricket (@BCBtigers) March 14, 2023 Congratulation 3.0 Bangladesh #Bangladesh vs #England pic.twitter.com/ftK5pxEQVN — Tayyab Qureshi (@TayyabQ37980603) March 14, 2023 చదవండి: 'ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం' -
SA Vs WI 2nd Test: దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
జొహన్నెస్‌బర్గ్- South Africa vs West Indies, 2nd Test: వెస్టిండీస్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. జోషువా డి సిల్వ (34)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ, సైమన్ హార్మర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... రబడ, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు 287/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. బవుమా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, ఎయిడెన్ మార్క్రమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లి ముఖంపై చిరునవ్వు! ఫ్యాన్స్ ఖుషీ IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! -
178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో
భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్-ఏ జట్టుకు భంగపాటే ఎదురైంది. న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక మూడు వన్డేల సిరీస్‌ను సంజూ శాంసన్ కెప్టెన్సీలోని ఇండియా-ఏ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన అనధికారిక మూడో వన్డేలో ఇండియా-ఏ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్-ఏ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ డానే క్లీవర్ ఒక్కడే 83 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా.. మిగిలినవారిలో మైకెల్ రిప్పన్ 29, చాడ్ బోవ్స్ 20 పరుగులు చేశారు. ఇండియా-ఏ బౌలర్లలో రాజ్ బవా నాలుగు వికెట్లతో చెలరేగగా.. రాహుల్ చహర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సంజూ శాంసన్(54), తిలక్ వర్మ(50), శార్దూల్ ఠాకూర్(51) అర్థ సెంచరీలతో చెలరేగారు.కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్‌కు రెండు, జో వాకర్‌కు ఒకటి, మైఖేల్ రిప్పన్‌కు రెండు, రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక అనధికారిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా-ఏ టెస్టు సిరీస్‌ను మాత్రం డ్రాతోనే సరిపెట్టుకుంది. చదవండి: షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్! -
IND Vs WI 3rd ODI: విండీస్‌పై భారత్ గెలుపు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా... కుర్రాళ్లు సత్తా చాటడంతో విండీస్‌ను 3–0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండు హోరాహోరీ వన్డేల తర్వాత చివరి పోరులో ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 119 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) విండీస్‌ను చిత్తు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను కుదించారు. ముందుగా భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (98 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శిఖర్ ధావన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం డక్‌వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అయితే విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెండన్ కింగ్ (37 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. సిరాజ్ తన తొలి ఓవర్లోనే మేయర్స్ (0), బ్రూక్స్ (0)లను అవుట్ చేయడంతో ‘సున్నా’కే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. యజువేంద్ర చహల్ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... సిరాజ్, శార్దుల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 64, 43, 98 నాటౌట్ (మొత్తం 205) పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. విండీస్ గడ్డపై ఆ జట్టును వన్డేల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇదే తొలిసారి. -
టార్గెట్ క్లీన్‌స్వీప్.. టీమిండియా ముంగిట అరుదైన రికార్డులు
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇంతకముందు జరిగిన రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తొలి వన్డేలో 308 పరుగులను కాపాడుకునే క్రమంలో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో 312 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మిగిలి ఉండగా విజయం సాధించింది. ఇక బుధవారం జరగనున్న మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే పలు రికార్డులు అందుకోనుంది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. ►మూడో వన్డేలో టీమిండియా గెలిస్తే.. విండీస్‌ను వారి సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించనుంది. ►మూడో వన్డే విజయంతో కరీబియన్ గడ్డపై తొలిసారి టీమిండియా క్లీన్‌స్వీప్‌తో సిరీస్ గెలవనున్న జట్టుగా నిలవనుంది. ►ఒకవేళ విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు ఇది 13వ సిరీస్ క్లీన్‌స్వీప్ సిరీస్ విజయం కానుంది. ►విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే విదేశీ గడ్డపై టీమిండియాకు ఇది మూడో క్లీన్‌స్వీప్ సిరీస్ అవుతుంది. ►ఇంతకముందు 2103, 2015, 2016లో జింబాబ్వేను.. 2017లో శ్రీలంకను టీమిండియా వైట్‌వాష్ చేసింది. ►ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఒకే క్యాలండర్ ఇయర్లో డబుల్ వైట్‌వాష్ చేసిన మూడో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ 3-0తో వైట్‌వాష్ అయింది. ►ఒక జట్టు ఒకే క్యాలండర్ ఇయర్లో తన ప్రత్యర్థిని డబుల్ వైట్‌వాష్ చేసిన సందర్భాలు రెండుసార్లు మాత్రమే. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్ వైట్‌వాష్ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా... -
బంగ్లాదేశ్‌పై విండీస్ ఘన విజయం.. సిరీస్ కైవసం..!
సెయింట్ లూసియా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 13 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 2.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఓవర్‌నైట్ స్కోరు 132/6తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకు ఆలౌటైంది. కేవలం 13 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగలగింది. బంగ్లా బ్యాటర్లలో నూరుల్ హసన్ (60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక విండీస్ బౌలర్లలో రోచ్, జోషఫ్, ఫిలిఫ్ తలా మూడు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కైల్ మైయర్స్(146) సెంచరీతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్ 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కైల్ మైయర్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. చదవండి: Ind Vs Eng 5th Test: "టీమిండియా ఓపెనర్‌గా గిల్ వద్దు.. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి" Kyle Mayers takes the #MastercardPricelessMoment of the match with his stunning century!🔥 #WIvBAN pic.twitter.com/8C3EAYUzbR — Windies Cricket (@windiescricket) June 27, 2022 -
‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’
Imran Khan wanted to clean sweep the entire opposition leadership: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖాన్ 15 ఏళ్లు తానే పాలన సాగించేలా ఫాసిస్ట్ ప్లాన్లు వేస్తున్నారని పాక్ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిరి ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అహ్సాన్ ఇక్బాల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీతో సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్నే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఇమ్రాన్ ఖాన్ కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులను వేగవంతం చేసేందకు సుమారు 100 మంది న్యాయమూర్తి నియమిస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ దేశం పై దాడి చేసేలా ఫాసిస్ట్ ప్లాన్లు కలిగి ఉన్నందునే సంకీర్ణం ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పాక్ మాజీ మంత్రి అలీ హైదర్ జైదీ స్పందిస్తూ...రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా తొలగించినట్లు ఖుర్రం దస్తగిర్ బహిరంగంగానే అంగీకరించాడని చెప్పారు. అవినీతి కేసుల నుంచి ప్రతిపక్షాలను కాపాడేందుకు ఇలా చేశారు. ఈ దుండగులు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయాలని చూస్తుండటం బాధాకరం అన్నారు. అంతేకాదు ఖాన్ కూడా రష్యా, చైనా మరియు అఫ్గనిస్తాన్‌ల స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తాను ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓటమిని ఎదుర్కొన్నానని అన్నారు. పైగా ఖాన్ ఇది యూఎస్ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నదని, పాకిస్తాన్‌కి ఆయన నిజమైన ప్రతినిధి కాదంటూ ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. (చదవండి: ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్ ప్లాంట్ భారీ పేలుడు...ఒకరు మృతి) -
భవిష్యత్ ఎన్నికలపై ఫోకస్.. టార్గెట్ క్లీన్ స్వీప్..!!
-
సెంచరీలతో చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. సిరీస్ క్లీన్‌స్వీప్
ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో నెదర్లాండ్స్‌పై 20 పరుగుల తేడాతో నెగ్గిన విండీస్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ ఐసీసీ పురుషుల వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో 80 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. క్లీన్‌స్వీప్ అయిన నెదర్లాండ్స్ 25 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కైల్ మేయర్స్(106 బంతుల్లో 120, 8 ఫోర్లు, 7 సిక్సర్లు), షమ్రా బ్రూక్స్ (115 బంతుల్లో 101 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయింది. మాక్స్ డౌడ్ 89, విక్రమ్‌జిత్ సింగ్ 54, ముసా అహ్మద్ 42 పరుగులు చేశారు. చదవండి: Ben Stokes Over Throw Controversy: మళ్లీ అదే స్టోక్స్.. 2019 వరల్డ్‌కప్ వివాదం గుర్తుకుతెచ్చేలా 3-0! A thrilling finish to the series! 💥 Well played boys!👏🏿 #NEDvWI pic.twitter.com/n87EwYLCBX — Windies Cricket (@windiescricket) June 4, 2022 -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
భారత్‌తో టి20 సిరీస్ ఆడేందుకు వస్తున్న జట్లకు గట్టి దెబ్బే తగులుతోంది. ఈ సీజన్లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల తర్వాత పరాజిత జట్ల జాబితాలో ఇప్పుడు శ్రీలంక చేరింది. టీమిండియా సొంతగడ్డపై అన్నీ గెలిచి వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది. ధర్మశాల: అసలు సీనియర్లే లేని పేస్ దళంతో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థిని ఆరంభంలోనే మూడు చెరువుల నీటిని తాగించింది. అవేశ్ ఖాన్ (2/23), సిరాజ్ (1/22), హర్షల్ (1/29)ల దెబ్బకు... శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ కూడా తోడవడంతో ఆఖరి టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మొదట లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ షనక (38 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూలిపోతున్న లంకను ఒంటిచేత్తో నిలబెట్టాడు. తర్వాత వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. షనక పోరాటం లంక 11 మందితో బరిలోకి దిగితే పోరాడింది మాత్రం కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్‌లో జట్టు భారాన్నీ మోసిన షనక ఇందులో అయితే జట్టు పాలిట ఆపద్భాంధవుడయ్యాడు. అవేశ్‌ఖాన్ ఆరంభ స్పెల్‌కు (3–1–4–2) కుదేలై... లంక 11 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. 60 స్కోరు వద్ద ఐదో వికెట్ కూలింది. ఈ దశలో మరో వికెట్ పడకుండా చమిక కరుణరత్నే (12 నాటౌట్)తో కలిసి షనక విరోచిత ప్రదర్శన చేశాడు. ఇద్దరు 7.5 ఓవర్లపాటు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. అవేశ్ మిగిలిపోయిన ఓవర్‌ను 2 ఫోర్లు, సిక్సర్‌తో చితగ్గొట్టాడు. 3 ఓవర్లేసి 4 పరుగులే ఇచ్చిన అవేశ్ తన ఆఖరి ఓవర్లో ఏకంగా 19 పరుగులిచ్చాడు. 29 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షనక ఆఖరి ఓవర్లలో చెలరేగిపోయాడు. అయ్యర్ సూపర్ సామ్సన్తో కలిసి లక్ష్యఛేదనకు దిగిన రోహిత్ బౌండరీతో ఖాతా తెరిచాడు. తొలి ఓవర్లోనే అతను అవుటవ్వాల్సింది కానీ మిడాఫ్‌లో షనక క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రోహిత్ (5) మరుసటి ఓవర్లోనే కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చీరాగానే లంక బౌలర్ల భరతం పట్టాడు. 6.1 ఓవర్లో భారత్ స్కోరు ఫిఫ్టీకి చేరింది. సామ్సన్ (18) పెద్ద స్కోరేమీ చేయలేదు. తర్వాత దీపక్ హుడా (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ జట్టును నడిపించాడు. అయ్యర్ 29 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ భారత్ 100 పరుగులకు చేరకముందే హుడా అవుటయ్యాడు. తర్వాత వెంకటేశ్ (5) విఫలమయ్యాడు. జడేజా (22 నాటౌట్; 3 ఫోర్లు) వచ్చాకా ఇంకో వికెట్ పడకుండా శ్రేయస్ మ్యాచ్‌ను ముగించేశాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) అవేశ్ ఖాన్ 1; గుణతిలక (బి) సిరాజ్ 0; అసలంక (సి) సామ్సన్ (బి) అవేశ్ ఖాన్ 4; లియనాగె (బి) రవి బిష్ణోయ్ 9; చండిమాల్ (సి) వెంకటేశ్ (బి) హర్షల్ 22; షనక (నాటౌట్) 74; కరుణరత్నే (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–1, 2–5, 3–11, 4–29, 5–60. బౌలింగ్: సిరాజ్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 4–1–23–2, హర్షల్ పటేల్ 4–0–29–1, కుల్దీప్ 4–0–22–0, రవి బిష్ణోయ్ 4–0–32–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) చండిమాల్ (బి) కరుణరత్నే 18; రోహిత్ (సి) కరుణరత్నే (బి) చమీర 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 73; దీపక్ హుడా (బి) కుమార 21; వెంకటేశ్ (సి) సబ్–జయవిక్రమ (బి) కుమార 5; జడేజా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో 4 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–6, 2–51, 3–89, 4–103. బౌలింగ్: ఫెర్నాండో 4–0–35–0, చమీర 3–0–19–1, లహిరు కుమార 3.5–0–39–2, కరుణరత్నే 3.4–0–31–1, వాండెర్సే 2.2–0–24–0. -
వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక..
గాలే: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 56.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా (5/35), రమేశ్ మెండిస్ (5/66) కరీబియన్ జట్టును పడగొట్టేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 328/8తో ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 121.4 ఓవర్లలో 345/9 వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డిసిల్వా (155 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ధనంజయకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రమేశ్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IND Vs NZ: ఒకే ఒక్కడు 6వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్.. -
Inzamam-ul-Haq: పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. ఇప్పటికైనా వాళ్లు మారాలి!
Inzamam ul Haq Slams Bangladesh After Whitewash Against Pakistan T20 Series: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ విమర్శల వర్షం కురిపించాడు. సుదీర్ఘకాలంగా ఒకే జట్టును బరిలోకి దించుతున్నారని.. కొత్త వాళ్లకు అవకాశమే ఇవ్వడం లేదన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేయడం లేదని.. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి తగిన మార్పులు చేస్తే మెరుగైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత.. పాకిస్తాన్ వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతికి మొహమ్మద్ నవాజ్ ఫోర్ బాదడంతో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆట తీరుపై ఇంజమామ్ పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే.. ఇప్పటికీ ముగ్గురు.. నలుగురు ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది. గత ఆరేడేళ్లుగా ఇదే పరిస్థితి. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వారు మారడం లేదు. కొత్త ముఖాలు కనిపించడం లేదు. కొంతమంది కీలక ఆటగాళ్లు(షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఉద్దేశించి) కూడా ఈ సిరీస్ ఆడలేదు... ఇప్పటికైనా బంగ్లాదేశ్ క్రికెట్లో మార్పు రావాలి. ఆటను అభివృద్ధిపరచడంపై దృష్టి సారించాలి’’ అని హితవు పలికాడు. ఇక వైట్‌వాష్ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై ప్రశంసలు కురిపించిన ఇంజమామ్... రోజురోజుకీ సారథిగా బాబర్ ఎంతో ఇంప్రూవ్ అవుతున్నాడని కితాబిచ్చాడు. చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్.. ఆట పట్టించిన శ్రేయస్.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్! -
Ban Vs Pak: చివరి బంతికి గట్టెక్కిన పాక్.. 3–0తో క్లీన్‌స్వీప్
ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠగా సాగిన మూడో టి20లో చివరి బంతికి నెగ్గిన పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో పాక్ ఛేదనను మొదలు పెట్టగా... ఆ జట్టు బ్యాటర్స్ మరీ నెమ్మదిగా ఆడారు. దాంతో విజయం కోసం పాకిస్తాన్ ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. బౌలింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ సారథి మహ్ముదుల్లా తొలి బంతికి పరుగు ఇవ్వలేదు. రెండు, మూడు బంతులకు వరుసగా సర్ఫరాజ్ అహ్మద్ (6), హైదర్ అలీ (38 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను అవుట్ చేశాడు. దాంతో పాక్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే క్రీజులోకి వచ్చిన ఇఫ్తిఖార్ అహ్మద్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి అతడు వెనుదిరగడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే గెలుపు ఖాయం అన్న తరుణంలో మొహమ్మద్ నవాజ్ (4; 1 ఫోర్) ఫోర్ బాది పాక్‌ను గట్టెక్కించాడు. దాంతో మూడో టి20లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్ నైమ్ (50 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి నెగ్గింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదర్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మొహమ్మద్ రిజ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 26న మొదలవుతుంది. చదవండి: Ind Vs Nz 2021 T20 Series: టీమిండియా సరికొత్త రికార్డు.. ఏకంగా ఆరు సార్లు.. Player of the Series @iMRizwanPak reviews the three-match series against Bangladesh.#BANvPAK | #HarHaalMainCricket pic.twitter.com/QHOkjsNKZj — Pakistan Cricket (@TheRealPCB) November 22, 2021 -
4 జిల్లాలు క్లీన్ స్వీప్: వైఎస్సార్సీపీ విజయ ఢంకా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రంలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. జిల్లాలవారీగా చూడగా ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసి విజయఢంకా మోగించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. కర్నూలు జిల్లాలో 52 స్థానాలను సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయ నాదం మోగించింది. -
పుట్టపర్తిలో 6 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీ వశం
సాక్షి, అనంతపురం: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్‌గా మారింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు. ప్రజారంజక పాలనకు మరోసారి ప్రజలు అఖండ విజయం అందించారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. -
చహర్‌కు రెస్ట్.. ప్రయోగాలు చేస్తారా.. ఉడ్చేస్తారా?
కొలొంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇదివరకే 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా నామమాత్రమైన మూడో వన్డేకు సిద్ధమవుతోంది. రేపు(జులై 23) జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా, ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని ఆతిధ్య లంక జట్టు భావిస్తోంది. అయితే రేపటి మ్యాచ్‌లో టీమిండియాలో మార్పులేమైనా ఉంటాయా.. లేక పాత జట్టునే యధావిధిగా కొనసాగిస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. టీమిండియా తుది జట్టులో ఎవరెవరికి అవకాశాలు ఉంటాయన్న అంశంపై విశ్లేషిస్తే.. ఓపెనర్ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ గబ్బర్‌కు తోడుగా మరో కొత్త ఓపెనర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పృథ్వీ షా (43, 13) స్థానంలో దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. ఒకవేళ జట్టు యాజమాన్యం టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం షాను తప్పించడం కష్టం. దీంతో ధవన్ పార్ట్నర్ ప్లేస్ కోసం త్రిముఖ పోరు నెలకొంది. వన్‌డౌన్ విషయానికొస్తే.. ఇషాన్ కిషన్ బదులు సంజు సామ్సన్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ద్రవిడ్‌కు సామ్సన్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ఇక మిడిలార్డర్లో మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ స్థానాలకు ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చు. వారిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేస్తున్నారని ద్రవిడ్ భావిస్తున్నారు. ఫిట్నెస్ ఇబ్బందులేమీ లేవు కాబట్టి హార్దిక్ పాండ్యకు చోటు కూడా దాదాపుగా ఖాయమే. అయితే టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అతనికి విశ్రాంతినివ్వొచ్చు. కృనాల్ పాండ్యను జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి. స్పిన్నర్ల కోటాలో చహల్ (2/52, 3/50) ప్లేస్ పదిలం కాగా, కుల్దీప్ (2/48, 0/55) స్థానంలో రాహుల్ చాహర్‌కు అవకాశం దక్కవచ్చు. ఒకవేళ చహల్‌కు కూడా విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తే.. కృష్ణప్ప గౌతమ్‌ను అవకాశం దక్కవచ్చు. ఇక పేస్ బౌలర్ల విషయానికొస్తే.. ఈ విభాగానికి నాయకుడైన భువీకి ఎటువంటి ఇబ్బంది లేకపోగా, టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని దీపక్ చాహర్‌కు విశ్రాంతినివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అతని స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చిన లంక జట్టును యధాతధంగా కొనసాగించే అవకాశం ఉంది. -
పిస్టల్‌లో క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్‌కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్ రజతం, మనూ భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ నిర్వహిం చగా... చింకీ యాదవ్ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రతాప్ సింగ్ ఘనత మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్ సింగ్ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్ సింగ్ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్తవన్ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్ ఒల్సెన్ (డెన్మార్క్–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు తేజస్విని సావంత్ 12వ స్థానంలో, అంజుమ్ మౌద్గిల్ 16వ స్థానంలో, సునిధి చౌహాన్ 17వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొట్టింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో విజయ ఢంకా మోగించింది. అలాగే మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, నగరి మునిసిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. పుంగనూరు మునిసిపాలిటీని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల పరిధిలో 217 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 197 స్థానాలను కైవసం చేసుకుంది. వార్డు, డివిజన్లతో కలిపి టీడీపీ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. సాక్షి, తిరుపతి: జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. మునిసిపల్ ఎన్నికల్లో క్లిన్‌స్వీప్ చేసి తిరుగులేని శక్తిగా నిలిచింది. 19 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత మొదటిసారి జరిగిన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కంచుకోటగా పిలుచుకునే ఈ నగరంలో టీడీపీ కేవలం ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. మొత్తం 50 డివిజన్లలో 22 ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఒక డివిజన్ కోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉంది. 35వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ 126 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి క్యాన్సర్‌తో మంచం పట్టి పెద్దగా ప్రచారం చేయలేకపోయినా గట్టి పోటీనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు వెంకటకీర్తి పోటీచేసిన 18వ డివిజన్, తుడా మాజీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ సోదరుడు కృష్ణాయాదవ్ పోటీచేసిన 3వ డివిజన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జ్యోత్స్న పోటీచేసిన 15వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ కంచు కోటలు బద్దలు జిల్లా కేంద్రమైన చిత్తూరు కార్పొరేషన్ కాంగ్రెస్, టీడీపీకి కంచుకోట. చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎంపీ సీఎం రమేష్ వంటి అగ్రనాయకులంతా ఈ నగరంలోనే నివాసం ఉంటున్నారు. వీరంతా కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. డబ్బు, మద్యంతోపాటు బంగారు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, చీరలు పంపిణీ చేశారు. అయినా స్థానిక ఓటర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకే జై కొట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి సొంత నియోజకవర్గమైన పలమనేరు మునిసిపాలిటీలో వైఎస్సార్సీపీ రెపరెపలాడింది. ఇక్కడ మొత్తం 26 వార్డులకుగాను ఏకగ్రీవాలతో కలుపుకుని 24 వార్డులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. 2 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కుప్పం పక్క నియోజకవర్గం అయినా చంద్రబాబు ప్రభావం పెద్దగా కనిపించలేదు. మదనపల్లె మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. 33 వార్డులు వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఉంటున్న 27వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ కరీముల్లా 507 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఆధిక్యం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ మునిసిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. వికసించని కమలం మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ పలుచోట్ల పోటీ చేసినా ఒక్క చోటా బోణీ చేయలేకపోయింది. తిరుపతిలో ఎనిమిది, నగరి, పుత్తూరులో ఆరు వార్డులు, పలమనేరులో ఒక చోట ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేశారు. అక్కడా నామమాత్రపు ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లు 2,546 మాత్రమే. అదేవిధంగా జనసేన తరుఫున తిరుపతిలో రెండు డివిజన్లలో పోటీచేస్తే ఇద్దరికీ కలిపి వచ్చిన ఓట్లు 231 మాత్రమే. డబ్బు పోసినా.. ఫ్యాన్‌గాలికి తలవంచాల్సిందే నగరి, పుత్తూరు మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్, అతని అనుచరులు తీవ్రంగా ప్రయ తి్నంచారు. ఈ మునిసిపాలిటీలను దక్కించుకునేందుకు అమెరికాలో ఉన్న టీడీపీ శ్రేణులు డబ్బు సంచులతో చేరుకున్నాయని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకూ రాని వారు సైతం వచ్చి అహరి్నశలు శ్రమించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. రెండు మునిసిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. ఇటీవల మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 10 గంటలు రేణిగుంట విమానాశ్రయంలో హైడ్రామా చేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకే జై కొట్టారు. చదవండి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్ తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు? -
శ్రీలంకకు ఘోర పరాజయం.. క్లీన్‌స్వీప్
జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన చివరిదైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు వికెట్ నష్టపోకుండా 13.2 ఓవర్లలో ఛేదించి గెలుపొందింది. ఓపెనర్లు మార్క్రమ్ (36 నాటౌట్; 4 ఫోర్లు), ఎల్గర్ (31 నాటౌట్; 5 ఫోర్లు) రాణించి లాంఛనం పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఎల్గర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. కాగా ఈ సిరీస్‌లో ఎల్గర్ 253 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 150/4తో మూడో రోజైన మంగళవారం ఆటను ఆరంభించిన శ్రీలంక 56.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 66 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే సెంచరీ (103; 19 ఫోర్లు)తో పోరాడాడు. ఇన్‌గిడి నాలుగు, సిపామ్లా మూడు వికెట్లతో రాణించారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.(చదవండి: ఓపెనర్‌గానే రోహిత్ శర్మ!) -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
కేప్‌టౌన్: వరుసగా మూడో టి20 మ్యాచ్‌లోనూ అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి ఛేదించింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 99 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాస్ బట్లర్ (46 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రెండో వికెట్‌కు అజేయంగా 167 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు 166 పరుగులతో జయవర్ధనే– సంగక్కర (శ్రీలంక–2010లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును మలాన్, బట్లర్ సవరించారు. అంతకు ముందు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (37 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డెర్ డసెన్ (32 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హడలెత్తించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 10.3 ఓవర్లలో 127 పరుగులు జత చేశారు. ఇంగ్లండ్ ‘టాప్’ ర్యాంక్‌లోకి... దక్షిణాఫ్రికాపై క్లీన్‌స్వీప్ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను రెండో స్థానానికి నెట్టేసి టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మలాన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలాన్ 915 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టి20 ర్యాంకింగ్స్‌లో ఓ బ్యాట్స్‌మన్ 915 రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే ప్రథమం. -
ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: గుజరాత్, మణిపూర్‌లు మినహా మిగిలిన రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, బీజేపీ నుంచి జ్యోతిరాధిత్య సింధియా, జార్ఖండ్ నుంచి షిబు సోరెన్ వంటి వారు సులువుగా ఎగువ సభకు ఎన్నికయ్యారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపారు. కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందింది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) ఒక సీటు సాధించుకుంది. బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. గుజరాత్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఓట్లను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యింది. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మేఘాలయలోని ఒక స్థానాన్ని మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థి వాన్వే రాయ్ ఖర్లుకి విజయం సాధించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే శాసనసభ్యులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు ధరించడంలాంటి అన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంలో పడిన మణిపూర్‌లో ఒకే ఒక్క రాజ్యసభ సీటుని కాంగ్రెస్ అభ్యర్థి టి. మంగిబాబు పై బీజేపీకి చెందిన లీసెంబా సనజోబా గెలుచుకున్నారు. -
గులాబీనామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా ఆరో ఏడాది కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. రాజకీయంగా ఆ పార్టీకి 2019 అన్ని రకాలుగా కలిసొచ్చింది. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కుదేలు చేయడంతోపాటు స్థానిక సంస్థలను క్లీన్‌స్వీప్ చేసుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ ఈ ఏడాది పూర్తిస్థాయి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం మినహా రాజకీయంగా ఈ ఏడాది అన్నీ ఒడిదుడుకులే ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో కాస్త జోష్ నింపాయి. అధికార టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎంకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కగా తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు ఈ ఏడాది ఉనికి చాటుకునేందుకు తంటాలు పడ్డాయి. 32 జిల్లా పరిషత్‌లు గులాబీ ఖాతాలోకి... ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో 12,732 గ్రామ పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ పదవులను అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ‘కారు’ జోరు తగ్గింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను తొమ్మిది చోట్లే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పార్టీ కీలక ఎంపీలైన కవిత, బోయినపల్లి వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్ ఓటమి పాలయ్యారు. మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు వరంగల్–నల్లగొండ–ఖమ్మం, కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ) విజయం సాధించారు. ఎమ్మెల్యే కోటాలో నవీన్‌రావు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. 5,659 ఎంపీటీసీ స్థానాలకుగాను 3556, 534 జెడ్పీటీసీ స్థానాలకుగాను 445 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ 2019లో రెండు విడతల్లో కేబినెట్‌ను విస్తరించారు. ఫిబ్రవరిలో జరిగిన తొలి విడత విస్తరణలో ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు చోటు దక్కింది. సెప్టెంబర్‌లో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం లభించింది. అక్టోబర్ 21న జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తొలిసారిగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 13 మంది అధికారికంగా టీఆర్ఎస్లో చేరగా సీఎల్పీని విలీనం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బతీసింది. కుదేలవుతూ... కోలుకుంటూ కాంగ్రెస్ పయనం అధికార టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలకు కుదేలవుతూనే ఈ ఏడాది కాంగ్రెస్ పయనాన్ని కొనసాగించింది. పార్టీ నుంచి గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకొని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఈ ఏడాది కాంగ్రెస్‌కు ఘోర పరాజయంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 3 ఎంపీ సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 శాతం స్థానాల్లో గెలిచినా ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ ఏడాది ఆసాంతంలో కాంగ్రెస్‌కు లభించిన పెద్ద ఊరట అంటే ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి గెలుపే. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలవడమే కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఈ ఏడాది మరణించడం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత సర్దుకొని పార్టీతో కలసి పనిచేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాల విషయానికి వస్తే ఎప్పటిలాగే కాంగ్రెస్ తాబేలు యాత్ర చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి కొంత హడావుడి చేసినా ఆర్టీసీ సమ్మె, దిశ హత్య లాంటి కీలకాంశాల్లో తగిన రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడక్కడా యాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతల్లో ఇంకా సమన్వయ లేమి కనిపిస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను మారుస్తారనే ప్రచారం జరిగినా 2019లో అది జరగలేదు. ఈ ఏడాది చివర్లో ఎన్నార్సీ అంశంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌కు 2020లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పోరాటాలు చేస్తున్నారు కానీ...! గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది తాము ప్రజల్లోకి వెళ్లామని బీజేపీ అంచనా వేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం కమలదళంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇదే జోష్‌తో రాష్ట్రంలో 11 లక్షలుగా ఉన్న పార్టీ సభ్యత్వాన్ని 30 లక్షలకు పెంచుకుంది. అయితే స్థానిక నేతల మధ్య సమన్వయం, వ్యూహాల అమలులో కొంత వెనుకబడింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం లాంటి అంశాలు తమకు మేలు చేశాయన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నా ప్రజల్లోకి వెళ్లడంలో ఈ ఏడాది స్ఫూర్తిదాయక పోరాటం చేసినట్టు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ ఏడాదిలోనే హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవగా మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావు మళ్లీ పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా 80 మందికిపైగా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించడం, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ చేరడం, టీ టీడీపీ నేతలు గరికపాటి రామ్మోహన్రావు, పెద్దిరెడ్డి, సురేశ్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి నేతలను చేర్చుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో కొంత పట్టు సాధించగలిగింది. అయితే ‘స్థానిక’ ఎన్నికల్లో కనీస స్థాయిలోనూ గెలవలేకపోవడంతో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు కొత్త ఏడాది పద్మవ్యూహం లాగానే కనిపిస్తోంది. విస్తరణ బాటలో ఎంఐఎం... ఎంఐఎంకు ఈ ఏడాది అనుకోని అవకాశం లభించింది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం కావడంతో అసెంబ్లీలో ఏడుగురు సభ్యుల బలంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ హోదాతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలవడం ద్వారా ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించుకుంది. తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఏడాది పరిమితమయ్యాయి. ప్రజాసమస్యలపై తమదైన స్థాయిలో ఉద్యమాలు చేస్తూ పార్టీ కార్యకలాపాలను కొనసాగించాయి. అయితే ఈ ఏడాది టీటీడీపీ దాదాపు కనుమరుగు కావడం గమనార్హం. -
బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతదీదీకి మళ్లీ జోష్ వచ్చింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇన్నాళ్లూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రాతినిధ్యం వహించిన ఖరగ్‌పూర్ సదార్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ రెండో స్థానానికే పరిమితమైంది. కళాయిగంజ్, ఖరగ్‌పూర్ సదార్, కరీంపూర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు వరసగా తపన్ దేబ్ సిన్హా, ప్రదీప్ సర్కార్, బిమలేందుసిన్హా రాయ్‌లు విజయం సాధించినట్టు గురువారం ఎన్నికల సంఘం ఫలితాలు విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న బీజేపీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టు వంటివని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయ పౌర రిజిస్టర్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలే బెంగాల్లో బీజేపీ ఓటమికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ అంగీకరించింది. -
నేడే క్లీన్‌స్వీప్
ఈ టెస్టుకు ఇంకా రెండు రోజుల ఆట ఉంది. కానీ... చరిత్రకెక్కేందుకు లాంఛనమే మిగిలుంది. సఫారీపై ఎప్పుడూలేని విధంగా 3–0తో క్లీన్‌స్వీప్ విజయానికి టీమిండియా రెండే అడుగుల దూరంలో ఉంది. టెస్టుల్లో నంబర్‌వన్ కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను రోజంతా దడదడలాడించింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లతో ఘనచరితకు శ్రీకారం చుట్టింది. రాంచీ: భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. చారిత్రక విజయానికి భారత్‌ను దగ్గర చేశారు. క్లీన్‌స్వీప్‌కు రెండే వికెట్ల దూరంలో నిలిపారు. ఆ లాంఛనం తొలి ఘడియలోనే పూర్తయితే కోహ్లి సేన ఎదురులేని విజయాన్ని సాధిస్తుంది. తొలి సెషన్లో పేసర్లు ఉమేశ్ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్ 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. హమ్జా (79 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. భారత పేసర్లు ఫాలోఆన్‌లో మరింత రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చేశారు. ఆటనిలిచే సమయానికి 132 పరుగులకే 8 వికెట్లను పడేశారు. 10 పరుగులే ఇచి్చన షమీ 3 వికెట్లు తీయగా, ఉమేశ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఆడింది... హమ్జా ఒక్కడే! దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హమ్జా ఒక్కడే భారత బౌలర్లకు ఎదురునిలిచాడు. 9/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీ జట్టు ఆరంభ ఓవర్లోనే కెపె్టన్ డు ప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని ఉమేశ్ బౌల్డ్ చేశాడు. హమ్జాకు బవుమా (72 బంతుల్లో 32; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను 21 ఓవర్ల పాటు ఆడుకున్నారు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక సఫారీ కష్టాలు మొదలయ్యాయి. వన్డేను తలపించే ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హమ్జాను జడేజా బోల్తా కొట్టించగా... బవుమాను నదీమ్ ఔట్ చేశాడు. 129/6 స్కోరు వద్ద సఫారీ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్లో లిండే (81 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) టెయిలెండర్లతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. పీట్ (4), రబడ (0) స్వల్ప వ్యవధిలోనే ని్రష్కమించినప్పటికీ... తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నోర్జే (55 బంతుల్లో 4) ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌ను చాలాసేపు ఎదుర్కొన్నాడు. 45వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత కాసేపటికే లిండేను ఉమేశ్, నోర్జేను నదీమ్ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది. తప్పని తడబాటు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే మొదలైంది. రిటైర్డ్‌హర్ట్ ఎల్గర్ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్ చేరారు. డికాక్ (5)ను ఉమేశ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జా (0)కు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్ డుప్లెసిస్ (4)ను షమీ ఎల్బీ చేశాడు. మొత్తానికి మూడో సెషన్‌కు ముందే సఫారీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ లిండే (27), పీట్ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్ (30 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో రెండే వికెట్లు ఉండటంతో మరో అరగంటసేపు ఆటను పొడిగించారు. కానీ బ్రుయిన్.. నోర్జే (5 బ్యాటింగ్)తో కలిసి నాటౌట్‌గా నిలవడంతో ఆట మరో రోజు కొనసాగనుంది. ►5..ఒకే రోజు ఆటలో 14 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం భారత్‌కిది ఐదోసారి. ఈ జాబితాలో 20 వికెట్లు (అఫ్గానిస్తాన్‌పై బెంగళూరులో; 2018) తొలి స్థానంలో ఉండగా... తర్వాతి స్థానాల్లో 17 వికెట్లు (పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 1952–53), 16 వికెట్లు (దక్షిణాఫ్రికాపై రాంచీలో; 2019లో), 15 వికెట్లు (శ్రీలంకపై బెంగళూరులో; 1993–94లో), 14 వికెట్లు (వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో 2018–19లో) ఉన్నాయి. ►8.. ప్రత్యర్థి జట్టును ఎక్కువసార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెపె్టన్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు భారత్ ప్రత్యర్థి జట్టును 8 సార్లు ఫాలోఆన్ ఆడించింది. తర్వాతి స్థానాల్లో అజహరుద్దీన్ (7), ధోని (5), సౌరవ్ గంగూలీ (4) ఉన్నారు. ►2.. ఒక సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండుసార్లు ఫాలోఆన్ ఆడటం 1964–65 తర్వాత ఇదే తొలిసారి. స్వదేశంలో 1964–65లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా చివరిసారి రెండుసార్లు ఫాలోఆన్ ఆడింది. ►4.. టెస్టుల్లో స్టంపింగ్ ద్వారా కెరీర్లో తొలి వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా షాబాజ్ నదీమ్ గుర్తింపు పొందాడు. గతంలో డబ్ల్యూవీ రామన్ (వాల్‡్ష–1987–88లో), ఎం.వెంకటరమణ (హేన్స్–1988–89లో), ఆశిష్ కపూర్ (కార్ల్ హూపర్–1994–95లో) ఈ ఘనత సాధించారు. ►2.. కొట్నీ వాల్ష్ (వెస్టిండీస్) తర్వాత భారత గడ్డపై వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమేశ్ యాదవ్ (6/88, 4/45, 3/37, 3/22, 3/40) గుర్తింపు పొందాడు. ఉమేశ్ బౌన్సర్... ఎల్గర్ కన్కషన్ భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బౌన్సర్ సఫారీ ఓపెనర్ ఎల్గర్‌ను పడేసింది. అతను వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఎల్గర్ 16 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా... ఉమేశ్ వేసిన మూడో బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాట్స్‌మన్ చెవి పైభాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను పడిపోయాడు. బ్యాటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఐసీసీ కన్కషన్ ప్రొటోకాల్ ప్రకారం మ్యాచ్ రిఫరీ ఎల్గర్ స్థానంలో బ్రుయిన్ను ఆడించేందుకు అనుమతించారు. ఎల్గర్ గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు రోజల సమయం పడుతుందని దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. సాహా స్థానంలో పంత్ కీపింగ్ టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయంతో మైదానం వీడాడు. మూడో రోజు ఆటలో అశ్విన్ వేసిన 27వ ఓవర్ తొలి బంతి గింగిర్లు తిరుగుతూ బౌన్స్ అయింది. క్రీజులో ఉన్న లిండే దాన్ని ఎదుర్కోలేకపోవడంతో బంతిని సాహా అందుకునే ప్రయత్నం చేయగా అతని మునివేళ్లను తాకడంతో గాయపడ్డాడు. నొప్పికి తాళలేకపోయిన సాహా పెవిలియన్ చేరగా అతని స్థానంలో రిషభ్ పంత్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 497/9 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) సాహా (బి) షమీ 0; డికాక్ (సి) సాహా (బి) ఉమేశ్ 4; హమ్జా (బి) జడేజా 62; డు ప్లెసిస్ (బి) ఉమేశ్ 1; బవుమా (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 32; క్లాసెన్ (బి) జడేజా 6; లిండే (సి) రోహిత్ (బి) ఉమేశ్ 37; పీట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; రబడ రనౌట్ 0; నోర్జే (ఎల్బీడబ్ల్యూ) (బి) నదీమ్ 4; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.2 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–4, 2–8, 3–16, 4–107, 5–107, 6–119, 7–129, 8–130, 9–162, 10–162. బౌలింగ్: షమీ 10–4–22–2, ఉమేశ్ 9–1–40–3, నదీమ్ 11.2–4–22–2, జడేజా 14–3–19–2, అశ్విన్ 12–1–48–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డికాక్ (బి) ఉమేశ్ 5; ఎల్గర్ (రిటైర్డ్ హర్ట్) 16; హమ్జా (బి) షమీ 0; డు ప్లెసిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 4; బవుమా (సి) సాహా (బి) షమీ 0; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 5; లిండే (రనౌట్) 27; పీట్ (బి) జడేజా 23; బ్రుయిన్ (బ్యాటింగ్) 30; రబడ (సి) జడేజా (బి) అశ్విన్ 12; నోర్జే (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (46 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–5, 2–10, 3–18, 4–26, 5–36, 6–67, 7–98, 8–121. బౌలింగ్: షమీ 9–5–10–3, ఉమేశ్ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్ 5–0–18–0, అశి్వన్ 10–3–28–1. -
భారత్ ‘ఎ’కు చేజారిన విజయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో : వెస్టిండీస్ ‘ఎ’తో తొలి రెండు అనధికారిక టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంది. మూడో టెస్టులో చివరి రోజు విండీస్ బ్యాట్స్‌మెన్ చక్కటి పోరాటపటిమ కనబర్చడంతో ఆ జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. 373 పరుగుల విజయలక్ష్యంతో ఆడుతూ విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరకు 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాబాజ్ నదీమ్ (5/103) మరోసారి రాణించినా... ఇతర బౌలర్ల వైఫల్యంతో భారత్ తమ ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. శుక్రవారం మొత్తం 94 ఓవర్లు ఆడిన విండీస్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. జెరెమీ సొలొజానో (250 బంతుల్లో 92; 8 ఫోర్లు), బ్రెండన్ కింగ్ (83 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సునీల్ ఆంబ్రిస్ (142 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి రక్షించారు. భారత్ ‘ఎ’ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నదీమ్ ఈ సిరీస్ నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున మొత్తం 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ పర్యటనలో 4–1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ‘ఎ’, టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. -
టార్గెట్ @ 125
లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్ తలాక్, మోటార్ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 101 ఎంపీల బలం గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా పెద్దల సభలో బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి. 2020 నవంబర్ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది. రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు. ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
నేలకొరిగిన హేమాహేమీలు..
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పనిచేయని ‘చౌకీదార్’ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్ చోర్ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి ఈసారి రాహుల్ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు. నేలకొరిగిన హేమాహేమీలు.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలో అశోక్ చవాన్, మిలింద్దేవ్రా, సుశీల్‌కుమార్ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్లో షాక్ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెహ్రూ బాటలో నడిస్తేనే.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దివంగత జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే.. 130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. -
రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా ఎంపీ, మనవడు ప్రజ్వల్ ప్రకటన సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ సంచలన ప్రకటన చేశారు. హసన్ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు. -
కడప జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
సాక్షి, కడప: వైఎస్సార్సీపీ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రభంజనాన్ని మరిపించేలా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. నడిమంత్రపు హోదాతో వచ్చిన నియంతృత్వం, అహంకారానికి జమ్మలమడుగు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వెరశి కౌంటింగ్‌లో రౌండు రౌండులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అహంకారపు మాటలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తూ వచ్చిన టీడీపీ నేతలకు బుద్ధి చెప్పారు. నడిమంత్రపు హోదాతో వైఎస్ కుటుంబాన్ని తూలనాడుతూ వచ్చిన తాజా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని తిరస్కరించారు. ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’ అన్నట్లుగా సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఘోర పరాభవం అప్పగించారు. గ్రామాల్లో స్వేచ్ఛగా ఇతర పార్టీల నాయకులు తిరిగేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులను తోసిపుచ్చారు. తాము ఏకమైతే తట్టుకోగలరా...ఎదురొడ్డి నిలిచే మొనగాడు ఎవ్వరంటూ తూలనాడిన నాయకునికి సిసలైన తీర్పునిచ్చారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని, ఊహించని మెజార్టీని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి సాధించారు. వర్గరాజకీయాలు కోసం ఫ్యాక్షన్‌ను పెంచి పోషించిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల స్వార్థ దృక్పథాలను ప్రజలు ఏమాత్రం సమ్మతించలేదు. అదే విషయాన్ని పోలింగ్ ద్వారా స్పష్టం చేశారు. జమ్మలమడుగు పరిధిలోని అన్నీ మండలాలల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. కనివిని ఎరుగని మెజార్టీ సొంతం.... జిల్లాలో పదికి పది సీట్లు ఏకపక్షంగా మొగ్గిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. వైఎస్సార్ హవాలో కూడా ఒక్కసీటు కోల్పోయారు. కాగా వైఎస్సార్సీపీ అన్నీ సీట్లును దక్కించుకోగా, ఆ పార్టీ అభ్యర్థులకు పరిశీలకులు ఊహించని స్థాయిలో మెజార్టీ స్వంతం దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. కడప ఎమ్మెల్యేగా ఎస్బి అంజాద్‌భాషా 52,539 ఓట్లు ఆధిక్యత చేజేక్కించుకున్నారు. జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్‌రెడ్డి 51,345 ఓట్లు మెజార్టీ పొంది జిల్లాలో మూడోస్థానంలో నిలిచారు. బద్వేల్ నుంచి పోటీచేసిన డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్లు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి 43,148 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి29,990, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 34,510వేల పైచిలుకు మెజార్టీ దక్కించుకోగా, రాయచోటిలో 32,679 మెజార్టీని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దక్కించుకున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 26168, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 29,674వేటు ఓట్లు ఆధిక్యత సాధించుకున్నారు. ప్రజల మధ్యలో ఉన్న నేతలకే పట్టం.... నిత్యం ప్రజల మధ్య నేతలకే ప్రజలు ఎన్నికలల్లో పట్టం కట్టారు. అదే విషయం ఫలితాలల్లో స్పష్టమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై ఉద్యమాలు ఓవైపు, పార్టీ కార్యక్రమాలతో మరోవైపు ప్రజల మధ్యనే ఉండిపోయిన నాయకులకు విజయాన్ని అప్పగించారు. మూడేళ్లుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టి గడపగడపను చుట్టేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించారు. జిల్లా ప్రజలంతా వైఎస్ కుటుంబం వెన్నంటే ఉంటూ వైఎస్సార్సీపీని బలపరుస్తున్నామని ఎన్నికల ద్వారా తీర్పు చెప్పారు. ఆమేరకు జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తూ ఫలితాలు అప్పగించడం విశేషం. ఇది ప్రజాతీర్పు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా భారీ మెజార్టీతో తనను మైదుకూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నా. ఎన్నో బాధలు పెట్టినా భరించాము. అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారు. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కరువుతో రైతులు బాగా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు లక్షల కోట్లను దోచుకుని ఖజానాను ఖాళీ చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక వనరులను సమకూర్చి అభివృద్ధి పథంలో ప్రజలను నడిపిస్తారనే భరోసా ప్రతి ఒక్కరిలో ఉంది. – శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రాజన్న రాజ్యం కోసమే ప్రజలు గెలిపించారు రాజన్న రాజ్యం మరలా రావాలని ప్రజలు వైఎస్సార్సీపీని అత్యధిక సీట్లతో గెలిపించారు. ప్రజలందరూ 2014లో 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబును అమరావతి రాజధాని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. కానీ హామీలనుగానీ, అభివృద్ధినిగానీ చేయని చంద్రబాబు కొన్ని లక్షల కోట్లను బినామీ ఆస్తులుగా మార్చుకుని రాజధాని చుట్టూ కోటరీని ఏర్పరుచుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువై వారి కష్టాలను దగ్గరగా చూశారు. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం: జమ్మలమడుగు జమ్మలమడుగు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం. సుధీర్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. ఎం. సుధీర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,24,201 రామసుబ్బారెడ్డికి వచ్చిన ఓట్లు: 72,856 మెజారిటీ: 51,345 మొత్తం ఓటర్లు: 2,37,551 పోలైన ఓట్లు: 2,02,890 పురుషుల ఓట్లు: 116382 స్త్రీల ఓట్లు: 121169 నియోజకవర్గం: కమలాపురం కమలాపురం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి. రవీంద్రనాథ్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు. రవీంద్రనాథ్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 85,118 పుత్తా నరసింహారెడ్డికి వచ్చిన ఓట్లు: 58,958 మెజారిటీ: 26,168 మొత్తం ఓటర్లు: 1,92,909 పోలైన ఓట్లు: 1,59,335 పురుషుల ఓట్లు: 95,237 స్త్రీల ఓట్లు: 97672 నియోజకవర్గం: రాయచోటి రాయచోటి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 98,248 రమేష్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 65,569 మెజార్టీ: 32,679 మొత్తం ఓటర్లు : 2,31,610 పోలైన ఓట్లు : 1,75,943 పురుషుల ఓట్లు : 1,15,365 స్త్రీల ఓట్లు : 1,16,245 నియోజకవర్గం: రాజంపేట రాజంపేట నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి బత్యాల చంగల్రాయుడుపై విజయం సాధించారు. మేడా మల్లికార్జునరెడ్డికి వచ్చిన ఓట్లు: 81,646 బత్యాల చంగల్రాయుడుకు వచ్చిన ఓట్లు: 51,656 మెజారిటీ: 29,990 మొత్తం ఓటర్లు: 2,22,251 పోలైన ఓట్లు: 1,69,077 పురుషుల ఓట్లు: 10,8849 స్త్రీల ఓట్లు: 113402 నియోజకవర్గం: రైల్వేకోడూరు రైల్వేకోడూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు సమీప టీడీపీ అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్పై విజయం సాధించారు. కొరముట్ల శ్రీనివాసులుకు వచ్చిన ఓట్లు: 77,516 నరసింహప్రసాద్‌కు వచ్చిన ఓట్లు: 43,006 మెజారిటీ: 34,510 మొత్తం ఓటర్లు: 1,82,649 పోలైన ఓట్లు: 1,37,534 పురుషుల ఓట్లు: 90,218 స్త్రీల ఓట్లు: 92,431 నియోజకవర్గం: పులివెందుల పులివెందుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి సతీష్‌రెడ్డిపై విజయం సాధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,32,178 సతీష్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 42,068 మెజారిటీ: 90,110 మొత్తం ఓటర్లు: 2, 23,395 పోలైన ఓట్లు: 1,80,663 పురుషుల ఓట్లు: 1,09,590 స్త్రీల ఓట్లు: 1,13,805 నియోజకవర్గం: మైదుకూరు మైదుకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌పై విజయం సాధించారు. రఘురామిరెడ్డికి వచ్చిన ఓట్లు: 94,854 సుధాకర్‌యాదవ్‌కు వచ్చిన ఓట్లు: 65,180 మెజారిటీ: 29,674 మొత్తం ఓటర్లు: 2,07,946 పోలైన ఓట్లు: 1,71,779 పురుషుల ఓట్లు: 1,03,070 స్త్రీల ఓట్లు: 1,04,876 నియోజకవర్గం: కడప కడప నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్బీ అంజద్బాషాసమీప టీడీపీ అభ్యర్థి అమీర్‌బాబుపై విజయం సాధించారు. అంజద్‌బాషాకు వచ్చిన ఓట్లు:1,00,737 అమీర్‌బాబుకు వచ్చిన ఓట్లు: 48,198 మెజారిటీ: 52,539 మొత్తం ఓటర్లు: 2,65,067 పోలైన ఓట్లు: 1,64,772 పురుషుల ఓట్లు: 1,30,063 స్త్రీల ఓట్లు: 1,35,004 నియోజకవర్గం: బద్వేలు బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి. వెంకటసుబ్బయ్య సమీప టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌పై విజయం సాధించారు. జి. వెంకటసుబ్బయ్యకు వచ్చిన ఓట్లు: 95,482 రాజశేఖర్‌కు వచ్చిన ఓట్లు: 50,748 మెజారిటీ: 44,734 మొత్తం ఓటర్లు: 2,04,597 పోలైన ఓట్లు: 1,58,863 పురుషుల ఓట్లు: 102811 స్త్రీల ఓట్లు: 101786 నియోజకవర్గం: ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి లింగారెడ్డిపై విజయం సాధించారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 1,07,941 లింగారెడ్డికి వచ్చిన ఓట్లు: 64,793 మెజారిటీ: 43,148 మొత్తం ఓటర్లు: 2,36,689 పోలైన ఓట్లు: 1,82,125 పురుషుల ఓట్లు: 115532 స్త్రీల ఓట్లు: 121157 -
భారత షూటర్లు భళా
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. చైనీస్‌తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాన్‡్ష సింగ్ పాన్వర్, ఎలవెనీల్ వలరియవన్ పసిడి పతకాల్ని క్లీన్‌స్వీప్ చేశారు. పురుషుల వ్యక్తిగత ఈవెంట్లో దివ్యాన్‡్ష, మహిళల ఈవెంట్లో ఎలవెనీల్ చెరో స్వర్ణం గెలిచారు. వీళ్లిద్దరు సహచరులతో కలిసి బరిలోకి దిగిన టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకాలు నెగ్గారు. 10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో దివ్యాన్‡్ష, రవికుమార్, దీపక్ కుమార్ల బృందం విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్లో ఎలవెనీల్, అపూర్వీ, మేఘనలతో కూడిన భారత జట్టు బంగారు పతకం సాధించింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య డజనుకు చేరింది. 14 పసిడి పతకాలకు గాను 12 స్వర్ణాలను భారత షూటర్లే చేజిక్కించుకోవడం విశేషం. వీటితో పాటు భారత్ ఖాతాలో నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు కూడా ఉన్నాయి. నేడు జరిగే జూనియర్ ఈవెంట్ పోటీలతో ఈ టోర్నీ ముగియనుంది. -
కూటమికి ఘోర ఓటమి
-
ఇంగ్లాండ్ చిత్తు.. యాషెస్ ఆసీస్ కైవసం
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. 123 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 346 పరుగులు సాధించగా.. మార్ష్ బ్రదర్స్ విధ్వంసంతో ఆస్ట్రేలియా 649/7(డిక్లేర్డ్) భారీ స్కోర్‌ను సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ ముందు అసీస్ 303 పరుగుల ఆధిక్యం ఉంచినట్లయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఆటగాడు జోయ్ రూట్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. మైదానంలో దిగిన అతను మరోసారి గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆసీస్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. 3-0 ఇదివరకే ఆధిక్యంతో ఉన్న ఆసీస్ యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకున్నట్లయ్యింది. అంతకు ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోయటంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించగలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆసీస్ బౌలర్లను తట్టుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో గాయపడిన రూట్‌దే అత్యధిక పరుగులు(58) కావటం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కుమ్మిన్స్ 4 వికెట్లు, నాథన్ కౌల్టర్-నైల్ 3 వికెట్లు తీశారు. షాన్ బతికిపోయాడు... పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష్ సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. లేకుంటే రన్ అవుట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. -
పాకిస్తాన్ క్లీన్‌స్వీప్
లాహోర్: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లోను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి టి20 పోరులో పాక్ 36 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉమర్ అమిన్ (45; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేయగల్గింది. షణక (54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆమిర్ 4 వికెట్లతో లంక వెన్నువిరిచాడు. అష్రఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. -
కోహ్లి ప్రత్యేకత ఇదే..!
సొంత గడ్డపై శ్రీలంకను భారత్ దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఇప్పటికే లంకతో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ వైట్‌వాష్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా క్లీన్‌స్వీప్ ఓటమిని ఎదుర్కోని శ్రీలంకకు కోహ్లి సేన తొలిసారి వైట్‌వాష్‌లతో దడపుట్టించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో శతకంతో రాణించడం.. భువనేశ్వర్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లు తీయడంతో శ్రీలంక ఐదో వన్డేలోనూ చేతులు ఎత్తేసింది. దీంతో సిరీస్‌ను 5-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్ పలు ఘనతలు సొంతం చేసుకుంది. ఆ గణాంకాలు ఇవి. తాజా సిరీస్‌తో కలుపుకొని మొత్తంగా భారత్ ఆరుసార్లు వన్డేల్లో క్లీన్‌స్వీప్ విజయాలను సాధించింది. ఈ ఆరింటిలో మూడు క్లీన్‌స్వీప్ విజయాలు విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్‌కు దక్కడం గమనార్హం. కోహ్లి నాయకత్వంలో 2013లో జింబాబ్వేను 5-0తో ఓడించిన భారత్.. 2014-15లో శ్రీలంకతో 5-0తో, తాజాగా మరోసారి లంకపై 5-0తో సంపూర్ణ విజయాలను సొంతం చేసుకుంది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత్‌కు రెండుసార్లు సంపూర్ణ సిరీస్ విజయాలు లభించాయి. 2008-09లో ఇంగ్లండ్‌పై 5-0తో, 2010లో ఇంగ్లండ్‌పైనే 5-0 తేడాతో ధోనీ కెప్టెన్‌గా టీమిండియా రెండుసార్లు క్లీన్‌స్వీప్ విజయాలు సాధించింది. ఇక, గౌతం గంభీర్ నాయకత్వంలో 2010-11లో న్యూజిలాండ్‌పై భారత్ ఓసారి క్లీన్‌స్వీప్ విజయాన్ని సాధించింది. Sixth 5-0 clean sweep for India & three if them have come under Virat Kohli!#SLvIND pic.twitter.com/VhMHV35txn — Rajneesh Gupta (@rgcricket) September 3, 2017 శ్రీలంకలో ఆ దేశంపై ఆల్ త్రి ఫార్మెట్లలోనూ పరాజయాల కన్నా విజయాలు పొందిన జట్టుగా భారత్ నిలించింది. టెస్టుల్లో భారత్ 9 విజయాలు సాధించి.. ఏడుసార్లు ఓడిపోయింది. వన్డేల్లో 28సార్లు గెలుపొంది.. 27సార్లు ఓడిపోయింది. ఇక, టీ-20ల్లో 2-0 విజయాలతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు (18 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి. వన్డే క్రికెట్లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లి (30 సెంచరీలు). సచిన్ (49) అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఢిల్లీలో బీజేపీకి బంపర్ మెజారిటీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ షాక్ తగలబోతుందా?... అవుననే అంటున్నాయి సర్వేలు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఒపినియన్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ రానుందని తేలింది. టైమ్స్ నౌ, వీఎమ్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 272 సీట్లకు గానూ బీజేపీ 195 సీట్లను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఆప్‌కు 55 స్థానాలు దక్కుతాయని తెలిపింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే. అలాగే ఏబీపీ న్యూస్ నిర్వహించిన సర్వేలో కూడా ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. ఉత్తర కార్పోరేషన్‌లోని 104 స్థానాలకు గానూ 76, దక్షిణలో 104 సీట్లకు 60, తూర్పులో 64 స్థానాలకుగానూ 43 స్థానాలలో బీజేపీ గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ మాత్రం 45 సీట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోనుందట. మొత్తంగా బీజేపీ 41.9 శాతం ఓట్ షేర్ సాధిస్తోందని ఏబీపీ న్యూస్ వెల్లడించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్ షేర్ సగానికి తగ్గుతుందని సర్వేలో తేలడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, ఆప్‌ల తరువాత మూడో స్థానంలో నిలుస్తుందని సర్వేలు తెలిపాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ఆప్‌ను గట్టి దెబ్బ కొట్టాలని కమలనాధులు భావిస్తున్నారు. పేరుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికలను గమనిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల్లో కంగుతిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆప్ పార్టీ నేతలు చీపురును వదిలి కాషాయ కండువా కప్పుకోవడం మరోవైపు ఆప్‌కు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోగా, ఆప్ మాత్రం ఆపసోపాలు పడింది. ఇక కాంగ్రెస్ మూడోస్థానంలోనే నిలిచింది. కాగా కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి 208 స్థానాలు దక్కడం ఖాయమని తేలడం విశేషం. అలాగే తమ పార్టీల అంతర్గత సర్వేల్లో ఆప్‌తో పాటు బీజేపీ కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడ్డారు. -
నంబర్ వన్ ఆట!
సమష్టిగా రాణించిన భారత ఆటగాళ్లు కివీస్‌పై అన్ని రంగాల్లో ఆధిపత్యం మరో 10 టెస్టులకు రెడీ సొంతగడ్డపై భారత జట్టు మళ్లీ తిరుగులేని ప్రదర్శనతో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ కోహ్లి సేన సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవరాల్‌గా అశ్విన్ ప్రదర్శనతోనే మన జట్టు సిరీస్ గెలిచినట్లుగా కనిపిస్తున్నా... ఇతర బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కూడా తమదైన కీలక పాత్ర పోషించారు. గత దక్షిణాఫ్రికా సిరీస్‌తో పోలిస్తే ఈ సారి పిచ్‌లపై పెద్దగా చర్చ జరగకపోవడం కూడా మరో మంచి పరిణామం. స్వదేశంలో వరుసగా మరో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్‌లో క్రితం సారి ఆడినప్పుడు సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్, వైట్‌వాష్‌కు గురైన ఆస్ట్రేలియా జట్లు ఇక్కడ పర్యటించబోతున్నారుు. ఈ నేపథ్యంలో కివీస్‌తో క్లీన్‌స్వీప్ విజయం మన టీమ్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందనడంలో సందేహం లేదు. సాక్షి క్రీడా విభాగం 197 పరుగులు, 178 పరుగులు, 321 పరుగులు... న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో భారత్ గెలిచిన పరుగుల తేడా ఇది. తొలి టెస్టులో మొదటి రోజు కాస్త తడబడటం మినహా, ఎక్కడా మన జట్టు వెనుకంజ వేయలేదు. ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో దూరమైనా, వారి స్థానంలో వచ్చినవారు తమ పాత్రను సమర్థంగా పోషించారు. ఫలితంగా ఆ ఆటగాళ్ల లోటు తెలియకపోగా, ఇక ముందు సుదీర్ఘ సీజన్లో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా తెలిసింది. ‘ఇది టీమ్ గేమ్. ఇక్కడ ఎలా ఆడాలో మా ఆటగాళ్లు సరిగ్గా అలాగే ఆడారు. గణాంకాల్లో చూస్తే కొందరి ప్రదర్శన చిన్నగా కనిపించవచ్చు. కానీ మ్యాచ్‌లను గెలిపించడంలో వాటి పాత్ర ఎంతో ముఖ్యమైంది. వ్యక్తిగత ప్రదర్శనకంటే ఈ సిరీస్ విజయాన్ని జట్టు విజయంగానే చూడాలి’ అని కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించడం ఈ సిరీస్‌లో సమష్టితత్వాన్ని చూపిస్తోంది. బౌలర్లు ముందుండి... భారత జట్టు బౌలింగ్ ప్రదర్శనలో నిస్సందేహంగా అశ్విన్‌కు నూటికి నూరు మార్కులు పడతారుు. మూడు సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు, రెండు సార్లు మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన అసాధారణం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. మొత్తం 60 వికెట్లలో అతను తీసిన 27 సిరీస్‌ను శాసించారుు. అశ్విన్‌కు అండగా మరో ఎండ్‌లో జడేజా కూడా కివీస్‌ను తన కచ్చితత్వంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. మొత్తం 14 వికెట్లు తీయడంతో పాటు రెండు సార్లు బ్యాటింగ్‌లోనూ కూడా ఆదుకున్నాడు. వీరిద్దరి నిలకడతో మూడో స్పిన్నర్‌ను ఆడించాల్సిన అవసరమే రాలేదు. కోల్‌కతా టెస్టులో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన (5/48) మరచిపోలేనిది. భారత్‌లో వికెట్‌పై కూడా ఒక పేసర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడని నిరూపించాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కొంత వరకు షమీ నిలబెట్టాడు. వికెట్లపరంగా గొప్పగా కనిపించకపోరుునా... కీలక సమయంలో రివర్స్ స్వింగ్‌తో అతను సత్తా చాటాడు. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ఉమేశ్ యాదవ్ మెరుపులు ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా ప్రధాన బౌలర్లంతా తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించడంతో బౌలింగ్ కోణంలో కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేకపోరుుంది. పుజారా టాప్ ఈ సిరీస్‌కు ముందు పుజారా స్ట్రైక్‌రేట్‌పై చాలా చర్చ జరిగింది. వేగంగా ఆడమంటూ తాను సూచించానని కోహ్లి కూడా చెప్పాడు. అరుుతే ఇప్పుడు ఒకే దెబ్బతో పుజారా అన్నింటికీ సమాధానం ఇచ్చాడు. మూడు అర్ధ సెంచరీల తర్వాత సెంచరీతో అతను సిరీస్‌లో టాపర్ (373 పరుగులు)గా నిలిచాడు. ఇండోర్‌లో 147 బంతుల్లోనే చేసిన సెంచరీ ఆ మార్పును కూడా చూపించింది. నిలకడకు మారుపేరుగా మారిన రహానే (347) కూడా కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్టులో చేసిన 188 పరుగులు అతని కెరీర్లో బెస్ట్‌గా చెప్పవచ్చు. సిరీస్ ఆరంభంలో తడబడినా డబుల్ సెంచరీ కోహ్లి విలువను మరోసారి చూపించింది. ఈ సిరీస్‌తో కెరీర్ నిలబెట్టుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే. అనుక్షణం విమర్శలతో ఒత్తిడిలో నిలిచిన అతను మూడు మ్యాచుల్లోనూ కనీసం అర్ధసెంచరీ చేసి... కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. కోల్‌కతా టెస్టులో రెండు అర్ధసెంచరీలతో సాహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. ఓపెనర్‌గా విజయ్ ఆశించిన స్థారుులో రాణించకపోరుునా, సుదీర్ఘ సీజన్లో మంచి ఆరంభాలు ఇవ్వగల సామర్థ్యం అతనిలో ఉంది. గాయాలతో దూరమైన రాహుల్, ధావన్ ఆడిన ఏకై క టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేదు. అరుుతే వీరి స్థానంలో వచ్చిన గంభీర్ అనుభవం మున్ముందు జట్టుకు మరింత ఉపయోగపడవచ్చు. రెండో ఇన్నింగ్సలో అతను చేసిన అర్ధసెంచరీ గంభీర్ రెండేళ్ల తర్వాత కూడా ఇంకా వెనుకబడిపోలేదని చూపించింది. ముందుంది ఇంగ్లండ్... కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టు మన గడ్డపై అడుగు పెడుతోంది. 2012లో ఆ టీమ్ 2-1తో సిరీస్ గెలిచింది. కివీస్ సులువుగానే తలవంచినా సాంప్రదాయ టెస్టుల్లో ఎలాంటి వేదికలోనైనా ఇంగ్లండ్ బలమైన జట్టే. నాడు సిరీస్ ఓడిన టీమ్ నుంచి ప్రస్తుత భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. నాడు పుజారా టాప్‌స్కోరర్‌గా నిలవగా... కోహ్లి, అశ్విన్ విఫలమయ్యారు. జడేజా, ఉమేశ్ ఒక్కో టెస్టు ఆడగా, గంభీర్ ఫర్వాలేదనిపించాడు. దాదాపు ప్రస్తుత జట్టే ఇంగ్లండ్‌తో కూడా తలపడే అవకాశం ఉంది. మరి మన టీమ్ ఇదే జోరును కొనసాగిస్తుందా చూడాలి. -
టీమిండియా సూపర్ షో
-
టీమిండియా క్లీన్ స్వీప్
-
టీమిండియా సూపర్ షో
ఇండోర్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులోనూ కివీస్ ను ఓడించి 3-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి టెస్టులో 321 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఆట నాలుగో రోజు 475 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 44.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో కివీస్ బ్యాట్స్ మెన్లు ఒకరివెనుక ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. స్పిన్నర్లను ఎదుర్కొని నిలబడలేక చేతులెత్తేశారు. అశ్విన్ మరోసారి విజృంభించాడు. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత ఫాస్ట్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. టేలర్(32) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గప్తిల్ 29, విలియమ్సన్ 27, రోంచి 15, శాంట్నర్ 14 పరుగులు చేశారు. వాట్లింగ్(23) నాటౌట్ గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 557/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, న్యూజిలాండ్ 299 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 216/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా అశ్విన్ ఎంపికయ్యాడు. -
పాకిస్తాన్ క్లీన్ స్వీప్
అబుదాబి: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బాబర్ ఆజమ్ (106 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా మూడో సెంచరీతో పాటు కెప్టెన్ అజహర్ అలీ (109 బంతుల్లో 101; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదడంతో చివరి వన్డేలో పాక్ 136 పరుగుల తేడాతో నెగ్గింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 308 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 44 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. రామ్‌దిన్ (37) టాప్ స్కోరర్. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు (360) చేసిన ఆటగాడిగా ఆజమ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు డికాక్ (342) పేరిట ఉండేది. అలాగే ఓవరాల్‌గా హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఘనత సాధించాడు. -
భారత జట్ల క్లీన్‌స్వీప్
చెస్ ఒలింపియాడ్ బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో పురుషుల జట్టు 4-0తో బొలివియాపై... మహిళల జట్టు 4-0తో మాసిడోనియాపై విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేశాయి. పురుషుల విభాగంలో ఆధిబన్ 52 ఎత్తుల్లో డానియల్ జోస్ జెమీపై, సేతురామన్ 30 ఎత్తుల్లో డెల్గాడిలోపై, మురళీ కార్తికేయన్ 40 ఎత్తుల్లో అలెజాంద్రో పరాగాపై, విదిత్ సంతోష్ గుజరాతి 27 ఎత్తుల్లో లూయిస్ అగిలార్పై నెగ్గారు. మహిళల విభాగంలో పద్మిని రౌత్ 44 ఎత్తుల్లో మోనికా స్తకోవ్స్కాపై, తానియా సచ్దేవ్ 37 ఎత్తుల్లో బొజనా బెటోవిచ్పై, సౌమ్య స్వామినాథన్ 47 ఎత్తుల్లో డ్రాగనా నికొలోవ్స్కాపై, బొడ్డ ప్రత్యూష 39 ఎత్తుల్లో సిమోనా లకిన్స్కాపై గెలిచారు. ప్రత్యర్థి జట్లు బలహీనంగా ఉండటంతో హరికృష్ణ, హారిక తొలి రౌండ్లో బరిలోకి దిగలేదు. -
శ్రీలంక క్లీన్ స్వీప్
చివరి టెస్టులో ఆసీస్‌పై విజయం కొలంబో: శ్రీలంక జట్టు తమ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పెద్దజట్టును వైట్‌వాష్ చేయగలిగింది. ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో టెస్టును నెగ్గిన లంక 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 324 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బుధవారం బరిలోకి దిగిన ఆసీస్ జట్టు స్పిన్నర్ రంగన హెరాత్ (7/64) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య జట్టు 163 పరుగుల తేడాతో నెగ్గింది. డేవిడ్ వార్నర్ (68) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 99.3 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవరాల్‌గా 13 వికెట్లతో చెలరేగిన హెరాత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ పురస్కారం కూడా దక్కింది. ఈనెల 21 నుంచి ఇరుజట్ల మధ్య నాలుగు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. -
క్లీన్ స్వీప్ చేస్తాం
మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తాం... తొలి టెస్టు తర్వాత కోహ్లి ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది. తొలి టెస్టులో భారత్ ఆటతీరు చూస్తే ఇది అసాధ్యమేం కాదు. ఉపఖండం బయట అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లి సేన... ఇదే జోరు కొనసాగిస్తే వెస్టిండీస్‌లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్లో తొలి మ్యాచ్‌లో లభించిన ఈ భారీ విజయం శుభసంకేతం. ⇒ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ⇒ వెస్టిండీస్‌పై తొలి టెస్టులో భారీ విజయం ⇒ ఫలించిన కెప్టెన్, కోచ్ వ్యూహాలు సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్ల క్రితం జమైకాలో భారత జట్టు వెస్టిండీస్‌లో టెస్టు విజయం సాధించింది. ఆ తర్వాతినుంచి తాజాగా ఆంటిగ్వా టెస్టు వరకు ఉపఖండం బయట మన జట్టు 24 మ్యాచ్‌లు ఆడితే 15 టెస్టుల్లో ఓటమిపాలైంది. కోహ్లి సేన గెలిచిన తొలి టెస్టు ఈ మధ్య కాలంలో మనకు రెండో విజయం మాత్రమే. 2014లో లార్డ్స్‌లో మరో విజయం దక్కింది. ఈ గణాంకాలు చూస్తే విదేశీ గడ్డపై మనం సాధించే ఒక్క విజయం కూడా ఎంత విలువైందో అర్థమవుతుంది. వెస్టిండీస్ గతంతో పోలిస్తే ఎంత బలహీనంగా ఉన్నా సరే... టీమిండియా ఘనతను తక్కువ చేయలేం. నాలుగు రోజుల పాటు పూర్తి ఆధిక్యం ప్రదర్శించి మ్యాచ్ గెలుచుకున్న భారత్, ప్రత్యర్థికి ప్రమాదకర సంకేతాలు పంపింది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్లో మొదటి మ్యాచ్‌లోనే భారీ విజయం లభించడం మున్ముందు జరిగే టెస్టులకు కావాల్సిన సన్నాహకంగా చెప్పవచ్చు. ముందుండి నడిపిస్తూ... విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన నాటినుంచి తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. ఐదుగురు బౌలర్లతో ఆడతానంటూ చెబుతూ వచ్చిన అతను... ఒక బ్యాట్స్‌మన్ తగ్గడం వల్ల తాను అదనపు బాధ్యత తీసుకుంటానన్నట్లు సందేశానిచ్చాడు. ఈ టెస్టులోనూ డబుల్ సెంచరీతో చెలరేగి తను దానిని చేసి చూపించాడు. ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా... విరాట్ బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. రాహుల్ బాగా ఆడుతున్నా ధావన్‌ను నమ్మి తుది జట్టులో చోటివ్వడం ఆశ్చర్యపరిచే నిర్ణయం. అయితే ధావన్ చక్కటి బ్యాటింగ్‌తో కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టాడు. మిశ్రా, సాహా బ్యాటింగ్ కూడా జట్టుకు కలిసొచ్చింది. పేస్, స్పిన్ సమష్టిగా... ఆంటిగ్వా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఎనిమిది, స్పిన్నర్లు రెండు వికెట్లు పడగొడితే... రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఎనిమిది, పేసర్లు రెండు వికెట్లు తీశారు. షమీ, ఉమేశ్‌లకు తోడు అశ్విన్, మిశ్రా చెలరేగగా... వికెట్లు తీయకపోయినా ఇషాంత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. మొత్తంగా ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు కూడా తమదైన పాత్ర పోషించడం కోహ్లిని చాలా సంతోష పెట్టింది. ‘నా దృష్టిలో ఈ మ్యాచ్ సరిగ్గా మేం ఆశించిన రీతిలో సాగింది. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో మన పేసర్లు రాణించడం సహజం, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడం, రెండు రోజుల్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయడం మా వ్యూహాలకు సరిగ్గా సరిపోయింది’ అని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశాడు. విదేశాల్లో కూడా మన ఆధిపత్యం ప్రదర్శించే సమయం ఆసన్నమైందని ప్రకటించాడు. అంతా అశ్విన్ ఈ మ్యాచ్‌ను ‘అశ్విన్ టెస్టు’గా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. పూర్తి స్థాయిలో, నమ్మదగిన ఆల్‌రౌండర్‌గా అతను కనిపించాడు. 33 టెస్టులకే క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథంతో పోలికలు తెచ్చే గణాంకాలు అతను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయకపోయినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను సత్తా చూపించాడు. 22 ఓవర్ల పాటు చంద్రిక, శామ్యూల్స్ జోడి నిలబడినప్పుడు చక్కటి బంతితో ఈ జోడీని విడదీసిన అతను, చివర్లో 24.1 ఓవర్ల పాటు ఇబ్బంది పెట్టిన తొమ్మిదో వికెట్ జంటను పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌కు అందించాడు. ఇక అశ్విన్‌ను ఈ సిరీస్‌లో సమర్థంగా ఎదుర్కోవడం విండీస్ వల్ల అవుతుందా అనేది సందేహమే. గతంలో టెస్టుల్లో రెండు సెంచరీలు చేసినా... అశ్విన్ బ్యాటింగ్‌పై ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కానీ కీపర్ సాహాకంటే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన అతను తన బ్యాటింగ్ విలువను సాధికారికంగా ప్రదర్శించాడు. స్టాన్స్ మార్చుకోవడంతో పాటు ఆఫ్‌స్టంప్‌పై పడే బంతులను ఆడటంపై పట్టు సాధించాడు. ఇది ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు కోహ్లికి కావాల్సిన ధైర్యాన్నిచ్చింది. తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు భారత్ తొలి ఇన్నింగ్స్: 556/8 డిక్లేర్డ్ (కోహ్లి 200, అశ్విన్ 113) వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 243 (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 74, డౌరిచ్ 57 నాటౌట్, ఉమేశ్ 4/41, షమీ 4/66) వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 231 (కార్లోస్ బ్రాత్‌వైట్ 51 నాటౌట్, శామ్యూల్స్ 50, అశ్విన్ 7/83). 1 ఉపఖండం బయట భారత్‌కు ఇదే (ఇన్నింగ్స్, 92 పరుగులు) అతి పెద్ద విజయం. వెస్టిండీస్ గడ్డపై భారత్ తొలి సారి ఇన్నింగ్స్ విజయం సాధించింది. 1 విండీస్ గడ్డపై భారత్ తరఫున అశ్విన్ (7/83)దే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 3 ఒకే టెస్టులో సెంచరీ చేసి 7 వికెట్లు తీసిన మూడో ఆటగాడు అశ్విన్ (గతంలో జాక్ గ్రెగరీ, బోథమ్). 17 అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి. కేవలం 33 టెస్టుల్లోనే అతను ఈ ఘనత సాధించాడు. కెరీర్లో 33 టెస్టులు ఆడే సమయానికి స్పిన్నర్లలో ఇదే బెస్ట్ కాగా... ఓవరాల్‌గా వఖార్ యూనిస్ (19 సార్లు) తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉండటం విశేషం. -
మళ్లీ మారిన అభ్యర్థులు
* ఏడోసారి అభ్యర్థుల మార్పు * ముగ్గురు మంత్రులకు మళ్లీ అవకాశం * అమ్మ నిర్ణయంతో ఆందోళన * కంచిలో ఓట్ల వేట సాక్షి, చెన్నై : ఒకటోస్సారి...రెండోస్సారి అంటూ ఏడోస్సారి గా అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా మారింది. ఎనిమి ది మందిని మార్చిన జయలలిత ముగ్గురు మంత్రులపై కరుణ చూపించారు. వారికి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక, సోమవారం కాంచీపురం జిల్లా వారణవాసి వేదికగా ఎన్నికల ప్రచారంలో జయలలిత ఓట్ల వేట సాగించారు. మార్పు పర్వం సాగుతుండడంతో, అభ్యర్థుల్లో ఆందోళన బయలు దేరింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఈ సారి 234 స్థానాల్లో రెండాకుల చిహ్నంతో పోటీకి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల జాబితా ఏ ముహూర్తాన ప్రకటించారో ఏమోగానీ, మార్పుల పర్వం సాగుతూనే వస్తున్నది. ప్రతి ఎన్నికల్లోనూ ఇది జయలలితకు పరిపాటే అయినా, ఈ సారి మాత్రం ఈ మార్పులు అభ్యర్థుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఫిర్యాదులు వెల్లువెత్తితే చాలు అభ్యర్థి మారినట్టే అన్న పరిస్థితి అన్నాడీఎంకేలో నెలకొని ఉండడం ఇందుకు కారణం. సీటు వచ్చిందన్న ఆనందంతో ప్రచారంలో దూసుకెళ్లడం కన్నా, ఆ సీటును దక్కించుకునేందుకే అభ్యర్థులు తీవ్ర కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఆరు సార్లు అభ్యర్థుల్ని జయలలిత మార్చారు. నామినేషన్ల పర్వం ఆరంభం, బీ ఫామ్‌లు చేతికి వచ్చే వరకు ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల సీట్లకు గ్యార ంటీ లేదన్నది స్పష్టం కాక తప్పదు. ఒకటి, రెండు మూడూ అంటూ వేలం పాట తరహాలో ఏడోస్సారి..! అంటూ అన్నాడీఎంకే అభ్యర్థుల మార్పు పర్వం చేరింది. ఏడోస్సారి : ఒకే విడతగా 234 స్థానాలకు (ఏడుగురు మిత్రులతో కలిపి) ప్రకటించిన జాబితాల్లో పలువురు మంత్రుల్ని జయలలిత పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అలాగే, కొందరు సీనియర్లకు సైతం చోటు కల్పించలేదు. ఎంపికలో పొరబాటు జరిగిందా..? లేదా, ఆయా మంత్రులు, సీనియర్లకు పరీక్ష పెట్టేందుకు నిర్ణయించారో ఏమోగానీ, విస్మరించ బడ్డ వారందరికీ మళ్లీ చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోన్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా అభ్యర్థుల మార్పు పర్వం సాగుతున్నది. తాజాగా, సోమవారం జరిగిన మార్పుతో ముగ్గురు మంత్రులకు, ఒక మాజీ మంత్రికి చోటు కల్పించడం గమనార్హం. ఆ మేరకు ఎనిమది మంది అభ్యర్థుల్ని మార్చారు. శంఖరాపురం నుంచి మంత్రి పి మోహన్, శ్రీ వైకుంఠం నుంచి మంత్రి ఎస్పి షణ్ముగనాథన్, పాపిరెడ్డి పట్టి నుంచి మంత్రి పళనియప్పన్‌లు పోటీకి అవకాశం కల్పించారు. ఇక, మాజీ మంత్రి కేవి రామలింగం ఈరోడ్ పశ్చిమం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తిరుచ్చి తూర్పు నుంచి నటరాజన్, ఎండీఎంకే నేత వైగోను ఢీ కొట్టేందుకు కోవిల్ పట్టి అభ్యర్థిగా కడంబూరు రాజ, పాళయం కోట్టైలో హైదర్ అలీ, అరక్కోణం నుంచి రవిలు పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ మార్పుల పర్వం ఎనిమిదోస్సారి, తొమ్మిదోస్సారి అని మరింతగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చిన ఫిర్యాదులు, ఆయా నియోజకవర్గాల్లో బలహీనం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని మరో 20 మందిని మార్చేందుకు తగ్గ కసరత్తులు జరుగుతున్న సమాచారంతో తదుపరి ఎవరో..! అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొని ఉన్నది. కంచిలో ఓట్ల వేట : చెన్నైలో శ్రీకారం చుట్టి, విరుదాచలం, ధర్మపురి, అరుప్పుకోటైలలో సాగిన జయలలిత ఎన్నికల ప్రచార పర్యటన కాంచీపురానికి చేరింది. సోమవారం సాయంత్రం కాంచీపురం జిల్లా వారణ వాసిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జయలలిత ఓట్ల వేటలో పడ్డారు. కాంచీపురం, చెంగల్పట్టు తదితర 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ఓటర్లకు ఆమె పరిచయం చేశారు. డీఎంకే ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై విరుచుకు పడ్డారు. సంపూర్ణ మద్యనిషేధానికి తొలి సంతకం అని కరుణానిధి గుప్పిస్తున్న హామీని నమ్మ వద్దని ఓటర్లకు సూచించారు. వరద ప్రళయం నుంచి కాంచీపురం, తిరువళ్లూరు, చెన్నై ప్రజల్ని రక్షించేందుకు తాము తీవ్ర చర్యలు చేపడితే, తమ మీదే నిందల్ని వేశారని మండిపడ్డారు. ప్రజల్ని మభ్య పెట్టి అధికారంలోకి వచ్చేందుకు కరుణానిధి ఆచరణలో పెట్టలేని హామీలు గుప్పిస్తున్నారని శివాలెత్తారు. ఈ హామీల్ని నమ్మి మోసపోవద్దని , తమకు మళ్లీ అండగా నిలబడాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం ఒకే సారి అమలు సాధ్యం కాదు అని, దశల వారీగా మాత్రమే సాధ్యం అవుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. -
ఎన్టీఎస్ఈ ఫలితాల్లో శ్రీ చైతన్య క్లీన్ స్వీప్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ) స్టేజ్-1 పరీక్షల ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకు నుంచి వరుసగా 20 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించి క్లీన్‌స్వీప్ చేశారని ఆ విద్యా సంస్థల అకాడమిక్ డెరైక్టర్ సీమ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా 103 మంది విద్యార్థులు ఒక్క శ్రీ చైతన్య స్కూల్ నుంచే ఎంపికయ్యారని ఆమె వెల్లడించారు. తమ విద్యార్థులైన ఎం.కౌషిక్, కె.రోహిత్ రెడ్డిలు స్టేట్ మొదటి ర్యాంకును, ఎ.కల్యాణ్ నాయక్, ఎ.భరత్ స్టేట్ రెండో ర్యాంకును సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు మాట్లాడుతూ ఎన్‌టీఎస్‌ఈలో గత ఐదేళ్లుగా శ్రీ చైతన్య విద్యార్థులే అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పటిష్టమైన రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ వల్లే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించినట్లు ఆయన వివరించారు. -
భారత్ ‘బంగారు గురి’
► షూటింగ్లో క్లీన్‌స్వీప్ ► ఎనిమిదో రోజు తొమ్మిది స్వర్ణాలు ► దక్షిణాసియా క్రీడలు గువాహటి: అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. పోటీల ఎనిమిదో రోజు శనివారం భారత క్రీడాకారులు తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. షూటింగ్లో ఆరు పసిడి పతకాలు లభించగా... ట్రయాథ్లాన్లో రెండు స్వర్ణాలు, తైక్వాండోలో ఒక బంగారు పతకం దక్కింది. ప్రస్తుతం భారత్ 156 స్వర్ణాలు, 85 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 268 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. శ్రీలంక 25 స్వర్ణాలు, 55 రజతాలు, 83 కాంస్యాలతో కలిపి మొత్తం 163 పతకాలతో రెండో స్థానంలో ఉంది. షూటింగ్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో భారత్ స్వర్ణాలతో క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో ఓంకార్ సింగ్... టీమ్ ఈవెంట్లో ఓంకార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, జితేంద్ర విభూతేలతో కూడిన బృందానికి బంగారు పతకాలు దక్కాయి. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో రాహీ సర్నోబాత్, అన్నురాజ్ సింగ్, అనీసా సయ్యద్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణం సొంతం చేసుకోగా... వ్యక్తిగత విభాగంలో రాహీ, అన్నురాజ్, అనీసాలకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కాయి. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత ఈవెంట్లో అంజుమ్, సుసాన్ కోషి ఎలిజబెత్, లజ్జా గోస్వామిలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. టీమ్ ఈవెంట్లో ఈ ముగ్గురితో కూడిన భారత్‌కే పసిడి పతకం దక్కింది. పురుషుల తైక్వాండో 87 కేజీల విభాగంలో పి.కుమార్ భారత్ తరఫున ఏకైక స్వర్ణాన్ని సాధించాడు. ఫైనల్లో హుస్సేని (అఫ్ఘానిస్తాన్)పై కుమార్ గెలిచాడు. పురుషుల ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)లో దిలీప్ కుమార్... మహిళల ట్రయాథ్లాన్లో పల్లవి రేతివాలా పసిడి పతకాలు గెలిచారు. పురుషుల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 30-17తో బంగ్లాదేశ్‌ను... ఆ తర్వాత 9-8తో పాకిస్తాన్‌ను ఓడించింది. మహిళల కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత భారత్ 56-23తో పాకిస్తాన్‌పై, ఆ తర్వాత 43-11తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. -
దక్షిణాఫ్రికా ‘క్లీన్‌స్వీప్’
- రెండో టి20లోనూ బంగ్లాదేశ్‌పై విజయం మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన సఫారీ జట్టు... మంగళవారం జరిగిన రెండో టి20లో 31 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. డికాక్ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (34 బంతుల్లో 40; 6 ఫోర్లు), మిల్లర్ (28 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), రోసోవ్ (6 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత బంగ్లా 19.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. అబాట్, లీ, ఫాంగిసో తలా మూడు వికెట్లు తీశారు. -
టి20లోనూ బంగ్లాదే విజయం
మిర్పూర్: ఫార్మాట్ మారినా పాకిస్తాన్ ఆటతీరులో మార్పు రాలేదు. కెప్టెన్‌గా ఆఫ్రిది వచ్చినా రాత మారలేదు. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్... అదే జోరులో ఏకైక టి20లోనూ పాక్‌ను చిత్తు చేసింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో నెగ్గింది. పాక్‌పై టి20ల్లో బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ముక్తార్ అహ్మద్ (30 బంతుల్లో 37; 5 ఫోర్లు; 1 సిక్స్), హరీస్ సోహైల్ (24 బంతుల్లో 30 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రహమాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 143 పరుగులు చేసి నెగ్గింది. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు అవుటైనా... షకీబ్ అల్ హసన్ (41 బంతుల్లో 57 నాటౌట్; 9 ఫోర్లు), సబ్బీర్ రహమాన్ (32 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 105 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ 28 నుంచి ప్రారంభమవుతుంది. -
బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్
ఢాకా: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అరంగే ట్రం మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/11) చరిత్ర సృష్టించడంతో బంగ్లా శిబిరం ఆనందం రెట్టింపయ్యింది. సోమవారం షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే... ఇస్లాం ధాటికి 30 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మసకద్జా (54 బంతుల్లో 52; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. తన ఆరో ఓవర్లో పన్యాంగర వికెట్ తీసిన ఇస్లాం మరుసటి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి రికార్డులకెక్కాడు. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (8/39) తీసిన బంగ్లా బౌలర్ రికార్డు కూడా ఇస్లాం పేరిటే ఉంది. బంగ్లా 24.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 130 పరుగులు చేసి గెలిచింది. మహ్ముదుల్లా (55 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు) రాణించాడు. ముష్ఫికర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇస్లాంకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కాయి. -
‘ఐదు'లోనూ అదరగొట్టారు
రాంచీ: వేదిక మారినా... కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినా... భారత జట్టు తమ జోరును కొనసాగించింది. శ్రీలంకపై చివరిదైన ఐదో వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ల పోరుగా నిలిచిన ఆఖరి వన్డేలో విరాట్ కోహ్లి (126 బంతుల్లో 139 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. ఫలితంగా శ్రీలంక జట్టు తొలిసారి ఓ సిరీస్‌ను 0-5తో కోల్పోయింది. జేఎస్సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (116 బంతుల్లో 139 నాటౌట్; 6 ఫోర్లు, 10 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 85 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో మ్యాథ్యూస్, తిరిమన్నే ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించి ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.4 ఓవర్లలో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. కోహ్లికి తోడుగా రాయుడు (69 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్‌ను వీరిద్దరు మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించి నిలబెట్టారు. చివర్లో 30 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాథ్యూస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్కోరు వివరాలు: శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెల్ల (సి) రాయుడు (బి) కులకర్ణి 4; దిల్షాన్ (బి) బిన్నీ 35; చండిమల్ (సి) రోహిత్ (బి) అక్షర్ 5; జయవర్ధనే (సి) రహానే (బి) అశ్విన్ 32; మ్యాథ్యూస్ నాటౌట్ 139; తిరిమన్నే (సి) రాయుడు (బి) అశ్విన్ 52; తిసారా పెరీరా (సి) జాదవ్ (బి) అక్షర్ 6; ప్రసన్న (బి) అక్షర్ (బి) కులకర్ణి 0; మెండిస్ (సి) కరణ్ (బి) కులకర్ణి 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 286 వికెట్ల పతనం: 1-32; 2-45; 3-73; 4-85; 5-213; 6-258; 7-285; 8-286; బౌలింగ్: ధావల్ కులకర్ణి 8-0-57-3; బిన్నీ 8-1-28-1; అక్షర్ 10-0-45-2; అశ్విన్ 10-1-56-2; కరణ్ శర్మ 10-0-61-0; రాయుడు 4-0-33-0. భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) మ్యాథ్యూస్ 2; రోహిత్ (బి) మ్యాథ్యూస్ 9; రాయుడు రనౌట్ 59; కోహ్లి నాటౌట్ 139; ఉతప్ప (సి) మ్యాథ్యూస్ (బి) మెండిస్ 19; జాదవ్ (బి) మెండిస్ 20; బిన్నీ (స్టంప్డ్) చండిమల్ (బి) మెండిస్ 12; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) మెండిస్ 0; అక్షర్ పటేల్ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (48.4 ఓవర్లలో 7 వికెట్లకు) 288 వికెట్ల పతనం: 1-6; 2-14; 3-150; 4-180; 5-215; 6-231; 7-231; బౌలింగ్: మ్యాథ్యూస్ 7-1-33-2; గమగే 4-0-25-0; ఎరంగా 7-0-45-0; ప్రసన్న 10-0-42-0; పెరీరా 3-0-20-0; మెండిస్ 9.4-0-73-4; దిల్షాన్ 8-0-46-0. 5 వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో కోహ్లి (21) టాప్-5లోకి చేరాడు. సచిన్, పాంటింగ్, జయసూర్య, గంగూలీల తర్వాత గేల్, గిబ్స్‌తో కలిసి సమంగా నిలిచాడు. 100 శ్రీలంకపై అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌కు ఇది వందో విజయం. 5 శ్రీలంకపై అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌కు ఇది వందో విజయం. 3 ఒకే వన్డేలో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. 205 భారత్ తరఫున వన్డే ఆడిన 205వ క్రికెటర్ కేదార్ జాదవ్. 4 కోహ్లి వరుసగా నాలుగేళ్లు (2011, 12, 13, 14) వన్డేల్లో వేయికి పైగా పరుగులు చేశాడు. గతంలో గంగూలీ (1997-00) మాత్రమే ఇలా చేయగలిగాడు. 2010లో కోహ్లి 995 పరుగులు చేశాడు. -
'సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తాం'
పులివెందుల : సీమాంధ్రలో క్లీస్ స్వీప్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో మద్దతుపై తొందరపడబోమన్నారు. రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా జరిగిందని జగన్ అభిప్రాయపడ్డారు. తాను తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని ఆయన తెలిపారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... స్వగ్రామం పులివెందులలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 124వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటల 35 నిమిషాల ప్రాంతంలో ఆయన ఓటు వేశారు. -
క్లీన్ స్వీప్ ఖాయం
ఏడింటికి ఏడు సీట్లూ గెలుస్తామంటున్న బీజేపీ నేతలు తమ వ్యతిరేక ఓట్లు చీలడం లాభిస్తుందని జోస్యం రెండో స్థానంలో ఆప్, కాంగ్రెస్ మూడో స్థానానికే.. పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైందంటున్న కమలనాథులు సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలలో ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీనే ఏకపక్షంగా గెలిపించే ఢిల్లీవాసులు ఈసారి ముక్కోణపు పోటీ జరిగినా ఏకపక్షంగానే ఓట్లు వేశారని తమ పార్టీ అంతర్గత సర్వేల్లో స్పష్టమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలు తమకే దక్కుతాయని సర్వేల్లో తేలడంతో బీజేపీ నేతలు ఆనందంతో పొంగిపోతున్నారు. ఆప్ కారణంగా తమ వ్యతిరేక ఓట్లు చీలడం తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా వెనుకబడిపోతారని, ఏడు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ తమకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యనే ఉంటుందన్నది కూడా బీజేపీ నేతలకు ఆనందం కలిగిస్తోంది. ప్రతి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థులు నాలుగు లక్షల ఓట్లతో మొదటి స్థానంలో, దాదాపు 3 లక్షల ఓట్లతో ఆప్ అభ్యర్థులు రెండవస్థానంలో ఉంటారని, కాంగ్రెస్ అభ్యర్థులకు రెండు లక్షల ఓట్లకు మించి రావని సర్వేలో తేలినట్లు ఆ పార్టీవర్గాలు వెల్లడించాయి. పోలింగ్ తరువాత బీజేపీ ప్రతి నియోజకకవర్గం నుంచి ఓటింగ్ సరళికి సంబంధించిన నివేదికలను సేకరించి పరిశీలించింది. దీని ప్రకారం నగరంలో ముస్లిం ఓట్లు చీలాయని, 40 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు, మిగతా ఓట్లు ఆప్‌కు లభించాయని బీజేపీ అంచనా వేసింది. అదేవిధంగా దళితులు, పునరావాసకాలనీ వాసుల ఓట్లు, ఇతర నిమ్నజాతుల ఓట్లు ఆప్ ఖాతాలోకే చేరాయని బీజేపీ భావిస్తోంది. దాంతో కాంగ్రెస్ ఓట్ల రేసులో వెనుకబడిపోయిందని వారు భావిస్తున్నారు. మధ్య తరగతి ఓటర్లు మళ్లీ తమ వైపునకు మళ్లారని బీజేపీ అంచనా వేస్తోంది. న్యూఢిల్లీలో మోడీ ప్రభంజనం బీజేపీని గెలిపిస్తుంందని పార్టీ సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తాము నిలబెట్టిన మీనాక్షీ లేఖికి ప్రజాదరణ పెద్దగా లేకపోయినా నరేంద్రమోడీ ప్రభావంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు గట్టి పోటీ ఇచ్చారని అక్కడ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. కరోల్‌బాగ్, రాజేంద్రనగర్‌లలో కాంగ్రెస్‌కు తక్కువ, ఆప్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని దాని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వెస్ట్ ఢిల్లీలో ఆప్ నిలబెట్టిన జర్నైల్ సింగ్ కారణంగా సిక్కుల ఓట్లు ఆ పార్టీ ఖాతాలో చే రతాయని, అయితే కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు గతంలో ఓటేసిన పూర్వాంచలీ, బ్రాహ్మణ ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు మొగ్గు చూపుతారని, దాంతోపాటు ద్వారకాలోని మధ్యతరగతి ఓటర్లు, నజఫ్‌గఢ్ గ్రామీణ ఓటర్లు కూడా తమకే ఓటేస్తారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. చాందినీచౌక్‌లో ముస్లిం ఓట్లు ఆప్‌కు దక్కినప్పటికీ గెలుపు తమదే అన్న ధీమాతో బీజేపీ ఉంది. డాక్టర్ హర్షవర్ధన్ ఇక్కడ నుంచి భారీ మెజారీటీతో గెలుస్తారని, ఆప్ అభ్యర్థి ఆశుతోష్ రెండవ స్థానంలో, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కపిల్ సిబల్ మూడో స్థానంలో ఉం టారని బీజేపీ అంచనా వేస్తోంది. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్ ఢిల్లీల్లో గెలుపు తమదేనని, తమ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలడం ఈ నియోజకవర్గాలలో తమకు లాభిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఏడు సీట్లలో అన్నింటికన్నా గట్టి పోటీ సౌత్ ఢిల్లీ నియోజకవర్గంలో ఎదురవుతుందని, అయితే కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు ఇద్దరు జాట్లు కావడం వల్ల ఆప్ ఓట్లు చీలడం తమకు అనుకూలిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
భారత్ క్లీన్‌స్వీప్
శ్రీలంకపై మూడో వన్డేలో 95 పరుగులతో విజయం సాక్షి, విశాఖపట్నం: కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుత ప్రదర్శనతో (109 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్స్)... శ్రీలంక మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత్ మహిళల జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 229 పరుగులు చేసింది. 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 24; 2 ఫోర్లు)తో కలిసి మిథాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈజోడి మధ్య మూడో వికెట్‌కు 57 పరుగులు జత చేరగా... చివర్లో జులన్ గోస్వామి (40 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 44 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటయ్యింది. పూనమ్ యాదవ్ (4/13) లెగ్ స్పిన్ ధాటికి లంక బ్యాట్స్‌వుమెన్ బెంబేలెత్తారు. రణసింఘే (49 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గైక్వాడ్, రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
విజయకేతనం
జిల్లాలో ఆదివారం జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతం ఎగురవేసింది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపారు. సాక్షి, కడప : సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది. కమలాపురం, బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం రోజు 20 సొసైటీలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 17 సొసైటీల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి కైవసం చేసుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇందులో కూడా చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే అక్కడ ఆధిక్యతను ప్రదర్శించగలిగారు. సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, పోలీసుసిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు. కే.అగ్రహారం సొసైటీలో.... కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఇక్కడ విచ్చలవిడిగా మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేశారు. తెలుగుదేశం నేత రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, డీఎల్ సమీప బంధువు గంగవరం ఆదినారాయణరెడ్డిలు శనివారం సంయుక్తంగా ప్రచారంచేశారు. ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ నాయకులు తమవంతు సహకారం అందించారు. ఇలాగే 12వ వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి గంగావతిని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేశారు. దీంతోపాటు డబ్బులుసైతం అన్ని వార్డుల్లో విపరీతంగా పంపిణీ చేశారు. నందలూరు సొసైటీలో సైతం టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం గమనార్హం. వైఎస్సార్ సీపీ గెలుపొందిన సొసైటీలు ఇవే! బి.కోడూరులో వైఎస్సార్ సీపీ 13 డెరైక్టర్ స్థానాలు గెలుచుకోగా, అధ్యక్షునిగా ఒ.ప్రభాకర్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. చెన్నకేశంపల్లెసొసైటీలో వైఎస్సార్సీపీ 13 డెరైక్టర్ స్థానాలను గెలుచుకుంది. అధ్యక్షునిగా పోలిరెడ్డి ఎన్నిక కానున్నారు. పెనగలూరులో వైఎస్సార్ సీపీ 12, కాంగ్రెస్ 1 డెరైక్టర్ స్థానాలను గెలుచుకున్నాయి. కొండూరు అజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షునిగా ఎన్నిక కానున్నారు. మన్నూరు సొసైటీలో కాంగ్రెస్ 4, వైఎస్సార్ సీపీ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ 1 డెరైక్టర్ స్థానాలను గెలుచుకున్నారు. ఇక్కడ అధ్యక్ష అభ్యర్థి ఖరారు కావాల్సిఉంది. అనంతయ్యగారిపల్లెలో వైఎస్సార్ సీపీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. అనంతసముద్రంలో వైఎస్సార్ సీపీ 13 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అల్లెం రామిరెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. వీరబల్లిలో వైఎస్సార్ సీపీ 7, కాంగ్రెస్ 6 డెరైక్టర్స్థానాల్లో విజయం సాధించగా, కల్లూరు రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగాఎంపిక కానున్నారు. మట్లిలో వైఎస్సార్ సీపీ 11, టీడీపీ 1, కాంగ్రెస్ 1 డెరైక్టర్ స్థానాల్లో గెలుపొందారు. రామాంజులరెడ్డి అధ్యక్షుడు కానున్నారు. నాగిరెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ 12 స్థానాలను కైవసం చేసుకోగా, పల్లవోలు భాస్కర్‌రెడ్డి అధ్యక్షుడు కానున్నారు. యల్లటూరు సొసైటీలో వైఎస్సార్ సీపీ 12స్థానాలు కైవసం చేసుకోగా, కంభం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. వల్లూరు సొసైటీలో వైఎస్సార్ సీపీ 7, టీడీపీ 5 స్థానాల్లో విజయం సాధించారు. టి.కృష్ణారెడ్డి అధ్యక్షుడు కానున్నారు. దిగువగొట్టివీడులో వైఎస్సార్ సీపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించారు. కె.గోవర్దన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. మద్దిరేవుల సొసైటీలో వైఎస్సార్ సీపీ 8, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందారు. పోలిరెడ్డి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. కొలిమివాండ్లపల్లెలో వైఎస్సార్ సీపీ 10, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందారు. ఆదినారాయణరెడ్డి అధ్యక్షుడిగాఎంపిక కానున్నారు. గొర్లముదివీడులో వైఎస్సార్సీపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలుపొందాయి. కె.వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షుడు కానున్నారు. అల్లాడుపల్లె సొసైటీలో వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 2, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా పి.వేమారెడ్డి ఎంపిక కానున్నారు. గోనుమాకులపల్లెలో వైఎస్సార్ సీపీ 11, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నారు. సొసైటీ అధ్యక్ష అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ గెలిచిన సొసైటీలివే! నందలూరులో కాంగ్రెస్ 10, టీడీపీ 1, వైఎస్సార్ సీపీ 2 స్థానాల్లో గెలుపొందగా, మేడాభాస్కర్రెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. కె.అగ్రహారంలో కాంగ్రెస్ 9, వైఎస్సార్ సీపీ 4 స్థానాల్లో గెలుపొందగా, అధ్యక్ష అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టంగుటూరు సొసైటీలో వైఎస్సార్సీపీ 7, కాంగ్రెస్ 5, టీడీపీ 1 స్థానంలో గెలుపొందింది. ఇక్కడ రామచంద్రారెడ్డి సొసైటీ అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. కాగా సోమవారం ఉదయం 9 గంటలకు సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. పుత్తాకు శృంగభంగం కమలాపురం నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్ సీపీ తమ సత్తా చాటుకుంది. ఎన్నికలు జరిగిన నాలుగు సొసైటీలు వల్లూరు, నాగిరెడ్డిపల్లె, ఎల్లటూరు, గోనమాకులపల్లెలో విజయఢంకా మోగించింది. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం విశేషం. బద్వేలులో ఎమ్మెల్యే కమలమ్మ కుయుక్తులు పన్నడంతోపాటు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై పోరాడినా బి.కోడూరు, చెన్నకేశంపల్లెలో ఒక్క డెరైక్టర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయి పరాభవాన్ని మూటగట్టుకున్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్‌రెడ్డి తమ ఆధిక్యతను ప్రదర్శించారు. అక్కడ అన్ని సొసైటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డిలు వైఎస్సార్సీపీ మద్దతుదారుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. -
క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ దృష్టి
ఉదయం గం. 5 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం సిడ్నీ: వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా జట్టు యాషెస్ సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టగా, ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది. ఎలాగైనా ఆఖరి టెస్టులో గెలిచి విజయంతో సిరీస్‌ను ముగించాలని కుక్‌సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి సిడ్నీలో ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లోనూ అదే హవాను కొనసాగించాలని సిద్ధమవుతోంది. ఇందుకోసం తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా మేనేజ్మెంట్ అంగీకరించడం లేదు. అయితే వాట్సన్, పేసర్ హారిస్‌లు చిన్న గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లు అందుబాటులో ఉండేది లేనిది మ్యాచ్‌కు ముందే తెలియనుంది. ముందు జాగ్రత్తగా ఫాల్క్‌నర్, అలెక్స్ దూలన్లను పిలిపించారు. ‘ఐదు టెస్టులకు ఒకే జట్టును కొనసాగించడం చాలా గొప్ప విషయం. అయితే మ్యాచ్ గెలిచేందుకు అవసరమైన బెస్ట్ 11 మందిని సెలక్టర్లు ఎంపిక చేస్తారు. సిడ్నీలో మ్యాచ్ గెలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది’ అని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. మరోవైపు నాలుగో టెస్టులో అనూహ్య రీతిలో ఓటమిపాలైన కుక్‌సేన ఈ మ్యాచ్‌లోనూ ఓడితే 0-5తో సిరీస్ కోల్పోయిన మూడో ఇంగ్లండ్ జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 15 మంది ఆటగాళ్లను ఉపయోగించిన ఇంగ్లండ్ ఐదో టెస్టుకూ జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. గ్యారీ బాలెన్సీ, స్కాట్ బోర్త్విక్, స్టీవెన్ ఫిన్‌లు జట్టులోకి రావొచ్చు. అయితే ఎంత మంది జట్టులోకి వస్తున్నా ఆసీస్ పేసర్ జాన్సన్ దాడిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. పీటర్సన్ ఫామ్‌లోకి వచ్చినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. దీంతో మిడిలార్డర్లో బెల్, స్టోక్స్, బెయిర్‌స్టోలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. లోయర్ ఆర్డర్లో పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. నాలుగో టెస్టులో అండర్సన్, బ్రాడ్, బ్రెస్నన్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నా నిలకడలేమీతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రధాన స్పిన్నర్ స్వాన్ లేకపోవడంతో స్పిన్ విభాగం బలహీనపడింది. -
సెమీఫైనల్లో బీజేపి క్లీన్‌స్వీప్
-
ఆదర్శ్ కేసులో సుశీల్‌కుమార్ షిండేకు క్లీన్చిట్
ముంబై: సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. షిండే 2003-2004 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొంది. ఈ మేరకు గురువారం బాంబే హైకోర్టుకు అఫిడవిట్ అందజేసింది. కార్గిల్ యుద్ధ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ముంబైలోని 32 అంతస్తుల ఆదర్శ్ సొసైటీ భవంతిలో షిండేకు రెండు బినామీ ఫ్లాట్లు ఉన్నాయని, ఆయనను నిందితుడిగా చేర్చాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ వతేగావ్కర్ గతంలో పిటిషన్ వేశారు. దివంగత మేజర్ ఎన్.డబ్ల్యూ ఖాంకోజీని సొసైటీ సభ్యుడిగా చేర్చుకోవాలని షిండే సిఫార్సు చేశారని తెలిపారు. షిండేకు, ఖాంకోజీ కుటుంబంతో సంబంధమున్నట్లు తమ దర్యాప్తులో తేలలేదని చెప్పింది. కేసు విచారణను కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.