SA Vs WI 2nd Test: దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | South Africa beat West Indies by 284 runs to sweep series | Sakshi
Sakshi News home page

SA Vs WI 2nd Test: దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published Sun, Mar 12 2023 6:36 AM | Last Updated on Sun, Mar 12 2023 7:25 AM

South Africa beat West Indies by 284 runs to sweep series - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌- South Africa vs West Indies, 2nd Test: వెస్టిండీస్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది.

జోషువా డి సిల్వ (34)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్‌ కొయెట్జీ, సైమన్‌ హార్మర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా... రబడ, కేశవ్‌ మహరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు 287/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. బవుమా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో నెగ్గింది.

చదవండి: Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లి ముఖంపై చిరునవ్వు! ఫ్యాన్స్‌ ఖుషీ
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement