Aiden Markram
-
SA20 2025: తొలిసారి విజేతగా ఎంఐ కేప్‌టౌన్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్‌గా నిలవాలన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్‌టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్‌మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్‌టౌన్- సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఎస్టెర్హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.సన్రైజర్స్బ్యాటింగ్ ఆర్డర్ కుదేలుఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్‌టౌన్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో ఎంఐ కేప్‌టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగాఅవార్డుల వివరాలు👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్‌టౌన్) 👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్‌టౌన్ 👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్‌టౌన్) 👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్‌టౌన్) 👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్) 👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) 👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) ఎస్ఏ20 2025 విశేషాలు 👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397 👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు 👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25 👉అత్యధిక సిక్స్‌లు- బ్రేవిస్ 25 👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47 ప్రైజ్‌మనీ వివరాలు👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్లు (రూ. 15 కోట్ల 46 లక్షలు) 👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్లు (రూ. 7 కోట్ల 70 లక్షలు). చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK— Betway SA20 (@SA20_League) February 8, 2025 -
రాయల్స్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. వరుసగా మూడో సారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పార్ల్ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెర్మాన్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్(59) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.టోనీ ఊచకోత..అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఈస్ట్రన్ కేప్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్స్ బౌలర్లను టోనీ ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఎంఐ కేప్‌టౌన్‌తో ఢీ..ఇక శనివారం(ఫిబ్రవరి 8)న జోహాన్స్‌బర్గ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో సన్‌రైజర్స్, ఎంఐ కేప్‌టౌన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కేప్‌టౌన్‌కు ఇదే తొలి ఫైనల్ కాగా.. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది ముచ్చటగా మూడో ఫైనల్. తొలి రెండు సీజన్లలోనూ మార్క్రమ్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కాగా ఈస్ట్రన్ కేప్ జట్టు ఐపీఎల్ ప్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే సంబంధించినదే కావడం గమనార్హం. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా -
సన్‌రైజర్స్ ఘన విజయం.. సూపర్ కింగ్స్ ఎలిమినేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్‌గా నిలిచింది.గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్‌కు గురిపెట్టిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.హ్యాట్రిక్ పరాజయాలుజనవరి 9న లీగ్ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.ఆపై విజయాల బాట పట్టిఅయితే, నాలుగో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్‌రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్‌లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో తలపడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ఓపెనర్లు బెడింగ్హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్‌రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సూపర్ కింగ్స్ ఎలిమినేట్ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ధనాధన్ దంచికొట్టాడు.కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్‌తో ఢీసన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పర్ల్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో టైటిల్ కోసం తలపడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌కు ‘బోనస్’ షాక్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ భారీ షాకిచ్చింది.సన్‌రైజర్స్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్’ పాయింట్(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులోనూ రైజర్స్‌తో పోటీకి సై అంటోంది. కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌తో తలపడ్డ.. డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.వరుసగా నాలుగు విజయాలుఅనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన మార్క్రమ్ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్స, జొబర్గ్ సూపర్ కింగ్స్‌పై గెలుపొందింది.ఈసారి మాత్రం ఘోర పరాజయంఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో జొబర్గ్ జట్టుతోనే తలపడిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్‌బర్గ్ వేదికగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, జొబర్గ్ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బెడింగ్హాం(40 బంతుల్లో 48), వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) మాత్రమే రాణించారు.మిగతా వాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే, అబెల్, జోర్డాన్ హెర్మాన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, బేయర్స్ స్వానెపోయెల్ డకౌట్ కాగా.. లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్‌మన్, రిచర్డ్ గ్లెసాన్(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్ బౌలర్లలో విల్జోన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.What a start for the Joburg Super Kings 🏎️#BetwaySA20 #JSKvSEC #WelcomeToIncredible pic.twitter.com/jQhU4dIW85— Betway SA20 (@SA20_League) January 26, 2025 డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్‌ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ ఆదిలోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధనాధన్ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ , 25 రన్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు.ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలుపొంది.. అదనపు పాయింట్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆరు జట్లు లీగ్ దశలో పదేసి మ్యాచ్‌లు ఆడతాయి. పాయింట్ల కేటాయింపు ఇలామ్యాచ్ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్‌రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్ పాయింట్ కూడా వస్తుంది.జొబర్గ్ సూపర్ కింగ్స్ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్ పాయింట్ సాధించి.. ఓవరాల్‌గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్ రాయల్స్ ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.మరోవైపు.. ఎంఐ కేప్‌టౌన్ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్‌రైజర్స్ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్ సూపర్ జెయింట్స్ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ -
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి. -
జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.ఎంఐ ఆల్‌రౌండర్ డెలానో పోట్గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పోట్గీటర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ రెండు, లిండే, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.బ్రెవిస్ విధ్వంసం..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేసిన కేప్‌టౌన్ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.Marco rocked, and Reeza was left shocked! 🤯☝️Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో కేప్‌టౌన్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.Dewald Brevis 🔛🔥Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025 కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్ డాసన్, హర్మర్ తలా వికెట్ సాధించారు.ఇదే తొలి విజయం..కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై ఎంఐకేప్టౌన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పోట్గీటర్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు -
మార్క్రమ్, బాష్ మెరుపులు.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
సెంచూరియన్: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. లోయర్ ఆర్డర్ అండతో పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్ రికార్డుల్లోకెక్కాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. కెప్టెన్ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్హమ్ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్ వెరిన్ (2), మార్కో యాన్సెన్ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్‌లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్‌లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్‌లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్‌లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్‌కుమార్ వైశాఖ్, రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్‌మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్! -
ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్
యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్, ఓపెనర్ సంజూ శాంసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్ బౌలర్లపై అటాక్ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదుసంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్ మాట్లాడుతూ... సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.అసాధారణ ఇన్నింగ్స్.. అతడిని ఆపలేకపోయాం‘‘ఈ మ్యాచ్‌లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్ చేయడానికి మేము చాలానే ప్లాన్స్ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.అదొక్కటే మాకు సానుకూలాంశంఅతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఆట తీరు మాకు ఈ మ్యాచ్‌లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో పొరపాట్లను సరి చేసుకుని మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.Sanju Chetta is on fire! 🔥💥Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ— JioCinema (@JioCinema) November 8, 2024 కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్ బృందంతో తొలి మ్యాచ్‌లో తలపడింది. తిలక్ సైతండర్బన్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్ల విజృంభణలక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ ఒకటి, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
Ind vs SA: అతడు పట్టిందల్లా బంగారమే!.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 73 కోట్లు!
టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.అదొక్కటి సానుకూలాంశంఅయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం. మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్‌వాష్‌కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.ఒక్కో మ్యాచ్‌తో రూ. 73 కోట్లు! నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్‌లతో భారత టీమ్‌ను ఎంపిక చేశారు.టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది! ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్‌బర్గ్- రాత్రి గం.8:30లకుజట్లుసౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.భారత్‌అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ.ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్‌లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది. -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్‌లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్‌తో (89) ఆఫ్ఘనిస్తాన్‌కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
T20 World Cup 2024 Final: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదో చేదు వార్త. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలనున్నాడు. మ్యాచ్‌కు వేదిక అయినా బార్బడోస్‌లో మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. HEAVY RAIN IN BARBADOS. 🌧️- We've a Reserve Day for the Final. (Revsportz).pic.twitter.com/dmCnirETxv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024మ్యాచ్‌కు ముందు రోజు బార్బడోస్‌లో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ షెడ్యూలైన రోజు రద్దైతే రిజ్వర్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. ఈ కప్ గెలిస్తే సౌతాఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా.. భారత్‌కు 13 ఏళ్ల కరువు తీరనుంది. సౌతాఫ్రికా ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్‌కు కూడా గెలవకపోగా.. భారత్ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. కాగా భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయ జట్లు అజేయ జట్లుగా ఫైనల్స్‌కు చేరాయి. -
T20 World Cup 2024: 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ప్రపంచకప్ టోర్నీల్లో ప్రొటీస్ ప్రస్తానం 1992 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్ గండం దాటింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది. సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్‌కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆరంభ ఎడిషన్ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్‌కు చేరింది.బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ (వరల్డ్‌కప్) గెలవలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్ మార్క్రమ్ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్‌కప్ (టీ20) ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా మార్క్రమ్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్కు అండర్-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గానూ రికార్ంది. మార్క్రమ్ సెంటిమెంట్ తమకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
టీ20 వరల్డ్‌కప్ : చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా (ఫొటోలు)
-
మాకు ఇదొక గుణపాఠం.. వాళ్లు అద్భుతం: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్-2024లో సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు అద్భుతంగా ఆడిందని.. ఈ గెలుపు తమకు ఊరటనందించిందని పేర్కొన్నాడు.వర్షం పడి వెలిసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారిందన్న మార్క్రమ్.. వీలైనంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు విండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.వర్షం వల్ల అంతరాయం సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ కైలీ మేయర్స్ 35 పరుగులతో రాణించాడు.ప్రొటిస్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ మూడు కీలక వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండో ఇన్నింగ్స్‌ను 17 ఓవర్లకు కుదించారు.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 123 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆరంభంలో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయినా.. ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సన్(14 బంతుల్లో 21) మెరుగ్గా రాణించి జట్టుకు విజయం అందించారు.మాకిది ఒక గుణపాఠం లాంటిదేమరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించిన సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఆడారు. షంసీ రూపంలో మిస్టరీ స్పిన్నర్‌ను వెస్టిండీస్‌పై అస్త్రంలా ప్రయోగించి విజయవంతమయ్యాం.అయితే, లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. మాకిది ఒక గుణపాఠం లాంటిదే. పరిస్థితులకు అనుగుణంగా ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ 18 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు.చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్‌మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో (2022) ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్‌లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్‌పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్ -
SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పటిష్ట ప్రొటిస్ జట్టుతో విజయం కోసం నేపాల్ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది.వరల్డ్‌కప్-2024 లీగ్ దశలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంకతో కలిసి గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. మరోవైపు.. నేపాల్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిఇలాంటి దశలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించి సత్తా చాటింది. సెయింట్ విన్సెంట్ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ చేసింది.స్పిన్నర్ కుశాల్ భూర్తేల్(4/19), పేసర్ దీపేంద్ర సింగ్(3/21) సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్స్‌తో సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 27 నాటౌట్) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ను సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆదిలోనే దెబ్బకొట్టినా.. ఓపెనర్ ఆసిఫ్ షేక్(49 బంతుల్లో 42) పట్టుదలగా నిలబడ్డాడు. అతడికి తోడుగా అనిల్ సా(27) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నేపాల్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.ఇక నేపాల్ టాపార్డర్‌ను కుప్పకూల్చిన తబ్రేజ్ షంసీ(4/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.నేపాల్‌పై విజయంతో గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా.. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్ స్కోర్లుసౌతాఫ్రికా- 115/7 (20)నేపాల్- 114/7 (20)ఫలితం- ఒక్క పరుగు తేడాతో నేపాల్‌పై సౌతాఫ్రికా గెలుపు. చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క క్యాచ్‌తో అంతా తలకిందులు.. వీడియో
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది.తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్‌గా నిలిచింది.ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్‌లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించని న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.డెత్ ఓవర్లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్‌తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్‌లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్‌ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.ఆ తర్వాతి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్‌తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు. SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్మన్కు (30 వికెట్లు) దక్కుతుంది. కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
చాలా సంతోషంగా ఉంది.. కానీ పిచ్ మాత్రం: మార్క్రమ్
టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. న్యూయర్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రోటీస్ తీవ్రంగా శ్రమించింది.బౌన్స్‌కు సహకరిస్తున్న డ్రాప్ ఇన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చుతూ 78 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), డికాక్(20) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో కెప్టెన్ హసరంగా రెండు, తుషారా, షనక తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లంక.. ప్రోటీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 19.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. దక్షిఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహారాజ్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. న్యూయర్క్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉందని మార్క్రమ్ తెలిపాడు."టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డాం. న్యూయర్క్ వికెట్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. అదృష్టవశాత్తూ మా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గతంలో కూడా మాకు ఇటువంటి పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్ధితుల్లో ఆడుతూ వస్తున్నాం. అయితే న్యూయర్క్ వికెట్ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మా తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వికెట్‌కు అలవాటు పడాలి.ఇక నోర్జే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఫామ్ గురించి ఏ రోజు మేము ఆందోళన చెందలేదు. అతడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడని నేను అశిస్తున్నాను. నోర్జే ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రమ్ పేర్కొన్నాడు. -
T20 WC: అందరినీ ఓడిస్తాం.. ఈసారి ట్రోఫీ మాదే: మార్క్రమ్
ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలో అదరగొట్టడం.. నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోయి ఇంటి బాట పట్టడం.. ఫలితంగా ‘చోకర్స్’ అనే ముద్ర. అవును.. సౌతాఫ్రికా గురించే ఈ ప్రస్తావన. పటిష్ట జట్టుగా పేరొందిన ప్రొటిస్ జట్టు 1998లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది.అదే మొదలు.. అదే ఆఖరుహాన్సీ క్రోంజీ సారథ్యంలో ఫైనల్లో వెస్టిండీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ ఒక్కసారి కూడా మెగా టోర్నీ విజేతగా నిలవలేకపోయింది. కానీ.. ఈసారి మాత్రం ఆ అపవాదును చెరిపేసుకుంటామంటున్నాడు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్.టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు మార్క్రమ్. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ప్రొటిస్ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డీ లో ఉంది.ఈ క్రమంలో న్యూయార్క్ వేదికగా సోమవారం శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వరల్డ్‌కప్ గెలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు.ఈసారి ట్రోఫీ మాదే‘‘నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ టోర్నీలో పోటీపడుతున్న జట్లన్నీ గొప్పగానే ఆడుతున్నాయి. అయితే, మేము గనుక ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చామంటే.. మా అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగుతూనే ఉంటాం.ప్రత్యర్థి ఎవరైనా ఓడించే తీరతాం. మా ఆట తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, మేము ఇక్కడికి వచ్చింది మాత్రం ట్రోఫీ గెలిచేందుకే!’’ అని పేర్కొన్నాడు. ఈసారి చాంపియన్లుగా నిలిచేది తామేనంటూ మార్క్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సౌతాఫ్రికా జట్టు ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది? -
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మార్క్రమ్ తీవ్రనిరాశ పరిచాడు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి తుది జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్రమ్కు ఈ మ్యాచ్‌లో అనుహ్యంగా చోటుదక్కింది.అయితే మెనెజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మార్క్రమ్ వమ్ము చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మార్క్రమ్తో పాటు జట్టు మెనెజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వరుసగా విఫలమైన ఆటగాడికి కీలక మ్యాచ్‌లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు. అతడికి బదులుగా కివీస్ సూపర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎక్స్‌లో #గ్లెన్ ఫిలిప్స్ అనే కీవర్డ్ ట్రెండ్ అవుతోంది. -
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్‌టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.