ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఐడైన్ మార్‌క్రమ్ 217 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్‌గా 50 పరుగులు ఉన్నాయి. మార్‌క్రమ్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా నిరాశపరిచాడు. తొలిసారి ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ చేపట్టిన మార్‌క్రమ్ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు.
అతడి కెప్టెన్సీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా విఫలమైన మార్‌క్రమ్‌పై సన్‌రైజర్స్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మార్‌క్రమ్‌కు కెప్టెన్సీ ఇచ్చి సన్‌రైజర్స్ తప్పు చేసిందని సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Chase of 189, SRH needed their captain to perform and as always Markram boy chose the right path of academy gone for 10 off 10 balls, strike rate-100🙈😋😍 #GTvSRH pic.twitter.com/wmkMeBU2Rn
— TukTuk Academy (@TukTuk_Academy) May 15, 2023
చదవండి: IPL 2023: వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment