సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.
ఎంఐ ఆల్‌రౌండర్ డెలానో పోట్‌గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పోట్‌గీటర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ రెండు, లిండే, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.
బ్రెవిస్ విధ్వంసం..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేసిన కేప్‌టౌన్ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
Marco rocked, and Reeza was left shocked! 🤯☝️
Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥
Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025
అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో కేప్‌టౌన్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.
Dewald Brevis 🔛🔥
Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025
కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్‌గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్ డాసన్, హర్మర్ తలా వికెట్ సాధించారు.
ఇదే తొలి విజయం..
కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై ఎంఐకేప్‌టౌన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పోట్‌గీటర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు
Comments
Please login to add a commentAdd a comment