MI Cape Town
-
SA20 2025: తొలిసారి విజేతగా ఎంఐ కేప్‌టౌన్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్‌గా నిలవాలన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్‌టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్‌మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్‌టౌన్- సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఎస్టెర్హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.సన్రైజర్స్బ్యాటింగ్ ఆర్డర్ కుదేలుఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్‌టౌన్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో ఎంఐ కేప్‌టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగాఅవార్డుల వివరాలు👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్‌టౌన్) 👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్‌టౌన్ 👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్‌టౌన్) 👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్‌టౌన్) 👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్) 👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) 👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) ఎస్ఏ20 2025 విశేషాలు 👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397 👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు 👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25 👉అత్యధిక సిక్స్‌లు- బ్రేవిస్ 25 👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47 ప్రైజ్‌మనీ వివరాలు👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్లు (రూ. 15 కోట్ల 46 లక్షలు) 👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్లు (రూ. 7 కోట్ల 70 లక్షలు). చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK— Betway SA20 (@SA20_League) February 8, 2025 -
ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 విజేతగా ఎంఐ కేప్‌టౌన్ నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను 76 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఎంఐ కేప్‌టౌన్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( 15 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 33), రాస్సీ వాన్డర్డుస్సెన్(23) అద్బుతమైన ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఎస్టర్‌హుజెన్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 39), డెవాల్డ్ బ్రెవిస్(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్, డాసన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, మార్క్రమ్ చెరో వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన రబాడ..అనంతరం 182 పరుగుల భారీ లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్ల దాటికి ఈస్ట్రన్ కేప్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో టామ్ అబెల్(30),టోనీ డిజోర్జే(26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఎంఐ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో నిప్పులు చెరగగా.. బౌల్ట్, లిండే తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రషీద్ ఖాన్, కార్బన్ బోష్ తలా వికెట్ సాధించారు. దీంతో వరుసగా మూడోసారి ఛాంపియన్స్‌గా నిలవాలనుకున్న సన్‌రైజర్స్ ఆశలపై ఎంఐ కేప్‌టౌన్ నీళ్లు చల్లింది.ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జాన్సెన్..ఇక ఈ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. 13 మ్యాచ్‌ల్లో 18.42 సగటుతో జాన్సెన్ 19 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ జాన్సెన్ 204 పరుగులు చేశాడు.చదవండి: PAK vs NZ: ఫిలిప్స్ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్ -
‘హ్యాట్రిక్’ టైటిల్‌పై సన్‌రైజర్స్ గురి
సెంచూరియన్: భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టి20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేసింది. ‘ఎస్ఏ20’ పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్(Sunrisers Eastern Cape team) వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే టైటిల్స్‌ను గెలుచుకుంది. రెండో క్వాలిఫయర్‌లో మొదట రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రిటోరియస్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు క్రెయిగ్ ఓవర్టన్, జాన్సెన్, ఒటెనీల్, మార్క్రమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. టోని డి జొర్జి (49 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మాన్ (48 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జొబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించిన 24 గంటలకే మరో ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నెగ్గి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కు చెందిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని కేప్‌టౌన్ జట్టు 39 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌పై గెలిచింది. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్‌టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్‌టౌన్ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఛేదనలో రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంటుంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
సన్‌రైజర్స్ చిత్తు.. ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) జట్టు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. న్యూలాండ్స్ వేదికగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape)తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎంఐ జట్టు తొలిసారి తమ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. స్టార్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జానెసన్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జానెసన్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.4 వికెట్లతో చెలరేగిన కార్బిన్ బాష్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ మార్క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. కాగా ఎంఐ కేప్ టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందనిదే కావడం గమనార్హం.సన్‌రైజర్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతుందా?ఎస్ఎ20-2025లో పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మరో రెండు స్ధానాల కోసం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ప్రిటోరియా క్యాపిటల్స్ కంటే సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్ల్ రాయల్స్‌తో తలపడనుంది.అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. ఎందుకంటే ఈస్ట్రన్ క్యాప్ ఖాతాలో 19 పాయింట్లు ఉన్నాయి. జోబర్గ్ సూపర్ కింగ్స్(15), ప్రిటోరియా(14) పాయింట్లతో మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నాయి. జోబర్గ్, ప్రిటోరియా జట్లకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జోబర్గ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తుంది. ఒకవేళ ప్రిటోరియా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే జో బర్గ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గేమ్లోనైనా ఓటమి చెందాలి. ఈ సమయంలో ప్రిటోరియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
ప్రిటోరియస్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న రాయల్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ రస్సీ వాన్ డర్ డస్సెన్ (64 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో ఎంఐ కేప్‌టౌన్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 30.. అజ్మతుల్లా 11 బంతుల్లో 13, జార్జ్ లిండే 10 బంతుల్లో 10, డెవాల్డ్ బ్రెవిస్ 4 బంతుల్లో 8, డెలానో పాట్గెటర్ 5 బంతుల్లో 2 (నాటౌట్) పరుగులు చేశారు.డస్సెన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్వేనా మఫాకాకు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో డస్సెన్ రెండు సిక్సర్లు, బౌండరీ సహా 20 పరుగులు పిండుకున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన జో రూట్ ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్ 16, 18, 20 ఓవర్లు వేసిన రూట్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. రాయల్స్ బౌలర్లలో ముజీబ్ రెండు, రూట్, గేలిమ్ తలో వికెట్ పడగొట్టారు.ప్రిటోరియస్ విధ్వంసం159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ (52 బంతుల్లో 83; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకం బాది రాయల్స్ విజయానికి గట్టి పునాది వేశాడు. రూట్ 15, మిచెల్ వాన్ బూరెన్ 22, డేవిడ్ మిల్లర్ 24 (నాటౌట్), దినేశ్ కార్తీక్ (10), అండైల్ ఫెహ్లుక్వాయో 1 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో రాయల్స్ గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.అదరగొడుతున్న ప్రిటోరియస్ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్ రాయల్స్ యువ ఓపెనర్ డ్రి ప్రిటోరియస్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 68.67 సగటున, 179.13 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ప్రిటోరియస్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరుస్తున్న ప్రిటోరియస్ సౌతాఫ్రికాకు ఆశాకిరణంలా మారాడు.SA20 2025లో ప్రిటోరియస్ స్కోర్లు..సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై 51 బంతుల్లో 97 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 12 బంతుల్లో 26ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై 52 బంతుల్లో 83 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్) -
రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. -
జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.ఎంఐ ఆల్‌రౌండర్ డెలానో పోట్గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పోట్గీటర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ రెండు, లిండే, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.బ్రెవిస్ విధ్వంసం..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే సన్‌రైజర్స్ పేసర్ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేసిన కేప్‌టౌన్ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.Marco rocked, and Reeza was left shocked! 🤯☝️Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో కేప్‌టౌన్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.Dewald Brevis 🔛🔥Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025 కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్ డాసన్, హర్మర్ తలా వికెట్ సాధించారు.ఇదే తొలి విజయం..కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై ఎంఐకేప్టౌన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పోట్గీటర్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 ఎడిషన్ కోసం ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టుకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. స్టోక్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ను కూడా ఎంపిక చేసుకుంది ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం. ఈ జట్టులో రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, రస్సీ వాన్ వర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, నువాన్ తషార లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్నారు. 14 మంది సభ్యుల జట్టును ఎంఐ కేప్‌టౌన్ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. కాగా, బెన్ స్టోక్స్ తాజాగా హండ్రెడ్ లీగ్ ఆడుతూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో స్టోక్స్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.ఇదిలా ఉంటే, ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు రెండు ఎడిషన్లు జరిగాయి. రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఫ్రాంచైజీనే విజేతగా నిలిచింది. ఎస్ఏ20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న మొదలై ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్‌టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్‌హ్యుజెన్ -
ముంబై ఇండియన్స్‌లోకి బెన్ స్టోక్స్.. వామ్మో ఇన్ని కోట్లా?
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరపున స్టోక్స్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో రూ. 8.5 కోట్ల భారీ ధరకు స్టోక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. స్టోక్సీ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులగా స్టోక్స్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టిసారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్టోక్స్.. ఈ ఏడాది మినీ వేలానికి ముందు తన నిర్ణయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీకి తెలియజేశాడు. దీంతో అతడిని సీఎస్కే రిటైన్ చేసుకోలేదు. ఒకవేళ ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో స్టోక్స్ చేరితో ఆ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఇప్పటికే ఆ జట్టులో కిరాన్ పొలార్డ్, రషీద్‌ఖాన్, రబాడ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయినప్పటకి గత రెండు సీజన్లలో కేప్‌టౌన్ జట్టు చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. స్టోక్సీ రాకతోనైనా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. అదేవిధంగా ఈ ఏడాది ది హాండ్రడ్ లీగ్‌లో కూడా స్టోక్స్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌తో సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ పార్ల్ రాయల్స్ ఒప్పందం కుదర్చుకుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్‌టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పోలార్డ్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న పొలార్డ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ప్రిటోరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో గురువారం ఏంఐ కేప్‌టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 32 సిక్స్‌లు బాదారు. ఆఖరికి ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌టౌన్ విజయం సాధించింది. రికెల్టన్ విధ్వంసం.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఏంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ కూడా ఆఖరిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా కెప్టెన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. వెర్రెయిన్నే సెంచరీ వృథా.. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్ కైల్ వెర్రెయిన్నే విరోచిత సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడికి మరో ఆటగాడు సపోర్ట్‌గా నిలిచివుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఏంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పొలార్డ్, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
94 నాటౌట్.. ఎంఐ కేప్‌టౌన్ ఘన విజయం! పొలార్డ్ ప్రశంసలు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో కేప్‌టౌన్‌కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు. రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక.. వన్‌డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్‌టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గెలుపు అనంతరం ఎంఐ కేప్‌టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్ను ప్రశంసించాడు. -
సన్‌రైజర్స్ ఓపెనర్ మెరుపు శతకం.. పోరాడి ఓడిన ముంబై
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటకీ.. ముంబై ఆటగాళ్లు గట్టిగా పోరాడటంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. సన్‌రైజర్స్ బౌలర్ ఒట్నీల్ (4-0-35-3) బార్ట్‌మన్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ముంబై గెలుపును అడ్డుకున్నాడు. ముంబై చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒట్నీల్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్ జోర్డన్ హెర్మన్ (62 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ (37 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమతమై స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వాన్ డర్ డస్సెన్ (41), ర్యాన్ రికెల్టన్ (58), సామ్ కర్రన్ (37 నాటౌట్), కీరన్ పోలార్డ్ (24) ముంబైను గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. ఒట్నీల్ బార్ట్‌మన్ (3/35) ముంబైని దెబ్బకొట్టాడు. డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. -
SA20 2023: నిరాశపరిచిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన డికాక్.. ఆఖరి ఓవర్లో..
Durban Super Giants vs MI Cape Town: ఎంఐ కేప్‌టౌన్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌దే పైచేయి అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్వింటన్ డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి ఓ బంతి మిగిలి ఉండగానే విజయం అందుకుంది. సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్టన్ వేదికగా ఎంఐ కేప్‌టౌన్- డర్బన్ సూపర్‌జెయింట్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన సూపర్‌జెయింట్స్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. నిరాశపరిచిన బేబీ ఏబీడీ ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు డెవాల్డ్ బ్రెవిస్(13), రొలోఫ్సెన్(10) శుభారంభం అందించలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 32 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన టిమ్ డేవిడ్ 33 రన్స్ చేశాడు. ఆఖర్లో ఓడియన్ స్మిత్ 10 బంతుల్లో 2 ఫక్షర్లు, ఒక సిక్సర్ సాయంతో 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డెలానో 17 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేప్‌టౌన్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చెలరేగిన డికాక్ లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్ డికాక్ ఆది నుంచే దూకుడు చూపడం కలిసి వచ్చింది. కెప్టెన్ డికాక్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కె 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. గెలిచినా.. మిగిలిన వాళ్లలో కీమో పాల్ 18 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో సమిష్టి విజయంతో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. అయితే, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మాత్రం మెరుగుపరచుకోలేకపోయింది. సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట 5 విజయాలతో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ ఎనిమిదింట 4 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాయల్స్ మూడు, సూపర్‌కింగ్స్ నాలుగు స్థానాల్లో ఉండగా.. ఎంఐ, డర్బన్ ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా మూడు విజయాలు సాధించాయి. అయితే, పాయింట్ల పరంగా ఎంఐ(13 పాయింట్లు) కంటే వెనుకబడ్డ డర్బన్ (12)చివరి స్థానంలో నిలిచింది. చదవండి: ILT 20 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ IND vs SA Womens T20 Tri Series 2023: తుది పోరులో పేలవంగా... Destructive @timdavid8 💪 Quintessential @QuinnyDeKock69 🔥#DSGvMICT was indeed a blockbuster encounter 🍿👌 🎥 the highlights and more of #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺 📲#SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/296WIhXFmm — JioCinema (@JioCinema) February 2, 2023 #DSG captain Quinton de Kock is all smiles after an important win over #MICT#Betway #SA20 | @Betway_India pic.twitter.com/3fjmPUDPxY — Betway SA20 (@SA20_League) February 2, 2023 #MICT captain Rashid Khan knows his side will come back stronger after their defeat at the hands of #DSG#Betway #SA20 | @Betway_India pic.twitter.com/pKCFETAYgp — Betway SA20 (@SA20_League) February 2, 2023 -
ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ ఎంట్రీ!
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఏంఐ కేప్‌టౌన్ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఆఖరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లివింగ్‌స్టోన్ చేతివేలికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్ స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో ఏంఐ కేప్‌టౌన్ భర్తీ చేసింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ఏంఐ కేప్‌టౌన్ ఓ వీడియోను షేర్ చేసింది. "టిమ్ డేవిడ్ ఇప్పుడు ఏంఐ కేప్‌టౌన్ ఫ్యామిలీలో చేరాడు అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. కాగా డేవిడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బిగ్‌బాష్ లీగ్-(2022-23)లో హోబార్ట్ హారికేన్స్ తరపున డేవిడ్ అదరగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 8.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ 186 పరుగులు సాధించాడు. చదవండి: Murali Vijay: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే Tim in blue-and-gold in Cape Town - here we go! 😉💙#MICapeTown #OneFamily @timdavid8 pic.twitter.com/pizLgh2hiu — MI Cape Town (@MICapeTown) January 30, 2023 -
రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో 500 వికెట్లు
పొట్టి ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ సారధి, ఈ తరంలో ప్రపంచంలోనే మేటి స్పిన్నర్‌గా పేరొందిన రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారధ్యం వహిస్తున్న ఇతను.. నిన్న (జనవరి 23) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-0-16-3) 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ20 ఫార్మాట్లో (ఓవరాల్‌గా) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్.. ఈ ఫీట్‌ను 371 టీ20 మ్యాచ్‌ల్లో సాధించాడు. The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D — MI Cape Town (@MICapeTown) January 23, 2023 పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో.. 500 వికెట్ల మైలరాయిని చేరుకునేందుకు 458 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 614 వికెట్లు ఉన్నాయి. రషీద్ అత్యంత పిన్న వయసులో, అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించడంతో మున్ముందు 1000, 1500 వికెట్లు సునయాసంగా సాధిస్తాడని క్రికెట్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని టీ20 లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ (3/37), ఓడియన్ స్మిత్ (2/27) బంతితో రాణించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో చేతులెత్తేయడంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున విల్ జాక్స్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఎంఐ కేప్‌టౌన్ తరఫున బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (46) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రిటోరియా బౌలర్లలో వేన్ పార్నెల్, అన్రిచ్ నోర్జే తలో 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ 2, ఈథన్ బోష్, విల్ జాక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 28 పరుగులు!
ఆఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్‌కు సన్‌రైజర్స్ బ్యాటర్ మార్కో జాన్సెన్ చుక్కలు చూపించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్‌లో జాన్సెన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో జాన్సెన్ 4 సిక్స్‌లు, ఒక్క ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌తోనే మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 ట్విటర్లో ఫోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ విజయంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు. Some clean hitting by Marco Jansen as he smashes 2⃣8⃣ runs off the Rashid over 🚀#Betway #SA20 #MICTvSEC | @Betway_India pic.twitter.com/504jSzfqXf — Betway SA20 (@SA20_League) January 18, 2023 చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ -
అదరగొట్టిన మార్కరమ్.. సన్‌రైజర్స్ తొలి విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. 159 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి ఈస్టర్న్ కేప్ 19.3 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక సన్‌రైజర్స్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన మార్క్రమ్.. అనంతరం బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 7 ఫోర్లు సాయంతో 50 పరుగలు సాధించాడు. అతడితో పాటు సరేల్ ఎర్వీ(41), స్టబ్స్(30) పరుగులతో రాణించారు. ఎంఐ కేప్‌టౌన్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు, సామ్ కుర్రాన్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా కేప్‌టౌన్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాసీ వాన్ డర్ డస్సెన్ (29), లిండే(63) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. కాగా ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మాన్ మూడు వికెట్లు, మగాల, మార్కరమ్ తలా రెండువికెట్లు పడగొట్టారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు -
విల్ జాక్స్ ఊచకోత.. చెలరేగిన బేబీ ఏబీడీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌తో నిన్న (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. విల్ జాక్స్ (46 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జాక్స్‌కు జతగా డి బ్రూన్ (23 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో క్యాపిటల్స్ టీమ్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో క్యాపిటల్స్ బౌలర్లు పార్నెల్ (2/20), ఆదిల్ రషీద్ (2/46), నోర్జే (1/37), నీషమ్ (1/13), ఈథన్ బాష్ (1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (29 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెలరేగిన బేబీ ఏబీడీ.. రెచ్చిపోయిన ఎంఐ బౌలర్లు లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన మరో మ్యాచ్‌లో రబాడ (2/12), రషీద్ ఖాన్ (2/18), జార్జ్ లిండే (2/25), ఓడియన్ స్మిత్ (2/10) రెచ్చిపోవడంతో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగా, ఎంఐ జట్టు 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి సత్తా చాటగా.. ఆఖర్లో సామ్ కర్రన్ (15 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్-పార్ల్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. -
ఫోర్టిన్ మాయాజాలం, మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. రాజస్థాన్, లక్నో జట్ల విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్.. సూపర్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో, సూపర్ జెయింట్స్.. ముంబై కేప్ టౌన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించాయి. తిప్పేసిన రాయల్స్ స్పిన్నర్లు.. పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్.. స్పిన్నర్లు ఫోర్టిన్ (3/16), ఇవాన్ జోన్స్ (3/21), తబ్రేజ్ షంషి (1/4) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. వెర్రిన్ (11), అల్జరీ జోసఫ్ (13), విలియమ్స్ (17 నాటౌట్), ఫాంగిసో (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్ 10.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. జోస్ బట్లర్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. తలో చేయి వేసిన ఎంఐని ఓడించిన సూపర్ జెయింట్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్.. రోలోఫ్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో, జార్జ్ లిండే (33), డెలానో పాట్గేయిటర్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో టాప్లే, సుబ్రయెన్, విల్యోన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో కైల్ మేయర్స్ (34), వియాన్ ముల్దర్ (30), హెన్రిచ్ క్లాసిన్ (36), కీమో పాల్ (20 నాటౌట్) తలో చేయి వేసి సూపర్ జెయింట్స్‌ను గెలిపించారు. ఎంఐ బౌలర్లలో ఓలీ స్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండేకు ఓ వికెట్ దక్కింది. కాగా, లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 14) జరుగబోయే మ్యాచ్‌ల్లో ప్రిటోరియ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్లు.. ఎంఐ కేప్ టౌన్-జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. -
బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ టీమ్ శుభారంభం
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది.