మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ శుభారంభం చేసింది. లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేప్‌టౌన్.. జోఫ్రా ఆర్చర్ (3/27), ఓలీ స్టోన్ (2/31), డుయన్ జన్సెన్ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) మాత్రమే రాణించారు.
అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్ టీమ్.. బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కర్రన్.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్.. రస్సీ వాన్ డర్ డస్సెన్ (3 బంతుల్లో 8 నాటౌట్; సిక్స్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్ బౌలర్లలో కోడి యుసఫ్, రామోన్ సిమండ్స్‌కు తలో వికెట్ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)-జొహనెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment