David Miller
-
రాణించిన కిల్లర్ మిల్లర్.. రాయల్స్‌కు హ్యాట్రిక్ విక్టరీ
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) పార్ల్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్ చేతిలో ఓడిన సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ రెండో స్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్‌స్టో పుణ్యమే. బెయిర్‌స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయల్స్ బౌలర్లలో ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ వాన్ బెర్రెన్ (44), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (40 నాటౌట్) రాణించి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డ్రి ప్రిటోరియస్ 27 పరుగులు చేయగా.. జో రూట్ 6, రూబిన్ హెర్మన్ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్‌కు జతగా దినేశ్ కార్తీక్ (2) అజేయంగా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్డస్ సిపామ్లా 2, ఇమ్రాన్ తాహిర్, ఫెరియెరా తలో వికెట్ దక్కించుకున్నారు. -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్‌లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్‌ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్‌టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
SA Vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్
స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాక్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగల్గింది. ఓ దశలో కెప్టెన్ రిజ్వాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్తాన్ సునాయసంగా లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఆఖరి ఓవర్లో రిజ్వాన్ ఔట్ కావడం, ఇతరుల నుంచి అతడికి సపోర్ట్ లభించకపోవడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 19 పరుగుల అవసరమవ్వగా.. సఫారీ యువ పేసర్ మఫాక కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(62 బంతుల్లో 74, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అయూబ్(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. బాబర్ ఆజం(0)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో జార్జ్ లిండీ 4 వికెట్లు పడగొట్టగా.. మఫాక రెండు, సీమ్లేన్, బార్ట్‌మన్ తలా వికెట్ సాధించారు.డేవిడ్ మిల్లర్ ఊచకోత..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రోటీస్ టాపర్డర్ విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాట్ డేవిడ్ మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జార్జ్ లిండే(24 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అర్బర్ ఆహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో డిసెంబర్ 13న సెంచూరియన్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్‌ను సీనియర్లే నియంత్రించాలి: ఆసీస్ మాజీ కెప్టెన్ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్‌పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్‌లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్‌లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో! -
డేవిడ్ మిల్లర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో క్వాలిఫియర్-2కు బార్బడోస్ రాయల్స్ ఆర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ఎలిమినేటర్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో బార్బడోస్ ఘన విజయం సాధించింది. ఫ్లడ్ లైట్స్ అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ మరోసారి సత్తాచాటాడు. 60 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 25 పరుగులతో రాణించాడు. డీఎల్ఎస్ ప్రకారం రాయల్స్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 60 పరుగులగా నిర్ణయించారు.చెలరేగిన మిల్లర్..అనంతరం లక్ష్య చేధనలో బార్బడోస్ స్టార్ ప్లేయయ్, ప్రోటీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఊచకోత ఫలితంగా బార్బడోస్ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. -
చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆధ్యంతం అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ 30 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరోసారి నిరాశే ఎదురైంది. బార్బోడస్ వేదికగా భారత్‌తో జరిగిన టైటిల్ పోరులో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. గెలుపు అంచుల దాక వెళ్లిన దక్షిణాఫ్రికా.. ఆఖరిలో భారత బౌలర్ల దాటికి చేతులేత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలితే.. మరోవైపు ప్రోటీస్ ఆటగాళ్లు న్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రోటీస్ స్టార్ డేవిడ్ మిల్లర్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.తన చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయానన్న బాధతో మిల్లర్ కుంగిపోయాడు. కాగా ఆఖరి ఓవర్లో ప్రోటీస్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా..తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో ప్రోటీస్ ఓటమి లాంఛనమైంది. కాగా వరల్డ్‌కప్‌లో ఓటమిపై డేవిడ్ మిల్లర్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్‌ను షేర్ చేశాడు."నేను చాలా నిరాశకు గురయ్యా. రెండు రోజులు గడిచినప్పటికి ఇంకా మా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను. మా జట్టు పోరాటం, ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాము. కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం. మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము. కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉందంటూ" ఇన్‌స్టాలో మిల్లర్ రాసుకొచ్చాడు. -
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్‌కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. -
T20 WC 2024: చెలరేగిన డికాక్, మిల్లర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మార్క్రమ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, రషీద్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024 GT VS DC: అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టిన పంత్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2-0-13-1) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించగా.. సుమిత్ కుమార్ అద్భుతమైన త్రోతో సాయి సుదర్శన్‌ను రనౌట్ చేశాడు. ఫలితంగా గుజరాత్ 5 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. పంత్ సూపర్ క్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాలాకాలం తర్వాత అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుత ఐపీఎల్‌తో క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. మునుపటి తరహాలో వికెట్ల వెనక చురుగ్గా ఉండి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లెగ్ సైడ్ దిశగా డేవిడ్ మిల్లర్ ఆడిన షాట్‌ను పంత్ అద్భుతమైన డైవిండ్ క్యాచ్‌గా మలిచి అభిమానుల మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరలవుతుంది. RISHABH PANT WITH A STUNNER 🥶pic.twitter.com/Se9bdsAAxi — Johns. (@CricCrazyJohns) April 17, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ 47 పరుగుల వద్ద మరో (ఐదో) వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ అద్భుతమైన స్టంపింగ్ చేయడంతో అభినవ్ మనోహర్ (8) ఔటయ్యాడు. 8.3 ఓవర్ల అనంతరం గుజరాత్ స్కోర్ 47/5గా ఉంది. రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. సాహా (2), గిల్ (8), సాయి సుదర్శన్ (12), డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ (8) ఔటయ్యారు. ఇషాంత్ శర్మ 2, ముకేశ్ కుమార్, స్టబ్స్ తలో వికెట్ పడగొట్టారు. -
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ .. స్టార్ క్రికెటర్ దూరం?
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్‌గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్? -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
David Miller Marriage Photos: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ (ఫొటో గ్యాలరీ)
-
David Miller: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కామిలా హారిస్‌ను మిల్లర్ పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియావేదికగా వెల్లడించారు. వారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను హారిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీరి వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. కాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ గతేడాది ఆగస్ట్‌లో జరిగింది. ఇక దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ప్రోటీస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు ఆడిన మిల్లర్ 4458 పరుగులు చేశాడు. అదే విధంగా 116 టీ20ల్లో 2270 పరుగులు డేవిడ్ చేశాడు. ఇక మిల్లర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ సొంతం చేసుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా బుధవారం జో బర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఎలిమేనిటర్ మ్యాచ్‌లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్ కెప్టెన్‌గా మిల్లర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 10019 పరుగులు చేశాడు. కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, ఫాప్ డుప్లెసిస్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్ 12 స్ధానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జో బర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే? క్రిస్ గేల్ (14562) షోయబ్ మాలిక్ (13077) కీరన్ పొలార్డ్ (12577), అలెక్స్ హేల్స్ (12002), విరాట్ కోహ్లి (11994), డేవిడ్ వార్నర్ (11860), ఆరోన్ ఫించ్ (11458), రోహిత్ శర్మ (11156), జోస్ బట్లర్ 11146), కోలిన్ మున్రో (10602) జేమ్స్ విన్స్ (10019) డేవిడ్ మిల్లర్(10019) -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. నిప్పులు చెరిగిన ఎంగిడి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ బురెన్ (40 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్‌లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. మిల్లర్, బురెన్, బట్లర్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (5), విహాన్ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో డుపవిల్లోన్, జేమ్స్ నీషమ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించాడు. విల్ జాక్స్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (0), డి బ్రూయిన్ (4), కొలిన్ ఇన్‌గ్రామ్ (1) నిరాశపరిచారు. -
ఇదేమి అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మద్య జరిగిన మూడో టీ20లో అంపైర్ అల్లావుదీన్ పాలేకర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్లియర్‌గా ఔటైనప్పటికి అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం అందరని షాక్‌కు గురిచేసింది. ఏమి జరిగిందంటే? దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్లో నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో మిల్లర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతికి వెళ్లింది. వెంటనే కీపర్‌తో పాటు బౌలర్ జడేజా గట్టిగా అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ అల్లావుదీన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. అంపైర్ నిర్ణయం పట్ల జడ్డూతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. అయితే జడేజా వేసిన ఓవర్లో సాంకేతిక లోపం వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి మిల్లర్ తప్పించుకున్నాడు. ఒక వేళ్ల డీఆర్ఎస్ అందుబాటులో ఉండి ఉంటే మిల్లర్ పెవిలియన్‌కు వెళ్లక తప్పేది కాదు. యాదృచ్ఛికంగా జడ్డు వేసిన ఓవర్ తర్వాత డీఆర్ఎస్ అందుబాటులో రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంపైర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం pic.twitter.com/796HKVL104 — Cricket Videos (@cricketvid123) December 14, 2023 -
దంచికొట్టిన మిల్లర్.. ఆఫ్ఘన్ ఓపెనర్ పోరాటం వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. బంగ్లా టైగర్స్-నార్త్ర్న్ వారియర్స్ మధ్య ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగిపోయారు. బంగ్లా టైగర్స్ తరఫున డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జోర్డన్ కాక్స్ (16 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వారియర్స్ తరఫున ఆఫ్ఘన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కెన్నార్ లెవిస్ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2స సిక్సర్లు) పేట్రేగిపోయారు. 138 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ ఆటగాళ్లు పోరాడినప్పటికీ, విజయం బంగ్లా టైగర్స్నే వరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్.. జోర్డన్ కాక్స్, డేవిడ్ మిల్లర్ చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగుల భారీ స్కోర్ చేసింది.టైగర్స్ ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (11), కుశాల్ మెండిస్ (20), షనక (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 2, సుల్తాన్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. 138 పరుగుల లక్ష్య ఛేదనలో వారియర్స్ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడినప్పటికీ లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్, కెన్నార్ లెవిస్‌తో పాటు ఆడమ్ హోస్ (17), జేమ్స్ నీషమ్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టైగర్స్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్, డేనియల్ సామ్స్, రోహన్ ముస్తఫా తలో వికెట్ దక్కించుకున్నారు. -
34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు
Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
జన్సెన్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్‌రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్‌పై ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జంపా.. క్లాసెన్‌ను కేవలం 6 పరుగులకే క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్‌లో ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి, సిరీస్‌లో సమంగా నిలిచాయి. -
క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం
వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తొలుత రస్సీ వాన్ డర్ డస్సెన్ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ (8) మినహా అందరూ పరుగులు చేశారు. క్వింటన్ డికాక్ (45), రీజా హెండ్రిక్స్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది. క్లాసెన్‌కు మిల్లర్ కూడా జతకలవడంతో ఆసీస్ బౌలింగ్ లైనప్ తునాతునకలైంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో రికార్డు స్థాయిలో 113 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు స్టొయినిస్ (10-1-81-1), హాజిల్‌వుడ్ (10-0-79-2), నాథన్ ఇల్లిస్ (10-0-79-1), మైఖేల్ నెసర్ (10-0-59-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్ ఆవకాశాలు సజీవంగా ఉంటాయి. క్లాసెన్ పరుగులు ఇలా సాధించాడు.. తొలి హాఫ్ సెంచరీ: 38 బంతులు రెండో హాఫ్ సెంచరీ: 19 బంతులు మూడో హాఫ్ సెంచరీ: 20 బంతులు ఆఖరి 24 పరుగులు: 6 బంతులు ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్ ఆఖరి 150 పరుగులను 58 బంతుల్లో చేయడం విశేషం. క్లాసెన్-మిల్లర్ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించింది. క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్.. కోహ్లి 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జంపా.. ఆసీస్‌కే చెందిన మిక్ లెవిస్ (113) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (7) 400 స్కోర్ దాటిన సౌతాఫ్రికా -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి. -
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ధోని శిష్యుడు ఒకే టీమ్‌లో..!
లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్‌లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఎల్పీఎల్లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్‌స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది. గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్‌ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్‌ను తమ ఓవర్సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి. ఎల్పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చదవండి: వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల