IND Vs SA T20 Series: ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రోటిస్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, వాన్‌డెర్ డసెన్ కీలక పాత్ర పోషించారు. 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిల్లర్(64), వాన్‌డెర్ డసెన్(75) విజృంభించడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా ఛేదించింది.
అయితే 29 పరుగుల వద్ద వాన్‌డెర్ డసెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ జారవిడిచాడు. అదే భారత్ కొంప ముంచింది. అనంతరం వాన్‌డెర్ డసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి 30 బంతుల్లో 29 పరుగులు చేసిన డసెన్.. అఖరి 16 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన డసెన్.. డ్రాప్ చేసిన క్యాచ్‌కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తనకు తెలుసు అని చెప్పాడు.
"ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ముందుగా బౌండరీలు కొట్టలేక జట్టును ఒత్తిడికి గురి చేశాను. అయితే నా రిథమ్‌ను అందుకోవడానికి ఏదో ఒక బౌలర్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నాను. వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. కాగా జారవిడిచిన క్యాచ్‌కు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని నాకు తెలుసు. కొన్ని సార్లు అదృష్టం మనకు కలిసి వస్తుంది. ఈ రోజు నేను అదృష్టవంతుడిని" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్‌డెర్ డసెన్ పేర్కొన్నాడు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20:
టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్
భారత్ స్కోరు: 211/4 (20)
దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు)
ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్
Comments
Please login to add a commentAdd a comment