Rassie van der Dussen
-
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్‌బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్‌ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్‌బాద్ ఖాన్‌కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
బట్లర్ ఊచకోత.. డస్సెన్, లిన్ మెరుపులు వృధా
అబుదాబీ టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్.. చెన్నై బ్రేవ్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో జోస్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న జోస్.. 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా డెక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (29 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్రిస్ లిన్ (28 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు సాధించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నోర్జే, లూక్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్.. బట్లర్, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (24 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర ఉతుకుడు ధాటికి మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ అజేయమైన అర్ద శతకంతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్ విధ్వంసం ధాటికి డస్సెన్, లిన్ మెరుపు అర్ద శతకాలు వృధా అయ్యాయి. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ గోల్డన్ డకౌట్ కాగా.. రిలీ రొస్సో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్.. మార్కస్ స్టోయినిస్‌తో (2 నాటౌట్) కలిసి గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు. బ్రేవ్ బౌలర్లలో సాబిర్ అలీ రావు 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన డెక్కన్ గ్లాడియేటర్స్ రెండుసార్లు అబుదాబీ టీ10 లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ జట్టులోకి సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు..ఎవరంటే?
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిచిల్ మార్ష్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా మార్ష్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో మార్ష్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ పడింది. మార్ష్ ప్లేస్‌లో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ రస్సీ వాండర్ డస్సెన్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన వాండర్ డస్సెన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఈ ప్రోటీస్ స్టార్ దమ్ములేపాడు. ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్.. 364 పరుగులతో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌ను ఢిల్లీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్ గతంలో ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు డెవాన్ కాన్వే రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో గాయపడ్డ కాన్వే.. తన చేతి వేలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ కివీ స్టార్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాష్రీచ్ లీగ్‌కు డెవాన్ దూరమయ్యాడు. ఈ క్రమంలో కాన్వే స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే ఫ్రాంచైజీ పడింది. అతడి స్ధానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో భర్తీ చేయాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు వాన్‌డెర్ డస్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లహోర్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ప్రోటీస్ స్టార్ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్.. 364 పరుగులతో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్పై సీఎస్కే కన్నేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్ గతంలో ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
సౌతాఫ్రికా ఆటగాడి విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో లాహోర్ ఖలందర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లాహోర్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేసింది. లాహోర్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో డస్సెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 50 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచరీని ఈ సఫారీ స్టార్ బ్యాటర్ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఏదేమైనప్పటికీ డస్సెన్ విధ్వంసకర సెంచరీ వృథా అయిపోయింది. లహోర్ బ్యాటర్లలో డస్సెన్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పెషావర్ బ్యాటర్లలో ఓపెనర్ సైమ్ అయూబ్(55 బంతుల్లో 88, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బాబర్ ఆజం(48), పావెల్(46) పరుగులతో రాణించారు. 2024 PSL's first centurion 💯🥇 Take a bow, Rassie van der Dussen 🤩🔥pic.twitter.com/6RIybWt2Ay — Sport360° (@Sport360) February 25, 2024 -
రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్ టీమ్ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్.. వాన్ డర్ డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ భారీ స్కోర్ చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్ 28, ఫకర్ జమాన్ 13, డేవిడ్ వీస్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, షాదాబ్ ఖాన్, నసీం షా తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (41 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్ (31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. కొలిన్ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్ బౌలర్లలో జమాన్ ఖాన్, సల్మాన్ ఫయాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
చెలరేగిన పూరన్, స్మట్స్.. 48 బంతుల్లోనే శతక్కొట్టిన డస్సెన్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఆటగాళ్లు వాన్ డర్ డస్సెన్, రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్బన్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్మట్స్ రెచ్చిపోయారు. డస్సెన్ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్ జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఓపెనర్ వాన్ డర్ డస్సెన్ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్ లిండే, ఓలీ స్టోన్ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్, రబాడ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డు ప్లూయ్ (48), రొమారియో షెపర్డ్ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చెలరేగిన పూరన్, స్మట్స్.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో (సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో) నికోలస్ పూరన్ (31 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో టామ్ ఏబెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (55), మార్క్రమ్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్మట్స్, ప్రిటోరియస్, గ్లీసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
వరల్డ్‌కప్ నుంచి అఫ్గాన్ ఔట్.. దక్షిణాఫ్రికా ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ విజయంలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్(76 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఓపెనర్ క్వింటన్ డికాక్(41), ఆండిలే ఫెహ్లుక్వాయో( 39 నాటౌట్) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలర్లలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్, ఎంగిడి తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో అఫ్గానిస్తాన్ వరల్డ్‌కప్ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో నవంబర్ 12న కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. చదవండి: మాథ్యూస్ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్ -
CWC 2023 SA VS SL: సెంచరీలతో డబుల్ సెంచరీ కొట్టిన డికాక్, డస్సెన్
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెంచరీల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. కాగా, ఈ మ్యాచ్‌లు అత్యధిక టీమ్ స్కోర్ నమోదు కావడంతో పాటు పలు ఇతర రికార్డులు కూడా నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (మార్క్రమ్- 49 బంతుల్లో), వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టడం.. ఇలా సౌతాఫ్రికా, ఆ జట్టు ఆటగాళ్లు పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ రికార్డులతో పాటు డికాక్, డస్సెన్‌లు మూడు వేర్వేరు ఘనతలను సాధించి, రికార్డుపుటల్లోకెక్కారు. అవేంటంటే.. ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన సెంచరీ వన్డేల్లో వికెట్కీపర్లు చేసిన 200వ సెంచరీగా రికార్డైంది. ఈ సెంచరీ వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున కూడా 200వ సెంచరీ కావడం విశేషం. ఇదే మ్యాచ్‌లో డస్సెన్ చేసిన సెంచరీ వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో 200వ శతకంగా నమోదైంది. ఇలా డికాక్, డస్సెన్ చేసిన సెంచరీలతో డబుల్ సెంచరీని మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధేశించిన కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 21 ఓవర్లలో 154 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. షకన (3), అసలంక (28) క్రీజ్‌లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (0), కుశాల్ పెరీరా (7), ధనంజయ డిసిల్వ (11), సమరవిక్రమ (23) విఫలం కాగా.. కుశాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నంతసేపు విధ్వంసం (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సృష్టించాడు. -
లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు రికార్డు స్థాయిలో 400కి పైగా పరుగులు స్కోర్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సఫారీ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కారు. తొలుత క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆతర్వాత రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు శతక వీరుల్లో మార్క్రమ్ సృష్టించిన విధ్వంసం ఓ రేంజ్లో ఉండింది. మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. అతను తన సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), మార్కో జన్సెన్ (7 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. గత రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై 417/6 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. మొత్తంగా వరల్డ్‌కప్‌లో 400కు పైగా స్కోర్ ఐదుసార్లు నమోదు కాగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికానే ఈ మార్కును దాటింది. వరల్డ్‌కప్‌లో భారత్ ఓసారి 400 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై భారత్ 413/5 స్కోర్ చేసింది. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవుమా (8) ఒక్కడే విఫలమయ్యాడు. సఫారీ బ్యాటర్ల విధ్వంసం ధాటికి లంక బౌలర్లు విలవిలలాడిపోయారు. దాదాపుగా అందరూ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించకున్నారు. రజిత 10 ఓవర్లలో వికెట్ తీసి 90 పరుగులు, దిల్షన్ మధుషంక 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 89 పరుగులు, దసున్ షనక 6 ఓవర్లలో 36 పరుగులు, ధనంజయ డిసిల్వ 4 ఓవర్లలో 39, మతీష పతిరణ 10 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి అత్యధికంగా 95 పరుగులు, దునిత్ వెల్లలగే 10 ఓవర్లలో వికెట్ పడగొట్టి 81 పరుగులు సమర్పించుకున్నారు. -
CWC 2023 SA VS SL: సెంచరీలతో విరుచుకుపడిన సౌతాఫ్రికా ప్లేయర్లు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 2023లో సెంచరీల మోత మోగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్), రచిన్ రవీంద్ర (123 నాటౌట్) శతక్కొట్టగా.. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్ సెంచరీలతో కదంతొక్కారు. 84 బంతులు ఎదుర్కొన్న డికాక్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ చేసి, ఆ వెంటనే పతిరణ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 103బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన డస్సెన్ క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. 34.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 244/2గా ఉంది. డస్సెస్, మార్క్రమ్ (24 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి శ్రీలంక సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఓవర్లోనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను (8) దిల్షన్ మధషంక ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తుంటే 400 స్కోర్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) ఆదరగొట్టి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కలిస్‌ను అధిగమించిన డికాక్.. ఈ వరల్డ్‌కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని ఇదివరకే ప్రకటించిన డికాక్.. తన ఆఖరి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో డికాక్ సౌతాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్‌ను (17 వన్డే సెంచరీలు) అధిగమించాడు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (27) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్ (25), హెర్షల్ గిబ్స్ (21) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. -
బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు..
ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రొటిస్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సూపర్ సెంచరీతో జట్టుకు విజయం అందించి సిరీస్‌ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం పక్కనబెడితే.. సౌతాఫ్రికా బ్యాటర్ వాండర్ డసెన్‌ను బట్లర్ తన వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించాడు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బట్లర్.. ''నీ సమస్యేంటి రాసీ.. ప్రతీసారి నీ గురించి రావడం లేదు.. బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. నిన్ను కాదు'' అంటూ పేర్కొన్నాడు. దానికి డసెన్.. ''ఏం జరిగిందో నేను చూశాను'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు వాగ్వాదానికి దిగడం స్టంప్‌మైక్‌లో రికార్డయింది. ఇదంతా గమనించిన అంపైర్ ఇక చాలు ఆపండి అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి బట్లర్‌కు కొత్తేమి కాదు. ఇంతకముందు కూడా తన కవ్వింపు చర్యలతో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాడు. 2020లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న ఫిలాండర్‌తో బట్లర్ మాటల యుద్ధానికి దిగాడు. ఫీల్డర్ బంతిని అందుకొని ఫిలాండర్ వైపు విసిరాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న బట్లర్.. ఫిలాండర్‌ను చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ వీడియో బాగా పాపులర్ అయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 94 నాటౌట్, హ్యారీ బ్రూక్ 80, మొయిన్ అలీ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రాకా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టెంబా బవుమా 109 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 58 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 👀 Jos Buttler is at it again.#SAvsENG | #Proteas https://t.co/d4724m1ws7 pic.twitter.com/TSn9OdaK3M — PEAK (@ThePeakSA) January 29, 2023 చదవండి: ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్, సిసంద మగలకు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ప్రోటీస్ స్టార్ బ్యాటర్ వాన్ డెర్ డస్సెన్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఉన్నారు. అయితే సిరీస్ సమయానికి వీరంతా జట్టుతో కలవనున్నారు. ఇక జనవరి 27న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ ప్రోటీస్‌కు చాలా కీలకం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగలా, కేశవ్ మహరాజ్, జన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, వేన్ పార్నెల్, షమ్సీ, వాన్ డెర్ డస్సెన్ చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా! స్టార్ బ్యాటర్ రీ ఎంట్రీ
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు డీన్ ఎల్గర్ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆసీస్ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ మార్క్రమ్ను ప్రోటీస్ సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అదే విధంగా ఈ సిరీస్‌కు కీగన్ పీటర్సన్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ప్రోటీస్ కీలక ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుసెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న బ్యాటర్ డి బ్రుయిన్కు తిరిగి చోటు దక్కింది. డి బ్రుయిన్ చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ఆడాడు. మరోవైపు యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్ 17న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా టెంబా బావుమా సారథ్యంలో ప్రోటీస్ జట్టు టీ20 ప్రపంచకప్-2022లో గ్రూపు దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, గెరాల్డ్ కోయెట్జీ, థ్యూనిస్ డి బ్రుయిన్, సరెల్ ఎర్వీ, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడ, గ్లెంటన్ స్టౌర్మాన్, కెన్ డ్యూస్లీ వెర్నీ, కె. , ఖయా జోండో -
'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి'
IND Vs SA T20 Series: ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రోటిస్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, వాన్‌డెర్ డసెన్ కీలక పాత్ర పోషించారు. 212 పరుగుల భారీ లక్ష్య చేధనలో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిల్లర్(64), వాన్‌డెర్ డసెన్(75) విజృంభించడంతో దక్షిణాఫ్రికా సునాయసంగా ఛేదించింది. అయితే 29 పరుగుల వద్ద వాన్‌డెర్ డసెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ జారవిడిచాడు. అదే భారత్ కొంప ముంచింది. అనంతరం వాన్‌డెర్ డసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి 30 బంతుల్లో 29 పరుగులు చేసిన డసెన్.. అఖరి 16 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన డసెన్.. డ్రాప్ చేసిన క్యాచ్‌కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తనకు తెలుసు అని చెప్పాడు. "ఆరంభంలో బంతులను ఎదర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ముందుగా బౌండరీలు కొట్టలేక జట్టును ఒత్తిడికి గురి చేశాను. అయితే నా రిథమ్‌ను అందుకోవడానికి ఏదో ఒక బౌలర్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నాను. వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. కాగా జారవిడిచిన క్యాచ్‌కు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని నాకు తెలుసు. కొన్ని సార్లు అదృష్టం మనకు కలిసి వస్తుంది. ఈ రోజు నేను అదృష్టవంతుడిని" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్‌డెర్ డసెన్ పేర్కొన్నాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్ చదవండి: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే.. అయితే: పంత్ -
Ind Vs SA: అదే మా కొంప ముంచింది.. అందుకే ఓడిపోయాం: పంత్
Ind Vs SA T20 Series- Rishabh Pant: ‘‘మేము మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. అయితే, ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్, వాన్‌డెర్ డసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. నిజానికి మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కాస్త స్లోగా ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోయింది. మిల్లర్‌ను కట్టడి చేసేందుకు మేము బాగానే ప్రయత్నించాం. కానీ వికెట్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించింది. ఏదేమైనా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాము. అయితే, తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో పంత్ ఆఖరి నిమిషంలో జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం(జూన్ 9) ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 211 పరుగుల భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డసెన్ విజృంభించడంతో పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పంత్.. తమ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, బౌలింగ్‌లో కాస్త తేలిపోయామని, వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించిందని పేర్కొన్నాడు. కాగా ఈ పరాజయంతో టీ20 ఫార్మాట్లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13వసారి గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించాలన్న కల నెరవేరకుండా పోయింది. ఇక ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా తదితరులు దూరంగా ఉండగా.. మొదటి మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు- నాటౌట్) ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ స్కోరు: 16 బంతుల్లో 29 పరుగులు చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది .@ishankishan51 dazzled & put on an absolute show with the bat! 🔥 🔥 #TeamIndia | #INDvSA | @Paytm Watch his 4⃣8⃣-ball 7⃣6⃣-run blitz 🎥 🔽https://t.co/VUi8n7B8aZ — BCCI (@BCCI) June 9, 2022 ఎప్పటికైనా సరే #𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞𝐈𝐧𝐁𝐥𝐮𝐞 💙 ఆటలో గెలుపోటములు సహజమే 😊 తిరిగి పుంజుకుని Paytm T20I ట్రోఫీని గెలవటమే లక్ష్యంగా వస్తుంది #TeamIndia 😎 మరి మీరు మీ విషెస్ ను సెండ్ చెయ్యండి 👇🏻 చూడండి #INDvSA 2nd T20I 12 జూన్ 6pm నుంచి మీ #StarSportsTelugu / Disney + Hotstar లో pic.twitter.com/j1YLHFELcr — StarSportsTelugu (@StarSportsTel) June 9, 2022 -
వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది
సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య జరిగిన తొలి టి20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆవేశ్ ఖాన్ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని ఆఫ్‌సైడ్ దిశగా యార్కర్ వేశాడు. క్రీజులో ఉన్న డుసెన్ బంతిని టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అంతే మిడిల్లో తాకిన బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్లింది. ఇది చూసిన డుసెన్ తన బ్యాట్‌ను పరిశీలించగా.. ఆవేశ్‌ఖాన్ సహా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శ్రేయాస్ అయ్యర్ 36, రిషబ్ పంత్ 29 పరుగులు చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే, పార్నెల్, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరుదైన రికార్డు -
'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !
రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 718 పరుగులు సాధించి ఈ ఏడాది టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా టోర్నీ ఆరంభంలో అత్యుత్తమంగా ఆడిన బట్లర్.. సెకెండ్ హాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో బట్లర్ 89 పరుగులు సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ భార్య లారా.. బట్లర్ బౌండరీ బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రాజస్తాన్ రాయల్స్ పాడ్‌కాస్ట్‌లో ధనశ్రీ వర్మ, పృతీ అశ్విన్‌లతో కలిసి మాట్లాడిన లారా ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది. కాగా లారాని అందరూ బట్లర్ భార్య అని భావించారు. ఇక పోడ్కాస్ట్లో ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.."నేను ఇప్పుడు జోస్‌ను నా రెండవ భర్తగా స్వీకరించానని అనుకుంటున్నాను. నన్ను లూయిస్ అని పిలుస్తారు. ఎందుకుంటే అతడి భార్య పేరు అదే కదా అని" లారా నవ్వుతూ సమాధానమిచ్చింది. "అందరూ నన్ను జోస్ భార్య అని అనుకుంటారు. నాపై కెమెరాలు చాలా సార్లు ఫోకస్ చేశాయి, ఆ సమయంలో నేను అతడిని ఉత్సాహపరుస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అలానే అనుకుంటారు. ధనశ్రీ గాని నేను గాని మ్యాచ్ వీక్షిస్తున్నప్పడు మా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేము. జోస్ సెంచరీలు సాధించినప్పుడు మేము మరింత ఎంజాయ్ చేశాం. ఇక ఐపీఎల్లో రాస్సీ అంతగా ఆడలేదు. కాబట్టి అతడిని నేను ఉత్సాహపరచలేకపోయాను" అని లారా పేర్కొంది. ఇక క్వాలిఫైయర్2లో శుక్రవారం ఆర్సీబీతో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: Dinesh Karthik: దినేశ్ కార్తిక్ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్! -
'సంజూ శాంసన్‌కు డ్రింక్స్ అందించడానికి రెడీగా ఉండు'
ఐపీఎల్ 2022 సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో క్రికెటర్ల నుంచి మీమ్స్ గోల చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా వసీం జాఫర్, యజ్వేంద్ర చహల్‌లు తమ ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా ఆసక్తికర మీమ్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకున్నారు. తాజాగా వీరి జాబితాలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ వచ్చి చేరాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్న నీషమ్.. క్వాలిఫయర్-1 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అదే జట్టుకు చెందిన వాండర్ డుసెన్ కూడా ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రాక్టీస్‌లో భాగంగా వేగంగా పరిగెత్తుతున్న ఫోటోను డుసెన్ పంచుకుంటూ.. ''కొత్త వారంలోకి పరిగెడుతున్నా.. నా దృష్టిలో అది చాలా పెద్దది( ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉద్దేశిస్తూ) #ఐపీఎల్ 2022'' అని క్యాప్షన్ జత చేశాడు. డుసెన్ పోస్టును చూసిన నీషమ్ సరదాగా ఆట పట్టించాడు. వేగంగా పరిగెత్తుత్ను డుసెన్‌ను చూపిస్తూ.. ''సరే సంజూకు డ్రింక్స్ అందించడానికి రెడీగా ఉండు.. విరామ సమయంలో ఎంత వేగంతో డ్రింక్స్ అందిస్తే అంత మంచిది'' అంటూ ట్రోల్ చేశాడు. నీషమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! View this post on Instagram A post shared by Rassie van der Dussen (@rassie72) -
కోహ్లి, రోహిత్‌ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్, డస్సెన్
Kohli Retains 2nd Spot In ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి(2వ ర్యాంక్), రోహిత్ శర్మ(3)లు తమ ర్యాంకులను పదిలంగా కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో కోహ్లి రెండు హాఫ్ సెంచరీలు బాది రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకోగా, రోహిత్.. ఈ సిరీస్ ఆడనప్పటికీ తన ర్యాంక్‌కు కాపాడుకోగలిగాడు. 🔹 Quinton de Kock continues his rise 🔼 🔹 Massive gains for Rassie van der Dussen 🔥 🔹 England players move up in the T20I charts 📈 Here’s how things stand after the latest update to the @MRFWorldwide ICC Men’s Player Rankings 📝 Details 👉 https://t.co/Jxktm5FBsr pic.twitter.com/HBGUPKNHsT — ICC (@ICC) January 26, 2022 మరోవైపు ఇదే సిరీస్‌లో సెంచరీలతో రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డికాక్(5), వాన్‌డర్ డస్సెన్(10)లు టాప్-10లోకి దూసుకురాగా.. పాక్ సారధి బాబర్ ఆజమ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(3 వన్డేల్లో 153 పరుగులు).. ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 59వ స్పాట్‌కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రొటీస్ బౌలర్ ఎంగిడి నాలుగు ప్లేస్‌లు మెరుగుపర్చుకుని 20 స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Rohit Sharma: హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్.. స్లిమ్‌గా, ఫిట్‌గా..! -
పంత్, డసెన్‌ల గొడవ.. ‘నీ కంటే ఐదేళ్లు చిన్నవాడి వెంట పడ్డావు.. పైగా’
సౌతాఫ్రికాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమితో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే మూడో టెస్టులో డీన్ ఎల్గర్ ఔట్ విషయంలో డీఆర్ఎస్ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి లైన్‌మీద వెళుతున్నప్పటికి ఆఫ్‌స్టంప్ బెయిల్‌కు తాకకుండా కనిపించడం దుమారం రేపింది. ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు స్టంప్స్ మైక్ ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ చానెల్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటన మరువకముందే కోహ్లి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు విషయంలోకి వెళితే.. మహ్మద్ షమీ వేసిన బంతి వాండర్ డసెన్ ప్యాడ్లకు తాకింది. అయితే అప్పీల్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత ఆటగాళ్లు ఎవరి స్థానాలకు వారు వెళుతున్న సమయంలో కోహ్లి.. వాండర్ డసెన్‌తో చాట్ చేశాడు. అప్పటికే పంత్, డసెన్‌ల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఇది విన్న కోహ్లి.. డసెన్‌తో..''నీ కంటే ఐదేళ్లు చిన్నవాడి వెంట పడ్డావు.. పైగా నాతోనే మీరు రిషబ్‌ను స్లెడ్జ్ చేస్తారా '' అని అడుగుతావా అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన అంశం అక్కడి స్టంప్స్ మైక్‌లో రికార్డయింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦 Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj — Cricket South Africa (@OfficialCSA) January 14, 2022 -
Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు!
Rassie van der Dussen Dismissal: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు రసే వాన్ డెర్ డసెన్ అవుటైన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. బంతి బౌన్స్ అయిన తర్వాత కీపర్ చేతుల్లో పడిందని, అతడిని తిరిగి మైదానంలోకి పిలిపిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వాండరర్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో 45వ ఓవర్లో లార్డ్ శార్దూల్ సంధించిన రెండో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు డసెన్. కానీ చివరి నిమిషంలో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే, అప్పటికే బంతిని బ్యాట్ తాకడం ఆ తర్వాత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దానిని అందుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో అంపైర్ డసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో లంచ్ సమయానికి ముందు ప్రొటిస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే, లంచ్ విరామ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. డసెన్ అవుటైన తీరుపై తమ జట్టు మేనేజర్ ఖొమొత్సొ మసుబెలెలెతో కలిసి అంపైర్లతో చర్చించినట్లు. సమాచారం. రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడటానికి ముందు బంతి నేలను తాకినట్లు కనిపించింది. సైడ్ యాంగిల్లో మాత్రం క్యాచ్ పట్టినట్లు కనబడింది. దీంతో తాము అనవసరంగా బలైపోయామని ఎల్గర్ వాపోయినట్లు సమాచారం. ఈ విషయం గురించి కామెంటేటర్ మార్క్ నికోలస్ మాట్లాడుతూ... ‘‘ఒక యాంగిల్లో ఒకలా.. మరో యాంగిల్లో ఇంకోలా కనిపిస్తుంది. కాబట్టి అవుట్ కాలేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఇందుకు కచ్చితమైన ఆధారాలు ఉంటే... ఫీల్డింగ్ కెప్టెన్‌కు సదరు బ్యాటర్‌ను వెనక్కి పిలిపించమని సూచించేవారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్.. ఇలాంటి అస్పష్టమైన దృశ్యాల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమని, బంతి నేలను తాకిందా లేదా అనేది పంత్‌కు తెలిసి ఉంటుందని చెప్పుకొచ్చాడు. చదవండి: Shardul Thakur: పాపం బుమ్రా, షమీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.. కానీ శార్దూల్.. అస్సలు ఊహించలేదు కదా! -
దక్షిణాఫ్రికా ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఫీల్డర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన రబాడా బౌలింగ్‌లో.. హనుమా విహారి డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. కాగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ డుస్సెన్ జంప్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విహారి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(50) అశ్విన్ (46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. చదవండి: SA vs IND: ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే What a superb close-in catch that was from Rassie van der Dussen to dismiss Hanuma Vihari! #SAvIND pic.twitter.com/SB0DURelNO — Cric Trend (@crictrend_) January 3, 2022 -
బుమ్రా సూపర్ డెలివరీ.. డసెన్‌కు బొమ్మ కనబడింది
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఐదోరోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను బుమ్రాను ఎల్బీగా వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. టీమిండియా విజయానికి మరో ఐదు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక నాలుగో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో రాసీ వాండర్ డసెన్‌ను వెనక్కి పంపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: SA Vs IND: బుమ్రాకి బౌలింగ్ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి.. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. డైరెక్టుగా టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయానికి గ్రౌండ్లో అడుగుపెట్టాడు. అయితే బౌలింగ్ వేస్తాడా లేదా అన్న సందేహంలోనే బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే ఎల్గర్.. వాండర్ డసెన్‌తో కలిసి 22 ఓవర్ల పాటు ఓపికగా ఆడుతూ 40 పరుగులు జతచేశారు. ఇక వికెట్ పడడం గగనం అనుకున్న సమయంలో బుమ్రా అద్భుత బంతితో మెరిశాడు. బుమ్రా ఆఫ్ స్టంప్ అవతల బంతి వేయడంతో వాండర్ డసెన్ అది వైడ్ లైన్ మీదుగా బయటకు వెళుతుందని భావించాడు. అయితే వికెట్లకు కూడా పూర్తిగా అడ్డుగా నిల్చున్నాడు. కానీ బంతి ఊహించనంతగా టర్న్ తీసుకొని ఇన్సైడ్ ఎడ్జ్ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఈ దెబ్బకు డసెన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. చదవండి: Marco Jansen Vs Kohli: ఒకప్పుడు నెట్‌బౌలర్‌గా కోహ్లికి చుక్కలు.. కట్‌చేస్తే How many times have we seen bumrah running in and delievering wickets when India need it the most? Bumrah, bohot pyaar ❤️ Looks like art, doesn't it?! VC - @StarSportsIndia#Bumrah #INDvSA pic.twitter.com/C2CEtNDcEw — Boxing day test 🇮🇳🇿🇦 (@Sectumsempra187) December 29, 2021 -
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు.. దక్షిణాఫ్రికా కొంపముంచిన బంగ్లా ఇన్నింగ్స్!
దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 190 పరుగులు... 87 పరుగులు చేస్తే సెమీస్‌కు ఇంగ్లండ్... 10.4వ ఓవర్లో ఆ పరుగు వచ్చేసింది... 106 పరుగులు చేస్తే గ్రూప్‌లో అగ్రస్థానం... 12.1వ ఓవర్లో అదీ జరిగిపోయింది... 132 పరుగులు చేస్తే ఆసీస్‌కు సెమీస్ అవకాశం... 15.2వ ఓవర్లో ఆ స్కోరు రావడంతో కంగారూ టీమ్‌లో ఆనందం...చివరి మ్యాచ్‌లో గెలిచినా దురదృష్టం వెంటాడటంతో సఫారీ జట్టు మరోసారి ఐసీసీ టోర్నీ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్–1 టాపర్‌గా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు అగ్రస్థానం దక్కగా... అదే తరహాలో మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత పొందింది. ఈ మూడు టీమ్‌లు 4 విజయాలు, 8 పాయింట్లతో సమానంగా నిలవగా... పోటీలో దక్షిణాఫ్రికా వెనకబడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 13.3 ఓవర్లు తీసుకోవడం చివరకు దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీసింది. తాజా ఫలితంతో సెమీస్‌లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా పోరు ఖాయమైపోయింది. (చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్) షార్జా: టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ డర్ డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... మార్క్రమ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడైన అర్ధ సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ (27 బంతుల్లో 34; 4 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు సాధించింది. మొయిన్ అలీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్ (15 బంతుల్లో 20 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జోడించారు. కగిసో రబడ (3/48) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (వోక్స్, మోర్గాన్, జోర్డాన్) తీసి ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబడ గుర్తింపు పొందాడు. (చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్) వార్నర్ వీరవిహారం అబుదాబి: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాకు చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం దక్కింది. ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఎవిన్ లూయిస్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్ (28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోష్ హాజల్‌వుడ్ (4/39) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విండీస్ చివరకు ఒకే ఒక విజయంతో టోర్నీని ముగిచింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు డ్వేన్ బ్రావో గుడ్‌బై చెప్పగా... క్రిస్ గేల్ కూడా తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. (చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్‌స్టోరీ) స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) కమిన్స్ 15; లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29; పూరన్ (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 4; ఛేజ్ (బి) హాజల్‌వుడ్ 0; హెట్‌మైర్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 27; పొలార్డ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 44; బ్రావో (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 10; రసెల్ (నాటౌట్) 18; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–35, 3–35, 4–70, 5–91, 6–126, 7–143. బౌలింగ్: స్టార్క్ 4–0–33–1, హాజల్‌వుడ్ 4–0–39–4, కమిన్స్ 4–0–37–1, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, మార్ష్ 3–0–16–0, జంపా 4–0–20–1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 89; ఫించ్ (బి) హొసీన్ 9; మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–33, 2–157. బౌలింగ్: హొసీన్ 4–0–29–1, రోస్టన్ ఛేజ్ 1.2–0–17–0, జేసన్ హోల్డర్ 2–0–26–0, డ్వేన్ బ్రావో 4–0–36–0, వాల్ష్ 2–0–18–0, ఆండ్రీ రసెల్ 2–0–25–0, గేల్ 1–0–7–1.