![PSL 2024: Islamabad United Beat Lahore Qalandars In The Opening Match - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/18/Untitled-2.jpg.webp?itok=hvvm8g0q)
పాకిస్తాన్ సూపర్ లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్ టీమ్ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్..
వాన్ డర్ డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ భారీ స్కోర్ చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్ 28, ఫకర్ జమాన్ 13, డేవిడ్ వీస్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, షాదాబ్ ఖాన్, నసీం షా తలో వికెట్ పడగొట్టారు.
రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్..
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (41 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్ (31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. కొలిన్ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్ బౌలర్లలో జమాన్ ఖాన్, సల్మాన్ ఫయాజ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment