Shadab Khan
-
సూపర్ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 లీగ్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజంను పెవిలియన్‌కు పంపాడు. పెషావర్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన నసీమ్ షా 4వ బంతిని బాబర్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాబర్ కొంచెం రూమ్ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్ ఆఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A bird, a plane? No, it's SUPERMAN SHADAB KHAN 😱#HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/PZFbd2ZNHV — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2024 -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇస్లామాబాద్ టీమ్ 18.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన డస్సెన్.. వాన్ డర్ డస్సెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (41 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ భారీ స్కోర్ చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (57) అర్దసెంచరీతో రాణించగా.. షఫీక్ 28, ఫకర్ జమాన్ 13, డేవిడ్ వీస్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది డకౌటయ్యాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, షాదాబ్ ఖాన్, నసీం షా తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన షాదాబ్ ఖాన్.. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (41 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఘా సల్మాన్ (31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్దశతకాలతో రెచ్చిపోవడంతో మరో 10 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అలెక్స్ హేల్స్ (36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. కొలిన్ మున్రో (5) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఖలందర్స్ బౌలర్లలో జమాన్ ఖాన్, సల్మాన్ ఫయాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్..!
కవ్దలకలవన్డే ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని అపే క్రమంలో షాదాబ్ తలకు గాయమైంది. అనంతరం ఫిజియో సాయంతో ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో అతడు తిరిగి మళ్లీ మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో షాదాబ్ స్ధానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామా మీర్ వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం షాదాబ్‌ను స్కానింగ్ తరలించగా అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు సమాచారం. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు వరల్డ్ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నడాని పాకిస్తాన్ మీడియా కథనాలు వెలువరిస్తోంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్‌పై కోపంతో ఊగిపోయిన బాబర్ ఆజం! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్ క్రికెటర్ అరుదైన ఘనత.. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా షాదాబ్ ఖాన్ తలకు గాయమైంది. బంతిని ఆపే క్రమంలో షాదాబ్ తల నేలకు బలంగా తాకింది. దీంతో అతడి నొప్పితో మైదానంలో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించినప్పటికీ ఫలితం లేదు. గాయం తీవ్రం కావడంతో ఫిజియో సాయంతో షాదాబ్ మైదానాన్ని వీడాడు. ఉసామా మీర్ ఎంట్రీ.. మైదానాన్ని వీడిన షాదాబ్ ఖాన్ తిరిగి మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్ధానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామా మీర్ మైదానంలో వచ్చాడు. తద్వారా ఉసామా మీర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మొదటి ఆటగాడిగా మీర్ రికార్డులకెక్కాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మీర్.. ఓ వికెట్ కూడా సాధించాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! -
కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. మోస్ట్ డేంజరస్: పాక్ వైస్ కెప్టెన్
ICC Cricket World Cupబ 2023- India vs Pakistan: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ బ్యాటింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు. ఒక్కసారి రోహిత్ క్రీజులో నిలదొక్కుకుంటే అతడిని ఆపడం కష్టమని.. ప్రపంచంలోని టాప్ బ్యాటర్లందరిలో అతడికి బౌలింగ్ చేయడం కష్టమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ పూర్తి చేసుకున్న బాబర్ ఆజం బృందం.. మంగళవారం ఆస్ట్రేలియాతో మరో సన్నాహక మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రపంచంలోని టాప్ బ్యాటర్లందరిలో టఫ్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న బ్యాటర్లలో నాకు రోహిత్ శర్మ ఆట అంటే ఇష్టం. అతడికి బౌలింగ్‌కు చేయడం చాలా కష్టం. అతడు మోస్ట్ డేంజరస్ ఒక్కసారి తను క్రీజులో పాతుకుపోతే.. అత్యంత ప్రమాదకారిగా మారిపోతాడు’’ అంటూ హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా ప్రస్తుతం.. టీమిండియాలో కుల్దీప్ యాదవ్ మోస్ట్ డేంజరస్ బౌలర్ అని షాదాబ్ ఖాన్ తన అభిప్రాయం పంచుకున్నాడు. అతడి ఫామ్ చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. హైదరాబాద్ ఆతిథ్యం అదుర్స్ ఇక తమకు హైదరాబాద్‌లో అదిరిపోయే ఆతిథ్యం లభించిందన్న ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. ఇక్కడి అభిమానుల ప్రేమను చూస్తుంటే సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆసియా కప్-2023లో సూపర్-4 మ్యాచ్‌లో షాదాబ్ బౌలింగ్‌లో రోహిత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే, అతడికే వికెట్ కూడా సమర్పించుకోవడం విశేషం. డేల్ స్టెయిన్ సైతం మరోవైపు.. ఆసియా వన్డే కప్-2023 టైటిల్‌ను రోహిత్ సేన గెలవడంలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. కాగా ఇటీవల సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్.. రోహిత్ శర్మ కఠినమైన బ్యాటర్ అని పేర్కొనగా.. తాజాగా షాదాబ్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2023లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్‌లో దాయాదులు టీమిండియా- పాకిస్తాన్ తలపడనున్నాయి. చదవండి: WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే! -
పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్ కెప్టెన్‌పై వేటు
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో జట్టులోని మిగితా ఆటగాళ్లకు విభేధాలు తలెత్తున్నట్లు సమాచారం. ఆసియాకప్-2023 లీగ్ దశలో అదరగొట్టిన పాకిస్తాన్.. సూపర్-4లో ఓటమి పాలై టోర్నీ అనుహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ అంతటా కెప్టెన్‌గా బాబర్ ఆజం తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది ఆటగాళ్ళు ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. అదేవిధంగా పాకిస్తాన్ డ్రెసింగ్ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని, కొంతమంది ఆటగాళ్ళు బాబర్ ఆజం నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బాబర్ ఆజంపై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా కీలక వాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్ ఆజంతో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అతడితో మేము మంచిగా ఎంజాయ్ చేస్తామని షాదాబ్ పేర్కొన్నాడు. షాదాబ్ ఖాన్‌పై వేటు.. కాగా బాబర్‌పై షాదాబ్ బహిరంగంగా చేసిన వాఖ్యలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ పదవి నుంచి షాదాబ్‌ను తప్పించాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియోన్యూస్ తమ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: Asia Cup 2023: 'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది' -
ICC: అద్భుత ఇన్నింగ్స్.. ఐసీసీ అవార్డు అతడికే! వరల్డ్‌కప్‌లో..
ICC Men's Player of the Month: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్ ఖాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజంకు క్రికెట్ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బాబర్.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు. నేపాల్‌పై శతక్కొట్టిన బాబర్ తద్వారా.. పాకిస్తాన్ అఫ్గన్ జట్టును 3-0తో వైట్‌వాష్ చేయడంలో బాబర్ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు. అరుదైన రికార్డు తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్లో బాబర్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటి ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్ ఆజం.. ఆసియా కప్- వన్డే వరల్డ్‌కప్-2023లో గెలుపొంది పాకిస్తాన్ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్‌లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు. చదవండి: Asia Cup: షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ -
రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్
Asia Cup, 2023 - Pakistan vs India, Super Fours: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన తీరును భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ విమర్శించాడు. హిట్‌మ్యాన్ తనను పూర్తిగా నిరాశపరిచాడన్న గౌతీ.. ఇలాంటి చెత్త షాట్లు ఆడటం ఎందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో భారత్- పాక్ రిజర్వ్ డే మ్యాచ్ ఆదివారం కొలంబో వేదికగా ఆరంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అర్ధ శతకాలు.. 147 పరుగులు ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు, శుబ్‌మన్ గిల్ 52 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించారు. వీరిద్దరి అర్ధ శతకాల నేపథ్యంలో వర్షం కారణంగా ఆదివారం ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది. గంభీర్(పాత ఫొటో) ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మ ఆట తీరును విశ్లేషిస్తూ స్టార్ స్పోర్ట్స్ షోలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోహిత్ నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో అవుటయ్యాడు. ఇలాంటి సాట్ ఎంచుకున్న కారణంగా అతడు విమర్శల పాలవుతాడని తనకూ తెలుసు. చెత్త షాట్ సెలక్షన్ పాకిస్తాన్ బౌలర్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి షాట్‌కు యత్నించడం సరికాదు. రోహిత్, గిల్ జోరు కొనసాగుతుంటే టీమిండియా 370-375 వరకు స్కోరు చేసే దిశగా పయనిస్తోందనిపించింది. కానీ.. రోహిత్ చెత్త షాట్ ఆడి అంతా తలకిందులు చేశాడు. ఇక మరుసటి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ కూడా అవుటయ్యాడు. పాకిస్తాన్ పటిష్ట బౌలింగ్ అటాక్ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వాళ్లకు ఇవ్వకుండా ఉండాలి కదా!’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. షాదాబ్, ఆఫ్రిది తలా ఓ వికెట్ కాగా భారత ఇన్నింగ్స్ 16.4 ఓవర్ వద్ద పాక్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ పహీం అష్రఫ్నకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షాదాబ్ సంధించిన బంతిని కవర్ మీదుగా షాట్‌గా మలచాలని రోహిత్ భావించగా.. స్ట్రెయిట్‌గా వెళ్లడంతో పహీం అద్బుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. మరుసటి ఓవర్ ఐదో బంతికి స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది గిల్‌ను అవుట్ చేశాడు. ఆఫ్రిది వేసిన స్లో బాల్‌ను తప్పుగా అంచనా వేసిన శుబ్‌మన్ గిల్.. ఆఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా వరుస ఓవర్లలో రోహిత్- గిల్ జోడీ మైదానం వీడటంతో పాకిస్తాన్ జట్టు సంబరాలు చేసుకుంది. స్కోరు.. ఇక సోమవారం నాటి ఆటలో విరాట్ కోహ్లి(122), కేఎల్ రాహుల్ (111) అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు స్కోరు చేసింది. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్! హ్యారిస్ రవూఫ్ దూరం.. కారణమిదే -
మనసులు గెలుచుకున్నాడు.. హార్దిక్ షూ లేస్ కట్టిన పాక్ స్టార్ క్రికెటర్
ఆసియాకప్-2023లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ రద్దైనప్పటికీ ఇరు జట్లకు కొన్ని సానుకూల ఆంశాలు ఉన్నాయి. భారత టాపర్డర్ విఫలమైనచోట హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి అందరని ఆకర్షించగా.. పాక్ పేసర్లు అఫ్రిది, రౌఫ్, నసీం షా సంచలన ప్రదర్శన చేశారు. శభాష్ షాదాబ్.. ఇక వర్షం కారణంగా రద్దైన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా షూ లేస్‌లను కట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల మధ్య మాత్రం మంచి స్నేహబంధం ఉంది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. Pakistani cricketer Shadab Khan ties Indian batter Hardik Pandya's shoelaces, exemplifying the true spirit of sportsmanship. This heartwarming moment is sure to make your day and is truly the best thing on the internet today. #PAKvIND #PakVsIndia #ShadabKhan #AsiaCup2023 pic.twitter.com/fb7cR8aunj — Anokhay (@AnokhayOfficial) September 2, 2023 చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
Ind Vs Pak: కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? పాక్ క్రికెటర్ రియాక్షన్..
India Vs Pakistan- "Bolne se kuch nahi hota": దాయాదులు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి హై వోల్టేజ్ తాజా మ్యాచ్ కి శ్రీలంక లోని పల్లకెలే వేదిక కానుంది గెలుపే లక్ష్యంగా ఆసియా కప్-2023 లో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా దాయాదిపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో ఈ విషయాన్నీ మరోసారి నిరూపించాడు. పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు. కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో .. కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులే అని తేలింది. పాక్ స్టార్ రియాక్షన్ ఇదే! ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దగ్గర ప్రస్తావించారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు అన్నారా లేదా అన్నది పక్కన పెడితే .. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్‌తో మూడో వన్డేలో గెలుపు తర్వాత ప్రెస్ మీట్ సందర్భంగా షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ అందరికి ఆట తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు. ప్రగల్బాలు మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టు లో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ ప్రగల్బాలు పలికాడు. కాగా లెగ్ స్పిన్నర్ అయిన షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటర్‌గానూ రాణించగలడు. ఇక పాక్ పేస్ దళంలో ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా గత కొంత కాలంగా మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! అతడు మొదలు పెట్టేశాడు -
PAK VS AFG 1st ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న షాదాబ్ ఖాన్
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యంకాని రీతిలో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహీది (0) క్యాచ్‌ను పట్టుకున్నాడు. షాహీది పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షాదాబ్ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్న అద్భుతమైన డైవింగ్ క్యాచ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. WHAT A CATCH BY SHADAB...!!! The best fielder from Pakistan in this generation.pic.twitter.com/QJAcIlZnLk — Johns. (@CricCrazyJohns) August 22, 2023 అంతకుముందు ఓవర్లోనే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్, తమ కెప్టెన్ వికెట్ కోల్పోవడంతో మరింత ఇరకాటంలో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి మూడు కీలకమై వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్ 4, 5 బంతులకు షాహీన్ అఫ్రిది.. ఇబ్రహీం జద్రాన్ (0), రెహ్మత్ షా (0)లను ఔట్ చేయగా.. 4వ ఓవర్ మూడో బంతికి నసీం షా.. ఆఫ్ఘన్ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం 8వ ఓవర్ మొదటి బంతికి, 14వ ఓవర్ మూడో బంతికి హరీస్ రౌఫ్.. ఇక్రమ్ అలీఖిల్ (4), గుర్భాజ్ (18)లను ఔట్ చేయడంతో ఆఫ్ఘన్ జట్టు 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 15 ఓవర్లు ముగిసాక ఆ జట్టు స్కోర్ 47/5గా ఉంది. ఒమర్జాయ్ (10), నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. -
దుబాయ్ క్యాపిటల్స్‌లోకి వార్నర్, వుడ్.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ మరో జట్టుతో..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ 8, డెజర్ట్ వైపర్స్ 6, దుబాయ్ క్యాపిటల్స్ 11, గల్ఫ్ జెయింట్స్ 5, ఎంఐ ఎమిరేట్స్ 8, షార్జా వారియర్స్ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి. కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్ వార్నర్ (దుబాయ్ క్యాపిటల్స్), మార్క్ వుడ్, షాదాబ్ ఖాన్ (డెజర్ట్ వైపర్స్), షాహీన్ అఫ్రిది (డెజర్ట్ వైపర్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (గల్ఫ్ జెయింట్స్), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్), కోరె ఆండర్సన్ (ఎంఐ ఎమిరేట్స్), మార్టిన్ గప్తిల్ (షార్జా వారియర్స్) లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్ 21) పూర్తి చేశాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా.. అబుదాబి నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్‌ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్ రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్, మతియుల్లా ఖాన్ డెజర్ట్ వైపర్స్ కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది రిటెన్షన్స్: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ దుబాయ్ క్యాపిటల్స్ కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్ రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్‌మన్ పావెల్, సికందర్ రజా గల్ఫ్ జెయింట్స్ కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్ రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్‌మైర్ ఎంఐ ఎమిరేట్స్ కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్ రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్ షార్జా వారియర్స్ కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్ రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్ -
టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్
Shadab Khan Reminds Teammates Of This BIG Challenge: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5 న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐసీసీ టోర్నీలో హాట్ ఫేవరెట్ మ్యాచ్ అయిన టీమిండియా- పాకిస్తాన్ల మధ్య పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. దాయాదుల మధ్య అక్టోబరు 14న మ్యాచ్ నిర్వహించనన్నట్లు ఐసీసీ రివైజ్ షెడ్యూల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం టీమిండియాకు అదనపు బలంగా మారగా.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మానసికంగా సిద్ధంగా ఉండాలి ‘‘ఇండియాలో ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి మద్దతు లభించదు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా మారాలి. మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. అంత తేలికగా అనుకున్న ఫలితాలు రాబట్టగలం’’ అని 24 ఏళ్ల షాదాబ్ ఖాన్ పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. ‘‘టీమిండియాపై విజయం సాధించడంతో పాటు ఇండియాలో వరల్డ్‌కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విషయం ఏదీ ఉండదు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే, మనకు ఎలాంటి ఆరంభం లభించింది.. ఎలా ముందుకు సాగుతున్నామన్న విషయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి జట్టుతో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే’’ అని షాదాబ్ వ్యాఖ్యానించాడు. కాగా రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టులో షాదాబ్ సభ్యుడు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ కంటే ముందు చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంక వేదికగా ఆసియా వన్డే కప్ టోర్నీలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. చదవండి: Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే -
మేజర్ లీగ్ క్రికెట్ 2023.. సిక్సర్లతో విరుచుకుపడిన పాక్ ఆల్‌రౌండర్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) తర్వాత పాక్ జట్టుకు చెందిన చాలా మంది ఆటగాళ్లు మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇమాద్ వసీమ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకోగా.. తాజాగా పాక్ ఆల్‌రౌండర్ షాబాద్ ఖాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లీగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోరే అండర్సన్(52 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(30 బంతుల్లో 61 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. సరబ్జిత్ లడ్డా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలుత స్ట్రెయిట్ సిక్సర్ సంధించిన షాదాబ్.. ఆ తర్వాత డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించాడు. అనంతరం రెండు వరుస బంతులను సిక్సర్లను సంధించాడు. షాదాబ్‌ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టిమ్ డేవిడ్ 53 నాటౌట్, డెవాల్డ్ బ్రెవిస్ 32, నికోలస్ పూరన్ 40, కీరన్ పొలార్డ్ 48 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనైన ముంంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్ద ఆగిపోయింది. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో కార్మీ లి రౌక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో రెండు వికెట్లు తీశారు. Feels good to contribute to a win in @SFOUnicorns first MLC match. pic.twitter.com/q8vKYEc0DW — Shadab Khan (@76Shadabkhan) July 15, 2023 చదవండి: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! -
రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి..
ICC ODI WOrld CUp 2023: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్‌గా షాదాబ్ ఖాన్‌ను ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. టీమిండియాకు రవీంద్ర జడేజాలాగా పాక్‌కు షాదాబ్ ఉన్నాడని వ్యాఖ్యానించాడు. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ-డీ క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌లు ఆడనున్న దాయాది జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. జడ్డూలా త్రీడీ ప్లేయర్.. డేంజరస్ హిట్టర్ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ మాథ్యూ హెడెన్ పాకిస్తాన్‌కు ఈ మెగా ఈవెంట్లో షాదాబ్ ఖాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ‘‘షాబాద్ ఖాన్ అద్బుతమైన ఆటగాడు. తనకంటూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ- డైమెన్షనల్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించగల ప్రమాదకర హిట్టర్. బంతితోనూ అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు అత్యద్భుతమైన ఫీల్డర్ కూడా! ఒక్కోసారి ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో కూడా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు మరి! కాబట్టి.. ఈసారి పాకిస్తాన్‌కు ఈ స్పిన్ ఆల్‌రౌండర్ కీలకం కానున్నాడని చెప్పవచ్చు’’ అని మాథ్యూ హెడెన్ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాదాబ్ ఖాన్.. బౌలింగ్ ఆల్‌రౌండర్. అందుకే అలా పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ 24 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కీలక సభ్యుడు. ఇప్పటి వరకు ఆడిన 56 వన్డేల్లో 631 పరుగులు సాధించడంతో పాటు.. 73 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. ఈ నేపథ్యంలో బ్యాటర్, బౌలర్‌గా రాణించడంతో పాటు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న షాబాద్‌ను హెడెన్ త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణించాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! -
భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్
ICC World Cup 2023 Ind Vs Pak: ఐసీసీ మెగా ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్-2023 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేజర్ టోర్నీలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను వేదికగా ఫిక్స్ చేసింది ఐసీసీ. అక్టోబరు 15న జరుగనున్న చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు పోటెత్తడం ఖాయం. ఇక టీ20 ప్రపంచకప్-2022 తర్వాత తొలిసారి భారత్- పాక్ ముఖాముఖి పోటీపడనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి కూడా ఉంటుంది క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో మ్యాచ్ అంటే ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుంది. ఇప్పుడు మేము భారత్‌కు వెళ్లాల్సి ఉంది. సొంతగడ్డపై మ్యాచ్ జరగడం వాళ్లకు కలిసి వస్తుంది. ప్రేక్షకుల మద్దతు కూడా వాళ్లకే ఉంటుంది. అయితే, మేము వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీ ఆడేందుకు అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి మా దృష్టి మొత్తం దానిమీదే ఉండాలి. అదొక్కటే ముఖ్యం కాదు కేవలం టీమిండియాను ఓడించడమే ప్రధాన లక్ష్యం కాదు. ఒకవేళ భారత జట్టును ఓడించినప్పటికీ మేము టైటిల్ గెలవలేదంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా! నా అభిప్రాయం ప్రకారం.. ఒకవేళ మేము టీమిండియా చేతిలో ఓటమిపాలైనా.. వరల్డ్‌కప్ గెలిస్తే అదే అసలైన విజయం. మా ప్రధాన లక్ష్యం కూడా అదే కావాలి’’ అని షాదాబ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన షాదాబ్ ఖాన్.. ప్రపంచకప్ ఈవెంట్ తర్వాత టెస్టు క్రికెట్‌పై కూడా దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: ►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్తాన్ vs క్వాలిఫయర్ 2 ►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ భారత్ ►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా ►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ ►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా ►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ ►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ vs న్యూజిలాండ్ ►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్ vs ఇంగ్లాండ్. చదవండి: World Cup 2023: టీమిండియాకు బిగ్‌షాక్.. వరల్డ్‌కప్‌కు స్టార్ ఆటగాడు దూరం! ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం! -
చరిత్ర సృష్టించిన షాదాబ్ ఖాన్.. తొలి పాకిస్తాన్ బౌలర్‌గా
షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్‌వాష్ నుంచి పాకిస్తాన్ తప్పించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇఫ్తికర ఆహ్మద్(31), షాదాబ్ ఖాన్(28) పరుగులతో రాణించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ 116 పరుగులకే కుప్పకూలింది. ఇహ్సానుల్లా,షాదాబ్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు. కాగా తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన ఆఫ్గాన్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చరిత్ర సృష్టించిన షాదాబ్ ఖాన్ ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్‌గా షాదాబ్ నిలిచాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ ఔట్ చేసిన షాదాబ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడిన అతడు 101 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(98) అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన జాబితాలో షాదాబ్ ఖాన్ స్ధానంలో నిలిచాడు. తొలి స్థానంలో 134 వికెట్లతో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ఉన్నాడు. చదవండి: AFG vs PAK: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! -
చివరి టి20లో ఓడినా ఆఫ్గన్‌ది చరిత్రే
పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తటస్థ వేదికలో పాకిస్తాన్‌పై సిరీస్ గెలవడం ఆఫ్గన్‌కు ఇదే తొలిసారి. సోమవారం రాత్రి జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆఫ్గన్ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షాదాబ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాగా.. సిరీస్ ఆద్యంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. Afghanistan put on a remarkable all-round display in the 3-match T20I series to secure a historic 2-1 series win over Pakistan after winning the first two matches of the series. Read More: https://t.co/a8pQYZh5f6 pic.twitter.com/tMg7wgXt8y — Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023 What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్
పాకిస్తాన్ జట్టుకు అఫ్గానిస్తాన్ షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆఫ్గన్ ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. సీనియర్లు లేని లోటు పాక్ జట్టుపై ప్రభావం చూపించింది. షాదాబ్‌ఖాన్ కెప్టెన్సీలో ఘోర ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్ వసీమ్(18), షాదాబ్ ఖాన్(23), సయీమ్ అయూబ్(17), తయూబ్ తాహిర్(16) రెండంకెల స్కోరు దాటగా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్గన్ బౌలర్లలో ముజీబ్, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. మహ్మద్ నబీ 38 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నజీబుల్లా జర్దన్ 17 నాటౌట్, రహమనుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఇమాద్ వసీమ్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక టి20ల్లో పాకిస్తాన్‌ను ఓడించడం అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పాకిస్తాన్‌కు టి20ల్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య జరిగిన రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది. Mohammad Nabi - The PoTM 🔥 Watch what the man of the moment, @MohammadNabi007, had to say after he stole the show with his (38* (38) & 2/12) incredible all-round performance to take Afghanistan to an incredible historic win. 🤩#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/bCggEWbsxW — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 This was the 𝓜𝓞𝓜𝓔𝓝𝓣! 👌 The President @MohammadNabi007 finished the job in some style to make history and win the game for Afghanistan. 🤩🔥#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/QPdMimCEdB — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నూతన సారధిని ఎంపిక చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరలో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నియామకం చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. వర్క్ లోడ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చి కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ సోమవారం (మార్చి 13) ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బృందంలో సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు తొలిసారి అవకాశం కల్పించిన పీసీబీ.. సీనియర్ ఇమాద్ వసీంను చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంది. పీసీబీ సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీ ఆధారంగా సెలెక్షన్ ప్రక్రియ సాగినట్లు పీసీబీ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్ పడింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, ఫజల్ హక్ ఫారూఖీ, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్ (1.4-0-13-3), సూఫియాన్ (3/37), అమెర్ జమాల్ (2/28), జేమ్స్ నీషమ్ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ (38), రహ్మానుల్లా గుర్భాజ్ (33), షాదాబ్ ఖాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పీఎస్ఎల్-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు.. ముల్తాన్ సుల్తాన్స్: 262/3 (ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120) క్వెట్టా గ్లాడియేటర్స్: 253/8 పెషావర్ జల్మీ 242/6 ముల్తాన్ సుల్తాన్స్ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121) లాహోర్ ఖలందర్స్ 226/5 (ఫకర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115) ఇస్తామాబాద్ యునైటెడ్ 107 పెషావర్ జల్మీ 240/2 (బాబర్ ఆజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115) క్వెట్టా గ్లాడియేటర్స్ 243/2 (జేసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్) -
అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా!
Shadab Khan: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఆ జట్టు పేసర్ హసన్ అలీ మధ్య జరిగిన సరదా సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అలీ కామెంట్‌కు షాదాబ్ బదులిచ్చిన తీరుపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు అతడి ఫాలోవర్లు. ఇంతకీ విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో.. హసన్ అలీ ఏదో సీరియస్‌గా చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. అతడి పెళ్లి గురించే! ఈ ట్వీట్లో హసన్ అలీని ట్యాగ్ చేశాడు. ఇందుకు స్పందించిన అలీ.. ‘‘మేము షాదాబ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం’’ అంటూ ఇందులోకి షాదాబ్ ఖాన్‌ను లాగాడు. ఈ ట్వీట్‌కు బదులుగా షాదాబ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ‘‘అసలు మీ ఇద్దరికీ ఏం అనిపిస్తోంది? నేను మరీ అంత పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నారా? నేను చిన్న పిల్లాడిని ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే అడుగుతున్నారు. నేనింకా చిన్న పిల్లాడినే’’ అని ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్ సరదాగా బదులిచ్చాడు. కాగా నిలకడలేమి ఆట తీరు వల్ల 28 ఏళ్ల హసన్ అలీకి ఇటీవల జట్టులో అవకాశాలు కరువయ్యాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ జట్టుకు అతడు ఎంపికకాలేదు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సైతం సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. షాదాబ్ ఖాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా.. టీ20 ఫార్మాట్లో ఈ ఆల్‌రౌండర్ అదరగొడుతున్నాడు. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల్లో అద్భుతంగా రాణించాడు. ఐసీసీ టోర్నీలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదితో కలిసి పాక్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే 28 ఏళ్ల హసన్ అలీ.. భారత్‌కు చెందిన సామియా ఆర్జూను పెళ్లాడిన విషయం తెలిసిందే. చదవండి: Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! Basically we talking about Shadab’s wedding babar saying vo ni honi 😆 @76Shadabkhan https://t.co/LLejsLkBFq — Hassan Ali 🇵🇰 (@RealHa55an) November 22, 2022 Aap logo ko be Lagta ha ka main boht bara ho gaya houn. Sab mere say shadi ka puchte hain. Abhi mai bacha hun. https://t.co/UktMfUZOcA — Shadab Khan (@76Shadabkhan) November 22, 2022 -
షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత.. తొలి పాక్ బౌలర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్‌గా షాదాబ్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌ను ఔట్ చేసిన షాదాబ్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 84 టీ20లు ఆడిన షాదాబ్ ఖాన్.. 98 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ ఆఫ్రిది(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆఫ్రిది రికార్డును షాదాబ్ బ్రేక్ చేశాడు. ఇక పైనల్ మ్యాచ్‌లో షాదాబ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు