
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్‌గా షాదాబ్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్‌ను ఔట్ చేసిన షాదాబ్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు 84 టీ20లు ఆడిన షాదాబ్ ఖాన్.. 98 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ ఆఫ్రిది(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆఫ్రిది రికార్డును షాదాబ్ బ్రేక్ చేశాడు. ఇక పైనల్ మ్యాచ్‌లో షాదాబ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు
Comments
Please login to add a commentAdd a comment