T20 World Cup 2022
-
'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే.. ఇంగ్లండ్ లెక్క సరి చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.THE WINNING CELEBRATION OF TEAM INDIA. 🇮🇳- History will be rewritten tomorrow. 🏆pic.twitter.com/atRTQyA1ZA— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 20242022 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాను ఓడించి ఫైనల్స్‌కు చేరిన ఇంగ్లండ్.. తుది సమరంలో పాకిస్తాన్‌ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌కు ఓడించి ఫైనల్స్‌కు చేరని భారత్.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.INDIA TOOK A PERFECT REVENGE OF 2022 SEMIS. 🇮🇳- England defeated India by 10 wickets in the 2022 Semi Final.- India took all 10 wickets of England in the 2024 Semi Final. pic.twitter.com/7OKz2yvrsT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
CWC 2023: టీ20 వరల్డ్‌కప్ 2022 సీన్‌ను ఇంగ్లండ్ మళ్లీ రిపీట్ చేస్తుందా..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించారు. ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్‌కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది. వన్డే ప్రపంచకప్‌ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్‌లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్‌ను ఓడించనప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్‌కప్ సీన్‌ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి మ్యాచ్ అక్కడే డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది. భారత్‌లో వన్డే రికార్డు అంతంత మాత్రమే! ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్‌లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్‌గా కలిగి ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం. కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్‌కప్‌లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత -
Virat Kohli: మళ్లీ రారాజుగా అవతరించు అని ఆ దేవుడే ఇలా!
Virat kohli Completes 15 Years As International Cricketer: ‘‘ఆ మ్యాచ్ ఆసాంతం విరాట్ కోహ్లి గురించే చర్చ. క్రికెట్ దేవుళ్లు అతడు పని పూర్తి చేయాలని దీవించారు. అప్పటికి అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. సొంత ప్రేక్షకుల నుంచే విమర్శలు. మీడియా అయితే.. అతడి వెంట పడింది. కానీ.. దేవుడు మాత్రం.. ఇది నీకై వేచిన వేదిక.. మునుపటి వైభవం అందుకో.. మళ్లీ రారాజుగా అవతరించు అని అతడిని ఆశీర్వదించినట్లుగా అనిపించింది. ఆరోజు మ్యాచ్ చూసిన వాళ్లకు విషయం అర్థమయ్యే ఉంటుంది. దాదాపు లక్ష మంది నేరుగా చూస్తుండగా.. 1.3 బిలియన్ల భారతీయులు, 30 కోట్ల మంది పాకిస్తానీలు ఆ అద్భుతాన్ని వీక్షించారు. ఆ రెండు సిక్సర్లు మహాద్బుతం క్రికెట్ ప్రపంచమంతా కోహ్లి ఆట కోసం ఎదురుచూసిన తరుణంలో.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆ రెండు సిక్సర్లు.. మహా అద్భుతం. అతడు తన రాజ్యంలోకి తిరిగి అడుగుపెట్టాడు. ఆరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇలా జరగాలని అతడి విధిరాతలో రాసి ఉంది’’ అంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. కోహ్లి ఎల్లప్పుడూ కింగ్ కోహ్లిగానే ఉంటాడంటూ రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై పరుగుల యంత్రం అద్భుత ఇన్నింగ్స్‌ను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో కొనియాడాడు. కాగా 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పద్దెనిమిదేళ్ల వయసులో అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన విఫలమైన ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. అంచెలంచెలుగా ఎదుగుతూ రికార్డుల రారాజుగా పేరొందాడు. అయితే, ఆసియా టీ20 కప్-2022 ముందు వరకు కెరీర్లో తొలిసారి అత్యంత గడ్డుకాలం ఎదుర్కొన్న కోహ్లి.. ఈ మెగా ఈవెంట్ సందర్భంగా సెంచరీతో మునుపటి లయను అందుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్ వింటేజ్ కోహ్లిని గుర్తు చేసింది. సెంచరీల వీరుడిపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రశంసలు మెల్బోర్న్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌పై భారత్ మరోసారి పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేశాడు. నేటి(ఆగష్టు 18)తో కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఈ మేరకు తమ జట్టుపై కోహ్లి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ అతడికి శుభాభినందనలు తెలియజేశాడు. కాగా కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
టీ20 వరల్డ్‌కప్ మాదిరే ఈసారి కూడా! ఇషాన్‌ను ఆడిస్తే రోహిత్ ‘డ్రాప్’.. మరి కోహ్లి?
India's decision-making ahead of the WC 2023 Big Worry Is: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి టీమిండియా సన్నద్ధత సరిగా లేదంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. మెగా ఈవెంట్‌కు ముందు అనవసర ప్రయోగాలతో సమయం వృథా చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అత్యుత్తమ తుదిజట్టు కూర్పు.. ముఖ్యంగా టాపార్డర్ విషయంలో తడబాటుకు లోనుకావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు. పిచ్చి ప్రయోగాలతో భారీ మూల్యం కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో మరో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, విండీస్‌లో పిచ్చి ప్రయోగాలకు పోయి టీమిండియా భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే. తొలి వన్డే లోస్కోరింగ్ మ్యాచ్‌లో ఎలాగోలా గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి.. వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించని విండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆగష్టు 1 నాటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గనుక తేడా జరిగితే.. ఘోర పరాభవం తప్పదు. టీ20 వరల్డ్‌కప్ మాదిరే జరగదు కదా! ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్-2022లో భారత జట్టు కుప్పకూలిన విధానం గుర్తుకువస్తోంది. మళ్లీ అదే పునరావృతం కాబోతోందా అన్న సందేహం నన్ను ఆందోళనకు గురి చేస్తోంది’’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో సెమీస్‌లోనే రోహిత్ సేన ఇంటిబాట పట్టిన తీరును ప్రస్తావించాడు. రోహిత్‌ను డ్రాప్ చేస్తే.. మరి కోహ్లి? ఇక.. బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు సరికావన్న ఆకాశ్ చోప్రా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదిరే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యకర విషయం మరొకటి ఉండదు. కిషన్- శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేస్తే రోహిత్‌ను మిడిలార్డర్‌కు డ్రాప్ చేస్తారా? ఇలాంటి నిర్ణయాలతో నేనైతే అస్సలు ఏకీభవించను. అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ ఇదే జరిగితే.. విరాట్ కోహ్లిని నంబర్ 3 నుంచి తప్పించి తనను కూడా మిడిలార్డర్‌కు పంపించాల్సి వసుంది. ఇది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు’’ అని ఆకాశ్ చోప్రా.. మేనేజ్మెంట్ తీరును ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్- కిషాన్లతో లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇషాన్‌ను నాలుగో స్థానంలో ఆడించాలనుకున్నా.. అతడి నంబర్ 4 గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్నాయంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం -
ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరన్, డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, టైమల్ మిల్స్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్‌తో అలరించిన రిషి సునాక్ ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో సామ్ కరన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఇక టి20 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ తమ దేశం పొట్టి క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. -
కోహ్లితో నాడు వాగ్వాదం.. పాక్ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు! కొడుకా అంటూ..
Virat Kohli: వన్డే వరల్డ్‌కప్ 2015.. ఫిబ్రవరి 15.. అడిలైడ్ ఓవల్ మైదానంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎప్పటిలాగే టీమిండియాదే పైచేయి.. ఈ విజయంలో ముఖ్యపాత్ర వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిది! రన్‌మెషీన్ కోహ్లి దెబ్బకు.. దాయాది శిబిరంలో పేసర్ సొహైల్ ఖాన్ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోని, అజింక్య రహానే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కోహ్లి అద్భుత సెంచరీకి తోడు, రైనా 74 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు స్కోరు చేసింది టీమిండియా. భారత బౌలర్ల విజృంభణతో చతికిలపడ్డ పాకిస్తాన్ 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో చిత్తైంది. కోహ్లి- సొహైల్ వాగ్వాదం అయితే, నాటి భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- సొహైల్ ఖాన్ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్న సొహైల్ ఖాన్.. కోహ్లితో గొడవ సందర్భంగా అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. బిడ్డా నువ్వు అండర్ 19లో ఆడుతున్నపుడే నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సొహైల్.. ‘‘నేను బ్యాటింగ్‌కి వెళ్లినపుడు.. విరాట్ కోహ్లి నా దగ్గరకొచ్చి.. కొత్తగా వచ్చావు.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు నేను.. ‘‘కొడుకా(బిడ్డా).. నువ్వు అండర్ 19 క్రికెట్ ఆడుతున్నపుడు.. మీ బాపు (తనను తాను ఉద్దేశించి) టెస్టు క్రికెటర్ అని చెప్పాను’’ అన్నాడు. ఇక 2006 నుంచి తాను పాకిస్తాన్‌కు ఆడుతున్నానన్న సొహైల్.. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన విషయాన్ని చెప్పానన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సొహైల్‌కు అనూహ్యంగా నాటి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అంత గొప్పగా ఏం లేదు ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లోనూ కోహ్లి ఒంటిచేత్తో పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే, సొహైల్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిందేమీ మరీ అంత చెప్పుకోదగ్గ షాట్ కాదు. తనకు బౌలర్ ఇచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకున్నాడు అంతే’’ అని పేర్కొన్నాడు. కింగ్ ఫ్యాన్స్ ఫైర్ కాగా సొహైల్ ఖాన్ 2008 జనవరిలో జింబాబ్వేతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో టెస్టుల్లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక కోహ్లి శ్రీలకంతో వన్డేలో 2008 ఆగష్టులో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాడు. 2011లో భారత్ తరఫున వెస్టిండీస్‌తో సిరీస్‌లో మొదటి టెస్టు ఆడాడు. ఇక సొహైల్ తాజా ఇంటర్వ్యూ నేపథ్యంలో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ఎప్పుడొచ్చామని కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం. వయసు రాగానే సరిపోదు.. అందుకు తగ్గట్లు సంస్కారంగా ఉండటం నేర్చుకోవాలి. అవేవో గొప్ప మాటలు అయినట్లు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నావా’’అని 38 ఏళ్ల సొహైల్‌కు చురకలు అంటిస్తున్నారు. కోహ్లి ముందు నువ్వు ఏమాత్రం పనికిరావంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! WC 2023: ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్‌ల ఫలితాలు తేలితేనే -
టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్! సారథిగా రోహిత్ చివరి టీ20 అక్కడే!?
Hardik Pandya- Rohit Sharma- India ODI, T20I captain: టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో మార్పు చోటు చేసుకోనుందా? పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథిగా రోహిత్ శర్మకు ఉద్వాసన పలికేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందా? త్వరలోనే అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కావడం లాంఛనమే! అంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. 35 ఏళ్ల రోహిత్ శర్మ తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. టెస్టు కెప్టెన్‌గా తొలి టూర్లో భాగంగా సౌతాఫ్రికాతో సిరీస్‌కు గాయం వల్ల రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల వివిధ సిరీస్‌లలోనూ విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉన్నాడు. కీలక సమయాల్లో వైఫల్యం ఇదిలా ఉంటే.. టీ20 కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైనా.. కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల్లో మాత్రం తేలిపోయాడు ‘హిట్‌మ్యాన్’. బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక బంగ్లాదేశ్‌తో టూర్లో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ రోహిత్.. ఇంకా కోలుకోలేదు. దీంతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అందుకేనా?! ఇక.. ఈ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడాల్సి ఉంది. రోహిత్ ఇలాగే ఫిట్నెస్ సమస్యలతో సతమతమైతే గతంలో మాదిరే తరచూ కెప్టెన్లను మార్చాల్సిన దుస్థితి వస్తుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇప్పటికే పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఈవెంట్లో వైఫల్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్ గైర్హాజరీలో ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్‌కు సమాచారం ఈ విషయం గురించి ఇప్పటికే హార్దిక్‌కు సమాచారం కూడా అందినట్లు కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఆలోచనపై స్పందించిన హార్దిక్.. తనకు కొంత సమయం కావాల్సిందిగా కోరినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏమో చూడాలి అయితే, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కెప్టెన్సీ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదని, సెలక్షన్ కమిటీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. మరోవైపు... గాయం నుంచి రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు మాత్రమే హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ఇన్సైడ్ స్పోర్ట్ కథనం పేర్కొంది. అక్కడే రోహిత్‌కు ‘వీడ్కోలు’! కానీ, బీసీసీఐ మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో తొలి మ్యాచ్. ఇది రోహిత్ హోం గ్రౌండ్. ఒకవేళ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే సెలక్టర్లు, జై షా కలిసి అతడికి అక్కడే.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఘనమైన వీడ్కోలు ఇవ్వొచ్చు కదా!’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. 10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్‌తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్‌తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్‌తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్‌తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్‌తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్‌తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్‌తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్‌తో 6 పరుగులు చేశాడు. - హాంగ్‌కాంగ్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్‌తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్‌తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్‌తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్‌లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్‌తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) ఎవరంటే..?
Jos Buttler: నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్.. అత్యధిక శాతం ఓటింగ్‌తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్‌ను జగజ్జేతగా నిలిపిన బట్లర్.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్‌ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిమేల్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. అమీన్.. నవంబర్‌లో ఐర్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్‌లో పాక్ మహిళా క్రికెటర్ నిదా దార్ ఈ అవార్డును దక్కించుకుంది. -
BCCI: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఆల్‌రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది. నేనసలు అప్లై చేయలేదు ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు. కాగా తమిళనాడు ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ 🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf — Hemang Badani (@hemangkbadani) November 30, 2022 -
పాకిస్తానీల మనసులు దోచుకున్న బెన్ స్టోక్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) ఆడుతుంది. ఇంగ్లండ్-పాక్‌ల మధ్య మరో రెండు రోజుల్లో తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం క్రికెట్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇటీవల పాకిస్తాన్లో వరదలు ఊహించని భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి సృష్టించిన ఈ మహా విళయంతో పాక్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌లో వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుకు వచ్చాడు. I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG — Ben Stokes (@benstokes38) November 28, 2022 తనవంతు సాయంగా పాక్‌తో ఆడే టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, అందులో కొంత కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, నేను చేస్తున్న ఈ చిన్న సాయం వరద బాధితులకు ఏదో ఓ రకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అంటూ ఓ నోట్లో రాసుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ చూపిన ఔదార్యం గురించి తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పాకిస్తానీలయితే స్టోక్స్‌ను ఆకాశానికెత్తుతున్నారు. రాజువయ్యా, మహరాజువయ్యా అంటూ కొనియాడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో అద్భుతంగా ఆడి టైటిల్ తమకు దక్కకుండా చేసినా స్టోక్స్‌ను శభాష్ అంటున్నారు. నీ దయా గుణానికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. -
‘పాపం పంత్’.. తప్పంతా వాళ్లదే! కొన్నాళ్లు అతడికి బ్రేక్ ఇస్తేనే వరల్డ్‌కప్‌లో
India tour of New Zealand, 2022- ‘‘ముందు అతడికి బ్రేక్ ఇవ్వండి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి రావొచ్చని చెప్పండి. నిజానికి మేనేజ్మెంట్ తన విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది’’ అని టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ పంత్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస వైఫల్యాలు.. అయినా అవకాశాలు అయినప్పటికీ, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్ కీపర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మెగా ఈవెంట్ అనంతరం కివీస్‌లో పర్యటనలో భాగంగా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా చేసిన స్కోర్లు.. వరుసగా 6, 11. ఇక ఆరంభ వన్డేలో నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతడికి రెండో వన్డలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పంత్‌పై విమర్శల వర్షం కురిపిస్తూ.. సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఫ్యాన్స్ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పు పంత్‌ది కాదు! ఎన్నడరా ఇది.. ‘‘రిషభ్ పంత్ విషయంలో మేనేజ్మెంట్ సరిగా లేదు. అతడిని సరిగ్గా హాండిల్ చేయలేకపోతున్నారు. తనకు కొంతకాలం బ్రేక్ ఇవ్వొచ్చు కదా! ఇంకో రెండు మూడు మ్యాచ్‌లలోనూ ఇలాగే వైఫల్యం చెందితే.. ఆ తర్వాత విశ్రాంతినివ్వడం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం చేస్తారా? నిజానికి రిషభ్ పంత్‌కు యాజమాన్యం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. అతడి ఆట తీరు నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. ఎన్నడ పంతూ ఇది’’ అని చిక్కా.. పంత్ పట్ల మేనేజ్మెంట్ వైఖరిని విమర్శించాడు. లోపాల్ని సరిదిద్దుకుంటేనే.. ‘‘నీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే ఎంతో బాగుండేది. ఒకవేళ ఈ మ్యాచ్‌లలో నువ్వు మెరుగ్గా స్కోరు చేసి ఉంటే.. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ వస్తుంది. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ టోర్నీ ఉంది కదా! ఇప్పటికే చాలా మంది.. ‘‘పంత్ అస్సలు సరిగ్గా ఆడటం లేదు.. అతడికి జట్టులో చోటు అవసరమా?’’ అంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సమయంలో నీపై ఒత్తిడి పెరగడం సహజం. కాబట్టి లోపం ఎక్కడ ఉందో నీకు నీవుగా తెలుసుకో! ప్రతిసారి ఎందుకు అంత తొందరగా వికెట్ పారేసుకోవాల్సి వస్తుందో ఆలోచించుకో’’ అని మాజీ ఓపెనర్ శ్రీకాంత్ యూట్యూబ్ వేదికగా పంత్‌కు సలహాలిచ్చాడు. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్ -
ఉమ్రాన్ ప్రపంచకప్‌లో ఆడకపోవడం మంచిదైంది.. మాలిక్ తండ్రి ఆసక్తికర వాఖ్యలు
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి వన్డే మ్యాచ్‌లోనే పేస్ బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. అఖరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఓవరాల్‌గా భారత్ మూడు వికెట్లు సాధిస్తే.. వాటిలో రెండు ఉమ్రాన్‌వే కావడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఐపీఎల్ అదరగొట్టిన ఉమ్రాన్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్ అద్భుతంగా రాణించాడు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సెలక్టర్లు మాలిక్‌ను పక్కన పెట్టారు. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభావం తర్వాత భారత జట్టులో ఉమ్రాన్ వంటి పేస్ బౌలర్లు ఉంటే బాగుండేది అని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డాడు. సెమీఫైన్లలో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేదు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ను ఎంపికచేయకపోవడంపై అతడి తండ్రి అబ్దుల్ రషీద్ తాజాగా స్పందించాడు. ఉమ్రాన్ అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం గురించి న్యూస్ 18తో రషీద్ మాట్లాడుతూ.. "ఉమ్రాన్ టీ20 ప్రపంచకప్‌లో ఆడి ఉంటే బాగుండేది అందరూ అభిప్రాయపడుతున్నారు. మేము అయితే అతడు వరల్డ్‌కప్‌లో ఆడకపోవడం మంచిదైంది భావించాము. ఎందకుంటే ఏది ఎప్పడు జరగాలో అప్పుడే జరుగుతోంది. మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా. మనం దేని వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. మాలిక్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అనుభవజ్ఞులైన వారితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకుంటున్నాడు. అతడు తన సీనియర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్ త్వరలోనే కీలక బౌలర్‌గా మారుతాడు. అందుకు మనం తొందరపడనవసరం లేదు. ఇప్పటికే జట్టులో చాలా మంది సీనియర్ బౌలర్లు ఉన్నారు. వారి తర్వాత ఉమ్రాన్‌కు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్నప్పుడు కేన్ విలియమ్సన్కు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా నా భార్యకు చెప్పాడు. ఇది గురువు- శిష్యుడి మధ్య పోటీలా అనిపించింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: మరోసారి విలన్‌గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు -
‘టీమిండియాను ఓడించిన పాక్ లేకుండా.. అసలు ఆ టోర్నీ ఎవరు చూస్తారు?’ అంటూ..
ODI World Cup 2023- India Vs Pakistan- Ramiz Raja: ‘‘ఒకవేళ వాళ్లు ఇక్కడికి వస్తేనే మేము వరల్డ్‌కప్ టోర్నీ ఆడటానికి అక్కడికి వెళ్తాం. భారత జట్టు ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ లేకుండానే మెగా టోర్నీ ఆడుకోమనండి. భారత్‌లో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పాల్గొనపోతే.. ఆ ఈవెంట్‌లోని మ్యాచ్‌లను అసలు ఎవరు చూస్తారు?’’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ప్రగల్భాలు పలికాడు. తమ జట్టు దూకుడైన ఆట తీరుకు మారుపేరుగా మారిందని.. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టును కూడా మట్టికరిపించిందంటూ గొప్పలకు పోయాడు. కాగా ఆసియా కప్-2023 టోర్నీ పాకిస్తాన్ వేదికగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. అక్కడ ఆసియా కప్.. ఇక్కడ వరల్డ్‌కప్ అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత జట్టు పాక్‌కు వెళ్లే ప్రసక్తి లేదని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ తమతో చర్చించకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ.. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నారు. వాళ్లను ఓడించాం కదా ఈ విషయం గురించి తాజాగా ఉర్దూ న్యూస్‌తో మాట్లాడిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. తమ విషయంలో బీసీసీఐ ప్రవర్తించే తీరుపైనే వరల్డ్‌కప్ ఆడాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌కు చెందిన జట్టును మేము ఓడించాం. మా ఆట తీరు మెరుగుపరుచుకుని.. అత్యుత్తమంగా ఆడుతుంటేనే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని నేను నమ్ముతాను. అందుకు తగ్గట్లుగానే టీ20 ప్రపంచకప్-2021లో మేము రాణించాం. టీమిండియాను ఓడించాం. తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ వాళ్లని మట్టికరిపించాం.బిలియన్ డాలర్ ఎకానమీ ఉన్న బోర్డుకు చెందిన జట్టును మేము రెండుసార్లు ఓడించాం. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్‌కు కూడా చేరుకున్నాం. రమీజ్ రాజా వాళ్లు ఇక్కడికి రాలేమని చెబితే.. మేమూ అక్కడికి వెళ్లం. పాక్లేని వరల్డ్‌కప్ టోర్నీని ఎవరు చూస్తారు?’’ అంటూ తమ జట్టును ప్రశంసిస్తూ.. టీమిండియాను తక్కువ చేసే విధంగా మాట్లాడాడు రమీజ్ రాజా. అతడి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. తాజా వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసం మంచిదేనని.. అయితే అతి విశ్వాసం ప్రదర్శిస్తే బొక్కబోర్లా పడకతప్పదంటూ రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. భారత జట్టును ఓడిస్తేనే మీది గొప్ప జట్టుగా మారిందన్న నీ వ్యాఖ్యలు మాత్రం నిజమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఆడకపోతే పాకిస్తాన్‌కు నష్టమని చురకలు అంటిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్-2022 టోర్నీలో పాక్ భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చదవండి: Umran Malik: ఉమ్రాన్ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.... ఇక వన్డేల్లోనే! అర్ష్‌దీప్ భేష్.. Ravindra Jadeja: వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం; కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో -
టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పాటు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు బుమ్రా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది అతడు త్వరంలోనే మైదానంలోనే అడుగుపెట్టనున్నాడు. బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన వర్కౌట్లకు సంబంధిచిన వీడియోను బుమ్రా ట్విటర్లో షేర్ చేశాడు. "అంత సులభమేం కాదు.. కానీ ఎల్లప్పుడూ విలువైనది" అంటూ క్యాప్షన్ పెట్టాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా బుమ్రా లేని లోటు టీ20 ప్రపంచకప్‌లో సృష్టంగా కన్పించింది. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. Never easy, but always worth it 💪 pic.twitter.com/aJhz7jCsxQ — Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2022 చదవండి: IPL 2023 Mini Auction: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! కేరళ ఆటగాడిపై రాజస్తాన్ కన్ను! -
‘వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే
ద్వైపాక్షిక సిరీస్‌లలో తిరుగులేని జట్టుగా అవతరించిన భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం బోల్తా పడుతోంది. ఐసీసీ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుని దాదాపు పదేళ్లు కావస్తోంది. చివరిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీ భారత జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఎన్నో అంచనాలతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోకి బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్లోనే తమ ప్రయాణాన్ని ముగించింది. మరోసారి ఐసీసీ టోర్నీల్లో నిరాశపరిచిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురిసింది. భారత ఆటగాళ్లు తమ జట్టు కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఆటగాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ చేరాడు. జట్టులో స్ధిరత్వం లేకపోవడమే టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ ఇంటిముఖం పట్టింది అని ఆయన అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ కీడాతో లాడ్ మాట్లాడుతూ.. గత ఏడు- ఎనిమిది నెలల్లో భారత జట్టులో స్ధిరత్వం లేదు. ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీకి సిద్ధమైనప్పడు.. అందుకు తగ్గట్టు జట్టును తయారు చేసుకోవాలి. గత ఏడు నెలలో భారత ఇన్నింగ్స్‌ను ఒక్కోసారి ఒక్కొక్కరు ప్రారంభించారు. బౌలింగ్ విభాగంలో కూడా ప్రతీ సిరీస్‌కు బౌలర్లు మారుతునే ఉన్నారు. పనిభారం పేరుతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు. ప్రపంచ క్రికెట్లో మిగితా ఆటగాళ్లకు లేని వర్క్‌లోడ్ కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే ఉందా? ఒక వేళ పనిభారం ఎక్కవైతే ఐపీఎల్లో ఎందుకు ఆడుతున్నారు? మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఐపీఎల్ ఆడకండి. వాళ్లు ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలి అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు -
ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? జట్టుకు భారం.. అతడిని తీసుకుంటే: మాజీ క్రికెటర్
New Zealand vs India- Sanju Samson: ‘‘అతడు టీమిండియాకు భారంగా మారుతున్నాడు. వైఫల్యం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోవడం ఎందుకు? అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురండి. ఒక ఆటగాడు తరచుగా విఫలమవుతున్నా.. అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారీ మూల్యం చెల్లించకతప్పదు. కాబట్టి కొత్తవాళ్లకు కూడా ఛాన్స్‌లు ఇవ్వాలి’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ రితీందర్ సోధి అన్నాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారని.. అయినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కారణంగా పంత్ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే, కీలక మ్యాచ్‌లలో ఛాన్స్ ఇచ్చినా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఐసీసీ టోర్నీలో జింబాబ్వేతో మ్యాచ్‌లో 3, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. రిషభ్ పంత్ ఇక ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ పంత్ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి 6 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మాత్రం జట్టులో అవకాశాలు కరువయ్యాయి. సంజూకు అన్యాయం! తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పంత్ స్థానంలో సంజూకు అవకాశం ఇవ్వాలంటూ.. ఈ కేరళ బ్యాటర్ పట్ల వివక్ష తగదని నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంజూ పేరును ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. పక్కన పెట్టేయండి! ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభం నేపథ్యంలో పంత్‌ను విమర్శిస్తూ.. సంజూకు అవకాశం ఇవ్వాలంటూ రితీందర్ సోధి అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘పంత్‌కు ఇంకెన్ని అవకాశాలు వస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. సమయం మించిపోకముందే అతడు కళ్లు తెరవాలి. అయినా ప్రతిదానికి ఓ హద్దంటూ ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఒకే ఆటగాడిపై ఆధారపడటం ఎంత వరకు సమంజసం. ఒకవేళ అతడు సరిగ్గా ఆడకపోతే.. నిర్మొహమాటంగా అతడిని పక్కనపెట్టాలి’’ అని సోధి.. సెలక్టర్లకు సూచించాడు. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇకనైనా అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా తరఫున 25 పంత్ ఇప్పటి వరకు 27 వన్డేలు, 66 టీ20లు ఆడగా.. 28 ఏళ్ల సంజూ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటి వరకు కేవలం 26 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కాగా శుక్రవారం టీమిండియా కివీస్‌తో మొదటి వన్డేలో తలపడనుంది. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ FIFA WC: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు -
దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్
Dinesh Karthik Shares Emotional Video: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్ కృతజ్ఞతలు తెలపడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. డీకే భావోద్వేగం ఇన్స్టాగ్రామ్ వేదికగా కార్తీక్ భావోద్వేగ వీడియో ఇందుకు కారణమైంది. "టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కార్తీక్ వీడియోపై స్పందించిన అభిమానులు.. ‘‘ప్లీజ్ డీకే.. వద్దు.. ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు.. మేము దానికి ఇంకా సిద్ధంగా లేము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో అదరగొట్టి.. రీ ఎంట్రీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్.. ఫినిషర్‌గా భారత జట్టులో పునరాగమనం చేశాడు. అయితే ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని డికేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కార్తీక్ కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Shikhar Dhawan: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం! అంత మాత్రానికి.. View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
స్టార్ ఆల్‌రౌండర్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్లను కరుణరత్నే ఉల్లంఘించాడు. దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల( భారత కరన్సీ ప్రకారం రూ. 4లక్షలు) జరిమానా కూడా విధించింది. "టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా కరుణరత్నే బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడు. అతడి చేసిన తప్పిదాలపై ముగ్గురు సభ్యలతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇటువంటి తప్పిదాలకు మరోసారి పాల్పడకుండా గట్టిగా హెచ్చరించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీంతో అతడిపై ఏడాది పాటు అన్ని రకాల క్రికెట్ ఆడకుండా కమిటీ నిషేదం విధించింది. అదే విధంగా 5000 వేల డాలర్ల ఫైన్ కూడా ఫైన్ కూడా చెల్లించాలంటూ అంటూ" శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియాకప్-2022ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు లంక క్రికెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా -
Team India: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్‌లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్‌లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్‌లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్‌కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్ కెప్టెన్సీకి గుడ్‌బై
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా ఎంపికైన పూరన్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్‌లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్‌గా పూరన్ విజయవంతమయ్యాడు. కాగా విండీస్ వైస్ కెప్టెన్‌గా ఉన్న పావెల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. "I remain fully committed to West Indies cricket." - @nicholas_47 pic.twitter.com/n0OvM1v7yw — Windies Cricket (@windiescricket) November 21, 2022 చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్‌కు అవకాశం? -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్‌పై వేటు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్‌కప్‌లోనే కాక కెప్టెన్‌గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్‌పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్‌పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్‌మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్‌కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలో షాహీన్ ఆఫ్రిది.. ఫోటో షేర్ చేసిన స్పీడ్ స్టర్!
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ షాహీన్ షా అఫ్రిది మెకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను వీడిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం మెకాలి గాయంతోనే కాకుండా అపెండిక్స్తో కూడా బాధపడుతున్నాడు. తాజాగా అఫ్రిది తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. అపెండెక్టమీ సర్జరీ చేయించుకున్నట్లు ట్విటర్ వేదికగా షాహీన్ వెల్లడించాడు. "ఈరోజు అపెండెక్టమీ చేయించుకున్నాను. అల్లా దయవల్ల బాగానే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు దన్యవాదాలు" అంటూ షాహీన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కాగా గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది. Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn — Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022 చదవండి: IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
ఓపెనర్‌గా పంత్ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు
టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్సీ, ఓపెనింగ్ స్థానాల పైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. భారత టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీ20ల్లో భారత ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ను పంపాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా పంత్‌ను టీ20ల్లో ఓపెనింగ్ పంపాలని సూచించాడు. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఒక వేళ రోహిత్ జట్టుకు దూరమైతే భారత ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ను ఫస్ట్ చాయిస్‌గా భావించకూడదని ఆకాష్ చోప్రా అన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత జట్టుకు ఒక విధ్వంసకర ఓపెనర్ అవసరం. పృథ్వీ షా రూపంలో టీమిండియాకు అద్భుతమైన అవకాశం ఉంది. అతడు విధ్వంసకర ఆటగాడు. పవర్ ప్లే జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కానీ అతడు ఫిట్‌గా లేడు, ఓపెనర్‌గా పనికిరాడని కొంతమంది భావిస్తున్నారు. దేశీవాళీ క్రికెట్లో ఓపెనర్‌గా అతడి రికార్డులు చూసి మాట్లాడాలి. అయితే ప్రతీ మ్యాచ్‌లోనూ చేలరేగుతాడని నేను చెప్పడం లేదు. బట్లర్, హేల్స్ వంటి వారు కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడలేరు కదా. పృథ్వీ మీ దృష్టిలో లేకపోతే, ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వండి. అతడు కూడా విధ్వంసక బ్యాటర్. ఒక్క సారి క్రీజులో నిలదొక్కకుంటే చెలరేగి ఆడుతాడు. అంతే తప్ప పంత్‌ను మాత్రం ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా భావించకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్‌దే హవా.. జట్టులో కీలక ప్లేయర్‌గా..