అర్ష్‌దీప్ సింగ్
T20 World Cup 2022- Arshdeep Singh: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ ప్రభావం చూపగలిగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 23 ఏళ్ల అర్ష్ వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మొత్తంగా 10 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.
కొత్త స్వింగ్ సుల్తాన్
ముఖ్యంగా బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించి తనదైన ముద్ర వేయగలిగాడు ఈ లెఫ్టార్మ్ సీమర్. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడంతో వచ్చిన వరుస అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా.. కొత్త స్వింగ్ సుల్తాన్ వచ్చేశాడు అంటూ అర్ష్‌దీప్‌ను ఆకాశానికెత్తాడు.
మరికొందరేమో.. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్, మాజీ పేసర్ వసీం అక్రమ్‌తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ది గ్రేట్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్‌తో అర్ష్‌దీప్‌ను పోల్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు.
వసీం అక్రమ్- జాంటీ రోడ్స్(PC: PTI)
పోలిక వద్దు.. ఇలా మాట్లాడితే
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ బౌలర్‌పై ఇలాంటి పోలికలు ఒత్తిడిని పెంచుతాయని.. అతడి ఆటపై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. ‘‘జస్‌ప్రీత్ బుమ్రా లాగే అర్ష్‌దీప్ సింగ్ కూడా కెరీర్ ఆరంభంలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అతడిలో మెండుగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలుగుతున్నాడు. పవర్ ప్లేలోనూ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు.
వసీం అక్రమ్ మాదిరి బౌలింగ్ చేయగలుగుతున్నాడు. కానీ ఇప్పుడే దిగ్గజాలతో పోలిస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది’’ 53 ఏళ్ల జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. అర్ష్‌దీప్‌నకు మేటి బౌలర్‌గా ఎదగగల సత్తా ఉందని.. అతడి భవిష్యత్తు బాగుంటుందంటూ జోస్యం చెప్పాడు.
చదవండి: Aus Vs Eng 1st ODI: స్టార్క్ అద్బుత ఇన్‌స్వింగర్.. షాట్ ఎలా ఆడాలిరా బాబూ! బిక్క ముఖం వేసిన రాయ్
FIFA World Cup Trophy History: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?
కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment