Arshdeep Singh
-
అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.బుమ్రా గాయంపై రాని స్పష్టతఅంతేకాదు.. ఈ ఓపెనింగ్ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే, చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.వన్డే వరల్డ్‌కప్-2023లో లీడింగ్ వికెట్(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సిరాజ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్ లేకపోతే సిరాజ్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.సీమ్ ఆల్‌రౌండర్లు లేరుఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.కాగా స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటిచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్-2024కు సంబంధించిన నామినీస్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం(డిసెంబర్ 29) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం మొత్తం నలుగురు ఆటగాళ్లను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ జాబితాలో భారత్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది కేవలం 18 టీ20లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్ 7.49 ఏకనామీతో 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఈ అవార్డు కోసం అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ పోటీ పడుతున్నారు.ఈ ఏడాది టీ20ల్లో బాబర్ పర్వాలేదన్పించాడు. 23 ఇన్నింగ్స్‌లో 738 పరుగులతో పాక్ తరపున లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా సికిందర్ రజా ఈ ఏడాది టీ20 క్రికెట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగట్టాడు. మొత్తం 23 ఇన్నింగ్స్‌లలో 573 పరుగులతో పాటు 24 కూడా వికెట్లు పడగొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేశాడు.బుమ్రాకు నో ఛాన్స్.. కాగా ఈ నామినీస్ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ఎనిమిది మ్యాచ్‌లలో 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా బుమ్రా నిలిచాడు. అయినప్పటికి బుమ్రాను టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయకపోవడం గమనార్హం. -
నిప్పులు చెరిగిన అర్షదీప్.. బెంబేలెత్తిపోయిన శ్రేయస్, సూర్యకుమార్, దూబే
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టీమిండియా టీ20 స్పెషలిస్ట్, పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ రెచ్చిపోయాడు. ముంబైతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ నిప్పులు చెరిగాడు. ఫలితంగా ముంబై టాపార్డర్ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్ ధాటికి ముంబై 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అర్షదీప్ ముంబై టాపార్డర్ మొత్తాన్ని నేలకూల్చాడు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే సహా దేశవాలీ సంచలనాలు రఘువంశీ, ఆయుశ్ మాత్రే వికెట్లు పడగొట్టాడు. 23.5 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 119/7గా ఉంది. అథర్వ అంకోలేకర్ (17), శార్దూల్ ఠాకూర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 5, సన్వీర్ సింగ్, రఘు శర్మ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో రఘువంశీ 1, ఆయుశ్ మాత్రే 7, హార్దిక్ తామోర్ 0, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17, సూర్యకుమార్ యాదవ్ 0, శివమ్ దూబే 17, సూర్యాంశ్ షేడ్గే 44 పరుగులు చేసి ఔటయ్యారు. -
తగ్గేదేలే!.. అతడి కోసం.. పోటీ పడ్డ కావ్యా- ప్రీతి.. ట్విస్ట్ అదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 తొలిరోజు మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం నాటి వేలంపాటను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక మొదటి రోజు ఫ్రాంఛైజీలు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరికోసం తమ పర్సుల నుంచి ఓవరాల్‌గా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.ప్రత్యేక ఆకర్షణగా ఆ ముగ్గురుఇదిలా ఉంటే.. ఎప్పటిలాగానే ఈసారీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో తమ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టిపోటీనిచ్చారు.అందుకు కారణం మాత్రం కావ్యానే!ఈ నేపథ్యంలో కావ్యా మారన్- ప్రీతి జింటా ఓ ఆటగాడి కోసం తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా ధర పెంచుతూ పోవడం హైలైట్‌గా నిలిచింది. అయితే, ఆఖరికి కావ్యా తప్పుకోగా.. సదరు ప్లేయర్ ప్రీతి జట్టు పంజాబ్‌కు సొంతమయ్యాడు. కానీ.. పంజాబ్ ఇందుకోసం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. అందుకు కారణం మాత్రం కావ్యానే!ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరా అంటారా?.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్. నిజానికి ఈ పేస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సైతం రంగంలోకి దిగాయి.రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారాఅయితే, ఊహించని రీతిలో రేసులోకి ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ అర్ష్‌దీప్ ధరను ఏకంగా రూ. 15.75 కోట్లకు పెంచింది. దీంతో మిగతా ఫ్రాంఛైజీలు పోటీ నుంచి తప్పుకోగా.. ఆక్షనీర్ మల్లికా సాగర్.. పంజాబ్ తమ పాత ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంటుందేమో అడిగారు.ఇందుకు సమ్మతించిన పంజాబ్ అర్ష్‌దీప్‌నకు అంతే మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అయినా కావ్యా మారన్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా రెండున్నర కోట్ల మేర పెంచింది. అయితే, పంజాబ్ మాత్రం అర్ష్‌దీప్‌ను వదులుకోలేకపోయింది. ఫలితంగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ వేసిన బిడ్‌కు సమానంగా రూ. 18 కోట్లు చెల్లించి అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది.క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరఫలితంగా అర్ష్‌దీప్‌నకు వేలంలో సరైన విలువ, తగిన జట్టు లభించాయి. వరుసగా ఆరు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కే అతడు వచ్చే సీజన్లో ఆడనున్నాడు. అంతేకాదు.. క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత తొలి ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. ఏదేమైనా కావ్యా.. ప్రీతితో పోటీపడటం వల్ల అర్ష్‌దీప్‌పై కోట్ల వర్షం కురిసిన మాట వాస్తవం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..! -
అర్ష్‌దీప్ సింగ్ ను రూ.18 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
-
IPL 2025: భారీ ధరకు అమ్ముడుపోయిన అర్ష్‌దీప్.. మళ్లీ ఆ జట్టుకే
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు అర్ష్‌దీప్‌ను వదిలేసిన పంజాబ్ కింగ్స్ రైజర్స్‌తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది.అయినప్పటికీ సన్‌రైజర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్ష్‌దీప్ కోసం రూ. 18 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే, పంజాబ్ మాత్రం ఈ టీమిండియా స్టార్‌ను వదులుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో ఫైనల్ బిడ్‌గా రూ. 18 కోట్లకు అర్ష్‌దీప్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 65 మ్యాచ్‌లలో కలిపి 76 వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా తరఫున మాత్రం అతడికి టీ20లలో మాత్రం గొప్ప రికార్డు ఉంది. ఇప్పటికి ఆడిన 60 మ్యాచ్‌లలోనే అతడు 95 వికెట్లు పడగొట్టడం విశేషం. చదవండి: RTM కార్డు విషయంలో ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఈ వేలం మునుపటిలా ఉండదు! -
Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్‌కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్‌హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది. వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్‌లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్‌పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లపై రూ. కోట్లు కురవనున్నాయి.విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. 116 మందిపైనే వేలం వెర్రి వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం. ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్‌ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్‌రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.అర్ష్‌దీప్ అ‘ధర’హో ఖాయం అంతర్జాతీయ క్రికెట్లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్‌దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్‌దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చేందుకు పంత్‌ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్‌కే ఉన్నాయి.బట్లర్ వైపు ఆర్సీబీ చూపు పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్‌జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్‌కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్‌దీప్‌కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!
భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 10) రెండో టీ20 జరుగనుంది. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!ఇవాళ జరుగనున్న రెండో టీ20లో అర్షదీప్ సింగ్ మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్షదీప్ సింగ్ బద్దలు కొడతాడు. భువీ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ కేవలం 57 మ్యాచ్‌ల్లోనే 88 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమిస్తాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజ్వేంద్ర చహల్‌కు దక్కుతుంది. చహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..చహల్- 96భువనేశ్వర్ కుమార్- 90జస్ప్రీత్ బుమ్రా- 89అర్షదీప్ సింగ్- 88హార్దిక్ పాండ్యా- 87కాగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ శతక్కొట్టడంతో (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాల్డ్ కొయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21), డేవిడ్ మిల్లర్ (18), ట్రిస్టన్ స్టబ్స్ (11), మార్కో జన్సెన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
టీమిండియా ప్రపంచ రికార్డు.. పాకిస్తాన్‌తో పాటు టాప్‌లో
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.127 పరుగులకు బంగ్లా ఆలౌట్తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడింది.టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమంఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు👉టీమిండియా- 42 సార్లు👉పాకిస్తాన్- 42 సార్లు👉న్యూజిలాండ్- 40 సార్లు👉ఉగాండా- 35 సార్లు👉వెస్టిండీస్- 32 సార్లుఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024 -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టి20లో భారత్ అలవోక విజయం
భారత యువ జట్టు సత్తా ముందు బంగ్లాదేశ్ తేలిపోయింది. ముందుగా అర్ష్ దీప్ పేస్‌ను, వరుణ్ స్పిన్‌ను ఎదుర్కోలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేయగా ... ఆపై స్వల్ప లక్ష్యాన్ని భారత బృందం సునాయాసంగా ఛేదించింది. పాండ్యా, సూర్య, సంజూ సామ్సన్ సులువుగా పరుగులు రాబట్టడంతో మరో 49 బంతులు మిగిలి ఉండగా ఘనవిజయం భారత్ సొంతమైంది. గ్వాలియర్: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన భారత్ అంతే జోరుగా టి20 సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది. టెస్టులతో పోలిస్తే టి20ల్లో టీమిండియా బృందం మొత్తం మారినా... ఫలితంలో మాత్రం తేడా రాలేదు. ఆదివారం జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. మిరాజ్ (32 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, నజు్మల్ హుస్సేన్ (25 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ , వరుణ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమిండియా లక్ష్య ఛేదనకు 71 బంతులే సరిపోయాయి. భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (19 బంతుల్లో 29; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. భారత్‌కు 1–0తో ఆధిక్యం లభించగా, రెండో మ్యాచ్ బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది. పేలవ బ్యాటింగ్... అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే లిటన్ దాస్ (4) వెనుదిరగ్గా, అతని తర్వాతి ఓవర్లో పర్వేజ్ (8) అవుటయ్యాడు. వరుణ్ తొలి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టిన బంగ్లా 5 ఓవర్లు ముగిసేసరికి 39 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో జట్టుకు ఒక్క పరుగూ రాలేదు. ఈ ఓవర్‌తో అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టిన మయాంక్ చక్కటి బంతులతో తౌహీద్ (12)ను కట్టడి చేసి తన మొదటి ఓవర్‌ను ‘మెయిడిన్’గా ముగించడం విశేషం. గతంలో అగార్కర్, అర్ష్ దీప్ మాత్రమే తమ అరంగేట్ర మ్యాచ్‌ను మెయిడిన్ ఓవర్‌తో మొదలు పెట్టారు. తర్వాతి ఓవర్లో తౌహీద్‌ను వరుణ్ అవుట్ చేయగా... మహ్ముదుల్లా (1)ను వెనక్కి పంపి మయాంక్ తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ నజ్ముల్ తడబడుతూనే ఆడగా... జాకీర్ (8) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 64/5 వద్ద నిలిచింది. తర్వాతి 59 బంతుల్లో జట్టు మరో 63 పరుగులు రాబట్టింది. ఇందులో మిరాజ్ ఒక్కడే 29 బంతులు ఆడి 29 పరుగులు సాధించగా... మిగిలిన వారు ప్రభావం చూపలేదు. ధనాధన్... షరీఫుల్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో సామ్సన్ ఛేదన మొదలు పెట్టగా... తస్కీన్ వేసిన తర్వాతి ఓవర్లో అభిõÙక్ శర్మ (16) ఒక సిక్స్, 2 ఫోర్లతో జోరు చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అభిõÙక్ రనౌటయ్యాడు. అనంతరం వచ్చీ రాగానే ధనాధన్ బ్యాటింగ్ చూపించిన సూర్య ఆరు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత ఇలాగే ధాటిగా ఆడబోయి సూర్య, సామ్సన్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే 73 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) అండగా నిలవగా... పాండ్యా ఒక్కడే 39 పరుగులు బాదడం విశేషం. తస్కీన్ వేసిన 12వ ఓవర్లో వరుసగా మూడు బంతులను 4, 4, 6గా మలచి పాండ్యా మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 8; లిటన్ దాస్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; నజు్మల్ (సి అండ్ బి) సుందర్ 27; తౌహీద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 12; మహ్ముదుల్లా (సి) సుందర్ (బి) మయాంక్ 1; జాకీర్ (బి) వరుణ్ 8; మిరాజ్ (నాటౌట్) 35; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 11; తస్కీన్ (రనౌట్) 12; షరీఫుల్ (బి) పాండ్యా 0; ముస్తఫిజుర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–40, 4–43, 5–57, 6–75, 7–93, 8–116, 9–117, 10–127. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 3.5–0–14–3, హార్దిక్ పాండ్యా 4–0–26–1, వరుణ్ చక్రవర్తి 4–0–31–3, మయాంక్ యాదవ్ 4–1–21–1, నితీశ్ రెడ్డి 2–0–17–0, వాషింగ్టన్ సుందర్ 2–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రిషాద్ (బి) మిరాజ్ 29; అభిõÙక్ శర్మ (రనౌట్) 16; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 29; నితీశ్ రెడ్డి (నాటౌట్) 16; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–25, 2–65, 3–80. బౌలింగ్: షరీఫుల్ 2–0–17–0, తస్కీన్ 2.5–0–44–0, ముస్తఫిజుర్ 3–0–36–1, రిషాద్ 3–0–26–0, మిరాజ్ 1–0–7–1. -
చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. -
Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం
దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఆరేసిన అర్షదీప్373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రికీ భుయ్ అజేయ శతకంరికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్‌దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలుతొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్‌కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్‌లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్‌లో భారీ స్లాగ్‌స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్‌దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్‌దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్‌కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
T20 World Cup 2024: "భల్లే భల్లే" డ్యాన్స్‌తో ఇరగదీసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ 2024 గెలుపును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన విరాట్.. వరల్డ్‌కప్ విజయానంతరం భల్లే.. భల్లే స్టెప్పులేసి ఇరగదీశాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందికి చెందిన పాపులర్ సాంగ్ "తునుక్ తనుక్"కు కోహ్లి.. సహచరుడు అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి చిందేశాడు. టీమిండియా సెలబ్రేషన్స్‌లో భాగంగా మైదానంలోని స్పీకర్స్‌లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా.. విరాట్, అర్ష్‌దీప్‌లతో సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా జత కలిశారు. వీరందరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024కాగా, ఫైనల్ మ్యాచ్ గెలిచాక కాసేపు భావోద్వేగాలకు లోనైన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని ఎంజాయ్మెంట్ మూడ్‌లోకి వచ్చారు. జట్టు సభ్యులంతా ఎవరి స్టయిల్లో వారు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆటగాళ్లంతా స్టేడియం మొత్తం కలియతిరిగి అభిమానులకు అభివాదం చేశారు. కొందరు ఫోన్లలో.. కొందరు నేరుగా తమ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. భారత ఆటగాళ్లందరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆనందబాష్పాలు కార్చడం ప్రతి భారతీయుడి మనస్సుని హత్తుకుంది. వీరితో పాటు కోచ్ ద్రవిడ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మొత్తంగా తొలుత భావోద్వేగాలు, ఆతర్వాత సంబురాలతో బార్బడోస్ మైదానం పులకించిపోయింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.అర్ష్‌దీప్ తన సెకెండ్ స్పెల్‌లో (16వ ఓవర్లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్‌ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్‌దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. -
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్ వాళ్లకే: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్‌దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్👉టాస్: ఇండియా బౌలింగ్👉యూఎస్ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఇండియా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc)