Ind vs SL 2nd T20: Wasim Jaffer Not Happy With Hardik's Captaincy - Sakshi
Sakshi News home page

Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు..

Published Sat, Jan 7 2023 2:02 PM | Last Updated on Sat, Jan 7 2023 3:42 PM

Ind Vs SL 2nd T20: Wasim Jaffer Not Happy With Hardik Captaincy - Sakshi

హార్దిక్‌ పాండ్యా- శివం మావి

India vs Sri Lanka, 2nd T20I: ‘‘డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడనుకున్నా. మావి స్థానంలో తనే వస్తాడనుకున్నా. కానీ అలా జరుగలేదు. నిజానికి మావికి డెత్‌ ఓవర్లలో మెరుగైన రికార్డు లేదు. హార్దిక్‌కు అనుభవజ్ఞుడు. ఏదేమైనా ఆఖరి ఓవర్లో హార్దిక్‌ బౌలింగ్‌ చేయాల్సింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు.

శ్రీలంకతో పుణెలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక లంక 6 వికెట్ల నష్టపోయి 206 పరుగులు స్కోరు చేసింది. భారత బౌలర్లు తేలిపోవడంతో ఈ మేరకు భారీ లక్ష్యం విధించింది.

అయితే, టార్గెట్‌ ఛేదించడంలో విఫలమైన హార్దిక్‌ సేన ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌.. భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో బౌలర్ల సేవలను వాడుకునే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు.

మావి స్థానంలో అతడే వస్తాడనుకున్నా!
ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో వసీం జాఫర్‌ మాట్లాడుతూ.. ‘‘ఆరో ఓవర్‌ తర్వాత తను బౌలింగ్‌ చేయడానికి రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేనైతే అతడు మొదటి రెండు ఓవర్లు లేదంటే మిడిల్‌లో రెండు ఓవర్లు వేయడంతో పాటు... డెత్‌ ఓవర్లలో వస్తాడనుకున్నా. 

కానీ అలా చేయలేదు. అర్ష్‌దీప్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నిజానికి శివం మావి మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్‌లో మొదట్లోనే అతడి చేతికి బంతిని ఇవ్వాల్సింది. 

అదే విధం‍గా బంతి కాస్త పాతబడిన తర్వాత అర్ష్‌దీప్‌తో మూడు లేదంటే నాలుగో ఓవర్‌ వేయించాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా లంకతో రెండో టీ20లో తమ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి, ఉమ్రాన్‌(3/48) ఇద్దరే 101 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

చెత్త రికార్డు
ఇక అర్ష్‌దీప్‌ కేవలం 2 ఓవర్ల స్పెల్‌ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు ఏకంగా 5 నోబాల్స్‌ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రెండే ఓవర్లు వేసిన పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 13 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్‌ తొలి ఓవర్‌, మూడో ఓవర్‌లో అతడు బౌల్‌ చేశాడు. ఇక గత మ్యాచ్‌లోనూ పాండ్యా ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్‌ చేతికి ఇచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్‌ జట్టులో వద్దు! ‘చీఫ్‌ సెలక్టర్‌’గా చెబుతున్నా.. పంత్‌ ఉంటే..
Sarfaraz Ahmed: నీ కెరీర్‌ ముగిసిపోయిందన్నాడు! రమీజ్‌ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement