Shivam Mavi
-
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
ఐపీఎల్ టోర్నీకి శివమ్ మావి దూరం
పక్కటెముకల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేస్ బౌలర్ శివమ్ మావి ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగాడు. గత ఏడాది ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో శివమ్ మావి సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గత డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. 6 కోట్ల 40 లక్షలకు శివమ్ మావిని కొనుగోలు చేసింది. -
లక్నోకు షాక్.. స్టార్ పేసర్ సీజన్ మొత్తానికి దూరం
IPL 2024- LSG pacer to pull out of tournament ఆర్సీబీపై గెలుపుతో జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోట్లు ఖర్చు పెట్టి కొన్న ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు పదిహేడో ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతడు మరెవరో కాదు టీమిండియా పేసర్ శివం మావి. పూర్తి ఫిట్నెస్ సాధించని కారణంగా అతడు ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ నుంచి వైదొలిగాడు. ఇందుకు సంబంధించి లక్నో ఫ్రాంఛైజీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు శివం మావి.. గాయం కారణంగా ఐపీఎల్-2024 మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిభావంతుడైన ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ డిసెంబరులో జరిగిన వేలం సందర్భంగా మాతో చేరాడు. ప్రీ సీజన్ క్యాంపులోనూ పాల్గొన్నాడు. ఈ సీజన్లో అతడు జట్టులో కీలక సభ్యుడిగా ఉంటాడనుకున్నాం. కానీ ఇలా జరగడం అతడిని కూడా నిరాశ పరిచింది. ఏదేమైనా ఫ్రాంఛైజీ ఎల్లవేళలా శివంకు అండగా ఉంటుంది. గాయం నుంచి కోలుకునే క్రమంలో అతడికి కావాల్సిన సహాయం అందిస్తుంది. త్వరగా కోలుకుని అతడు మరింత స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని.. పూర్తి ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటున్నాం’’ అని లక్నో యాజమాన్యం శివం మావిని విష్ చేసింది. కేకేఆర్, గుజరాత్ జట్లకు ఆడి కాగా 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన యూపీ పేసర్ శివం మావి.. 2022 వరకు కేకేఆర్కే ఆడాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ అతడిని ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. 2022లో గుజరాత్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఈ క్రమంలో గతేడాది జనవరిలో టీమిండియాలో అడుగుపెట్టి ఇప్పటి వరకు ఆరు టీ20లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్-2023లో గుజరాత్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన శివం మావిని ఫ్రాంఛైజీ వదిలేసింది. ఆవేశ్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడి కోసం 6.4 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. ఆవేశ్ ఖాన్ రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లిపోయిన నేపథ్యంలో అతడి స్థానాన్ని శివంతో భర్తీ చేసింది. ఇదిలా ఉంటే.. రూ. 20 లక్షలతో లక్నో కొనుగోలు చేసిన మయాంక్ యాదవ్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో లక్నో రెండు గెలిచింది. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? You'll come back stronger, Shivam. And we're with you all the way. 💙 pic.twitter.com/zYSs3URV1p — Lucknow Super Giants (@LucknowIPL) April 3, 2024 -
ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన
Asian Games 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ ఆకాశ్ దీప్‌ను అదృష్టం వరించింది. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత పురుషుల క్రికెట్ జట్టులో అతడికి చోటు దక్కింది. శివం మావి స్థానంలో ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్‌ను చైనాకు పంపనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది. మావి వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా అతడి స్థానంలో ఆకాశ్ దీప్‌ను ప్రధాన జట్టులోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా బిహార్‌కు చెందిన ఆకాశ్ దీప్.. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఎన్ని వికెట్లు తీశాడంటే 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ 26 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్.. అదే ఏడాది లిస్ట్-ఏ(వన్డే), ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. 2021 (సెకండ్ ఫేజ్)లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. ఇప్పటి వరకు మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్- శివం మావి(PC: IPL/BCCI) టీ20 ఫార్మాట్లో ఈ క్రమంలో శివం మావి గాయపడటంతో చైనాకు వెళ్తున్న టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్-2018 గెలిచిన జట్టులో సభ్యుడైన యూపీ పేసర్ మావి దురదృష్టవశాత్తూ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి కాగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు చైనాలోని హొంగ్జూ వేదికగా.. ఆసియా క్రీడలు-2023 ఆరంభం కానున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 28 నుంచి టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు షురూ అవుతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న మహిళా క్రికెట్ జట్టుకు పేసర్ అంజలి శార్వాణి దూరం కాగా.. పూజా వస్త్రాకర్ ప్రధాన జట్టులోకి వచ్చింది. 19వ ఆసియా క్రీడలకు భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: యశ్ ఠాకూర్, సాయికిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. చదవండి: Asia Cup: అభిమానులకు చేదువార్త.. ఫైనల్‌కు వర్షం ముప్పు! -
టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా!
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్‌కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. భారత జట్టుకు గాయాల బెడద ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్రాన్‌తో పాటు అతడి పేరు పరిశీలనలో అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తొలిసారి భారత క్రికెట్ జట్లు చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. శిక్షణా శిబిరం అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్‌కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు. ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్. చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? -
శివమ్ మావి కళ్లు చెదిరే క్యాచ్.. హార్దిక్ షాకింగ్ రియాక్షన్ వైరల్
రాజ్‌కోట్ వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు శివమ్ మావి సంచలన క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 10 ఓవర్లో చాహల్ వేసిన ఫుల్ ఆఫ్‌సైడ్ బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడాడు. దీంతో అది బౌండరీ దాటడం ఖాయమని అంతా భావించారు. కానీ స్వీపర్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న మావి పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్టన్నింగ్ క్యాచ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం మావి మెరుపు క్యాచ్ చూసి ఆశ్చర్యపోయాడు. మావి క్యాచ్ పట్టిన హార్దిక్ సూపర్ అంటూ వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. ఇక మావి క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడిన సూర్యకుమార్ యాదవ్(112 నాటౌట్)కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్ టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ దక్కింది. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు ICYMI - A fine running catch by @ShivamMavi23 near the boundary ends Asalanka's stay out there in the middle. Live - https://t.co/bY4wgiSvMC #INDvSL @mastercardindia pic.twitter.com/hwSrjjsalm — BCCI (@BCCI) January 7, 2023 pic.twitter.com/bmQflv7Q9u — IPLT20 Fan (@FanIplt20) January 7, 2023 -
హార్దిక్ ఇలా చేస్తాడనుకోలేదు! చెత్త బౌలింగ్.. ఆశ్చర్యపోయా..
India vs Sri Lanka, 2nd T20I: ‘‘డెత్ ఓవర్లలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడనుకున్నా. మావి స్థానంలో తనే వస్తాడనుకున్నా. కానీ అలా జరుగలేదు. నిజానికి మావికి డెత్ ఓవర్లలో మెరుగైన రికార్డు లేదు. హార్దిక్‌కు అనుభవజ్ఞుడు. ఏదేమైనా ఆఖరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. శ్రీలంకతో పుణెలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక లంక 6 వికెట్ల నష్టపోయి 206 పరుగులు స్కోరు చేసింది. భారత బౌలర్లు తేలిపోవడంతో ఈ మేరకు భారీ లక్ష్యం విధించింది. అయితే, టార్గెట్ ఛేదించడంలో విఫలమైన హార్దిక్ సేన ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో బౌలర్ల సేవలను వాడుకునే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. మావి స్థానంలో అతడే వస్తాడనుకున్నా! ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఆరో ఓవర్ తర్వాత తను బౌలింగ్ చేయడానికి రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేనైతే అతడు మొదటి రెండు ఓవర్లు లేదంటే మిడిల్లో రెండు ఓవర్లు వేయడంతో పాటు... డెత్ ఓవర్లలో వస్తాడనుకున్నా. కానీ అలా చేయలేదు. అర్ష్‌దీప్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నిజానికి శివం మావి మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్‌లో మొదట్లోనే అతడి చేతికి బంతిని ఇవ్వాల్సింది. అదే విధంగా బంతి కాస్త పాతబడిన తర్వాత అర్ష్‌దీప్‌తో మూడు లేదంటే నాలుగో ఓవర్ వేయించాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా లంకతో రెండో టీ20లో తమ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి, ఉమ్రాన్(3/48) ఇద్దరే 101 పరుగులు సమర్పించుకోవడం విశేషం. చెత్త రికార్డు ఇక అర్ష్‌దీప్ కేవలం 2 ఓవర్ల స్పెల్ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు ఏకంగా 5 నోబాల్స్ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రెండే ఓవర్లు వేసిన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 13 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ తొలి ఓవర్, మూడో ఓవర్లో అతడు బౌల్ చేశాడు. ఇక గత మ్యాచ్‌లోనూ పాండ్యా ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్ చేతికి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే.. Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! -
Ind Vs SL: చెత్త బౌలింగ్..! ‘నెట్స్‌లో నేను సిక్స్‌లు బాదడం చూసే ఉంటారు!’
India vs Sri Lanka, 2nd T20I: శివం మావి... శ్రీలంకతో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఈ యువ పేసర్ అరంగేట్రంలోనే 4 వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కానీ... ఆ తర్వాతి మ్యాచ్‌లోనే సీన్ రివర్స్ అయింది. లంకతో పుణె వేదికగా జరిగిన రెండో టీ20లో మావి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అతడు ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. అయితే, అదే సమయంలో తన బ్యాటింగ్ స్కిల్స్‌తో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ.. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో మెరుపులు అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య అవుట్ కావడంతో క్రీజులోకి శివం మావి వచ్చాడు. అప్పటికే జోరు మీదున్న అక్షర్‌కు స్ట్రైక్ రొటేట్ చేసి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండిపోతాడేమో అనుకుంటున్న తరుణంలో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హుడా, మావి, చహల్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. మధుషంక బౌలింగ్‌లో 18వ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్లో వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్‌తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో.. శివం మావి మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. నెట్స్‌లో నేను కొట్టే సిక్స్‌లు చూసే ఉంటారు! బీసీసీఐ టీవీ గత ఇంటర్వ్యూలో శివం మావి మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా బ్యాటింగ్‌పై దృష్టి సారించాను. నెట్స్‌లో నేను కొట్టే సిక్స్‌లు చూసే ఉంటారు. నా ఫీల్డింగ్ బాగుంది. బౌలింగ్ కూడా బాగానే చేస్తున్నా. అందుకే బ్యాటింగ్‌పై ఫోకస్ చేసి ఇంకాస్త మెరుగుపడితే బాగుంటుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ శివం మావి ఆల్‌రౌండ్ ప్రతిభతో మెరుస్తూంటాడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ మావిని ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా సారథ్యంలో మావి అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇక లంకతో రెండో టీ20లో టీమిండియా 16 పరుగులతో ఓడగా సిరీస్ 1-1తో సమమైంది. చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ IND Vs SL 2nd T20: అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ గవాస్కర్ -
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్
పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు. యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు. కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
Ind Vs SL: అరంగేట్రంలోనే దుమ్మురేపిన మావి.. అరుదైన జాబితాలో చోటు
India vs Sri Lanka, 1st T20I- Shivam Mavi: అరంగేట్రంలోనే దుమ్ములేపాడు టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ శివం మావి. శ్రీలంకతో స్వదేశంలో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక(1), వన్‌డౌన్ బ్యాటర్ ధనంజయ డి సిల్వా(8) సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ(21), మహీశ్ తీక్షణ(1)లను పెవిలియన్‌కు పంపాడు. నమ్మకం నిలబెట్టుకుని బంతిని తన చేతికి ఇచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదో బంతికి నిసాంకను బౌల్డ్ చేసిన మావి.. మిగతా మూడు వికెట్లు కూల్చే క్రమంలోనూ తడబడలేదు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మావి.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో శివం మావిపై ప్రశంసలు కురుస్తున్నాయి. హుడా, మావి, చహల్ అరుదైన జాబితాలో అరంగేట్రంలోనే ఈ మేరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 24 ఏళ్ల యూపీ క్రికెటర్.. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా, బరీందర్ సరన్ ఈ ఫీట్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. అరంగేట్రంలోనే 4 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు 1. ప్రజ్ఞాన్ ఓజా- 2009లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో- 21/4 2. బరీందర్ సరన్- 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌లో- 10/4 3. శివం మావి- 2022లో శ్రీలంకతో మ్యాచ్‌లో- 22/4. ఇక ఈ ముగ్గురిలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బరీందర్ నిలిచాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! From claiming a four-wicket haul on debut to the feeling of representing #TeamIndia 👏🏻👏🏻 Bowling Coach Paras Mhambrey Interviews Dream Debutant @ShivamMavi23 post India’s win in the first #INDvSL T20I👌🏻 - By @ameyatilak Full interview 🎥🔽 https://t.co/NzfEsb5ydo pic.twitter.com/z9CuqFqlLP — BCCI (@BCCI) January 4, 2023 -
శ్రీలంకతో తొలి టీ20.. గిల్, మావి అరంగేట్రం
ముంబై వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత యువ ఆటగాళ్లు శుబ్మాన్ గిల్, శివమ్ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. మరో వైపు యువ సంచలనం అర్ష్‌దీప్ సింగ్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇక లంకతో టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: NZ vs PAK: పాపం బాబర్.. అలా ఔట్ అవుతానని అస్సలు ఊహించి ఉండడు! -
ఒక్క ఓవర్ 30 పరుగులు.. కేకేఆర్ బౌలర్‌కు పీడకలే!
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు దారుణ పరాభవమే ఎదురైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి.. తమ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు లక్నో 142 పరుగులు సాధారణ స్కోరుతోనే ఉంది. శివమ్ మావి వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్ తొలి మూడు బంతుల్లో 6, 6, 6 బాది నాలుగో బంతికి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన హోల్డర్ తర్వాతి 2 బంతులను 6, 6 కొట్టడంతో మొత్తం 5 సిక్సర్లతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మొత్తానికి శివమ్ మావి కేకేఆర్ పాలిట విలన్‌గా తయారయ్యాడు. ఇంతవరకు ఒక కేకేఆర్ బౌలర్ మూడు సందర్భాల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. యాదృశ్చికమేంటంటే.. ఈ మూడుసార్లు శివమ్ మావినే ఉండడం విశేషం. శనివారం లక్నోతో మ్యాచ్‌తో పాటు.. 2018 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో.. అదే సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మావి ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. చదవండి: IPL 2022: కేకేఆర్‌ను కుమ్మేసిన లక్నో.. -
IPL 2022: తొలివారంలో అట్టర్ ఫ్లాప్ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే!
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభమై వారం రోజులు దాటింది. ఏప్రిల్ 1 నాటికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లో స్కోరింగ్ మ్యాచ్‌లతో పాటు.. ఆఖరి ఓవర్ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కొంతమంది ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో ఐపీఎల్-2022 బరిలో దిగిన వారు ఆరంభ మ్యాచ్‌లలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2021 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడు. ఈ చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ ఏకంగా 635 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీలు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2022లో అడుగుపెట్టాడు. కానీ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో డకౌట్ అయిన రుతురాజ్, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున గత సీజన్ రెండో అంచెలో అదరగొట్టాడు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు. తద్వారా టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఐపీఎల్-2021 ప్రదర్శన నేపథ్యంలో కేకేఆర్ అతడిని 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ యువ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీఎస్కేతో మొదటి మ్యాచ్‌లో ఈ ఓపెనర్ 16 పరుగులు చేశాడు. ఆర్సీబీపై 10, పంజాబ్‌పై కేవలం 3 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేదు. అనూజ్ రావత్ ఆర్సీబీ యువ ఆటగాడు సైతం ఆరంభ మ్యాచ్‌లలో తేలిపోయాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఘనంగానే ఇన్నింగ్స్ ఆరంభించినా రాహుల్ చహర్‌కు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి అనూజ్ రావత్ సగటు స్కోరు 10.5. మనీష్ పాండే లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాడు మనీశ్ పాండేకు ఈ సీజన్లో మంచి ఆరంభం దక్కలేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో మొత్తం కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 5, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 6 పరుగులు సాధించాడు. నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో ఆశలతో నికోలస్ పూరన్‌ను మెగా వేలంలో కొనుగోలు చేసింది. గత సీజన్లో విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. ఇక ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించిన ఈ విండీస్ వికెట్ కీపర్బ్యాటర్.. ఐపీఎల్-2022ను ఘనంగా ఆరంభించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయిన పూరన్.. పూర్ పర్ఫామెన్స్తో అభిమానులను నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ మెగా వేలం-2022లో భాగంగా 11.5 కోట్ల భారీ ధర చెల్లించి పంజాబ్ కింగ్స్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఇంగ్లండ్ క్రికెటర్ ఘనంగా తన ఆగమనాన్ని చాటలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులు చేశాడు. రాజ్ బవా భారత అండర్-19 వరల్డ్‌కప్ ప్లేయర్ రాజ్ బవా ఐసీసీ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో భాగమైన ఈ యువ ఆటగాడు.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 14వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాజ్ బవా విఫలమయ్యాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు సాధించగలిగాడు. డానియెల్ సామ్స్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలింగ్ ఆల్‌రౌండర్ డానియెల్ సామ్స్ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు మొత్తంగా 24(6,1,6,4,1,6) పరుగులు సాధించి తమ జట్టుకు విజయం అందించారు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడని భావించిన ముంబై యాజమాన్యానికి ఆరంభ మ్యాచ్‌లో విఫలమై షాకిచ్చాడు డానియెల్ సామ్స్. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను 12 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. జట్టుకు ప్రధానమైన ఈ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఆరంభం ఘనంగా లేకపోయినప్పటికీ ఈ అనువజ్ఞుడైన ఆటగాడు తప్పక రాణించగలడని విశ్లేషకుల అభిప్రాయం. నాథన్ కౌల్టర్‌నైల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. 61 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సత్తా చాటింది. అయితే, ఈ విజయంలో నాథన్ తన వంతు పాత్ర పోషించలేకపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ బౌలర్ ఏకంగా 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. శివమ్ మావి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు శివమ్ మావి. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అతడు.. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జట్టులో స్థానం కోల్పోయిన శివమ్ మావి.. పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. అయితే, రెండు ఓవర్లలోనే 39 పరుగులు ఇచ్చుకుని విఫలమయ్యాడు. అయితే, ఒక వికెట్ మాత్రం తీయగలగడం గమనార్హం. అయితే, ఆరంభ మ్యాచ్‌లలో ఈ ఆటగాళ్లు విఫలమైనప్పటికీ రానున్న మ్యాచ్‌లలో తమదైన శైలిలో రాణించి అభిమానులను ఆకట్టుకోవాలని కోరుకుందాం. A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన బానుక రాజపక్స ఉన్న కాసేపు కేకేఆర్ బౌలర్లను హడలెత్తించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాజపక్స చివరికి శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఔటైన రాజపక్స అదే ఓవర్లోనే శివమ్ మావికి చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మావి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు సంధించాడు. దీంతో మావి షార్ట్ పిచ్ బంతి వేయగా.. రాజపక్స మరో సిక్సర్ సంధించే యత్నంలో మిడాఫ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తన బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రాజపక్సను ఔట్ చేసి మావి పగ తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటూ మావి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివమ్ మావి- బానుక రాజపక్స్ వీడియో కోసం క్లిక్ చేయండి -
MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!
KKR Beats RR... MI "Chances" To Enter Play Offs Explained: గత రెండు సీజన్లలో రన్‌రేట్‌లో వెనుకబడి ఐదో స్థానానికే పరిమితమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఈసారి తప్పు దిద్దుకుంది. విజయాలతో పాటు రన్‌రేట్‌ను కూడా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు నాలుగో జట్టుగా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులతో భారీ విజయం సాధించడం ఆ జట్టుకు మరింతగా కలిసొచ్చింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా (36 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ మావి (4/21), ఫెర్గూసన్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చివర్లో జోరు... తొలి 10 ఓవర్లలో 69 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు... కోల్‌కతా ఇన్నింగ్స్ ఇలా రెండు భిన్న పార్శ్వాలుగా సాగింది. నెమ్మదిగా ఆట ప్రారంభించిన గిల్, వెంకటేశ్... పవర్‌ప్లేలో కూడా మరీ దూకుడుగా వెళ్లకుండా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా 6 ఓవర్లలో జట్టు 34 పరుగులే చేయగలిగింది. ఎట్టకేలకు ఉనాద్కట్ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ రెండు భారీ సిక్సర్లు కొట్టి జోరు పెంచాడు. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో 79 పరుగుల (65 బంతుల్లో) భాగస్వామ్యానికి తెర పడింది. అయితే అక్కడి నుంచి కేకేఆర్ స్కోరు వేగంగా దూసుకుపోయింది. తర్వాతి బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా (12), రాహుల్ త్రిపాఠి (21), దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), మోర్గాన్ (13 నాటౌట్) తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సకారియా బౌలింగ్‌లో ఫోర్‌తో గిల్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోరిస్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రాజస్తాన్ 9 వైడ్లు సహా ఏకంగా 17 అదనపు పరుగులు ఇచ్చింది. టపటపా... సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన రాజస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించింది. ఒక్క తెవాటియా పోరాటం మినహా...మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. అవుటయ్యేందుకు ఒకరితో మరొకరు పోటీ పడటంతో తొలి ఓవర్ నుంచే జట్టు పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లే ముగిసేసరికే జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాతా అందరూ విఫలం కావడంతో కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకపోయింది. ముంబై 171 పరుగులతో గెలిస్తేనే... ఇక కేకేఆర్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ... సాంకేతికంగా ముంబైకి ఇంకా అవకాశం ఉంది. అయితే, వాస్తవికంగా చూస్తే అది అసాధ్యమే. నేడు(శుక్రవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 171 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇక ఛేదన అయితే మాత్రం టాస్‌తోనే వారి ఆట ముగిసిపోతుంది. అంటే రెండోసారి బ్యాటింగ్ చేస్తే అంకెలకు అందని విధంగా ముంబై జట్టుకు ఏమాత్రం అవకాశం లేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) యశస్వి (బి) మోరిస్ 56; వెంకటేశ్ (బి) తెవాటియా 38; రాణా (సి) లివింగ్‌స్టోన్ (బి) ఫిలిప్స్ 12; త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; మోర్గాన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–79, 2–92, 3–133, 4–145. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–35–0, మోరిస్ 4–0–28–1, సకారియా 4–0–23–1, ముస్తఫిజుర్ 4–0–31–0, దూబే 2–0–18–0, తెవాటియా 1–0–11–1, ఫిలిప్స్ 1–0–17–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) షకీబ్ 0; లివింగ్‌స్టోన్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; సామ్సన్ (సి) మోర్గాన్ (బి) మావి 1; దూబే (బి) మావి 18; రావత్ (ఎల్బీ) (బి) ఫెర్గూసన్ 0; ఫిలిప్స్ (బి) మావి 8; తెవాటియా (బి) మావి 44; మోరిస్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; ఉనాద్కట్ (సి) షకీబ్ (బి) ఫెర్గూసన్ 6; సకారియా (రనౌట్) 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 85. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–12, 4–13, 5–33, 6–34, 7–35, 8–62, 9–85, 10–85. బౌలింగ్: షకీబ్ 1–0–1–1, శివమ్ మావి 3.1–0–21–4, నరైన్ 4–0–30–0, ఫెర్గూసన్ 4–0–18–3, వరుణ్ 4–0–14–1. చదవండి: Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర! THAT. WINNING. FEELING! 👏 👏 The @Eoin16-led @KKRiders put up a clinical performance & seal a 86-run win over #RR. 💪 💪 #VIVOIPL #KKRvRR Scorecard 👉 https://t.co/oqG5Yj3afs pic.twitter.com/p5gz03uMbJ — IndianPremierLeague (@IPL) October 7, 2021 -
వైరల్: పృథ్వీ షాపై పగ తీర్చుకున్న శివం మావి!
అహ్మదాబాద్: ఆట ఏదైనా అప్పటివరకు మిత్రులుగా మెలిగిన ఆటగాళ్లు మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులుగా మారిపోతారు. ‘నువ్వా- నేనా’ అంటూ పోటీపడుతూ తమ జట్టును గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే, ఒక్కసారి మ్యాచ్ ముగిసిందంటే చాలు మళ్లీ ఫ్రెండ్స్‌లా మారిపోయి, మునుపటిలాగే సరదాగా గడిపేస్తారు. ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. మ్యాచ్ పూర్తవ్వగానే పృథ్వీ షా- శివం మావి ఆత్మీయంగా పలకరించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కేకేఆర్ బౌలర్ శివం మావి వేసిన తొలి ఓవర్లోనే వరుసగా ఆరు బౌండరీలు బాది అతడికి చుక్కలు చూపించాడు. ఇక మ్యాచ్‌లో 41 బంతుల్లో 82 పరుగులు చేసిన షా అద్భుతమైన స్ట్రైక్‌రేటు నమోదు చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. షా సూపర్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ మెరుగైన స్కోరు నమోదు చేసి, కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, పూనకం వచ్చినట్లుగా షా మొదటి ఓవర్లోనే వరుసగా ఫోర్లు బాదడంతో తలపట్టుకున్న శివం మావి, మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం అతడిపై స్వీట్‌గా రివేంజ్ తీర్చుకున్నాడు. శభాష్ అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూనే.. ‘‘నా బౌలింగ్‌లోనే విధ్వంసం సృష్టిస్తావా’’ అన్నట్లుగా.. పృథ్వీ షా మెడను, చేతిని నొక్కిపట్టాడు. ఇక శివం ఇలా చేయగానే, ఇక నొప్పి భరించలేను అన్నట్లుగా పృథ్వి అతడిని విడిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విటర్లో షేర్ చేసింది. ‘‘ఒక్కసారి మ్యాచ్ అయిపోయిందంటే.. స్నేహమే దాని తాలుకూ ఫలితాలను ఆక్రమించేస్తుంది. ఐపీఎల్లో ఉన్న బ్యూటీ అదే’’ అని కామెంట్ జతచేసింది. Once the match is completed, friendship takes over. The beauty of #VIVOIPL🤗@PrithviShaw | @ShivamMavi23 https://t.co/GDR4bTRtlQ #DCvKKR pic.twitter.com/CW6mRYF8hs — IndianPremierLeague (@IPL) April 29, 2021 చదవండి: దురదృష్టంకొద్దీ మావి అలా వేయలేదు: పృథ్వీ షా -
శివం మావి వ్యాఖ్యలు: కంటతడి పెట్టిన డేల్ స్టెయిన్!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బౌలర్లలో తానే ఆదర్శం అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ శివం మావి చెప్పిన మాటలు విని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో పాటు డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా, శివం మావి మాట్లాడుతూ.. ‘‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్ స్టెయిన్ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా. బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్ స్టెయిన్ లాగే అవుట్ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. అతడితో పాటు బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. అయితే, నా రోల్‌మోడల్ మాత్రం డేల్ స్టెయిన్’’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన డేల్ స్టెయిన్.. శివం మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ‘‘నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2021లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: KKR vs PBKS: నైట్‌రైడర్స్ ఎట్టకేలకు.. -
42 పరుగులకే 5 వికెట్లు.. రాజస్తాన్ ఇక కష్టమే
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తడబడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేకేఆర్ విధించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. పాట్ కమిన్స్ వేసిన వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఇన్ఫామ్ బ్యాట్సమన్ సంజూ శామ్సన్ కేవలం 8 పరుగులే చేసి శివమ్ మావి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో మంచి టచ్‌లో కనిపించినా.. శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప , రియాన్ పరాగ్‌లు కూడా వెనుదిరగడంతో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది.(చదవండి : రాజస్తాన్ లక్ష్యం 175 పరుగులు) కాగా అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ పెద్ద మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్ గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్ మెరుపులతో కేకేఆర్ 170 పరుగుల మార్కును దాటింది. -
కుల్దీప్ యాదవ్ విజృంభణ
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ స్సిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించి బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కుల్దీప్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో రాజస్తాన్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా ఆండ్రీ రస్సెల్, ప్రసిధ్ కృష్ణలు చెరో రెండు వికెట్లు సాధించగా, మావి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించింది. రాజస్తాన్ ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి, జోస్ బట్లర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 63 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్ త్రిపాఠి(27;15 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో అజింక్యా రహానే(11) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి బట్లర్(39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్ర్కమించడంతో రాజస్తాన్ 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక అటు తర్వాత రాజస్తాన్ రాయల్స్ ఏ దశలోనూ తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ అందివచ్చిన చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్(12), స్టువర్ట్ బిన్నీ(1), గౌతమ్(3), స్టోక్స్(11)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. ఇక చివర్లో ఉనాద్కత్(26;18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. కాగా, ఆఖరి వికెట్‌గా ఉనాద్కత్ వెనుదిరగడంతో రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. -
మరోసారి శివం మావిని కుమ్మేశారు..!
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి, జోస్ బట్లర్లు చెలరేగి ఆడి జట్టును స్కోరు పరుగులు పెట్టించారు. కేకేఆర్ బౌలర్ శివం మావి వేసిన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే తీసిన రాజస్తాన్.. ఆపై విజృంభించింది. రెండో ఓవర్లో 19 పరుగులు, మూడో ఓవర్లో 28 పరుగులు సాధించి స్కోరులో వేగాన్ని పెంచింది. అయితే రెండో ఓవర్‌ను ప్రసిధ్ వేయగా, మూడో ఓవర్‌ను శివం మావి వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఓవర్‌ను కుదురుగా వేసిన మావి.. మూడో ఓవర్లో మాత్రం జోస్ బట్లర్ ధాటికి తలవంచాడు. మావి వేసిన మూడో ఓవర్ తొలి బంతిని ఫోర్ కొట్టిన బట్లర్.. రెండో బంతిని సిక్సర్‌గా, మూడో బంతిని ఫోర్‌గా, నాల్గో బంతిని ఫోర్‌గా, ఐదో బంతిని సిక్సర్‌గా, ఆరో బంతిని ఫోర్‌గా మలిచాడు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్లో శివం మావి ఒకే ఓవర్లో అత్యధిక పరుగులకు ఇచ్చిన అప్రతిష్టను రెండోసారి మూటగట్టుకున్నాడు. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో మావి 29 పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు బట్లర్లు మావిని కుమ్మేశారు. ఫలితంగా తాజా ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లలో జాబితాలో తొలి రెండు స్థానాల్లో మావినే నిలిచాడు. -
‘అతడు టీమిండియా ఆశాకిరణం’
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పేసర్ శివం మావిపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మావిలోని సాంకేతికను, ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే అతను భవిష్యత్తులో టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘శివం మావి టీమిండియా ఆశాకిరణం కాగలడు. అతని బౌలింగ్ యాక్షన్ అసాధారణ రీతిలో ఉంది. ఒక పేసర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ మావిలో ఉన్నాయి. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ రాణిస్తున్నాడు. ఎవరైనా సక్సెస్ కావాలంటే ఎంజాయ్ చేస్తూ గేమ్‌ను ఆస్వాదించే లక్షణాలుండాలి. మావిలో ఒక అత్యుత్తమ బౌలర్ నాకు కనిపిస్తున్నాడు. నా దృష్టిలో మావి గొప్ప బౌలర్ అవుతాడు’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు. -
ధోనిని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి
పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గత సీజన్లలో ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత కోలుకొని చాంపియన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అతను జట్టును విజయబాట పట్టించాడు. లీగ్ తొలి మ్యాచ్‌లోనే ముంబైను ఓడించి... ఇపుడు అదే జట్టు చేతిలో ఓటమి పాలైన చెన్నై నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ జట్టు పరాజయాల బాటను విడిచి విజయపథంలోకి వచ్చింది. మరోవైపు ఇద్దరు యువ బౌలర్లు అవేశ్ ఖాన్, శివమ్ మావి దుందుడుకు ప్రవర్తనకుగాను ఐపీఎల్ కౌన్సిల్ మందలించడం శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాక ఈ ఇద్దరు బౌలర్లు అభ్యంతరకర భాషను ప్రయోగించడం మంచిది కాదు. యువ క్రికెటర్లలో ఈ దూషణ పర్వం అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. అయితే టీవీల్లో తమ సీనియర్ క్రికెటర్ల ప్రవర్తనను చూశాకే వీరు కూడా ఇలా చేసి ఉంటారనిపిస్తోంది. ఈ మందలింపు అనేది ఈ ఇద్దరితోపాటు మిగతా యువ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదే. వికెట్ తీసినపుడుగానీ, అర్ధ సెంచరీ చేసినపుడగానీ ఆవేశంతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆవేశం ప్రదర్శించే బదులు హాయిగా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే అందరికీ బాగుంటుంది. మైదానంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో యువ క్రికెటర్లు ధోనిని చూసి నేర్చుకోవాలి. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించినా ధోని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. విజయంలోనూ అతను హుందాతనం చూపిస్తాడు. -
శివం మావి, అవేష్లకు మందలింపు
ఢిల్లీ: ఐపీఎల్ తాజా సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ శివం మావి, ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ అవేశ్ ఖాన్లు మ్యాచ్ రిఫరీ మందలింపుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్‌ను తీసిన క్రమంలో దురుసుగా ప్రవర్తించారు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్-1కు వ్యతిరేకం కావడంతో వారిద్దర్నీ రిఫరీ హెచ్చరించాడు. వీరు తమ తప్పును ఒప్పుకోవడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కోల్‌కతా పేసర్ శివం మావి బౌలింగ్‌లో ఢిల్లీ ఓపెనర్ కోలిన్ మున్రో ఔటయ్యాడు. ఆ సమయంలో మావి దూకుడుగా వ్యవహరించడంతో పాటు నిరర్ధకమైన పదమును ఉపయోగించాడు. ఆ తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఆండ్రీ రస్సెల్ ఔటైనప్పుడు ఢిల్లీ బౌలర్ అవేశ్ ఖాన్ తనకు నోటి పనిచెప్పాడు. దాంతో పాటు చేతితో ఏవో సంజ్ఞలు చేస్తూ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దాంతో వారిని రిఫరీ పిలిచి మందలించారు. -
యువ 'రైడర్స్'.. అ‘ధర’హో!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా జరుగుతున్న వేలంలో అండర్ -19 క్రికెటర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. తొలి రోజు వేలంలో బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్(రూ.1.8 కోట్లు), పేసర్ కమలేశ్ నాగకోటి(రూ.3.2 కోట్లు)లను కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకోగా, పృథ్వీ షా(రూ.1.2 కోట్లు)ను ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఇక ఈ రోజు వేలంలో మరో అండర్-19 క్రికెట్ ఫాస్ట్ బౌలర్ శివం మావి(రూ. 3 కోట్లు)ని కేకేఆర్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలుండగా, రూ. 3 కోట్లు వెచ్చించి కేకేఆర్ కొనుగోలు చేసింది. అండర్-19లో సత్తాచాటుతున్న శివం మావి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ అతన్ని చివరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుత భారత అండర్-19 క్రికెట్ జట్టులో ఉన్న ముగ్గురు క్రికెటర్లను కేకేఆర్ కొనుగోలు చేసినట్లయ్యింది. గత ఐపీఎల్ సీజన్లలో సీనియర్ క్రికెటర్లపై ఎక్కువ ఆసక్తి కనబరిచిన కేకేఆర్.. ఈసారి యువ క్రికెటర్లతో జట్టును నింపే యత్నం చేస్తోంది. దాంతో యువ రైడర్స్‌తో కేకేఆర్ పోరుకు సిద్దమవుతోంది. -
145 కి.మీ వేగంతో దడ పుట్టించారు
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పదునైన బంతులతో భారత పేస్ బృందం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టింది. భారత పేసర్లు శివం మవి, కమలేశ్ నగర్కోటి, ఇషాన్ పొరెల్‌లు స్థిరంగా 145 పైచిలుకూ వేగంతో బంతులు విసిరారు. వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్న ఈ ముగ్గురిని గుర్తించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. విరాట్ కొహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తున్న వీరిపై దృష్టి సారించాలని కోరారు. కాగా, మ్యాచ్‌లో వేగవంతమైన డెలివరి(149 కి.మీ)ను నగర్కోటి విసిరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్-19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి.. మనకు సచిన్ మళ్లీ దొరికాడు..!)