అండర్ -19 పేసర్ కమలేశ్ నగర్‌కోటి
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పదునైన బంతులతో భారత పేస్ బృందం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టింది.
భారత పేసర్లు శివం మవి, కమలేశ్ నగర్‌కోటి, ఇషాన్ పొరెల్‌లు స్థిరంగా 145 పైచిలుకూ వేగంతో బంతులు విసిరారు. వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్న ఈ ముగ్గురిని గుర్తించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. విరాట్ కొహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తున్న వీరిపై దృష్టి సారించాలని కోరారు.
కాగా, మ్యాచ్‌లో వేగవంతమైన డెలివరి(149 కి.మీ)ను నగర్‌కోటి విసిరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్-19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి.. మనకు సచిన్ మళ్లీ దొరికాడు..!)
Comments
Please login to add a commentAdd a comment