Ishan Porel
-
సెమీస్‌లో చిత్తుగా ఓడిన పాక్
-
చిత్తుగా ఓడిన పాక్.. భారత్ సూపర్ విన్
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే ప్రపంచకప్ టైటిల్‌కు యువ భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. సెమీస్ సమరంలో యువ పాక్ 203 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. 29.3 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ల పదునైన బంతులకు పాక్ బ్యాట్స్‌మన్ తలవంచారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. టపాటపా వికెట్లు నష్టపోయి చతికిలపడింది. ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. మొదటి నాలుగు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. శివసింగ్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఆటగాళ్లలో రొహైల్ నజీర్(18), సాద్ ఖాన్(15), మొహమ్మద్ మూసా(11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షహీన్ ఆఫ్రిది డకౌటయ్యాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) రాణించారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ మూసా 4, అర్షల్ ఇక్బాల్ 3 వికెట్లు పడగొట్టారు. షహీన్ ఆఫ్రిది ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
ఇషాన్ దూకుడు; పీకల్లోతు కష్టాల్లో పాక్
క్రైస్ట్‌చర్చ్: భారత్‌తో జరుగుతున్న అండర్–19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 273 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ పాకిస్తాన్ స్వల్పస్కోరుకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 45 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. 21 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. యువ భారత బౌలర్ ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాట్స్‌మన్‌ను వణికిస్తున్నాడు. మొదటి నాలుగు వికెట్లు అతడే నేలకూల్చడు. ఇమ్రాన్ షా(2), మహ్మద్ జైద్ ఆలం(7), అలీ జర్యాబ్(1), అమ్మద్ ఆలం(4)లను పెవిలియన్‌ను పంపించాడు. రియాన్ పరాగ్ రెండు వికెట్లు పడగొట్లాడు. శివసింగ్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) రాణించారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
145 కి.మీ వేగంతో దడ పుట్టించారు
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పదునైన బంతులతో భారత పేస్ బృందం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టింది. భారత పేసర్లు శివం మవి, కమలేశ్ నగర్కోటి, ఇషాన్ పొరెల్‌లు స్థిరంగా 145 పైచిలుకూ వేగంతో బంతులు విసిరారు. వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్న ఈ ముగ్గురిని గుర్తించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. విరాట్ కొహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తున్న వీరిపై దృష్టి సారించాలని కోరారు. కాగా, మ్యాచ్‌లో వేగవంతమైన డెలివరి(149 కి.మీ)ను నగర్కోటి విసిరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్-19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి.. మనకు సచిన్ మళ్లీ దొరికాడు..!)