చిత్తుగా ఓడిన పాక్‌.. భారత్‌ సూపర్‌ విన్‌ | India enters U-19 World Cup final | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన పాక్‌.. భారత్‌ సూపర్‌ విన్‌

Published Tue, Jan 30 2018 9:16 AM | Last Updated on Tue, Jan 30 2018 9:29 AM

India enters U-19 World Cup final - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌కు యువ భారత్‌ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.

సెమీస్‌ సమరంలో యువ పాక్‌ 203 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. 29.3 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ల పదునైన బంతులకు పాక్‌ బ్యాట్స్‌మన్‌ తలవంచారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 10 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. టపాటపా వికెట్లు నష్టపోయి చతికిలపడింది. ఇషాన్‌ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. మొదటి నాలుగు వికెట్లు పడగొట్టి పాక్‌ పతనాన్ని శాసించాడు. శివసింగ్‌, రియాన్‌ పరాగ్‌ రెండేసి వికెట్లు తీశారు. అభిషేక్‌ శర్మ, అనుకూల్‌ రాయ్ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. పాక్‌ ఆటగాళ్లలో రొహైల్‌ నజీర్(18), సాద్‌ ఖాన్‌(15), మొహమ్మద్‌ మూసా(11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. షహీన్‌ ఆఫ్రిది డకౌటయ్యాడు.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్‌ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్‌ కల్రా(47), సుధాకర్‌ రాయ్‌(33) రాణించారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ మూసా 4, అర్షల్‌ ఇక్బాల్ 3 వికెట్లు పడగొట్టారు. షహీన్‌ ఆఫ్రిది ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement