
వెల్లింగ్‌టన్ : అండర్ -19 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ టీమ్ అదరగొడుతోంది. గ్రూప్-బీలోని ప్రత్యర్థులు అందరినీ చిత్తు చేసిన పృథ్వీ షా సేన క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్-బీలో శుక్రవారం జరిగిన ఆఖరు మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడిన భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరిచింది.
ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ 59 బంతుల్లో 90 పరుగులు, దేశాయ్ 73 బంతుల్లో 56 పరుగులు సాధించడంతో చిన్న లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్ కొసిలాతి నుంగు విసిరిన 14వ ఓవర్‌లో గిల్ అద్భుతమైన షాట్‌ను ఆడి క్రికెట్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
కోహ్లి ట్రేడ్ మార్క్ షాట్‌ను అదే తరహాలో ఆడిన గిల్ దాన్ని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇదే మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అనుకుల్ సుధాకర్ రాయ్ కేవలం 20 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లను పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment