U-19 World Cup
-
U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్ .. ఇలాంటివి లెక్కలోకి రావు!
ICC Under 19 World Cup 2024: క్రికెట్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్ సాధించింది. అండర్-19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో సీనియర్ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్ గెలవాలన్న యువ భారత్ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్ సేన మాదిరే.. ఉదయ్ సహారన్ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇలాంటివి అసలు లెక్కలోకే తీసుకోరు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్-19 స్థాయిలో క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఇప్పటికైనా కైఫ్ బాయ్ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు పేపర్ మీద మనమే బెస్ట్ అంటూ.. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను. పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్.. భారత క్రికెట్ జట్లను ఓడించి.. టైటిల్స్ ఎగురేసుకుపోయింది. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! At u-19 level team results don't matter much. Future stars learn lesson that help them in long journey.. Well played India. This time have to say Australia good on pitch, and on paper 😊#U19WorldCup2024 — Mohammad Kaif (@MohammadKaif) February 11, 2024 -
U19 World Cup: ఐర్లాండ్‌తో మ్యాచ్... ఇండియా క్వార్టర్స్ చేరేనా?
U19 World Cup: India Vs Ireland: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా యువ భారత్ జట్టు నేడు ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్ ‘బి’లో భారత్, ఐర్లాండ్ జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచాయి. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ వరుసగా రెండో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ ఒక్కడే బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో విక్కీ ఒస్త్వాల్, రాజ్ బావా మెరిశారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వెస్టిండీస్‌లోని టరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. భారత జట్టు: హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒస్త్వాల్, గర్వ్ సంగ్వాన్. చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే... -
Unmukt Chand: ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్... ఫొటోలు వైరల్
Cricketer Unmukt Chand Married To His Girlfriend Simran Khosla Pics Viral: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి సిమ్రన్ ఖోస్లాను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉన్ముక్త్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దేశవాళీ క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఉన్ముక్త్ చంద్.. అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే 2012 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, టీమిండియాకు ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ అమెరికాకు మకాం మార్చాడు. అక్కడ మైనర్ లీగ్ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకున్న 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్... బిగ్‌బాష్ లీగ్‌కు సంతకం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక ఉన్ముక్త్ భార్య సిమ్రన్ ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: Viral Video: సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్ Today, we decided on forever! 21.11.21 💕💍#SimRANtoChand@KhoslaSimran pic.twitter.com/enG4qCCeAi — Unmukt Chand (@UnmuktChand9) November 21, 2021 -
U 19 World Cup 2022: ఉగాండ, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో పాటు భారత్..
U 19 World Cup 2022: India In Group B With Uganda Ireland South Africa: వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గ్రూప్ వివరాలను ప్రకటించారు. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో ఉగాండ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి గత ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు చోటు కల్పించారు. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇంగ్లండ్... గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా... గ్రూప్ ‘డి’లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. చదవండి: Kurnool: ఇండియన్ క్రికెట్ టీంకు ఎమ్మిగనూరు విద్యార్థి ఎంపిక -
ప్రపంచకప్-2020: టీమిండియా జట్టు ఇదే
ముంబై : దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్- 19 ప్రపంచకప్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో ప్రియం గార్గ్ (ఉత్తరప్రదేశ్)నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్- ఏలో భారత్‌తో పాటుగా జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. కాగా ఫిబ్రవరి 9న పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆనాటి అండర్-19 జట్టు భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టింది. ప్రపంచకప్- 2020 అండర్-19 భారత జట్టు ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్ Four-time winner India announce U19 Cricket World Cup squad. Priyam Garg to lead the side. pic.twitter.com/VEIPxe2a2n — BCCI (@BCCI) December 2, 2019 -
అనుకుల్పై ఫ్రాడ్ ఆరోపణలు
న్యూఢిల్లీ : అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యుడైన అనుకుల్ రాయ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రికెస్ అసోసియేషన్ ఆఫ్ బిహార్(సీఏవో) కార్యదర్శి ఆదిత్య వర్మ అనుకుల్పై ఆరోపణలు చేశారు. అండర్-19లో పాల్గొనేందుకు అనుకుల్ వయసు పరంగా మోసం చేశాడని అన్నారు. ఈ విషయం బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి అమితాబ్ చౌదరికి కూడా తెలుసునంటూ బాంబు పేల్చారు. ఆదిత్య వర్మ ఆరోపణలను అనుకుల్ ఖండించాడు. ఆదిత్య ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని, అన్ని రకాల పరీక్షలు పూర్తైన తర్వాత తాను ప్రపంచకప్‌కు ఆడేందుకు వెళ్లినట్లు చెప్పాడు. స్పిన్నరైన అనుకుల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. -
వరల్డ్ కప్‌తోనే తిరిగొస్తానన్నాడు: క్రికెటర్ తల్లి
సాక్షి, లక్నో: పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత క్రికెట్ జట్టు అండర్-19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోగా.. కుటుంసభ్యులు క్రికెటర్లతో తమ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా సభ్యుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివసింగ్ తల్లి ప్రపంచ కప్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. నా కుమారుడు శివ సింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. మేజర్ టోర్నీకి వెళ్లేముందు.. అండర్-19 ప్రపంచ కప్‌తోనే తిరిగొస్తామని శివసింగ్ అన్నాడు. చెప్పిన ప్రకారంగానే ప్రపంచ కప్ సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన జట్టులో సభ్యుడయ్యాడు. శివ సింగ్ కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. భారత జట్టులో చోటు దక్కించుకుని మంచి క్రికెటర్‌గా రాణించాలన్నదే కుమారుడి ధ్యేయమని శివసింగ్ తల్లి తెలిపారు. భారత్ గర్వించేలా జట్టుకు తన సేవలు అందించాలని శివ సింగ్ తాపత్రాయ పడేవాడన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో స్పిన్నర్ శివసింగ్ సైతం రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో పాలు పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తొలుత ఇషాన్ పొరెల్ చెలరేగగా, ఆసీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ క్రికెటర్లను శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్‌లు వెంట వెంటనే ఔట్ చేసి భారత్‌కు స్వల్ప విజయలక్ష్యం ఉండేలా చేశారు. ఛేజింగ్‌లో మన్జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీకి తోడు హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. -
పాకిస్తాన్‌కు ఓ ద్రవిడ్ కావాల్సిందే..!
కరాచీ: టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో యువ భారత్ తమ జోరు కొనసాగిస్తుండటంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెటర్లు, మాజీ దిగ్గజాలతో పాటు పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ద్రవిడ్ నైపుణ్యాన్ని, ఆటపట్ల అతడి అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రతి ప్రత్యర్థి జట్టును చిత్తుచేసిన యువ టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సైతం యువ భారత్ విజయాలపై స్పందిస్తూ ద్రవిడ్ లాంటి వ్యక్తి వారి దేశానికి కావాలని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ‘అండర్ 19 క్రికెట్ జట్టు రాహల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్‌కు ద్రవిడ్ లాంటి వ్యక్తే కావాలి. అతడి కోచింగ్‌లో శుబ్మాన్ గిల్, మరికొందరు యువ సంచలనాలు తయారయ్యారు. ఒత్తిడిని ఎదుర్కొని ఎలా ఆడాలో జట్టును బాగా సిద్ధం చేశాడు ద్రవిడ్. భారత యువ క్రికెటర్లు ద్రవిడ్ నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఆటతో పాటు అంకితభావాన్ని, నిబద్ధతను కూడా వారు అలవాటు చేసుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సెమిస్లో పాక్ బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. ద్రవిడ్ కోచింగ్ ఇచ్చిన జట్టు చేతిలో యువ పాక్ జట్టు 203 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసిందంటేనే ఆ కోచ్ ఆటగాళ్లలో ఎంత ఉత్సాహాన్ని నింపుతారో అర్థమవుతోంది. అందుకే పాకిస్తాన్‌కు ఓ ద్రవిడ్ అవసరం ఎంతైనా ఉందని’ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పేర్కొన్నారు. -
‘క్రికెట్ అంటే వాడికి పిచ్చి’
చంఢీఘడ్ : అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సెంచరీతో ఆకట్టుకున్న శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన సెమీస్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ (103) సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో పాక్‌పై భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక శుభ్‌మన్ ప్రదర్శన పట్ల అతని తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పట్ల శుభ్‌మన్‌కు ఉన్న నిబద్ధతే అతన్ని ఈస్థాయికి తీసుకొచ్చిందని చెబుతూ మురిసిపోతున్నారు. శుభ్‌మన్ తండ్రి లక్వింధర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. శుభమన్‌కు మూడేళ్ల నుంచే క్రికెట్ అంటే పిచ్చని, దాన్ని గుర్తించి ప్రోత్సాహించమన్నారు. చిన్నప్పుడు ఏ బొమ్మ కొనిచ్చిన తీసుకునేవాడు కాదని, బ్యాట్, బంతినే ఇష్టపడేవాడని పేర్కొన్నారు. పడుకునేటప్పుడు సైతం బ్యాట్, బంతిని పక్కన పెట్టుకొని పడుకునే వాడని గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. పాకిస్థాన్‌పై సెంచరీ చేసి భారత్‌ను గెలిపించడంతో తల్లితండ్రులుగా ఉప్పొంగిపోయామన్నారు. నా కుమారుని ప్రదర్శన పట్ల తండ్రిగా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. తల్లికీరత్ గౌరీ సైతం కొడుకు ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్లోఅద్భుతంగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కెప్టన్ పృథ్వీషా తండ్రి పంకజ్షా సైతం సంతోషం వ్యక్తం చేశారు. అని విభాగాల్లో రాణించి ఫైనల్లోకి అడుగుపెట్టిన అండర్-19 జట్టును అభినందించారు. ప్రత్యేకంగా శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. దిగ్గజ క్రికెటర్లు, అభిమానులు సైతం శుభ్‌మన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఎవరీ యువ కెరటం..?
శుభ్‌మాన్ గిల్.. యువ టీమిండియాలో ఈ పేరు మార్మోగుతోంది. నిలకడగా రాణిస్తున్న ఈ యువ బ్యాట్స్‌మన్ తాజాగా అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో జట్టును టైటిల్‌కు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ బాదాడు. 94 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు(341) కూడా అతడివే. ఈ కుడిచేతి వాటం టాపార్డర్ బ్యాట్స్‌మన్ అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో గిల్ మరింత రాటు దేలుతున్నాడు. దేశీయ మ్యాచుల్లో పంజాబ్ తరుపున ఆడుతున్న అతడు 2017, నవంబర్‌లో బెంగాల్‌తో తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన గిల్.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్ 8న శుభ్‌మాన్ గిల్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. క్రికెటర్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రిని ఒప్పించి కుటుంబంతో సహా మొహాలి తరలివెళ్లాడు. కఠోర సాధన, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాడు. 2014లో జరిగిన అండర్-16 పంజాబ్ అంతర్ జిల్లా టోర్నమెంట్లో 351 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. నిర్మల్ సింగ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 587 భాగస్వామ్యం నమోదు చేశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫిలో పంజాబ్ తరపున అరంగ్రేటం చేసిన అండర్-16 మ్యాచ్‌లోనే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 2013-14, 2014-15లో వరుసగా రెండుసార్లు బెస్ట్ జూనియర్ క్రికెటర్‌గా బీసీసీఐ అవార్డు అందుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా 2014లో అవార్డు అందుకుని మురిసిపోయాడు. తాజాగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.1.8 కోట్లకు గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. -
ద్రవిడ్ బాయ్స్.. అదుర్స్!
క్రైస్ట్‌చర్చ్: రాహుల్ ద్రవిడ్ శిక్షణలో యువ టీమిండియా అద్భుతాలు చేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భారీ విజయాలు నమోదు చేయడం యువ భారత్ సత్తాకు సిసలైన నిదర్శనంగా నిలిచింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రాటుదేలిన యువ క్రికెటర్లు అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మక టోర్నిలో దేశానికి తిరుగులేని విజయాలు అందించారు. సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. తుది సమరంలోనూ జోరు కొనసాగించి విజేతగా నిలవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది. అండర్–19 తాజా ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన యంగ్ ఇండియా అన్నింటిలోనూ భారీ విజయాలు సాధించింది. వందకు పైగా పరుగుల తేడాతో మూడు, 10 వికెట్ల తేడాతో రెండుసార్లు విజయదుందుభి మోగించింది. యువ భారత్ గెలిచిందిలా... ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలుపు పపువా న్యూ గునియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయకేతనం మూడో వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్లతో విజయం క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 131 పరుగుల తేడాతో విక్టరీ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 203 పరుగుల తేడాతో విజయదుందుభి -
కుర్రాళ్లూ.. శభాష్!
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. భారత బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో పాకిస్తాన్ ఫీల్డర్ కట్టాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ సహాయం చేశాడు. సెంచరీ పూర్తి చేసిన శుభ్‌మాన్ గిల్ దగ్గరకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లలో చాలా మంది అతడిని అభినందించారు. కీలక మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ వేసి ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ఫలితం ఎలావున్న యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. భారత్-పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన యువ టీమిండియాపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. శుభ్‌మాన్ గిల్‌ను అభినందిస్తున్న పాకిస్తాన్ ఆటగాళ్లు -
భారత్ సూపర్ విన్
-
చిత్తుగా ఓడిన పాక్.. భారత్ సూపర్ విన్
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే ప్రపంచకప్ టైటిల్‌కు యువ భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. సెమీస్ సమరంలో యువ పాక్ 203 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. 29.3 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ల పదునైన బంతులకు పాక్ బ్యాట్స్‌మన్ తలవంచారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. టపాటపా వికెట్లు నష్టపోయి చతికిలపడింది. ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. మొదటి నాలుగు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. శివసింగ్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఆటగాళ్లలో రొహైల్ నజీర్(18), సాద్ ఖాన్(15), మొహమ్మద్ మూసా(11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షహీన్ ఆఫ్రిది డకౌటయ్యాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) రాణించారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ మూసా 4, అర్షల్ ఇక్బాల్ 3 వికెట్లు పడగొట్టారు. షహీన్ ఆఫ్రిది ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
ఇషాన్ దూకుడు; పీకల్లోతు కష్టాల్లో పాక్
క్రైస్ట్‌చర్చ్: భారత్‌తో జరుగుతున్న అండర్–19 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 273 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ పాకిస్తాన్ స్వల్పస్కోరుకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 45 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. 21 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. యువ భారత బౌలర్ ఇషాన్ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాట్స్‌మన్‌ను వణికిస్తున్నాడు. మొదటి నాలుగు వికెట్లు అతడే నేలకూల్చడు. ఇమ్రాన్ షా(2), మహ్మద్ జైద్ ఆలం(7), అలీ జర్యాబ్(1), అమ్మద్ ఆలం(4)లను పెవిలియన్‌ను పంపించాడు. రియాన్ పరాగ్ రెండు వికెట్లు పడగొట్లాడు. శివసింగ్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) రాణించారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
కోట్లు కొల్లగొట్టిన కుర్రాళ్లు
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్ 11వ సీజన్‌కు జరుగుతున్న వేలంలో అండర్-19 కుర్రాళ్లు కోట్లు కొల్లగొట్టారు. తొలి రోజు బెంగళూరులో జరిగిన వేలంలో ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న పృథ్వీషా, కమలేష్ నాగర్ కోటి, శుభ్‌మన్ గిల్లు అధిక ధర పలికారు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న కమలేష్ నాగర్ కోటి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పలికాడు. ఈ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ టోర్ని ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నాగర్ కోటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి (3/29) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్రాంచైజీలు ఈ యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. దీంతో 20 లక్షలున్న నాగర్ కోటి కనీస ధర వేలంలో రూ. మూడు కోట్లు పైగా పలికాడు. ఇక అండర్-19 భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న పృథ్వీషా తన ఆటతో జూనియర్ సచిన్‌గా గుర్తింపు పొందాడు. ఈ తరుణంలో కుర్రాళ్ల జాబితాలో అందరి కన్నా అధిక ధర పలుకుతాడని అందరూ ఊహించగా అనూహ్యంగా రూ.1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇక మరో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక మాజీ అండర్-19 కెప్టెన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ అనూహ్యంగా 6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. -
విరాట్ కోహ్లిని తలపించాడు..!
వెల్లింగ్టన్ : అండర్ -19 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ టీమ్ అదరగొడుతోంది. గ్రూప్-బీలోని ప్రత్యర్థులు అందరినీ చిత్తు చేసిన పృథ్వీ షా సేన క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్-బీలో శుక్రవారం జరిగిన ఆఖరు మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడిన భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరిచింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ 59 బంతుల్లో 90 పరుగులు, దేశాయ్ 73 బంతుల్లో 56 పరుగులు సాధించడంతో చిన్న లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్ కొసిలాతి నుంగు విసిరిన 14వ ఓవర్లో గిల్ అద్భుతమైన షాట్‌ను ఆడి క్రికెట్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కోహ్లి ట్రేడ్ మార్క్ షాట్‌ను అదే తరహాలో ఆడిన గిల్ దాన్ని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఇదే మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అనుకుల్ సుధాకర్ రాయ్ కేవలం 20 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లను పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. -
సెమీస్‌కు చేరిన బంగ్లాదేశ్
ఢాకా: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. నేపాల్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 48.2ఓవర్లలో బంగ్లా నాలుగు వికెట్ల నష్టపోయి ఛేదించి సెమీస్ లోకి ప్రవేశించింది. బంగ్లా ఆటగాళ్లలో జాకీర్ హాసన్(75 నాటౌట్), మెహ్దీ హసన్ మిరాజ్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు పినాక్ గోష్(32), సైఫ్ హసన్(5), జోయరాజ్ షేక్(38), నజ్మముల్(8) వికెట్లను బంగ్లా కోల్పోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 211పరుగులు చేసింది. రిజాల్(72) మినహా ఎవరూ రాణించకపోవడంతో నేపాల్ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. -
అండర్-19 వరల్డ్ కప్ జట్లు ఖరారు
దుబాయ్: ఈనెల చివర్లో బంగ్లాదేశ్ లో ఆరంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ఖరారు చేసింది. టెస్టు హోదా ఉన్న 10 దేశాలే కాకుండా, మరో ఆరు సభ్య దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, కెనడా, నమీబియా, నేపాల్, స్కాట్లాండ్ కూడా ఈ టోర్నికి అర్హత సాధించాయి. అంతకుముందే ఈ ఆరు జట్లు అర్హత సాధించినా.. ఐసీసీ అధికారికంగా శుక్రవారం ఆయా జట్ల పేర్లను వెల్లడించింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకూ బంగ్లాదేశ్ లోని నాలుగు నగరాల్లో మొత్తం 8 వేదికల్లో పోటీలు జరుగనున్నాయి. స్థానిక కాలమాన ప్రకారం మ్యాచ్ లు ఉదయం గం.9.00.లకు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ తో చిట్టాగాంగ్ లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ ఒక్క గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. బంగ్లాదేశ్ లో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులున్నందున ఆస్ట్రేలియా ఈ టోర్నీకి దూరంగా ఉండనుంది. ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నట్లు ఐసీసీ పేర్కొంది. జనవరి 22 నుంచి 25 వరకూ వార్మప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
వరుసగా మూడో విజయం రాణించిన శామ్సన్, కుల్దీప్ అండర్ 19 ప్రపంచకప్ షార్జా: ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తడబడినా అండర్-19 ప్రపంచ కప్ ప్రధాన టోర్నమెంట్లో మాత్రం భారత యువ జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిచింది. పసికూన పపువా న్యూ గినియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 245 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సంజూ శామ్సన్ (48 బంతుల్లో 85, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 ఓవర్లలో 6 వికెట్లకు 301 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియా జట్టు 28.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్‌తో చెలరేగిన శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈనెల 22న దుబాయ్‌లో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. నిదానంగా మొదలుపెట్టి... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిదానంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు అంకుశ్ బైన్స్(83 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్), అఖిల్ హర్వాద్కర్ (40 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) గినియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. జట్టు స్కోరు 58 పరుగుల దగ్గర హర్వాద్కర్ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విజయ్ జోల్ (68 బంతుల్లో 35) నెమ్మదిగా ఆడాడు. బైన్స్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే వీళ్లిద్దరు కొద్ది పరుగుల తేడాతో అవుటైన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈ దశలో శామ్సన్, శ్రేయాస్ అయ్యర్ (38 బంతుల్లో 36; 3 ఫోర్లు) గినియా బౌలర్లను ఆడుకున్నారు. గినియా జట్టు బౌలర్ గెబాయ్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో శామ్సన్ వరుసగా 4, 4, 4, 4, 6, 1 స్కోరు చేశాడు. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 250 దాటించిన తర్వాత అయ్యర్ అవుటయ్యాడు. ఆ తర్వాత శామ్సన్ కూడా వెనుదిరిగాడు. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) జోరుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ స్కోరు 300 దాటింది. టపటపా... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ గినియాను భారత బౌలర్లు హడలెత్తించారు. రెండో ఓవర్ నుంచే గినియా వికెట్ల పతనం మొదలైంది. కుల్దీప్ యాదవ్ (4/10), మోను కుమార్ (3/13), దీపక్ హుడా (2/5) దెబ్బకు గినియా ఇన్నింగ్స్ 56 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 74 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై; పాకిస్థాన్ 146 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై; అఫ్ఘానిస్థాన్ 4 వికెట్ల తేడాతో నమీబియాపై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో శ్రీలంక (22న); అఫ్ఘానిస్థాన్‌తో దక్షిణాఫ్రికా (23న); ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ (23న) తలపడతాయి.