
U19 World Cup: India Vs Ireland: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా యువ భారత్ జట్టు నేడు ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్ ‘బి’లో భారత్, ఐర్లాండ్ జట్లు తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచాయి. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ వరుసగా రెండో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.
తొలి మ్యాచ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ ఒక్కడే బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో విక్కీ ఒస్త్‌వాల్, రాజ్ బావా మెరిశారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వెస్టిండీస్‌లోని టరూబాలో గల బ్రియన్ లారా స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
భారత జట్టు:
హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశి, షేక్ రషీద్, యశ్ ధుల్, ఆరాధ్య యాదవ్, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), కుశాల్ తంబే, రవి కుమార్, సిద్దార్థ్ యాదవ్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, నామవ్ ప్రకాశ్, అనీశ్వర్ గౌతమ్, రాజ్ బవా, వసు వాట్స్, విక్కీ ఒస్త్‌వాల్, గర్వ్ సంగ్వాన్.
చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment