Yash Dhull
-
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్‌ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
‘గుండె’ ధైర్యంతో ముందుకు.. క్రికెటర్‌గా రాణిస్తూ (ఫొటోలు)
-
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్‌కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్సీ కోల్పోయిన స్టార్ క్రికెటర్
చిన్న జట్టు చేతిలో పరాభవం ఓ యువ క్రికెటర్ కెప్టెన్సీకి ఎసరు తెచ్చిపెట్టింది. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా పసికూన పుదుచ్చేరి చేతిలో ఓడటంతో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ కెప్టెన్ యశ్ ధుల్‌ను పదవి నుంచి తొలగించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పుదుచ్చేరి చేతిలో పటిష్టమైన తమ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఢిల్లీ పెద్దలు మరో ఆలోచన లేకుండా కెప్టెన్‌పై వేటు వేశారు. కెప్టెన్సీ నుంచి యశ్ ధుల్‌ను తొలగించడంపై ఢిల్లీ హెడ్ కోచ్ దేవాంగ్ పటేల్ మాట్లాడుతూ.. యశ్ ధుల్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సెలెక్టర్ల నిర్ణయం. నా వరకైతే యశ్ ఢిల్లీ క్రికెట్‌తో పాటు టీమిండియాకు భవిష్యత్తు. ఇలాంటి ఆటగాడు కెప్టెన్సీ కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడు. యశ్ ముందుగా పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. యశ్‌ను పరుగులు చేయనీకుండా నియంత్రించే దేన్నైనా ముందుగా పక్కకు పెట్టాలి. కెప్టెన్సీ భారం అతన్ని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది. అందుకే సెలెక్టర్లు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని భావిస్తున్నాను. తదుపరి జరిగే మ్యాచ్‌కు యశ్ ధుల్ స్థానంలో మిడిలార్డర్ ఆటగాడు హిమ్మత్ సింగ్ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆయుశ్ బదోని హిమ్మత్ సింగ్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరిస్తానడి దేవాంగ్ పటేల్ తెలిపాడు. కాగా, సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన పుదుచ్చేరి చేతిలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 148, రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసిన పుదుచ్చేరి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి ఢిల్లీపై సంచలన విజయం సాధించింది. పుదుచ్చేరి బౌలర్ గౌరవ్ యాదవ్ 10 వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాశించాడు. ఢిల్లీ జట్టులో ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. -
ఢిల్లీకి ఊహించని షాక్.. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పుదుచ్చేరి
రంజీ ట్రోఫీ-2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్ గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్ త్యాగీ(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్‌ను 244 పరుగుల వద్ద ముగించి 96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్ ధుల్ విఫలమయ్యాడు. చదవండి: Pak Vs NZ: పాక్ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు! -
Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్ 128 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (29), కెప్టెన్ యశ్ ధుల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం జూనియర్ తలో 2 వికెట్లు, ముబాసిర్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అయూబ్, ఫర్హాన్, తాహిర్‌లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర శతకం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) మధ్యాహ్నం మొదలైన తుది సమరంలో టాస్ గెలిచిన భారత్.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అయూబ్, ఫర్హాన్, తాహిర్‌లతో పాటు ఒమైర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) కూడా రాణించారు. ఖాసిం అక్రమ్ (0), కెప్టెన్ మహ్మద్ హరీస్ (2), మెహ్రన్ ముంతాజ్ (13) విఫలం కాగా.. మహ్మద్ వసీం జూనియర్ (17), సూఫియాన్ ముఖీమ్ (4) నాటౌట్‌గా నిలిచారు. 14 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలరల్లో నిషాంత్ (5.30) మినహా అందరూ 6 అంతకంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 51 పరుగులు, హంగార్గేకర్ 6 ఓవర్లలో 48, అభిషేక్ శర్మ 9 ఓవర్లలో 54, యువ్‌రాజ్ సింగ్ దోడియా 7 ఓవర్లలో 56, మానవ్ సుతార్ 9 ఓవర్లలో 68, రియాన్ పరాగ్ 4 ఓవర్లలో 24.. ఇలా ప్రతి భారత బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్లకు స్వర్గధామమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద తప్పిదమని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్ధి భారీ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, టీమిండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని, ఎలాగైనా తామే గెలుస్తామని భారత అభిమానులు సోషల్‌మీడియా వేదికగా యువ భారత జట్టుకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. -
భారత్-పాకిస్తాన్ ఫైనల్ పోరు.. ఏ జట్టు ఫేవరేట్ అంటే?
ఆసియా ‘ఎమర్జింగ్’ కప్ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్‌గా ఉంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా నిశాంత్ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్ వసీమ్, కెప్టెన్ మొహమ్మద్ హారిస్, ఫర్హాన్, అర్షద్ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్ టీమ్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు. తుది జట్లు(అంచనా): భారత్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ పాకిస్తాన్: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్ చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
Asia Cup: చెలరేగిన స్పిన్నర్లు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! పాకిస్తాన్‌తో ఢీ
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భారత- ఏ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబోలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 51 పరుగులతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలి సెమీస్‌లో శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌తో టైటిల్ వేటలో తలపడనుంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. ఇక నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) నిరాశ పరిచారు. 49.1ఓవర్లలో కేవలం 211 పరుగులు మాత్రమే చేసిన యశ్ ధుల్ సేన ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ తలా రెండు వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చెలరేగిన స్పిన్నర్లు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దంచికొట్టింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ 38, తంజీద్ హసన్ 51 పరుగులతో రాణించారు. వన్‌డౌన్‌లో వచ్చిన జాకీర్ హసన్ మాత్రం 5 పరుగులకే చేతులెత్తేయగా.. భారత స్పిన్నర్లు మానవ్ సుతార్, నిశాంత్ సింధు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. మానవ్ 3 వికెట్లు సాధించగా.. నిశాంత్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. యువరాజ్‌సిన్హ్ దోడియా , అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. దీంతో 160 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. 51 పరుగులతో భారత జయభేరి మోగించింది. యశ్ ధుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక జూలై 23న ఫైనల్లో పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. చదవండి: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
సెమీస్‌లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్‌లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్‌సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్‌లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్‌లు ఇదివరకే సెమీస్‌కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్‌కు చేరిన భారత్, పాక్‌లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాక్‌లకే ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్‌లో భారత్-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్‌లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్‌కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్‌బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్‌లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్‌లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్‌గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్‌లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
శతక్కొట్టిన యశ్ ధుల్.. ఆసియా కప్‌లో టీమిండియా బోణీ
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ (జులై 14) జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ.. యూఏఈ-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ యశ్ ధుల్ అజేయమైన సూపర్ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్) మెరిసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (41 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా భారత్.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. హర్షిత్ రాణా (4/41), నితిశ్ రెడ్డి (2/32), మానవ్ సుథార్ (2/28), ఆకాశ్ సింగ్ (1/10) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ష్ శర్మ (38), కెప్టెన్ చిదంబరం (46), అలీ నసీర్ (10), మొహమ్మద్ ఫరాజుద్దీన్ (35), జష్ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. శతక్కొట్టిన యశ్ ధుల్.. నిరాశపరచిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత-ఏ.. యశ్ ధుల్ సెంచరీతో మెరవడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది (26.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి). ఓపెనర్లు, ఐపీఎల్-2023 స్టార్లు సాయి సుదర్శన్ (8), అభిషేక్ శర్మ నిరాశపరిచినప్పటికీ, యశ్ ధుల్.. నికిన్ జోస్ సహకారంతో టీమిండియాను గెలిపించాడు. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా, అలీ నసీర్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్‌ను మట్టికరిపించిన పాక్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ.. నేపాల్-ఏపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 37 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 32.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో సోంపాల్ కామీ (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాక్ బౌలర్లు షానవాజ్ దహానీ (5/38), మహ్మద్ వసీం జూనియర్ (4/51) విజృంభించారు. పాక్ ఇన్నింగ్స్‌లో తయ్యబ్ తాహిర్ (51) టాప్ స్కోరర్ కాగా.. నేపాల్ బౌలర్లు లలిత్ రాజబంశీ (3/50), పవన్ సర్రాఫ్ (2/15) రాణించారు. -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కి సితాంషు కొటక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
ఢిల్లీ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఆంధ్ర జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి. కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్‌డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్‌కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! -
ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా యశ్ ధుల్.. 20 ఏళ్ల వయస్సులోనే
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 20 ఏళ్ల యశ్ ధుల్ సారథ్యం వహించనున్నాడు. జట్టులో ఇషాంత్ శర్మ, నితీష్ రాణా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజేమెంట్ యశ్ ధుల్కి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. కాగా అతడి సారథ్యంలోనే యువ భారత జట్టు ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుంది. అతడి కెప్టెన్సీ నైపుణ్యాలు చూసి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక గత రంజీ సీజన్ లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన యశ్‌దుల్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 820 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఏడాది రంజీ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి పుణే వేదికగా ప్రారంభం కానుంది. ఢిల్లీ జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హిమ్మత్ సింగ్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ షోరే, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), వైభవ్ రావల్, లలిత్ యాదవ్,నితీష్ రాణా, ఆయుష్ బదోని, హృతిక్ షోకీన్, శివంక్ వశిష్త్, వికాస్ మిశ్రా, జాంటీ సిద్ధు, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, సిమర్జీత్ సింగ్ లక్షయ్ థరేజా, ప్రన్షు విజయరన్ -
ఇదేం షాట్ అయ్యా యష్ ధుల్ .. నేనెక్కడా చూడలే.. బంతిని చూడకుండానే!
ఐపీఎల్-2022కు సమయం దగ్గర పడడంతో అన్ని జట్లు నెట్స్‌లో చెమట్చోడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు, భారత అండర్-19 కెప్టెన్ యష్ ధుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్లో అద్భుతమైన షాట్లు ఆడుతూ యష్ ధుల్ అలరించాడు. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా బంతిని చూడకుండానే 'అప్పర్ కట్' షాట్ ఆడి అందరనీ యష్ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన యష్ ధుల్‌ను ఐపీఎల్ మెగా వేలంలో రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో భారత జట్టును ఛాంపియన్ యశ్ ధుల్ నిలిపిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. పాకిస్తాన్ పర్యటన కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచ్ల్ మార్ష్ ఢిల్లీ జట్టు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మరో వైపు ఆ జట్టు పేస్ బౌలర్ అన్రీచ్ నోర్జే జట్టులో చేరినప్పటికీ అతడు అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' That No-look was S.M.O.O.T.H 🤌 🔝 Upper Cut 🔥 @YashDhull2002 🤩#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/vrnyoso5MS — Delhi Capitals (@DelhiCapitals) March 21, 2022 -
IPL 2022: సిక్సర్లు బాదిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు
IPL 2022- Rishabh Pant: ఐపీఎల్-2022 సమరానికి జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర రిషభ్ పంత్ సైతం నెట్స్‌లో చెమటోడ్చాడు. వరుస షాట్లతో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. యువ ఆటగాళ్లు యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, కమలేష్ నాగర్కోటి అలా చూస్తూ ఉండిపోయారు. పంత్ ఆటను నిశితంగా గమనించారు. కాగా శ్రీలంకతో ఇటీవల స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లో పంత్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరాడు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో బస చేస్తున్న జట్టుతో కలిశాడు. ఇక శ్రీలంకతో సిరీస్‌లో పంత్ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కాగా మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇక ఢిల్లీ.. మార్చి 27 న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ఆరంభించనుంది. చదవండి: Shane Warne: నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది: వార్న్ మాజీ ప్రేయసి భావోద్వేగం 🎶 𝘿𝙞𝙡𝙡𝙞 𝙠𝙤 𝙠𝙖𝙧𝙖𝙖𝙧 𝙖𝙖𝙮𝙖 🔥#YehHaiNayiDilli #IPL2022 @RishabhPant17 pic.twitter.com/thTbpJb9X8 — Delhi Capitals (@DelhiCapitals) March 20, 2022 -
యశ్ ధుల్ వీర విజృంభణ.. డబుల్ సెంచరీతో చెలరేగిన ఢిల్లీ డైనమైట్
Yash Dhull Scores Double Century: అండర్-19 ప్రపంచకప్ 2022లో యువ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యశ్ ధుల్.. అరంగేట్రం రంజీ సీజన్లోనే అదరగొడుతున్నాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(113, 113 నాటౌట్) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ అమన్‌దీప్ కారే (156 నాటౌట్), శశాంక్ సింగ్ (122) శతకాలతో రాణించడంతో 482/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 295 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఈ క్రమంలో యశ్ ధుల్, దృవ్ షోరే (100; 13 ఫోర్లు), నితీశ్ రాణా (57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి, మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ధుల్ 29 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ధుల్ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. చదవండి: శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ -
టీమిండియా క్రికెటర్లకు అవమానం.. వ్యాక్సిన్ వేసుకోలేదని..!
ICC U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత యువ జట్టుకు కరీబియన్ గడ్డపై అవమానం జరిగినట్లు తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు ఒక రోజంతా అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. అంతటితో ఆగకుండా ఆ ఏడుగురు ఆటగాళ్ల(రవికుమార్, రఘువంశీ తదితరులు)ను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరించారని, భారత ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని బెదిరించారని బాంబు పేల్చాడు. భారత్‌లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులకు వినలేదని, ఆ ఏడుగురిని తర్వాతి ఫ్లయిట్లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. 24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఆటగాళ్లు మ్యాచ్ వేదిక అయిన గయానాకు చేరుకున్నారని పేర్కొన్నాడు. కాగా, అండర్ 19 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన భారత యువ జట్టు, రెండు మ్యాచ్‌ల తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జట్టులోని ఐదుగురు కీలక ప్లేయర్ల (కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ తదితరులు)తో పాటు అడ్మినిస్టేషన్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ యువ భారత క్రికెటర్లు ఏ మాత్రం తగ్గకుండా ఐదోసారి ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టించారు. చదవండి: ఈ ఫోటోలో విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..! -
చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో యష్ సెంచరీల మోత మోగించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన యశ్ ధుల్..రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో యశ్ ధుల్ అరుదైన ఫీట్ సాధించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోను సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా యష్‌ధుల్ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి కాగా, మహారాష్ట్ర బ్యాటర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. 1952-53 రంజీట్రోఫీ సీజన్లో కాంట్రాక్టర్ ఈ ఘనత సాధించగా, 2012-13 సీజన్లో విరాగ్ అవతే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేసిన యష్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 113 పరగులు సాధించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rashid Khan: గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా? Only the 3rd player in the history of #RanjiTrophy to hit 2⃣ centuries on debut 🔥 A dream start for @YashDhull2002 💙#YehHaiNayiDilli #DELvTN pic.twitter.com/ZXY6Gt00aQ — Delhi Capitals (@DelhiCapitals) February 20, 2022 -
"అతడు త్వరలోనే టీమిండియా లోకి వస్తాడు"
Vinod Kambli Hails Yash Dhull After Ranji Ton: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన యష్ ధుల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. యష్ ధుల్ త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని కాంబ్లీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యష్.. తమిళనాడుపై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 150 బంతుల్లో 113 పరుగులు యష్ చేశాడు. ఇక అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా యష్ ధుల్ భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. "ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యష్ ధుల్ తన కేరిర్‌ను ఘనంగా ఫ్రారంభించాడు. తొలి సెంచరీను తన దైన శైలిలో సాధించాడు. అతడు దేశీయ స్ధాయి, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నాను. యష్ ఖచ్చితంగా భారత్ తరుపున త్వరలోనే అరంగేట్రం చేస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ధూల్" అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ యష్ ధుల్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!