ICC U19 World Cup 2022: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత యువ జట్టుకు కరీబియన్ గడ్డపై అవమానం జరిగినట్లు తెలుస్తుంది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు ఒక రోజంతా అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. అంతటితో ఆగకుండా ఆ ఏడుగురు ఆటగాళ్ల(రవికుమార్, రఘువంశీ తదితరులు)ను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరించారని, భారత ప్రభుత్వ అనుమతి వచ్చేవరకూ వారిని కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని బెదిరించారని బాంబు పేల్చాడు.
భారత్‌లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులకు వినలేదని, ఆ ఏడుగురిని తర్వాతి ఫ్లయిట్‌లో ఇండియాకి తిరిగి పంపిచేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. 24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఆటగాళ్లు మ్యాచ్ వేదిక అయిన గయానాకు చేరుకున్నారని పేర్కొన్నాడు.
కాగా, అండర్ 19 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్‌లో అడుగు పెట్టిన భారత యువ జట్టు, రెండు మ్యాచ్‌ల తర్వాత కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జట్టులోని ఐదుగురు కీలక ప్లేయర్ల (కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ తదితరులు)తో పాటు అడ్మినిస్టేషన్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ యువ భారత క్రికెటర్లు ఏ మాత్రం తగ్గకుండా ఐదోసారి ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టించారు.
చదవండి: ఈ ఫోటోలో విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..!
Comments
Please login to add a commentAdd a comment