''ధోని ఫినీషెస్ ఆఫ్ ఇస్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇన్‌టూది క్రౌడ్.. ఇండియా లిప్ట్స్ ది వరల్డ్‌కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. ఈ పదం క్రికెట్‌ను అభిమానించే ప్రతీ భారతీయుడు తమ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోడు. మన చెవుల తుప్పు వదిలేలా ఎన్నోసార్లు ఈ వీడియోనూ యూట్యూబ్‌ల్లో ప్లేచేసిన సందర్భం కోకోల్లలు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా 2011 ప్రపంచకప్ అందుకున్న మధుర క్షణాలవి. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం. అయినా అది మరిచిపోయే విషయం కాదని కూడా తెలుసు. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహీ 90 పరుగులు నాటౌట్‌గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా.
విషయం ఏంటంటే.. శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖర్లో వికెట్ కీపర్ దినేష్ బనా కొట్టిన విన్నింగ్ సిక్స్ అచ్చం ధోని సిక్స్‌లా కనిపించింది. అక్కడ ధోని ఎలా అయితే సిక్స్ కొట్టి టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడో.. అచ్చం అదే తరహాలో దినేష్ బనా కూడా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఇండియాను ఐదోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్స్‌లా నిలిపాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల్లోనే బనా కొట్టిన సిక్స్‌ను ధోని సిక్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐసీసీ కూడా బనా సిక్స్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఇంతకముందు ఇలాంటి సిక్స్‌తో ముగిసిన ఎండింగ్‌ను మీరెక్కడైనా చూశారా'' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎంఎస్ ధోని.. దినేష్ బనాలు ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే.
చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత
'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం'
Comments
Please login to add a commentAdd a comment