ICC Under-19 World Cup
-
నిన్న టీమిండియాలోకి అన్న.. ఇప్పుడేమో తమ్ముడి విధ్వంసకర సెంచరీ
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఆటగాడు ముషీర్ ఖాన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్(118)సెంచరీతో సత్తాచాటాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 325 పరుగులు చేశాడు. కాగా ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు స్వయానా ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. నిన్న ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు రావడం.. ఈ రోజు తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ముషీర్‌తో పాటు ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా? -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్‌తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
ఐసీసీ అండర్-19 టి20 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక మహిళా క్రికెటర్ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్. విషయంలోకి వెళితే.. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్ చివరి బంతిని అమీ స్మిత్ లాంగాఫ్ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హామిల్టన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్ ఎండ్ వైపు విసిరింది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్ రనౌట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్ అడ్డుకోకపోయుంటే హామిల్టన్ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆసీస్ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్ నిరాశగా పెవిలియన్ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్ 36, సియాన్నా జింజర్ 30 పరుగులు, కేట్ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాగీ క్లార్క్ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ -
పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే
వచ్చే ఏడాది జనవరిలో తొలిసారి ఐసీసీ అండర్-19 వుమెస్స్ టి20 వరల్డ్‌కప్ జరగనుంది. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొననున్నాయి. కాగా 11 దేశాలు ఐసీసీ ఫుల్‌టైం మెంబర్స్ కాగా.. మిగతా ఐదు దేశాలను మాత్రం ఐసీసీ రీజియన్స్ నుంచి ఎంపిక చేశారు. వాటిలో అమెరికా(యూఎస్ఏ) కూడా ఒకటి. తాజాగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్-19 వుమెన్స్ టి20 టోర్నమెంట్‌కు యూఎస్ఏ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే క్రికెట్ అమెరికా ప్రకటించిన జట్టు చూస్తుంటే.. అసలు ఆడుతుంది అమెరికా లేక భారత్ అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే జట్టుకు ఎంపికచేసిన 15 మంది భారత సంతతికి చెందినవాళ్ల కావడం గమనార్హం. ఇక రిజ్వర్స్ కేటగిరలో ఎంపిక చేసిన ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్‌కే చెందిన వారే ఉన్నారు. ఇలా జట్టు మొత్తం భారతీయుల పేర్లతో నిండిపోయింది. ఇది గమనించిన క్రికెట్ ఫ్యాన్స్.. అమెరికా జట్టులాగా లేదు.. ఇండియా-బి టీమ్ స్క్వాడ్లాగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇక జట్టు హెడ్‌కోచ్‌గా విండీస్ మాజీ క్రికెటర్ శివ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఎంపిక చేసింది. ఇక ఐసీసీ తొలి అండర్-19 వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ 2023 జనవరి 14 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. జనవరి 27న జరిగే సెమీఫైనల్స్‌కు జేబీ మార్క్స్ ఓవల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జనవరి 29న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. U-19 టోర్నమెంట్ కోసం యూఎస్ఏ ప్రకటించిన జట్టు: గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్ (వికెట్ కీపర్), పూజా షా, రీతూ సింగ్ ,సాయి తన్మయి ఎయ్యుణ్ణి,స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా రిజర్వ్ ప్లేయర్స్: చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్ కోచింగ్, సహాయక సిబ్బంది: ప్రధాన కోచ్: శివనారాయణ్ చంద్రపాల్ టీమ్ మేనేజర్: జాన్ ఆరోన్ జట్టు విశ్లేషకుడు: రోహన్ గోసాల అసిస్టెంట్ కోచ్: బర్ట్ కాక్లీ ఫిజియో/మెడికల్: డా. ఆడ్రీ ఆడమ్స్ అసిస్టెంట్ టీమ్ మేనేజర్: జోన్ అలెగ్జాండర్-సెరానో 📡MEDIA RELEASE: USA Cricket Women's U19s Squad for Historic First World Cup Appearance Named 15-player squad to represent Team USA is named for the inaugural ICC Under-19 Women’s T20 World Cup in South Africa next month ➡️: https://t.co/xB789FYppc#WeAreUSACricket🇺🇸 #U19CWC pic.twitter.com/x6Y00UXrE7 — USA Cricket (@usacricket) December 14, 2022 United States of India — Rahul Goyal (@rahulgoyalactor) December 14, 2022 USA Cricket team or India B team?? — Vignesh (@vickki93) December 14, 2022 The USA women's cricket team is a more diverse representation of India than the Indian women's cricket team!:) — Sandeep Ramesh (@SandeepRamesh) December 14, 2022 చదవండి: కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
అప్పుడు ధోని.. ఇప్పుడు దినేష్ బనా; అదే విన్నింగ్ సిక్స్
''ధోని ఫినీషెస్ ఆఫ్ ఇస్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇన్టూది క్రౌడ్.. ఇండియా లిప్ట్స్ ది వరల్డ్‌కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. ఈ పదం క్రికెట్‌ను అభిమానించే ప్రతీ భారతీయుడు తమ ఊపిరి ఉన్నంతవరకు మరిచిపోడు. మన చెవుల తుప్పు వదిలేలా ఎన్నోసార్లు ఈ వీడియోనూ యూట్యూబ్‌ల్లో ప్లేచేసిన సందర్భం కోకోల్లలు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా 2011 ప్రపంచకప్ అందుకున్న మధుర క్షణాలవి. ఇక ఆరోజు శ్రీలంకతో ఫైనల్లో ఎంఎస్ ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎన్నోసార్లు టీవీలో చూసుంటాం. అయినా అది మరిచిపోయే విషయం కాదని కూడా తెలుసు. ఆ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహీ 90 పరుగులు నాటౌట్‌గా నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా. విషయం ఏంటంటే.. శనివారం ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదోసారి చాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖర్లో వికెట్ కీపర్ దినేష్ బనా కొట్టిన విన్నింగ్ సిక్స్ అచ్చం ధోని సిక్స్‌లా కనిపించింది. అక్కడ ధోని ఎలా అయితే సిక్స్ కొట్టి టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడో.. అచ్చం అదే తరహాలో దినేష్ బనా కూడా లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టి ఇండియాను ఐదోసారి అండర్-19 వరల్డ్ చాంపియన్స్‌లా నిలిపాడు. ఇంకేముంది కొన్ని నిమిషాల్లోనే బనా కొట్టిన సిక్స్‌ను ధోని సిక్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐసీసీ కూడా బనా సిక్స్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఇంతకముందు ఇలాంటి సిక్స్‌తో ముగిసిన ఎండింగ్‌ను మీరెక్కడైనా చూశారా'' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎంఎస్ ధోని.. దినేష్ బనాలు ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' View this post on Instagram A post shared by ICC (@icc) -
యశ్ ధుల్ ఖాతాలో మరో అరుదైన ఘనత
అండర్-19 టీమిండియా యంగ్ కెప్టెన్ యశ్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి అండర్-19 ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యశ్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యశ్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన ప్రతీసారి ఐసీసీ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌ను ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే యశ్ ధుల్ కెప్టెన్‌గా.. ఈ టోర్నీలో పాల్గోన్న ఎనిమిది దేశాల నుంచి అత్యంత మెరుగ్గా రాణించిన మరో 11 మంది భవిష్యత్తు స్టార్లను జట్టుగా ఎంపికచేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి యశ్ ధుల్‌తో పాటు.. టోర్నమెంట్లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాతో పాటు స్పిన్నర్‌విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఈ అత్యుత్తమ జట్టును ఐసీసీ మ్యాచ్ రిఫరీ గ్రీమి లాబ్రోయ్, జర్నలిస్ట్ సందీపన్ బెనర్జీ, కామెంటేటర్స్ సామ్యూల్ బద్రి, నాటల్లీ జెర్మనోస్ కలిసి ఎంపిక చేశారు. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ 12 మందితో కూడిన జట్టులో ఓపెనర్లుగా హసీబుల్లాఖాన్(పాకిస్తాన్, వికెట్ కీపర్), టీగు విల్లీ(ఆస్ట్రేలియా).. ఇక టోర్నమెంట్లో పరుగుల వరద పారించి జూనియర్ ఏబీగా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) వన్‌డౌన్‌కు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియాను నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన టామ్ పెర్స్ట్ ఐదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో టీమిండియా నుంచి రాజ్ బవా.. శ్రీలంకు నుంచి దునిత్ వెల్లలగే ఎంపికయ్యారు. ఇక స్పిన్నర్‌గా టీమిండియా తరపున విశేషంగా రాణించిన విక్కీ ఓస్త్వాల్కు చోటు దక్కింది. ఇక పేసర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన జోష్ బోయెడెన్, పాకిస్తాన్‌కు చెందిన అవైస్ అలీ, బంగ్లాదేశ్‌కు చెందిన రిపన్ మోండోల్ ఎంపికయ్యారు. ఇక జట్టులో పన్నెండవ ఆటగాడిగా అఫ్గనిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ నూర్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఈ ఆల్‌రౌండర్ 10 వికెట్లు తీయడంతో పాటు విలువైన పరుగులు సాధించాడు. చదవండి: Washington Sundar: ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా ఐసీసీ అండర్-19 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్: హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్, పాకిస్థాన్) టీగ్ విల్లీ (ఆస్ట్రేలియా) డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) యశ్ ధుల్ (కెప్టెన్, ఇండియా) టామ్ పెర్స్ట్ (ఇంగ్లండ్) దునిత్ వెల్లలాగే (శ్రీలంక) రాజ్ బవా (భారతదేశం) విక్కీ ఓస్త్వాల్ (భారతదేశం) రిపన్ మోండోల్ (బంగ్లాదేశ్) అవైస్ అలీ (పాకిస్థాన్) జోష్ బోడెన్ (ఇంగ్లండ్) నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) -
ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. విషయం తెలియక..!
కరీబియన్ దీవులు వేదికగా జరుగుతున్న పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2022లో భూకంపం సంభవించింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానంలో ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు 20 సెకెన్ల పాటు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. Earthquake at Queen's Park Oval during U19 World Cup match between @cricketireland and @ZimCricketv! Ground shook for approximately 20 seconds during sixth over of play. @CricketBadge and @NikUttam just roll with it like a duck to water! pic.twitter.com/kiWCzhewro — Peter Della Penna (@PeterDellaPenna) January 29, 2022 అయితే భూమి కంపించిన సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు విషయం తెలియకపోవడం విశేషం. జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సందర్భంగా భూ ప్రకంపనలు సంభవించినట్లు కొద్దిసేపటి తర్వాత కామెంటేటర్లు చెప్పడంతో విషయం తెలిసింది. భూకంపం సమయానికి కెమెరాలు షేక్ అవుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ముజామిల్ షెర్జాద్(5/20) ధాటికి 48.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ కాగా, ఛేదనలో ఐర్లాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 32 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. జాక్ డిక్సన్ 78, కెప్టెన్ టిమ్ టెక్టర్ 76 పరుగులతో అజేయంగా నిలిచి ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. చదవండి: "భారత్‌ను నెం1గా నిలపాలని కష్టపడ్డాడు.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా ఉండాల్సింది" -
ICC Cricket World Cup: 11 మంది ప్లేయర్లు లేక టోర్నీ మధ్యలోనే నిష్క్రమణ
Canada Under 19 Cricket Team To Fly Back Home: అండర్-19 ప్రపంచ కప్ 2022 టోర్నీపై కరోనా కన్నెర్ర చేసింది. టోర్నీలో పాల్గొనేందుకు కరీబియన్ దీవులకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు క్యూ కట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడి, కోలుకోగా.. తాజాగా కెనడా జట్టులో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేక టోర్నీ మధ్యలోనే తప్పుకుంది. స్కాట్లాండ్తో ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌కు ముందు కెనడా జట్టుకు ఈ దుస్థితి ఎదురైంది. మహమ్మారి కారణంగా పరిస్థితులు చేజారుతుండటంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది. కాగా, టోర్నీ లీగ్ దశలో ఉండగా టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు భారత్ జంబో జట్టుతో ప్రపంచకప్ బరిలోకి దిగడంతో ఆటగాళ్ల కొరత ఏర్పడలేదు. ఈ దశలో ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నా టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఉగాండా, ఐర్లాండ్‌లపై భారీ విజయాలు నమోదు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇవాళ క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న యువ భారత్.. 2019 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతుంది. కాగా, గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. గ్రూప్ 2 నుంచి రెండో బెర్తు కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. చదవండి: IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..! -
ఆహా.. ఏమా క్యాచ్..! అచ్చం పక్షిలా గాల్లోకి ఎగురుతూ..
Windies Player Teddy Bishop Superman Catch: అండర్ 19 ప్రపంచ కప్ 2022లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ యువకెరటం టెడ్డీ బిషప్ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అమోరీ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్ రాబర్ట్సన్ స్లిప్ దిశగా ఆడగా, అక్కడే కాపు కాసిన బిషప్.. అచ్చం పక్షిలా గాల్లోకి ఎగురుతూ సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. ఈ విన్యాసాన్ని చూసి మైదానంలోని సహచరులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం అవాక్కయ్యింది. Reflexes 💯This extremely sharp take at first slip by Teddy Bishop has been voted @Nissan Play of the Day winner after Day 4 👏 pic.twitter.com/DLKDPqVV3F— ICC (@ICC) January 18, 2022 ఆహా.. ఏమా క్యాచ్.. అంటూ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సూపర్ మ్యాన్ క్యాచ్.., స్పైడర్ మ్యాన్ దొరికాడు.., జూనియర్ జాంటీ రోడ్స్.., అథ్లెటిజం విండీస్ క్రికెటర్ల రక్తంలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో బిషప్ మరో సెన్సేషనల్ క్యాచ్ అందుకోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ(23 నాటౌట్) రాణించి తన జట్టును గెలిపించాడు. చదవండి: U19 World Cup: ఐర్లాండ్‌తో మ్యాచ్... ఇండియా క్వార్టర్స్ చేరేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
అండర్ 19 వరల్డ్ కప్: రేపు భారత్ పాక్ సెమీఫైనల్
-
నేటి నుంచి కుర్రాళ్ల పోరు
కేప్‌టౌన్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు కుర్రాళ్లకు అవకాశం దక్కింది. నేటి నుంచి అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు వారు సిద్ధమయ్యారు. మొత్తం 16 జట్లు తలపడే ఈ టోర్నీలో యువ భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఎలాగో కుర్రాళ్ల సంగ్రామంలో భారత్ అలాంటి జట్టు. ఎవరికీ సాధ్యం కానీ రీతిలో యువ జట్టు నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా నిలిచింది. ఇప్పుడు గ్రూప్–డిలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో మరో టైటిల్ వేటకు సిద్ధమైంది. నేడు ఆతిథ్య దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’లో తొలి పోరు జరగనుండగా... 19న యువ భారత్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. వచ్చే నెల 9న జరిగే తుదిపోరుతో ఈ మెగా ఈవెంట్ ముగుస్తుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక దశలో ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్ లీగ్‌లో తలపడతాయి. ఇంకో దశలో తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేట్ లీగ్ పోటీలు జరుగుతాయి. అయితే సూపర్ లీగ్ జట్లు మాత్రమే టైటిల్ వేటలో ఉండగా... మిగతా జట్లు వర్గీకరణ పోటీల్లో తలపడతాయి. భారత అండర్–19 జట్టు: ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ, అథర్వ అంకోలెకర్, యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్, దివ్యాన్‡్ష సక్సేనా, సిద్ధేశ్ వీర్, ఆకాశ్ సింగ్, శుభాంగ్ హెగ్డే, ధ్రువ్ జురెల్, కుశాగ్ర కుమార్, విద్యాధర్ పాటిల్, శాశ్వత్ రావత్, దివ్యాన్‡్ష జోషి. యువ భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ (వేదిక బ్లూమ్ఫొంటెన్ ) జనవరి 19 భారత్–శ్రీలంక జనవరి 21 భారత్–జపాన్ జనవరి 24 భారత్–న్యూజిలాండ్. -
మనోళ్లు ఐదుగురు
దుబాయ్: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటుదక్కింది. కెప్టెన్ పృథ్వీ షాతో పాటు మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, కమలేశ్ నాగర్కోటి, అనుకూల్ రాయ్‌లు ఈ టీమ్‌లో ఉన్నారు. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకే బెర్తు దక్కగా... నాలుగోసారి చాంపియన్ అయిన భారత ఆటగాళ్లే ఐదుగురు ఉండటం విశేషం. ఐసీసీ జట్టు: రేనార్డ్ వాన్ (కెప్టెన్, దక్షిణాఫ్రికా), పృథ్వీ షా, మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, నాగర్కోటి, అనుకుల్ రాయ్ (భారత్), ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), మక్వెటు (వికెట్ కీపర్), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), కైయిస్ అహ్మద్ (అఫ్గానిస్తాన్), షహీన్ ఆఫ్రిది (పాకిస్తాన్), 12వ ఆటగాడుగా అలిక్ అథనాజ్ (వెస్టిండీస్). -
ఆసీస్‌ను చితగ్గొట్టారు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): ఐసీసీ అండర్– 19 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. కెప్టెన్ పృథ్వీ షా (100 బంతుల్లో 94; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మన్జోత్ కల్రా (99 బంతుల్లో 86; 12 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మాన్ గిల్ (54 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలో 228 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌలింగ్‌లో పేసర్లు కమలేశ్ నాగర్కోటి (3/29), శివమ్ మావి (3/45) నిప్పులు చెరిగారు. దీంతో క్రమంగా వికెట్లు పడటంతో ఏ దశలోనూ ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా పయనించలేకపోయింది. ఓపెనర్ జాక్ ఎడ్వర్డ్స్ (73; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, జొనాథన్ మెర్లో (38), బాక్స్టర్ హోల్ట్ (39) ఫర్వాలేదనిపించారు. రేపు జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్...పపువా న్యూగినియాతో తలపడుతుంది. -
కెప్టెన్‌గా పృథ్వీ షా
న్యూఢిల్లీ: ముంబై యువ సంచలనం పృథ్వీ షా యువ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ అండర్–19 టోర్నీకి న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ టీమ్‌లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. క్రితంసారి ఈ మెగా టోర్నీలో రన్నరప్ అయిన భారత్ మూడు సార్లు (1988, 2002, 2010) విజేతగా నిలిచింది. భారత అండర్–19 జట్టు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), మన్జోత్ కల్రా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఆర్యన్ జుయల్, హార్విక్ దేశాయ్ (వీళ్లిద్దరు వికెట్ కీపర్లు), శివమ్ మావి, కమలేశ్ నాగర్కోటి, ఇషాన్ పొరెల్, అర్‡్షదీప్ సింగ్, అనుకూల్ రాయ్, శివా సింగ్, పంకజ్ యాదవ్. స్టాండ్‌బైలు: ఓం భోస్లే, రాహుల్ చహర్, నినద్ రథ్వా, ఉర్విల్ పటేల్, ఆదిత్య థాకరే. -
ఒక్క మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ మనదే
ఢాకా: ఒక్క అడుగు.. ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ మనసొంతం అవుతుంది. మంగళవారం ఢాకా షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన సెమీస్ లో 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసిన భారత యువ జట్టు సగర్వంగా ఫైనల్స్ లోకి ప్రవేశించి టైటిల్ గెలుచుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ల మధ్య గురువారం (ఫిబ్రవరి 11న) రెండో సెమీస్ జరగనుంది. ఆ మ్యాచ్ విజేతతో ఆదివారం (ఫిబ్రవరి 14న) జరగనున్న ఫైనల్స్ లో యువ భారతజట్టు తలపడుతుంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో తొలి 10 ఓవర్లు లంక బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి 10 ఓవర్లలో భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రేమే చేయగలిగింది. అయితే వన్ డౌన్ బ్యాట్స్ మన్ అన్మోల్ ప్రీత్ సింగ్ (72), నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (59) భారత ఇన్నింగ్ ను చక్కదిద్దారు. ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ (43), అర్మాన్ జాఫర్ (29)లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 267 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఫెర్మాండో 4, కుమారా, నిమేశ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 268 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్లిద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, వన్ డౌన్ లో వచ్చిన మెండిస్(39), ఐదో స్థానంలో వచ్చిన అశాన్(38)ను కాసేపు పోరాడారు. ఆ తర్వాత డిసిల్వ (28), బంద్న్ సిల్వా (24)లు చేసిన పరుగులు బూడిదలోపోసిన పన్నీరయ్యాయి. లంక జట్టును 42.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా భారత్ 97 పరుగుల విజయాన్ని మూటగట్టుకుంది. మన బౌలర్లలో ఎంజే డగార్ 3, అవేశ్ ఖాన్ 2, అహ్మద్, బాతమ్, సుందర్ లు తలోవికెట్ సాధించారు. -
మేం బంగ్లాదేశ్‌లో ఆడలేం
♦ అండర్-19 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా మెల్బోర్న్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు వైదొలిగింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ జరుగనుండగా భద్రతాకారణాలరీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇదే కారణంతో ఆసీస్ సీనియర్ జట్టు కూడా గత అక్టోబర్‌లో బంగ్లా పర్యటనను వాయిదా వేసుకుంది. అప్పటి నుంచి అక్కడి పరిస్థితిని తాము సమీక్షిస్తున్నట్టు సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ‘ఐసీసీ భద్రతా సలహాదారులతో కలిసి గత వారం సీఏ భద్రతా కమిటీ చీఫ్ షాన్ కారాల్ ఢాకాకు వెళ్లారు. సంబంధిత అధికారులను కలిసి టోర్నీ సెక్యూరిటీ వివరా ల గురించి తెలుసుకున్నారు. అయితే ఆసీస్ జాతీ యులపై దాడులు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయన్న మా ప్రభుత్వ సలహా మేరకు కప్ నుంచి తప్పుకున్నాం. ఇది కఠిన నిర్ణయమే అయినా నిర్వాహకులను, అభిమానులను క్షమిం చాలని కోరుతున్నాం’ అని సదర్లాండ్ అన్నారు. ఆసీస్ స్థానంలో ఐర్లాండ్ ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ జట్టును అండర్-19 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఐసీసీ ఆహ్వానించింది. మరోవైపు టోర్నీ జరిగే సమయంలో అన్ని జట్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు పేర్కొంది. టోర్నీ నుంచి ఆసీస్ వైదొలగడం బా ధాకరమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అన్నారు. -
అండర్ - 19: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఔట్
దుబాయ్: ఐసీసీ అండర్ - 19 ప్రపంచ కప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారమిక్కడ భారత్‌కు, ఇంగ్లండ్‌కు మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటిమి పాలైంది. దీంతో అండర్ -19 ప్రపంచ కప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇండియా నిష్ర్కమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో ఐదు బంతులు మిగులుండగానే 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ ఆటగాడు డక్కెట్ట్ 61 పరుగులు చేయగా, క్లార్క్42 పరుగులు చేశాడు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు టట్టర్సాల్ల్ (23), పించ్(10), భర్నార్డ్ (24), రోడ్స్ (10) పరుగులు చేశారు. జోన్స్ (28), సేయర్ (10)లు నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిషర్ 3 వికెట్లు తీసుకోగా, విన్స్టేడ్,సేయర్, హిగ్గిన్స్, తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో హుడా (68), జోల్ (48), కులదీప్ యాదవ్ (16), బెయిన్స్ (3) పరుగులు చేయగా, ఖాన్ (52), మిల్లంద్ (7)లు నాటౌట్‌గా నిలిచారు. భారత్ బౌలర్లు కులదీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, మెనూ కుమార్, హుడా, గనీ, మిల్లంద్లు తలో వికెట్ తీసుకున్నారు. -
పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోటీలలో భారత్ బోణి కొట్టింది. పాకిస్థాన్‌పై 40 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఆ తరువాత రంగంలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 48.4 ఓవర్లకు 222 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.