అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఆటగాడు ముషీర్ ఖాన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్(118)సెంచరీతో సత్తాచాటాడు.
ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 325 పరుగులు చేశాడు. కాగా ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు స్వయానా ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. నిన్న ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌కు భారత సెలక్టర్ల నుంచి పిలుపు రావడం.. ఈ రోజు తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ముషీర్‌తో పాటు ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment