Musheer Khan
-
‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్‌కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్‌కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్‌కు గురై మ్యాచ్‌కు దూరమైన ముషీర్‌కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్‌కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్‌గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్‌లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్‌నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్‌కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
‘అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ’
తన ఆరోగ్యం బాగానే ఉందని భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తెలిపాడు. ఆ దేవుడి ఆశీసుల వల్లే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడని.. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఇరానీ కప్-2024లో పాల్గొనేందుకు ఈ ముంబై ఆటగాడు... తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ మెడ భాగంలో గాయాలయ్యాయి.మా నాన్న కూడా నాతోనే ఉన్నారుఅయితే, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వేగంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముషీర్ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ వంటిదని పేర్కొన్నాడు. ‘నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా బాగానే ఉన్నారు.ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్ సంఘం (ఎమ్సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ముషీర్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. కాగా టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ-2024లో ముషీర్ భారీ శతకం సాధించాడు. రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఈ క్రమంలో రంజీ చాంపియన్ ముంబైతో రెస్టాఫ్ ఇండియా ఆడే ఇరానీ కప్-2024 మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అయితే, ఈ రెడ్‌బాల్ టోర్నీ మ్యాచ్ ఆడేందుకు లక్నోకు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా అతడు అక్టోబర్ 1 నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్‌తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. చదవండి: పూరన్ సుడిగాలి శతకం View this post on Instagram A post shared by Naushad Khan (@musheerkhan.97) -
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్‌కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్‌తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్‌తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్‌తో పాటు.. రంజీ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు?
ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొదరుడు ముషీర్ ఖాన్ దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో దుమ్ములేపిన ముషీర్ ఖాన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సైతం ఆకట్టుకుంటున్నాడు.ఈ టోర్నీలో ఇండియా-బి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్.. ఇండియా-ఎ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 181 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.బీసీసీఐ బంపరాఫర్..ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఆసీస్ పర్యటనకు భారత-ఎ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముషీర్ ఖాన్‌పై భారత సెలక్టర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. అతడిని భారత-ఎ జట్టుకు ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు రాజస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్‌ను సైతం ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ యోచిస్తోందంట.అదే విధంగా భారత-ఎ జట్టుతో పాటు ఇద్దరు టెస్టు స్పెషలిస్ట్‌లు, సీనియర్ జట్టుకు ఆడే పేస్ బౌలర్లను బీసీసీఐ ఆసీస్‌కు పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏడాది నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. -
ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్
బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్ ముషీర్ ఖాన్ లెగ్ సైడ్ దిశగా ఆడిన షాట్‌ను జురెల్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుత క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. The Dhruv Jurel stunner in Duleep Trophy. 🤯🙇♂️pic.twitter.com/Rteg0d0CX8— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2024ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జురెల్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4), ముషీర్ ఖాన్ (0), నితీశ్ రెడ్డి విఫలం కాగా.. సర్ఫరాజ్ ఖాన్ (46), రిషబ్ పంత్ (61) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్ తలో 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్‌మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/62), నవ్‌దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) సత్తా చాటారు.ముషీర్ భారీ శతకం..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ (181) భారీ శతకంతో చెలరేగడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. -
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో తడబడి మళ్లీ నిలదొక్కుకుంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ ఖాన్ (181), నవ్‌దీప్ సైనీ (56) ఇండియా-బి ఆదుకున్నారు. ముషీర్ భారీ శతకంతో కదంతొక్కడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ.. ఇండియా-బి బౌలర్లు రెచ్చిపోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముకేశ్ కుమార్ (3/62), నవ్‌దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) ధాటికి ఇండియా-ఏ 231 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్‌మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ఇండియా-బి బ్యాటర్ ముషీర్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముషీర్ 6 బంతులు ఎదుర్కొని ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో దృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముషీర్‌తో పాటు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4) కూడా విఫలమయ్యారు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-బి స్కోర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులుగా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (28), రిషబ్ పంత్ (24) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా-బి 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్‌కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్‌జోన్‌తో మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్‌ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 202/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-బి టీమ్.. అదనంగా 119 పరుగులు చేసి తమ మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముషీర్ ఖాన్ అదుర్స్..ఇక తొలి రోజు ఆటలో సెంచరీతో చెలరేగిన భారత-బి జట్టు బ్యాటర్ ముషీర్ ఖాన్.. రెండో రోజు కూడా తన మార్క్‌ను చూపించాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. బి జట్టు 321 పరుగులు చేయడంలో ముషీర్ కీలక పాత్ర పోషించాడు.ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా కన్పించిన ముషీర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఓటౌయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 373 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 181 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్ నవ్‌దీప్ సైనీ కీలక నాక్ ఆడాడు. 144 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. ఇక టీమ్-ఎ బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్, ఖాలీల్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
కుల్దీప్ భాయ్‌తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
దేశీవాళీ క్రికెట్లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్‌దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్‌గా నిలిచాడు.ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్‌ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్‌కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ భాయ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్‌లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. -
టీమిండియా ఫ్యూచర్ స్టార్.. ముషీర్ ఖాన్
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్‌లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్) మెరిశాడు. ముషీర్ తన సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా క్రీజ్‌లో నిలదొక్కుకుని అద్భుత శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్.. నవ్‌దీప్ సైనీతో (29 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.తొలి మ్యాచ్‌లోనే సెంచరీ..19 ఏళ్ల ముషీర్ దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. వయసు ప్రకారం చూస్తే ముషీర్ ఇండియా-బి జట్టులో అందరికంటే చిన్నవాడు. ముషీర్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో కేవలం 11 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్‌లో సెకెండ్ హైయ్యెస్ట్ రన్గెటర్ అయిన ముషీర్.. గత రంజీ క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆతర్వాత సెమీస్‌లో హాఫ్ సెంచరీ.. ఫైనల్లో సెంచరీ చేశాడు.టీమిండియా ఫ్యూచర్ స్టార్..ముషీర్ బ్యాటింగ్ స్టయిల్ చాలా క్లాస్‌గా ఉంటుంది. ముషీర్ ఇప్పటికే తానెంటో రుజువు చేసుకున్నాడు. ముషీర్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముషీర్.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. ముషీర్ భారత్ మిడిలార్డర్లో అన్నకు పోటీ అయ్యేలా ఉన్నాడు. ముషీర్ ఇదే ఫామ్‌ను దులీప్ ట్రోఫీ మొత్తంలో కొనసాగిస్తే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావడం ఖాయం. తనకంటే సీనియర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ విఫలమైన మ్యాచ్‌లో ముషీర్ సెంచరీ సాధించడం హర్షించదగ్గ విషయం. -
Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీ
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్‌లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ముషీర్.. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా తాను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముషీర్‌కు మరో ఎండ్‌లో నవ్‌దీప్ సైనీ (29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకారం అందిస్తున్నాడు. That celebration 🌟#DuleepTrophy2024 | #MusheerKhanpic.twitter.com/ziv0AE6liX— CricTracker (@Cricketracker) September 5, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్, సైనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, వీరు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు. -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్‌గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్‌కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్‌కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్‌తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్ కోసం!
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.అన్నదమ్ముల మధ్య పోటీ?వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్‌తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్‌తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 200 పరుగులు సాధించాడు.తమ్ముడు ఆల్రౌండర్నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్‌క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్‌రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం. -
ఐపీఎల్లో నా పేరు లేకపోవటమే మంచిదైంది: సర్ఫరాజ్ తమ్ముడు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్‌ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్! కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు. ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్. నాన్న చెప్పాడు ‘‘ఐపీఎల్లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్లో చోటు కూడా దక్కుతుందన్నారు. ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్‌ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు. ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్‌లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్కూ నో ఛాన్స్ కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్‌కోట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్‌ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. సచిన్ రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభం నుంచి అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్.. ఇప్పుడు ఫైనల్లో కూడా అదరగొట్టాడు. వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న తుది పోరులో ముషీర్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు చేసి నిరాశపరిచిన ముషీర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం శతకంతో మెరిశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. ముషీర్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ముంబై ఆటగాడిగా ముషీర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల 14 రోజుల వయస్సులో ముషీర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో సచిన్ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో 29 ఏళ్ల సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్ లో నుంచి వీక్షిస్తున్న సమయంలోనే ముషీర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు వాంఖడేకు వెళ్లారు. ఇక ఈ ఏడాది సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 108.25 సగటుతో 433 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్బ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. -
సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్.. విజయం ముంగిట ముంబై
రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 141/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ మరో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఆటగాడు, ముంబై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 14 నెలల తర్వాత అతడికిది తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే(73), శామ్స్ ములాని(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ 3, ఆదిత్య థాక్రే, అమన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ.. ముంబై బౌలర్ల దాటికి 105 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ముంబై.. విధర్భకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
రాణించిన రహానే, ముషీర్ ఖాన్.. టైటిల్ దిశగా ముంబై
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు మూడో వికెట్‌కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. -
వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్ తండ్రి?! నిజం ఇదీ..
తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ స్పందించాడు. తన పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. యువ క్రికెటర్లు ఎవరూ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కవద్దని.. తాను ఏ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించడం లేదని నౌషద్ ఖాన్ స్పష్టం చేశాడు. కాగా తన ఇద్దరు కుమారులు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లను టీమిండియాకు ఆడించాలన్నది నౌషద్ కల. ఇందుకోసం వారిద్దరిని చిన్ననాటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించి.. అనేక కష్టనష్టాలకోర్చి కోచ్‌గా శిక్షణనిచ్చి మెంటార్‌గా మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్, ముషీర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తండ్రి పేరును నిలబెడుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి.. ముషీర్ ఖాన్ ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్‌కోట్‌లో టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో నౌషద్ ఖాన్ కూడా కొడుకు పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల మనసును మెలిపెట్టాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్‌తో పాటు నౌషద్ ఖాన్ పేరు కూడా నెట్టింట మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో.. ‘‘డబ్బులు కడితే ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా లేదంటే దేశవాళీ క్రికెట్లో ఆడే ఛాన్సులు ఇప్పిస్తాం’’ అని నౌషద్ ఖాన్ పేరిట ప్రకటనలు రాగా.. అతడు తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘నా పేరు మీద ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మంది నకిలీ ఖాతాలు సృష్టించి.. ఐపీఎల్ నెట్‌బౌలర్లుగా, రాష్ట్రస్థాయి క్రికెటర్లుగా, అకాడమీ సెలక్షన్ విషయంలో సాయం చేస్తామంటూ డబ్బు అడుగుతున్నారు. దయచేసి వీటిని ఎవరూ నమ్మకండి. మీ ప్రతిభ, హార్డ్వర్క్పైనే నమ్మకం ఉంచండి. నాకు ఏ ఐపీఎల్ జట్టుతోనూ సంబంధం లేదు. అదే విధంగా నేను ఏ జట్టుకు కూడా కోచింగ్ ఇవ్వడం లేదు. నకిలీ ప్రచారాలను నమ్మకండి. థాంక్యూ’’ అని నౌషద్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నామమాత్రపు ఆఖరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1తో గెలిచిన విషయం తెలిసిందే. -
డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ తమ్ముడు..
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఖాన్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ. కాగా ముషీర్ ఖాన్ తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్‌గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముషీర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్‌తో పాటు హార్దిక్ తామోర్(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో సత్తా చాటాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
రంజీ క్వార్టర్ ఫైనల్స్.. రెచ్చిపోయిన ఆంధ్ర బౌలర్లు
రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (ఫిబ్రవరి 23) మొదలయ్యాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో విదర్భ-కర్ణాటక.. రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై-బరోడా.. మూడో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర-తమిళనాడు.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చెలరేగిన ఆంధ్ర బౌలర్లు.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆంధ్ర బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్ర పేసర్లు ఎంపీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శశికాంత్ (4/37), నితీశ్ రెడ్డి (3/50), గిరినాథ్ రెడ్డి (1/40) ధాటికి ఎంపీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో యశ్ దూబే (64) అర్దసెంచరీతో రాణించగా.. హిమాన్షు మంత్రి (49), సరాన్ష్ జైన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సరాన్ష్ జైన్‌కు జతగా కుల్వంత్ కేజ్రోలియా (1) క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీతో కదంతొక్కిన అథర్వ తైడే.. కర్ణాటకతో జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అథర్వ తైడే (109) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కరుణ్ నాయర్ (30), అక్షయ్ వాద్కర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప, కౌశిక్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ముషీర్ ఖాన్ అద్భుత శతకం.. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (128 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. అతనికి జతగా హార్దిక్ తామోర్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా 33, ఆజింక్య రహానే 3 పరుగులు చేసి ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 4, నినాద్ రత్వ ఓ వికెట్ పడగొట్టారు. ఐదేసిన సాయికిషోర్.. తమిళనాడుతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 183 పరుగులకే ఆలౌటైంది. సాయికిషోర్ (5/33) తన స్పిన్ మాయాజాలంతో సౌరాష్ట్ర పతనాన్ని శాశించాడు. అజిత్ రామ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్వక్ దేశాయ్ (83) ఒక్కడే రాణించాడు. సీనియర్ బ్యాటర్ పుజారా (2) విఫలమయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. విమల్ కుమార్ (5) ఔట్ కాగా.. జగదీశన్ (12), సాయికిషోర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
ఓ పక్క అన్న.. మరో పక్క తమ్ముడు.. రఫ్ఫాడిస్తున్న ఖాన్ బ్రదర్స్
ప్రస్తుతం భారత క్రికెట్లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్ బ్రదర్స్ ప్రపంచ క్రికెట్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్.. దేశవాలీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్ట్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంచలనాల ముషీర్.. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగించి, పరుగుల వరద (7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు. శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్ జోన్లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఎందుకంత హైప్.. క్రికెట్లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ ఖాన్ బ్రదర్స్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్, ముషీర్లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్, ముషీర్ల తండ్రి నౌషద్ ఖాన్ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. సర్ఫరాజ్ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. -
శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అయ్యర్ ఆడటం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్ ఆంధ్రతో మ్యాచ్ ఆడి.. 48 పరుగులు చేశాడు. అనంతరం భారత జట్టుతో చేరి తొలి రెండు టెస్టుల్లో భాగమయ్యాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ముంబై బ్యాటర్‌కు స్థానం కల్పించలేదు. ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అయ్యర్ జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి టీమిండియాకు ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ టోర్నీలో తిరిగి అడుగుపెడతాడని భావించగా.. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని ముంబై మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్, ముంబైని క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన శివం దూబే కూడా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ ముంబై జట్టులోకి వచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో క్వార్టర్ ఫైనల్లో ముంబై తలపడనుంది. రంజీ క్వార్టర్ ఫైనల్స్-2024కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, అమోగ్ భత్కల్, భూపేన్ లల్వానీ, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, షామ్స్ ములానీ, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే, ధవళ్ కులకర్ణి, రాయ్స్టాన్ డయాస్. Mumbai squad for Ranji Trophy 2023-2024 Quarter Final match against Baroda to be played from 23rd to 26th February 2024 at MCA Sharad Pawar Cricket Academy, Bandra Kurla Complex, Mumbai. No Shivam Dube & Shreyas Iyer For Mumbai Musheer Khan returns to Mumbai squad… pic.twitter.com/YERqPzA248 — Rajesh Khilare (@Cricrajeshpk) February 20, 2024 -
సెంచరీ వీరుడికి గాయం.. సర్ఫరాజ్ తమ్ముడికి లక్కీ ఛాన్స్!
రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ క్వార్టర్ ఫైనల్‌కు ముందు ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి తీవ్రమైతరమైన నేపథ్యంలో రంజీ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా తరఫున అదరగొట్టిన శివం దూబే.. వెంటనే రంజీ బరిలో దిగాడు. ముంబై తరఫున ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తూ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తూ రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ శతకాలు బాదాడు. చివరగా అసోంతో మ్యాచ్‌లో 140 బంతుల్లో 121 పరుగులు చేసిన దూబే నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు విశ్రాంతి తీసుకున్న ఈ ఆల్‌రౌండర్.. మ్యాచ్ అనంతరం మళ్లీ పక్కటెముల నొప్పితో ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘దూబే గాయపడిన కారణంగా రంజీ ట్రోఫీ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అసోంతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పక్కటెముకలు పట్టేశాయి. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో అతడు మళ్లీ మైదానంలో దిగలేదు’’ అని పేర్కొన్నాయి. కాగా ముంబై తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బరోడాతో తలపడనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు శివం దూబే దూరం కానుండగా.. భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రంజీల్లో పరుగుల వరద పారించి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ తరఫున 338 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్. అదే విధంగా ముంబై తరఫున ఇప్పటి వరకు మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 రన్స్ సాధించాడు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్‌కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్‌కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్‌కప్‌లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తాను ఆడిన ప్రతి షాట్‌ను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్‌మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో ముషీర్‌తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది.