దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్‌లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ముషీర్.. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా తాను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముషీర్‌కు మరో ఎండ్‌లో నవ్‌దీప్ సైనీ (29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకారం అందిస్తున్నాడు.
That celebration 🌟#DuleepTrophy2024 | #MusheerKhanpic.twitter.com/ziv0AE6liX
— CricTracker (@Cricketracker) September 5, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్, సైనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, వీరు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment