Duleep Trophy 2024
-
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్‌కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్‌తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్‌తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్‌తో పాటు.. రంజీ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
2024 దులీప్ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకుంది.350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్ కృష్ణ (3/50), తనుశ్ కోటియన్ (3/47), ఆకిబ్ ఖాన్ (2/26), షమ్స్ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్ పాటిదార్ (7), ఇషాన్ కిషన్ (17), అభిషేక్ పోరెల్ (0) నిరాశపరిచారు.శాశ్వత్ సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్ ఖాన్ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచగా.. అభిషేక్ పోరెల్ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆకిబ్ ఖాన్ తలో 3, షమ్స్ ములానీ 2, తనుశ్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టారు.రాణించిన రియాన్63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్ పరాగ్ (73), శాశ్వత్ రావత్ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కుషాగ్రా (42), మయాంక్ అగర్వాల్ (34), తనుశ్ కోటియన్ (26 నాటౌట్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.That Winning Feeling! 🤗 India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆 The celebrations begin 🎉@IDFCFIRSTBank Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024సాయి సుదర్శన్ పోరాటం వృధా350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.రన్నరప్‌గా నిలిచిన ఇండియా-సిమూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ టైటిల్ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం -
Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం
దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఆరేసిన అర్షదీప్373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రికీ భుయ్ అజేయ శతకంరికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్‌దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలుతొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అనంతపురంలో సూర్యకుమార్ యాదవ్.. 5 పరుగులకే అవుట్ (ఫొటోలు)
-
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
శాంసన్ సూపర్ సెంచరీ.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో విధ్వంసం
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ దేశీవాళీ టోర్నీలో ఇండియా-డికి ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో మూడంకెల స్కోరును అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో వన్డే క్రికెట్‌ను తలపిస్తూ మెరుపు శతకాన్ని సంజూ నమోదు చేశాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 94 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న శాంసన్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూకు ఇది 11వ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సెంచరీ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా-డి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. సంజూతో పాటు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs BAN: జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే? -
DT 2024: శ్రేయస్ నీవు ఇక మారవా? మళ్లీ డకౌట్
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో.. భారత్ ‘డి’ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు.ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో నితీష్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్‌కు చేరాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో శ్రేయస్ ఒక్కసారి మాత్రమే అర్ధ శతకం సాధించాడు. ఓవరాల్‌గా 5 ఇన్నింగ్స్‌లో 20.80 సగటుతో కేవలం 105 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత టెస్టు జట్టులో అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటిలో కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో శ్రేయస్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. శ్రేయస్ నీవు ఇక మారవా? అంటూ పోస్టులు పెడుతున్నారు.చెలరేగిన సంజూ..ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత-డి ఇన్నింగ్స్‌లో అయ్యర్ మినహా మిగితా బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అదే విధంగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
భారత్-సితో మ్యాచ్.. శాశ్వత్ రావత్ అజేయ సెంచరీ
సాక్షి, అనంతపురం: మిడిలార్డర్ ఆటగాడు శాశ్వత్ రావత్ (235 బంతుల్లో 122 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘సి’జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’జట్టు 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ ‘సి’జట్టు బౌలర్ల ధాటికి 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ‘ఎ’జట్టును శాశ్వత్ రావత్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ప్రథమ్ సింగ్ (6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6), హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుషాగ్ర (0) విఫలమయ్యారు. ఈ దశలో షమ్స్ ములానీ (76 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి శాశ్వత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దులీప్ ట్రోఫీలో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్న ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ మరోసారి తన విలువ చాటుకున్నాడు. భారత్ ‘సి’జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తాచాటిన అన్షుల్... ఆరంభంలోనే పదునైన పేస్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. జట్టు స్కోరులో సింహభాగం పరుగులు చేసిన శాశ్వత్ అజేయంగా నిలవగా... అతడితో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; తిలక్ వర్మ (రనౌట్) 5; రియాన్ పరాగ్ (సి) సాయి సుదర్శన్ (బి) విజయ్ కుమార్ వైశాఖ్ 2; శాశ్వత్ రావత్ (నాటౌట్) 122; కుమార్ కుషాగ్ర (సి) ఇషాన్ కిషన్ (బి) విజయ్ కుమార్ వైశాక్ 0; షమ్స్ ములానీ (సి) రజత్ పాటిదార్ (బి) గౌరవ్ యాదవ్ 44; తనుశ్ కొటియాన్ (సి) బాబా ఇంద్రజిత్ (బి) అన్షుల్ కంబోజ్ 10; అవేశ్ ఖాన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: (77 ఓవర్లలో 7 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–11; 2–14; 3–17; 4–35; 5–36; 6–123; 7–154, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 14–2–40–3; గౌరవ్ యాదవ్ 17–7–46–1; విజయ్‌కుమార్ వైశాఖ్ 15–1–33–2; పులి్కత్ నారంగ్ 21–0–58–0; మానవ్ సుతార్ 10–1–38–0. -
సెంచరీకి చేరువలో సంజూ.. భారీ స్కోర్ దిశగా భారత్-డి
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత్ ‘బి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.వికెట్ కీపర్ సంజు సామ్సన్ (83 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) కూడా రాణించాడు. అయితే ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా అయ్యర్ వెనుదిరిగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్, పడిక్కల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందివ్వగా.. రికీ భుయ్, సంజు సామ్సన్ దాన్ని కొనసాగించారు. భారత్ ‘బి’ బౌలర్లలో రాహుల్ చహర్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సామ్సన్తో పాటు సారాంశ్ జైన్ (56 బంతుల్లో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్‌లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దులిప్ ట్రోఫీ-2024 ఫైనల్ రౌండ్ మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇండియా-‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని సూర్య భర్తీ చేయనున్నాడు. కాగా టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా ఈ ముంబై బ్యాటర్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.గాయంతో ఎన్సీఏలో చేరిఈ క్రమంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో సూర్యకుమార్ భాగమయ్యాడు. ముంబై తరఫున ఈ రెడ్‌బాల్ టోర్నమెంట్ బరిలో దిగాడు. అయితే, బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. ఫీల్డింగ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి బొటనవేలికి గాయం కావడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు చేరుకున్నాడు.అక్కడి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న సూర్యకుమార్ పూర్తిగా కోలుకున్నాడని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని ఎన్సీఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఆడేందుకు సూర్యకు మార్గం సుగమమైంది. ఇండియా- ‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. అనంతపురం చేరుకున్న సూర్యకాగా బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఇప్పటికే దులిప్ ట్రోఫీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనంతపురం వేదికగా గురువారం(సెప్టెంబరు 19) నుంచి ఇండియా-‘బి’- ఇండియా- ‘డి’ జట్టుతో తలపడనుంది. ఇందుకోసం 34 ఏళ్ల సూర్య ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఇక ఇప్పటి వరకు.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-‘బి’ దులిప్ ట్రోఫీ-2024లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఇండియా-‘ఎ’పై గెలుపొందడంతో పాటు.. ఇండియా-‘సి’తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్లోకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది. ఇక సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 3-0తో శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక దులిప్ ట్రోఫీ తర్వాత సూర్య బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సిద్ధం కానున్నాడు.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!? -
శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? ఇప్పట్లో అతడు టెస్టు జట్టులో పునరాగమనం చేయడం కష్టమేనా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. స్వయంకృతాపరాధం, నిలకడలేమి ఫామ్ శ్రేయస్ టెస్టు భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చినట్లు తెలుస్తోంది.సెంట్రల్ కాంట్రాక్టు పాయెఈ ఏడాది ఇంగ్లండ్‌తో స్వదేశంలో చివరగా టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి రెండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 104(35, 13, 27, 29) పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్‌పై వేటు పడింది. మిగిలిన మూడు టెస్టులకు అతడిని పక్కనపెట్టింది బీసీసీఐ. అనంతరం రంజీల్లో ఆడాలని ఆదేశించగా.. ఫిట్నెస్ కారణాలు చూపి శ్రేయస్ అయ్యర్ ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉన్నాడు.ఐపీఎల్‌తో జోష్అయితే, పూర్తి ఫిట్‌గా ఉన్నా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశాడన్న కారణంతో బీసీసీఐ అతడిపై కొరడా ఝులింపించింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డందుకు గానూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు.అంతలోనే విఫలంఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ వన్డే రీఎంట్రీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే, టెస్టుల్లో చోటు లక్ష్యంగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీల్లో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. విజయవంతం కాలేకపోతున్నాడు. తొలుత బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ముంబై తరఫున ఆడిన అతడు.. అక్కడ ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా- ‘డి’ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఇప్పటి వరకు 9, 54 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఇప్పటికే అతడిని పక్కన పెట్టేశారు టీమిండియా సెలక్టర్లు. ఇక దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో( 0, 41)నూ అయ్యర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్‌తో రెండో మ్యాచ్‌కు కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఎవరి స్థానంలో? ఎందుకు చోటివ్వాలి?అంతేకాదు.. స్వదేశంలో తదుపరి న్యూజిలాండ్‌తో.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు. ఎవరి స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాలంటారు? దులిప్ ట్రోఫీలో అతడి షాట్ సెలక్షన్లు కూడా ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా! వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు’’ అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.చదవండి: బుమ్రా కాదు!.. అతడితో పోటీ అంటే మస్తు మజా: ఆసీస్ స్టార్ -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్ -
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు.. ఫోటోలు
-
రికీ భుయ్ సూపర్ సెంచరీ
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్ అద్బుతమైన సెంచరీ (195 బంతుల్లో 113; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్‌లో భుయ్ సెంచరీతో మెరిసినా ఇండియా-డికి ఓటమి తప్పలేదు. 488 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి 301 పరుగులకే ఆలౌటై, 186 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భుయ్‌కి జట్టులో ఏ ఒక్క ఆటగాడి నుంచి సహకారం లభించలేదు. సంజూ శాంసన్ (40), శ్రేయస్ అయ్యర్ (41), యశ్ దూబేలకు (37) మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.Ricky Bhui smashed a 4th innings century while chasing 488 in the Duleep Trophy.- Salute, Bhui...!!! 🙇♂️🫡pic.twitter.com/tLnPMvO15w— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షమ్స్ ములానీ (89), తునశ్ కోటియన్ (53) అర్ద సెంచరీలు చేసి ఇండియా-ఏకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. ఇండియా-డి బౌలర్లలో హర్షిత రాణా 4, విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. ఖలీల్ అహ్మద్ (3/39), ఆకిబ్ ఖాన్ (3/41) ఇండియా-డి పతనాన్ని శాశించారు. ఇండియా-డి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.107 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. మయాంక్ అగర్వాల్ (56), షాశ్వత్ రావత్ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.THE WINNING MOMENT FOR INDIA A.- Riyan Parag takes the final wicket, A thumping 186 runs win. 💯 pic.twitter.com/8JnlzIDtja— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం పెద్దది కావడంతో ఇండియా-డికి ఓటమి తప్పలేదు. రికీ భుయ్ వీరోచిత సెంచరీ కూడా ఇండియా-డిని కాపాడలేకపోయింది. ఇండియా-ఏ బౌలర్లలో తనుశ్ కోటియన్ 4, షమ్స్ ములానీ 3 వికెట్లు తీసి ఇండియా-డిని దెబ్బకొట్టారు. చదవండి: ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్ -
ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత-సి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 309/07తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు అదనంగా మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో భారత-సి జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా ఇండియా-బి బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 బ్యాటింగ్), జగదీశన్ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇండియా-సి బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 8 వికెట్లతో చెలరేగాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్-సి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(111) సెంచరీతో చెలరేగా.. మానవ్ సుత్తార్(82), బాబా ఇంద్రజిత్(78) పరుగులతో రాణించారు.చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను -
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్‌లో ఇలాతాజా ఎడిషన్‌లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్‌లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్‌కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్‌కు పోయి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?
దులీప్ ట్రోఫీ-2024ను ఇండియా-డి టీమ్ ఓపెనర్ ప్రథమ్ సింగ్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రథమ్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్ధానంలో భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రథమ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. లెఫ్ట్‌హ్యాండర్ అయిన ప్రథమ్ సింగ్ తన క్లాసిక్ షాట్లతో ఆలరించాడు. హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లను సైతం టార్గెట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఎవరీ ప్రథమ్ సింగ్ నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ప్రథమ్ సింగ్?31 ఏళ్ల ప్రథమ్ సింగ్ ఆగస్టు 31, 1992లో ఢిల్లీలో జన్మించాడు. అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రైల్వేస్‌కు ఆడుతున్నాడు. 2017లో మహారాష్ట్రపై ప్రథమ్ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. సీనియర్ రైల్వేస్ జట్టు తరపున ఆడేమందు.. రైల్వేస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ప్రథమ్ సింగ్.. 35.63 సగటుతో 169 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటివరకు రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రథమ్ ఐపీఎల్లో కూడా భాగమయ్యాడు. 2017లో గుజరాత్ టైటాన్స్ తరపున క్యాష్‌రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20లక్షల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. 2024 సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ జట్టులో ప్రథమ్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ అతడికి కేకేఆర్ తరపున ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు.చదవండి: భారత మాజీ క్రికెటర్‌కు షాక్.. నెల రోజులకే హెడ్‌కోచ్ పోస్ట్ ఊస్ట్?Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
భారత్ ‘సి’తో మ్యాచ్.. ఇండియా ‘బి’ దీటైన జవాబు
సాక్షి, అనంతపురం: టాపార్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాట్‌కు పని చెప్పడంతో... అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో పరుగుల వరద పారుతోంది. భారత్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘బి’ 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు సాధించింది. కెప్టెన్అభిమన్యు ఈశ్వరన్ (91 బంతుల్లో 51 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జగదీశన్ (126 బంతుల్లో 67 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్ ‘బి’ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 401 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ (156 బంతుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అన్షుల్ కంబోజ్ (27 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) ముకేశ్ 58; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ 12; మానవ్ సుతార్ (బి) రాహుల్ చహర్ 82; మయాంక్ మార్కండే (బి) నితీశ్ కుమార్ రెడ్డి 17; అన్షుల్ (బి) రాహుల్ చహర్ 38; విజయ్ కుమార్ వైశాఖ్ (సి) ఈశ్వరన్ (బి) రాహుల్ చహర్ 12; సందీప్ వారియర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం (124.1 ఓవర్లలో ఆలౌట్) 525. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345, 6–382, 7–406, 8–461, 9–489, 10–525, బౌలింగ్: ముకేశ్ కుమార్ 32–4–126–4; సైనీ 23–3–101–1; వాషింగ్టన్ సుందర్ 18–1–67–0; నితీశ్ కుమార్ రెడ్డి 17–2–69–1; సాయికిశోర్ 18–2–78–0; రాహుల్ చహర్ 16.1–2–73–4. భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 51; జగదీశన్ (బ్యాటింగ్) 67; ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: (36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 124. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0– 8–0; విజయ్ వైశాఖ్ 10–2–29–0; అన్షుల్ 8.5–2–30–0; మయాంక్ మార్కండే 5–0–18–0; మానవ్ సుతార్ 10–0–34–0.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
పడిక్కల్ పోరాటం
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్‌లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. పడిక్కల్ ఒక్కడే... భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్‌లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1. -
ఆర్డీటీ స్టేడియంలో దులిప్ ట్రోఫీ.. రెండో రోజు ఇలా(ఫొటోలు)
-
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో ఇండియా-‘డి’ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్‌లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్‌దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్‌దత్ పడిక్కల్ 92 రన్స్‌తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్‌కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్‌లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024