దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా అనంతపూర్ వేదికగా భారత-డి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-సి జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమ్-సి విజయానికి ఇంకా 155 పరుగుల దూరంలో నిలిచింది. అయితే 206/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డి జట్టు.. 236 పరుగులకు ఆలౌటైంది.
అంతకుముందు ఇండియా-సి జట్టు 168 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత-బి జట్టుకు కేవలం 4 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం 4 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన డి జట్టు 236 పరుగులకు ఆలౌటైంది.
దీంతో సి జట్టు ముందు 233 పరుగుల లక్ష్యాన్ని టీమ్ డి ఉంచింది. కాగా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాపచుట్టేసింది.
7 వికెట్లతో చెలరేగిన మానవ్..
ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత-సి జట్టు స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో చెలరేగాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇండియా డి జట్టు విల్లవిల్లాడింది. పడిక్కల్, రిక్కీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఔట్ చేసి డి జట్టును దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మానవ్ సుతార్.. 49 పరుగులతో 7 వికెట్లు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment