దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ టోర్నీలో ఇండియా డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. మరోసారి నిరాశపరిచాడు. ఇండియా-సితో జరిగిన తొలి మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి టచ్‌లో కన్పించిన శ్రేయస్.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.
అనంతపూర్ వేదికగా ఇండియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్ డకౌటయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. ఓ చెత్త షాట్ ఆడి మిడాన్‌లో అయ్యర్ దొరికిపోయాడు.
ఈ మ్యాచ్‌లో అయ్యర్ కూలింగ్ అద్దాలు పెట్టుకుని మరి బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన శ్రేయస్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అయ్యర్ కల ఇప్పటిలో నేరవేరేలా కన్పించడం లేదు.
మరోవైపు బీసీసీఐ అగ్రహానికి గురైన ఇషాన్ కిషన్ మాత్రం అదరగొడుతున్నాడు. ఇండియా-సి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. భారత్-బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో సైతం కిషన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
చదవండి: AFG vs NZ: అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి?
Shreyas Iyer dismissed for a duck in Duleep Trophy 2024 pic.twitter.com/MXJb4IvkKW
— Dev Sharma (@Devsharmahere) September 13, 2024
Comments
Please login to add a commentAdd a comment