ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును అయ్యర్ తన మెరుపు సెంచరీతో అదుకున్నాడు.
కేవలం 133 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 16 ఫోర్లు,4 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ దేశీ, గౌరవ్ యాదవ్, గురువర్దన్ సింగ్, అంకిత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.
రెండో సెంచరీ..
కాగా ఈ టోర్నీలో శ్రేయస్‌కు ఇది రెండో సెంచరీ. ఈ దేశీవాళీ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 138.66 స్ట్రైక్ రేటుతో 312 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ముంబై ఆటగాడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment