vijay hajare trophy
-
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును అయ్యర్ తన మెరుపు సెంచరీతో అదుకున్నాడు. కేవలం 133 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 16 ఫోర్లు,4 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ దేశీ, గౌరవ్ యాదవ్, గురువర్దన్ సింగ్, అంకిత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.రెండో సెంచరీ.. కాగా ఈ టోర్నీలో శ్రేయస్‌కు ఇది రెండో సెంచరీ. ఈ దేశీవాళీ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 138.66 స్ట్రైక్ రేటుతో 312 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ముంబై ఆటగాడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. -
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో శ్రీజిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 101 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అనీష్ కేవీ(82), ప్రవీణ్ దూబే(65) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో జునేద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అయ్యర్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(114) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అయాష్ మాత్రే(78), హార్దిక్ తమోర్(84), శివమ్ దూబే(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విధ్యాదర్ పటేల్, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ముంబై ఓటమి పాలవ్వడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృథా అయిపోయింది. కర్ణాటక రికార్డు..కాగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ చేసిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్ర జట్టు తొలి స్ధానంలో ఉంది. 2011/12 సీజన్లో గోవాపై 384 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేజ్ చేసింది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో
విజయ్ హజారే ట్రోఫీ-2024లో బెంగాల్ యువ సంచలనం అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 273 పరుగుల లక్ష్య చేధనలో పోరెల్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ వంటి స్టార్ బౌలర్లను సైతం అతడు ఊతికారేశాడు. ఓవరాల్‌గా 130 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో 170 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బెంగాల్ జట్టు లక్ష్యాన్ని కేవలం 41.3 ఓవర్లలోనే చేధించింది.లిస్ట్-ఎ క్రికెట్లో అభిషేక్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కాగా వైట్‌బాల్ క్రికెట్లో అభిషేక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలతో దుమ్ములేపిన అబిషేక్.. ఇప్పుడు అదే దూకుడును విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. మరోవైపు 22 ఏళ్ల అభిషేక్ పోరెల్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకుంది. రిషబ్ పంత్‌ను ఢిల్లీ వదిలేయడంతో అభిషేక్ పూర్తి స్దాయి వికెట్ కీపర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గత సీజన్లో పోరెల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 152.00 స్ట్రైక్ రేటుతో 360 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ రిటైన్ చేసుకుంది.చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!? -
ఫైనల్లోనూ అదే దూకుడు.. సెంచరీతో చెలరేగిన రుత్‌రాజ్ గైక్వాడ్
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కూడా మహారాష్ట్ర కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. సౌరాష్ట్రతో ఫైనల్లో రుత్‌రాజ్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఈ టోర్నీలో రుత్‌రాజ్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. కాగా అస్సాంతో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన రుత్ రాజ్.. తమ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు ఉత్తర్ ప్రదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో ఏకంగా 220 పరుగులు సాధించాడు. రుత్‌రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సౌరాష్ట్ర టార్గెట్ 249 పరుగులు ఇక ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో రుత్‌రాజ్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక సౌరాష్ట్ర బౌలర్లో చిరాగ్ జానీ మూడు వికెట్టు పడగొట్టగా.. ఉనద్కట్, భట్, మన్కడ్ తలా వికెట్ సాధించారు. చదవండి: IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం -
IPL 2022 Auction: అతడి కోసం మూడు జట్లు పోటీ.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే!
విజయ్-హజారే ట్రోఫీని తొలిసారి గెలిచి హిమాచల్ ప్రదేశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ అద్భుత విజయంలో ఆ జట్టు కెప్టెన్ రిషి ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో 458 పరుగులతో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో రానున్న ఐపీఎల్ మెగా వేలంలో అతడిని దక్కించకోనేందుకు చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు జట్లు అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2022 వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలంజ్సర్ బెంగళూరు జట్లు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2022 వేలానికి ముందు కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జేను రీటైన్ చేసుకుంది. కాగా సరైన ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడంతో రిషి ధావన్‌పై డిసీ కన్నేసినట్లు సమాచారం. అతడి కోసం ఎంత మొత్తం అయినా వెచ్చించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs Wi- Kieron Pollard: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి లేదంటే..’.. అవునా? -
Shikhar Dhawan: ధావన్ కథ ముగిసినట్టేనా..!
ఓపెనర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన శిఖర్ ధావన్ తిరిగి భారత జట్టుకు ఆడడం సందేహంగా మారింది. కొద్ది రోజులు క్రితం ధావన్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీకు ఆడుతున్న ధావన్ వరుసగా విఫలం అవుతున్నాడు.ఈ క్రమంలో ప్రస్తుతం ధావన్ ఆట తీరు జట్టు ఎంపికలో కీలకం కావచ్చు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ కేవలం 26 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. జార్కండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే సాధించి పెవిలియన్‌కు చేరాడు. కాగా శనివారం (డిసెంబర్-11) ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. అయితే తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి! -
మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్
Tamil Nadu announce squad for Vijay Hazare Trophy Dinesh Karthik Washington Sundar return: త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫి కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 20 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఇక వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్‌కు పర్యటనకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. చేతి వేలి గాయంతో మొదటి టెస్టుకు ముందు జట్టునుంచి తప్పుకున్నాడు. చదవండి: IND-A Vs SA-A: తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా... ఇక ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు పాల్గొనలేదు. అయినప్పటికీ కర్ణాటకపై ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీను తమిళనాడు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ హజారే ట్రోఫి డిసెంబర్ 8 నుంచి ప్రారంభకానుంది. తమిళనాడు జట్టు: విజయ్ శంకర్ (కెప్టెన్), ఎన్ జగదీశన్, దినేష్ కార్తీక్, సి హరి నిశాంత్, ఎం షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఎం అశ్విన్, సందీప్ వారియర్, ఎంఎస్ వాషింగ్టన్ సుందర్, ఎం సిద్ధార్థ్, బి సాయి సుదర్శన్, వి గంగా శ్రీధర్ రాజు, ఎం మహమ్మద్, జె కౌసిక్, పి శరవణ కుమార్, ఎల్ సూర్యప్రకాష్, బి ఇంద్రజిత్, ఆర్ సంజయ్ యాదవ్, ఎం కౌశిక్ గాంధీ, ఆర్ సిలంబరసన్. చదవండి: ఐపీఎల్-2022 షెడ్యూల్ ఫిక్స్.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్! -
యశస్వి డబుల్ యశస్సు
బెంగళూరు: భారత క్రికెట్లో మరో కొత్త టీనేజీ సంచలనం! సంచలన బ్యాటింగ్ ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్‌వంటి ముంబై మైదానాల నుంచి వచ్చిన మరో కుర్రాడు కొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. ముంబైకి చెందిన యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి 154 బంతుల్లో 17 ఫోర్లు, 12 సిక్సర్లతో 203 పరుగులు సాధించాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన అలన్ బారో 20 ఏళ్ల 276 రోజుల వయసులో చేసిన డబుల్ సెంచరీ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వికి తోడుగా ఆదిత్య తారే (78; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించడంతో ముంబై 50 ఓవర్లలో 3 వికెట్లకు 358 పరుగులు చేసింది. అనంతరం 319 పరుగులకు ఆలౌటైన జార్ఖండ్ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ సింగ్ (77 బంతుల్లో 100; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. పానీపూరి నుంచి పరుగుల వరద వరకు... 11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్ క్లబ్’ క్రికెట్ గ్రౌండ్లో ఒక మూలన ఉండే టెంట్లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. యశస్వి గాథలు ఆజాద్ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్ జ్వాలా సింగ్ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్–19 ముక్కోణపు టోరీ్నలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించిన అతను ఇప్పుడు సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 ఆసియా కప్ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్ విజేతగా నిలిచిన ఆ టోరీ్నలో యశస్వి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా. వీటిని చూస్తే యశస్వి ప్రదర్శన ఒక సంచలన ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని, అతని ఆటలో ఎంత నిలకడ ఉందో అర్థమవుతుంది. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్ తారగా ఆశలు రేపేలా చేసింది. మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం సమయంలో నా సహచరులు లేదా వాళ్ల తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు రావడం చాలా సార్లు చూశాను. నేను మాత్రం ఏదైనా వండుకుంటేనే తినే పరిస్థితి. బ్రేక్ ఫాస్ట్ అనేది దాదాపుగా లేనట్లే. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి పని కానిచ్చేయడమే. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గు పడకపోయేవాడిని. ‘డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది’ అంటూ వారిని అడిగి తినేందుకు సిద్ధపడిపోయేవాడిని.నా పరిస్థితి చూసుకున్నప్పుడు చాలా సార్లు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని. వేసవిలో ప్లాస్టిక్ టెంట్లో పడుకున్నప్పుడు వేడితో చచి్చపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోవడంతో ఆ తర్వాత ఎంత వేడి అయినా టెంట్‌లోకే మారిపోయా. క్రికెట్లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని. బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన చెందిన రోజులు ఉన్నాయి. –యశస్వి జైస్వాల్ లిస్ట్–ఎ క్రికెట్లో భారత్ ‘డబుల్ సెంచరీ’ హీరోలు అంతర్జాతీయ క్రికెట్లో... ►రోహిత్ శర్మ 264 (శ్రీలంకపై, కోల్‌కతాలో 2014) ►రోహిత్ శర్మ 209 (ఆ్రస్టేలియాపై, బెంగళూరులో 2013) ►రోహిత్ శర్మ 208 నాటౌట్ (శ్రీలంకపై, మొహాలీలో 2017) ►సచిన్ టెండూల్కర్ 200 నాటౌట్ (దక్షిణాప్రికాపై, గ్వాలియర్‌లో 2010) ►వీరేంద్ర సెహా్వగ్ 219 (వెస్టిండీస్‌పై, ఇండోర్‌లో 2011) దేశవాళీ క్రికెట్లో... ►శిఖర్ ధావన్ 248 (దక్షిణాఫ్రికా ‘ఎ’పై, ప్రిటోరియాలో 2013) ►కరణ్ కౌశల్ 202 (సిక్కింపై, గుజరాత్లో 2018) ►సంజూ సామ్సన్ 212 నాటౌట్ (గోవాపై, బెంగళూరులో 2019) ►యశస్వి జైస్వాల్ 203 (జార్ఖండ్‌పై, బెంగళూరులో 2019) -
ధోని పోరాడినా...
► జార్ఖండ్‌కు తప్పని ఓటమి విజయ్‌హజారే సెమీఫైనల్లో ఢిల్లీ బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మహేంద్రసింగ్ ధోని (108 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత పోరాటం జార్ఖండ్‌ను పరాజయంనుంచి తప్పించలేకపోయింది. ఢిల్లీతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 99 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రాణా (76 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా, పవన్ నేగి (16 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో చెలరేగాడు. జార్ఖండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 29 పరుగులు ఇవ్వడం విశేషం. అనంతరం జార్ఖండ్ 38 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ధోని మినహా మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఇషాంత్ శర్మ వేసిన ఒకే ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ బాదాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్‌నుంచి అతనికి సహకారం అందకపోవడంతో ఢిల్లీ సునాయాసంగా సెమీస్ చేరింది. యువరాజ్ విఫలం: సెమీస్‌కు హిమాచల్ ఆలూరు: మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ 5 వికెట్లతో పంజాబ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా పంజాబ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. మన్దీప్ సింగ్ (145 బంతుల్లో 119; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, గుర్కీరత్ సింగ్ (35) ఫర్వాలేదనిపించాడు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి భారత జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ (16 బంతుల్లో 5) క్వార్టర్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం హిమాచల్ 49.2 ఓవర్లలో 5 వికెట్లకు 266 పరుగులు చేసింది. రాబిన్ బిస్త్ (135 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు) శతకం సాధించగా, రిషి ధావన్ (41), నిఖిల్ గంగ్తా (39) అండగా నిలిచాడు. గురువారం జరిగే క్వార్టర్స్‌లో తమిళనాడుతో యూపీ, విదర్భతో గుజరాత్ తలపడతాయి.