విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
లక్ష్య చేధనలో శ్రీజిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 101 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అనీష్ కేవీ(82), ప్రవీణ్ దూబే(65) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో జునేద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు.
అయ్యర్ సెంచరీ వృథా..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(114) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అయాష్ మాత్రే(78), హార్దిక్ తమోర్(84), శివమ్ దూబే(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.
కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విధ్యాదర్ పటేల్, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ముంబై ఓటమి పాలవ్వడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృథా అయిపోయింది.
కర్ణాటక రికార్డు..
కాగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ చేసిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్ర జట్టు తొలి స్ధానంలో ఉంది. 2011/12 సీజన్‌లో గోవాపై 384 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేజ్ చేసింది.
చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment