
ఓపెనర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన శిఖర్ ధావన్ తిరిగి భారత జట్టుకు ఆడడం సందేహంగా మారింది. కొద్ది రోజులు క్రితం ధావన్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీకు ఆడుతున్న ధావన్ వరుసగా విఫలం అవుతున్నాడు.ఈ క్రమంలో ప్రస్తుతం ధావన్ ఆట తీరు జట్టు ఎంపికలో కీలకం కావచ్చు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ కేవలం 26 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. జార్కండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ధావన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే సాధించి పెవిలియన్‌కు చేరాడు. కాగా శనివారం (డిసెంబర్-11) ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. అయితే తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.
చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!
Comments
Please login to add a commentAdd a comment