Shikhar Dhawan
-
కోచ్‌లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్‌ను రోల్ చేయడం సహా కోచ్‌లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్‌కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్‌కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్‌కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్‌బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్‌లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్‌ను రోల్ చేయడం, కోచ్‌ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌తో కలిసి జోరావర్‌కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్‌ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్‌కు జతగా మరో ఎండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్‌కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్‌లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్‌లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్‌లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానులను అలరించాడు. -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్‌గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్‌కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్‌ని బట్టి..) -
శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్‌లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్‌కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చిట్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్‌నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్‌లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024 -
భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్‌గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.శుబ్‌మన్ గిల్ రాకతోఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్‌లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్‌మన్ గిల్ రాకతో గబ్బర్ కెరీర్ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్‌లేమి.. మరోవైపు గిల్ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టారు.ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్ ధావన్ ఆగష్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆయేషా ముఖర్జీతో వివాహంఇక ధావన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్‌కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్గా నామకరణం చేశారు.భార్యతో విడాకులు.. కుమారుడు దూరంధావన్- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్‌ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్ సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.ఆ అమ్మాయి ఎవరు?ఈ క్రమంలో ధావన్ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్‌తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా ధావన్ బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్‌కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక View this post on Instagram A post shared by HT City (@htcity) -
‘రోహిత్ గొప్ప నాయకుడు.. ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడకపోయినా..’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప నాయకుడని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. సహచర ఆటగాళ్ల పట్ల సారథి వ్యవహరించే తీరే అన్నికంటే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. కివీస్‌కు 0-2తో సిరీస్ సమర్పించుకుంది. దీంతో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌ల విజయాల(18) పరంపరకు బ్రేక్ పడింది. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ స్పందించాడు. ‘‘క్రికెటర్లుగా మేము కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాం. గెలుపే మా లక్ష్యం. ఇక రోహిత్ గురించి చెప్పాలంటే.. అతడొక గొప్ప నాయకుడు. మ్యాచ్‌లు గెలిచామా? ఓడిపోయామా? అన్న ఫలితంతో సంబంధం లేకుండా.. ఒక జట్టును తీర్చిదిద్దడంలో కెప్టెన్‌గా తన వంతు పాత్ర చక్కగా పోషిస్తాడు.సహచర ఆటగాళ్లతో అతడి బంధం ఎలా ఉందనేదే ముఖ్యం. అవసరమైన వేళ వాళ్లకు అండగా ఉన్నాడా? లేడా అన్నది కూడా ప్రధానం’’ అని శిఖర్ ధావన్ రోహిత్ శర్మను కొనియాడాడు. ఇక కివీస్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ ఆసీస్‌తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో టీమిండియా గొప్పగా రాణిస్తుంది. రోహిత్ తొలి మ్యాచ్ ఆడతాడా? లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో లేనట్లయితే కచ్చితంగా ఆటగాళ్లు అతడి కెప్టెన్సీని మిస్సవుతారు.అయితే, రోహిత్ లేకపోయినా జట్టులోని ప్రతి ఆటగాడు తమ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ప్రస్తుత టీమ్ ఆసీస్‌లోనూ బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నామమాత్రపు మూడో టెస్టు ముంబై వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా వెళ్తుంది. -
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్‌పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్‌పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్‌ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్‌లో ఆడనున్న భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌లో సదరన్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్‌గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్‌కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్‌తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్‌లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్‌ను కాదని.. ధావన్‌ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.వినోదం పంచేందుకు సిద్ధంరిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.రిటైర్మెంట్ అనంతరంఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్ఎల్సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్‌కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్‌కు నిరాశే ఎదురైంది.ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్‌గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆరు జట్లుటీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్‌స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది. -
థాంక్యూ శిఖర్.. లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు: కోహ్లి
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్ననేషనల్ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి ధావన్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గౌతం గంభీర్ వంటి దిగ్గజ క్రికెటర్లు విషెస్ తెలపగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేరాడు. ధావన్‌ను ఉద్దేశించి కోహ్లి ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. గబ్బర్‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో కింగ్ కోహ్లి పంచుకున్నాడు. "శిఖర్.. నీ ఘనమైన అరంగేట్రం నుంచి టీమిండియా అద్భుతమైన ఓపెనర్లలో ఒకడిగా మారేవరకు మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆట పట్ల మీ అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతాము. కానీ మీ లెగసీ మాత్రం కొనసాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్‌ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్‌కు ఆల్ దిబెస్ట్ అని" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. కాగా కోహ్లి, ధావన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఢిల్లీ తరపున జూనియర్ క్రికెట్ కూడా ఆడారు. కాగా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి. Shikhar @SDhawan25 from your fearless debut to becoming one of India's most dependable openers, you've given us countless memories to cherish. Your passion for the game, your sportsmanship and your trademark smile will be missed, but your legacy lives on. Thank you for the…— Virat Kohli (@imVkohli) August 25, 2024 -
తొడగొట్టి చెబుతున్నా...
ఓపెనర్‌గా శిఖర్ ధావన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ధావన్ కెరీర్లో కొన్ని ఆసక్తికర గణాంకాలను చూస్తే...‘నా క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, అభిమానం మూటగట్టుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలకు తిప్పక తప్పదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్లు భారత్ తరఫున ఆడగలిగినందుకు నా హృదయంలో ప్రశాంతత ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ గుర్తుంచుకునే క్షణాలే. ఆటను దాటి బయటకు చూస్తే అంతా కొత్త ప్రపంచమే. నా జీవితంలో భారత్‌కు ఆడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. అది సాధించగలిగాను. భారత్‌కు ఇకపై ఆడబోవడం లేదని బాధపడవద్దు. ఇన్నేళ్లు ఆడగలిగానని సంతోంచు అనేది నా మాట. దాని పట్ల గర్వంగా ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. జై హింద్’ –శిఖర్ ధావన్ 187 తన తొలి టెస్టులో ధావన్ చేసిన పరుగులు. అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు కాగా...85 బంతుల్లో సాధించిన శతకం భారత ఆటగాళ్లందరిలో వేగవంతమైంది. 65.15 ఐసీసీ టోరీ్నల్లో (వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ కలిపి) ధావన్ సగటు అందరికంటే అత్యధికం. 20 ఇన్నింగ్స్‌లలో అతను 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 1238 పరుగులు చేశాడు.18 రోహిత్‌తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. సచిన్–గంగూలీ (21) తర్వాత ఇది రెండో స్థానం.109 తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన ధావన్, ఈ ఫీట్ నమోదు చేసిన పది మంది ఆటగాళ్ళలో ఒకడు.12 విదేశాల్లో ధావన్ సెంచరీల సంఖ్య. భారత్‌లో 5 శతకాలు మాత్రమే అతను సాధించాడు. 6769 ఐపీఎల్లో ధావన్ పరుగులు. ఓవరాల్‌గా కోహ్లి (8004) తర్వాత రెండో స్థానం. 5 ఐపీఎల్లో ఐదు సీజన్లలో ధావన్ 500కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వన్డేల్లో కనీసం 40కు పైగా సగటు, 90కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 5 వేలకు పైగా పరుగులను సాధించిన ఎనిమిది మంది బ్యాటర్లలో ధావన్ ఒకడు -
ఓవైపు గాయం.. అయినా 'గబ్బర్' వీరోచిత సెంచరీ(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌కు కూడా గబ్బర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధావన్.. చివరగా డిసెంబర్ 2022లో భారత జెర్సీలో కన్పించాడు. యువ క్రికెటర్ల రాకతో పాటు ఫామ్ లేమి కారణంగా గబ్బర్ భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే గత రెండేళ్లగా టీమిండియాలో ధావన్ ఆడకపోయినప్పటకి.. ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలను సైతం శిఖర్ అందించాడు.వన్డే ప్రపంచకప్-2019లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ ధావన్ కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ధావన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. అది కూడా తన పుట్టిన రోజున కావడం విశేషం.పోరాట యోదుడు..2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా లీగ్ మ్యాచ్‌లో డిసెంబర్ 5న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతి శిఖర్ ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ ధావన్ మాత్రం తన ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ఆసీస్ బౌలర్లపై గబ్బర్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో నొప్పిని భరిస్తూనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి ఆసియా ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఆ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న ధావన్.. 16 పరుగులతో 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ధావన్‌ను స్కానింగ్‌కు తరలించగా.. బొటన వేలు విరిగినట్లు తేలింది. దీంతో టోర్నీ మధ్యలోనే గబ్బర్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని రిషబ్ పంత్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. కాగా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ అతడి ఐకానిక్ ఇన్నింగ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 🔸 117 runs from 109 balls🔸 16 foursCelebrating @SDhawan25 on his birthday 🎉Relive his match-winning 💯 against Australia from the 2019 ICC Men's Cricket World Cup 📽️ pic.twitter.com/bJ8phF2RpJ— ICC Cricket World Cup (@cricketworldcup) December 5, 2020 -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
అంతర్జాతీయ క్రికెట్‌కు 'గబ్బర్' గుడ్ బై (ఫోటోలు)
-
అరంగేట్రంతోనే వరల్డ్ రికార్డు!
భారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా ధావన్ తప్పుకున్నాడు. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురిచేసింది. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధావన్.. ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో ఎన్నో ఘనతలను కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత ఆరంభాలను ఇచ్చిన ధావన్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దాం.తొలి మ్యాచ్‌లోనే డకౌట్.. అయినా2010లో వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో సిల్వర్ డకౌటై అందరని నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత తన నిలకడ ప్రదర్శనతో ధావన్ జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే వన్డేల్లో తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై తన మొదటి వన్డే సెంచరీ మార్క్‌ను ధావన్ అందుకున్నాడు. ఆ తర్వాత ధావన్ వరుసగా శతకాలు మ్రోత మోగించాడు.టెస్టు అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు..అప్పటికే వన్డేల్లో తన మార్క్‌ను చూపించిన ధావన్.. మార్చి 14, 2013న మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే తన అరంగేట్రంలోనే గబ్బర్ సత్తాచాటాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 85 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 33 ఫోర్లు, 2 సిక్స్‌లతో 187 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తన డెబ్యూలో భీబత్సం సృష్టించిన ధావన్ 'మొహాలీ హరికేన్‌గా పేరు గాంచాడు. ధావన్ డెబ్యూ ఇన్నింగ్స్‌ను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు..2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడడంలో ధావన్‌ది కీలక పాత్ర. ఆ టోర్నీ అసాంతం గబ్బర్ మెరుపులు మెరిపించాడు. 5 మ్యాచుల్లోనే గబ్బర్ ఏకంగా 90.75 సగటుతో 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌పై సెంచరీలతో చెలరేగాడు.చివరి మ్యాచ్ అదే.. భారత స్టార్ ఓపెనర్‌గా ఒక వెలుగు వెలిగిన ధావన్ నెమ్మదిగా తన ఫామ్‌ను కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా యువ క్రికెటర్ల రాకతో ధావన్‌ను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ధావన్ చివరగా భారత్ తరుపన 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఆడాడు.ఓవరాల్‌గా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో గబ్బర్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి.మిస్‌యూ గబ్బర్..ఇక ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మిస్‌యూ గబ్బర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధావన్ ఇకపై కేవలం ఐపీఎల్లో మాత్రం ఆ -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్‌గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్‌ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్‌ను కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్‌రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్‌ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్‌కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్‌కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్‌కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్‌కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్‌లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ పంజాబ్‌ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్‌ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్‌ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్‌పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్‌తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్‌తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్‌తో నేటి మ్యాచ్‌లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లో యాక్టివ్‌గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్‌లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్] -
IPL 2024: పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లో ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ధవన్ పంజాబ్ తదుపరి ఆడబోయే ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ తెలిపాడు. రాజస్తాన్ రాయల్స్‌తో నిన్నటి (ఏప్రిల్ 13) మ్యాచ్‌కు ముందు చివరి నిమిషంలో ధవన్ డ్రాప్ అయ్యాడు. ధవన్ ఏప్రిల్ 26న కేకేఆర్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఈ మధ్యలో పంజాబ్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు ధవన్ దూరం కావడం పంజాబ్‌కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ధవన్ గైర్హాజరీలో పంజాబ్‌ను సామ్ కర్రన్ ముందుండి నడిపించనున్నాడు. రాయల్స్‌తో మ్యాచ్, గత ఐపీఎల్ సీజన్లోనూ కర్రన్ పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, రాయల్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి హెట్‌మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో హెట్‌మైర్ మరో సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఖర్లో అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్‌ను ఝులిపించడంతో పంజాబ్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. అయితే హెట్‌మైర్ మెరుపులు మెరిపించి రాయల్స్‌ను గెలిపించాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్‌మ్యాన్, శ్రేయస్‌లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్‌గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్‌మ్యాన్‌తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్‌ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్‌లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్‌కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్‌మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 GT vs PBKS : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
IPL 2024 GT vs PBKS Live Updates: గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్ 150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. 111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ 71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్ ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4 శుబ్‌మన్ గిల్ ఫిప్టీ.. శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ 123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(46) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్ 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్ల్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్‌మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు విజయం (ఫొటోలు)