IPL 2023, KKR Vs PBKS: Shikhar Dhawan Joins David Warner And Virat Kohli In Elite List With 50 Half-Centuries - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్‌ సరసన

Published Mon, May 8 2023 11:05 PM | Last Updated on Tue, May 9 2023 10:42 AM

Shikhar Dhawan Achieves A Remarkable IPL Feat - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 50 హాఫ్ సెంచరీలు కొట్టిన మూడవ బ్యాటర్‌గా ధావన్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన ధావన్‌ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న ధావన్‌ 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ధావన్‌ ఇప్పటివరకు 50 హాఫ్‌ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.ఇక అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో ధావన్‌ కంటే ముందు డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లి ఉన్నారు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో వార్నర్‌ ఇప్పటివరకు 59 హాఫ్‌ సెంచరీలు సాధించగా..విరాట్‌ కోహ్లి 50 ఆర్థశతకాలు సాధించాడు.
చదవండి: #Glenn Phillips: ఫిలిప్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్‌రేటుతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement