PC: IPL.com
ఐపీఎల్-2023ను పంజాబ్ కింగ్స్ ఓటమితో ముగించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ నిష్క్రమించింది.
188 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకోలేకపోయింది. ఇక తమ చివరి మ్యాచ్‌లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఫీల్డింగ్ తప్పిదాల వల్లే తాము ఓడిపోయామని ధావన్ తెలిపాడు.
"పవర్‌ప్లేలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని వెనుక్కి నెట్టింది. అయితే కుర్రాన్, జితేష్, షారుఖ్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో మంచి స్కోర్‌ను అందించారు. దీంతో మళ్లీ మేము మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చాం. మా బాయ్స్ బౌలింగ్‌లో కూడా పర్వాలేదనపించారు. కానీ ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరిచారు.
ఈజీ క్యాచ్‌లను జారవిడవడం మా కొంపముంచింది. ఈ పిచ్‌పై కనీసం 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుంది. కొన్నిసార్లు బ్యాటింగ్ క్లిక్ అయితే బౌలింగ్‌లో విఫలమయ్యాం. మరికొన్ని సార్లు బౌలింగ్‌లో రాణిస్తే బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. ఈ మ్యాచ్‌లోనూ ఈ రెండు విభాగాల్లో ఒక యూనిట్‌గా రాణించలేకపోయాం.
మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. మేము ఈ సీజన్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము కొన్ని విభాగాల్లో అద్భుంగా రాణించాం. ఇక ఈ మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో మా ప్రధాన బౌలర్లను ముందే ఉపయోగించాను. కాబట్టి రాహుల్ చాహర్ చివరి ఓవర్‌ని వేయాల్సి వచ్చింది" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధావన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఢిల్లీతో సీఎస్‌కే కీలక పోరు.. గెలిస్తే ప్లే ఆప్స్‌కు! లక్నో కూడా
Comments
Please login to add a commentAdd a comment