రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్‌ ధావన్‌​.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు | DY Patil T20 Cup In Mumbai: Shikhar Dhawan Makes Strong Comeback, Dinesh Karthik Out For 0, Details Inside - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan: రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్‌ ధావన్‌​.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు

Published Thu, Feb 29 2024 8:53 AM | Last Updated on Thu, Feb 29 2024 10:18 AM

Shikhar Dhawan makes strong comeback - Sakshi

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖన్‌ ధావన్‌ ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. డివై పాటిల్ టీ20 కప్‌లో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్‌ ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం పూణే వేదికగా టాటా స్పోర్ట్స్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో ధావన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం  28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లుతో 39 పరుగులు చేశాడు.  అయితే దురదృష్టవశాత్తూ ధావన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో డివై పాటిల్ బ్లూ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టాటా స్పోర్ట్స్‌ క్లబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

టాటా బ్యాటర్లలో అపూర్వ వాంఖడే(83) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. డివై పాటిల్ బ్లూ బౌలర్లలో కెప్టెన్‌ విపుల్‌ కృష్ణణ్‌ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్‌ బ్లూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో తమ విజయానికి కేవలం ఒక్కపరుగు దూరంలో డివై పాటిల్‌ బ్లూ జట్టు నిలిచిపోయింది.
చదవండిBabar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం..!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement