భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్‌’తో శిఖర్‌ ధావన్‌! వీడియో వైరల్‌ | Shikhar Dhawan spotted with Mystery Girl After Divorce With Ayesha Mukherjee | Sakshi
Sakshi News home page

భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్‌’తో శిఖర్‌ ధావన్‌! వీడియో వైరల్‌

Nov 4 2024 4:12 PM | Updated on Nov 4 2024 4:55 PM

Shikhar Dhawan spotted with Mystery Girl After Divorce With Ayesha Mukherjee

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్‌’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్‌ ధావన్‌ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

శుబ్‌మన్‌ గిల్‌ రాకతో
ఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్‌.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్‌లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్‌మన్‌ గిల్‌ రాకతో గబ్బర్‌ కెరీర్‌ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్‌లేమి.. మరోవైపు గిల్‌ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టారు.

ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా గిల్‌ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్‌ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్‌ ధావన్‌ ఆగష్టులో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఆయేషా ముఖర్జీతో వివాహం
ఇక ధావన్‌ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్‌ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్‌కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్‌గా నామకరణం చేశారు.

భార్యతో విడాకులు.. కుమారుడు దూరం
ధావన్‌- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్‌ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్‌ సోషల్‌ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.

ఆ అమ్మాయి ఎవరు?
ఈ క్రమంలో ధావన్‌ తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్‌తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్‌ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్‌ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. 

కాగా ధావన్‌ బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్‌ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్‌కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్‌ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!

చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement