వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..! | Women Hang Onto Moving Train After Delay Of Kalyan Ladies Special Goes Viral | Sakshi
Sakshi News home page

వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!

May 12 2025 5:12 PM | Updated on May 12 2025 5:23 PM

Women Hang Onto Moving Train After Delay Of Kalyan Ladies Special Goes Viral

హైదరాబాద్‌ ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రజలు రాకపోకలకు లోకల్‌ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. అది కామన్‌. అయితే ముంబై నగరంలోనో ఓ లేడీస్‌ స్పెషల్‌ ట్రైన్‌ కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏ రేంజ్‌లో రద్దీగా ఉందో చూస్తే షాకవ్వుతారు. అది కూడా అమ్మాయిలే ఫుట్‌బోర్డుపై వేళ్లాడుతూ వెళ్తున్న విధానం చూస్తే నోటమాట రాదు. మరి అదెక్కడ జరిగిందో చదివేయండి మరీ..

ముంబై మహానగరం అంతటా లక్షలాదిమంది ప్రయాణికులు ఈ లోకల్‌ రైళ్లపై ఆధారపడతారు. ఈ స్థానిక రైళ్లే ముంబైలోని వివిధ శివారు ప్రాంతాలను అనుసంధానించడంతో.. అక్కడ నివాసితులకు ఈజీగా రాకపోకలు సాగించడంలో కీలక పాత్రపోషించేది అవే. ఐతే అలాంటి ఓ రైలు మహిళతో ఫుల్‌ అయ్యి ఉన్నవీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. 

అదికూడా మహిళలే ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై కళ్యాణ్‌ లేడీస్ స్పెషల్ లోకల్‌ రైలులో చోటుచేసుకుంది. అయితే ఆ రైలు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంతలా హౌస్‌ఫుల్‌ అయ్యినట్లు సమాచారం. ఏకంగా మహిళలు కూడా ఏ మాత్రం భయపడకుండా ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే అత్యంత షాకింగ్‌ గురిచేసే విషయం. 

అందుకు సంబంధించిన వీడియోని  ముంబౌ రైల్వే యూజర్స్ ఎక్స్‌ అకౌంట్‌ షేర్ చేసింది. అయితే నెటిజన్లు ఈ అసురక్షితమైన జర్నీలకంటే మరొక రైలు కోసం ఎదురుచూడటం మంచిదని పోస్ట్‌ చేయగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన జర్నీలు తమ కుటుంబాలకు శాశ్వతాన్ని బాధను మిగులుస్తాయని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ హగ్‌ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement