women
-
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్‌లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్‌లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్‌కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్‌లైట్‌ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
మిల్లెట్ ఫ్యాక్టరీ.. ఆమెకు ఆర్థిక బలం
‘మిల్లెట్స్‌లో పోషకాలుంటాయి. అందుకే వాటిని పునర్వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు మహిళా రైతులు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే దారిలో మామిడిపాలెంలో మహిళలే నిర్వహిస్తున్న ‘మిల్లెట్ ఫ్యాక్టరీ’ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. పాడేరు, అరకు ఏజెన్సీలో పండే చిరుధాన్యాలనుప్రాసెస్ చేసి దేశమంతా మార్కెట్ చేయడమేకాక, చిరుధాన్యాలతో వివిధ రకాల రుచికరమైన వంటకాల కోసం రెస్టారెంట్ కూడా నిర్వహిస్తున్నారు.పంట పండిన వెంటనే కొనడానికి తమను వెదుక్కుంటూ ఎవరూ రారని ముందే గుర్తించారు మామిడిపాలెం మహిళా రైతులు. పంట వేయడానికి ముందే మిల్లెట్స్‌కి మార్కెట్ ఎక్కడ ఉంది అని ఆరా తీశారు. ఆ విషయంలో ఒక ఎన్జీఓ వీరికి సహాయపడింది. మిల్లెట్స్ పండించినంత మాత్రాన ఆదాయం రాదని, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చినపుడే డిమాండ్ ఉంటుందని తెలుసుకున్నారు. దానికోసం వారి ఊరి మధ్యనే ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ పెట్టి చిరుధాన్యాలతో సేమియా, ఇడ్లీ, దోసె పిండి తయారు చేసి ΄్యాకింగ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ ఫ్యాక్టరీ సమీపంలో ఒక మిల్లెట్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి, సజ్జల జంతికలు, జొన్నల స్నాక్స్, అరికల అప్పడాల రుచి చూపిస్తున్నారు. ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి మార్కెట్ వాళ్లను వెతుక్కుంటూ వస్తుంది! ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ వల్ల ఏజెన్సీ రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించింది. మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చిరుధాన్యాలు పండించుకొని ఇక్కడేప్రాసెస్ చేయించుకొని లాభాలుపొందుతున్నారు. ఈ మిల్లెట్స్ మిల్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండొందలకు పైగా మహిళలకు ఉపాధి దొరికింది. ‘ఒకప్పుడు పశువులను మేపుకునే దానిని. మాకు దగ్గరే ఈ మిల్లెట్ ఫ్యాక్టరీ పెట్టాక ఇక్కడ పని దొరికింది. స్థిరమైన ఆదాయం వస్తోంది. దాంతో పిల్లలను చదివించుకుంటున్నాను’ అన్నారు మామిడిపాలేనికి చెందిన నూకరత్నం. ‘మాకు కొంతపొలం ఉన్నా దాని మీద వచ్చే పంటతో ఏడాదంతా బతకడం కష్టం అయ్యేది. కొన్నిరోజులు కూలి పనులకు వెళ్లేదానిని. అది కూడా అన్నిసార్లూ దొరికేది కాదు. ఈ ఫ్యాక్టరీలో చేరాకే మిల్లెట్స్ గొప్పతనం తెలిసింది. కనీస మద్దతు ధర దొరుకుతోంది’ అని సంతోషంగా చెప్పింది విజయ. వర్షాధార భూముల్లో అరుదైన సంపదను సృష్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చారు. సుస్థిర జీవనోపాధిపొంది ఏడాదికి రూ.కోటికి పైగా బిజినెస్ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన ఆత్మవిశ్వాసం, నమ్మకం సంపాదించారు. – శ్యాంమోహన్ఫ్యాక్టరీ ప్రత్యేకతలుఈ ఫ్యాక్టరీలో తొమ్మిది రకాల చిరుధాన్యాలుప్రాసెస్ చేస్తారు. బ్రాండెడ్ ΄్యాకింగ్ చేసి దాని మీద ఏ మిల్లెట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో స్పష్టంగా వివరాలిస్తారు ∙చిరు ధాన్యాలపై పోషకాలు ఎక్కువగా ఉండే లేయర్ తొలగించకుండా కేవలం పై పొట్టు మాత్రమే మర పట్టే యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. అందుకే మార్కెట్లో దొరికే వాటికంటే వీరి మిల్లెట్స్‌లో పోషకాలు ఎక్కువ. అన్నిరకాల మిల్లెట్స్‌ని ఇక్కడప్రాసెస్ చేయడం వల్ల రైతులు కూడా అన్ని రకాలు పండించడం మొదలు పెట్టారు. దీనివల్ల క్రాప్‌డైవర్సిటీ పెరిగింది.ఒక అధ్యయనం తరువాత...పాడేరు, అరకు ఏజెన్సీలో మిల్లెట్స్ ఉత్పత్తి పెరిగింది కానీ మార్కెటింగ్ సదుపాయాలు లేవు.ప్రాసెసింగ్ సదుపాయాలు లేవు. అపుడొక అధ్యయనం చేసింది ‘వాస¯Œ ’ స్వచ్ఛంద సంస్థ. సామలు, సజ్జలను ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కొని నాసిక్లోనిప్రాసెసింగ్ మిల్స్‌కి పంపుతున్నారు. అక్కడప్రాసెస్ చేసి వాటినే ఇక్కడికి తెచ్చి మన మార్కెట్లోకి అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల స్థానిక రైతులకు రేటు, తూకం దగ్గర మోసాలు జరుగుతున్నాయి. ఇదంతా గమనించాక సొంతంగాప్రాసెసింగ్ యూనిట్ పెడితే స్థానికంగా రైతులకు మేలు జరుగుతుందని గుర్తించాం. మహిళలతో మిల్లెట్ ఫ్యాక్టరీప్రారంభించాం’ అంటారు మార్కెటింగ్ నిపుణుడు శ్రీనివాస్. ఈయన ముడిధాన్యాలను నాణ్యమైన ధాన్యాలుగా మార్చడంలో మహిళలకు సాంకేతిక సహకారం అందించారు. -
విటమిన్ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా?
భారతదేశంలో ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ఎముకలను బలహీనపరిచడం, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందనీ, ఈ నేపథ్యంలోనే ఎముకల ఆరోగ్యం గురించి డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ట్ స్టైల్ లిమిటెడ్ ద్వారా.. వరుసగా నాలుగో ఏడాది కూడా 30ఏళ్లకు పైబడిన మహిళల్లో ఎముకల ఆరోగ్య అవగాహనను కల్పించడం , పరీక్ష చేయించుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 49.9శాతం మంది స్త్రీలు ఆస్టియోపెనియా , 18.3శాతం మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మహిళలు తాత్కాలిక అనాల్జెసిక్స్పై ఆధారపడకుండా,అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ద్వారా విటమిన్ డీ , కాల్షింయ లోపంపై అవగాహన కల్పించి, విటమిన్ డి స్క్రీనింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్.. నటి తాప్సీ పన్నూ సైతం పాల్గొన్నారు.అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌తో ,హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భారతదేశంలోని మహిళలకు డీ విటమిన్ టెస్టులను మరోసారి సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పుడు రూ. 1850కు బదులుగా కేవలం రూ. 199 కే విటమిన్ D పరీక్షను పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 నాటి మాంప్రెస్సో అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 98శాతంమంది మహిళలు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీరిలో 87శాతం మందికి ఈ పెయిన్స్, ఎముకల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డీ ఒక ముఖ్యమైన పోషకం. ఈ లోపాన్ని గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. -
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించిందా? క్యాన్సర్ రిస్క్ ఎంత?
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం మామూలే. కానీ రుతుస్రావాలు ఆగిపోయి... ఏడాది కాలం దాటాక మళ్లీ తిరిగి రక్తస్రావం కనిపిస్తుందంటే అదో ప్రమాద సూచన కావచ్చు. అది ఎందుకుజరుగుతోంది, దానికి కారణాలు కనుగొని... తగిన చికిత్స తప్పక చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాతకూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం.ఓ మహిళకు మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు ఆస్కారముంది. అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.చేయించాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తే... అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ వంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో ఎండోమెట్రియం ΄÷ర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అప్పుడు మరికొన్ని పరీక్షలూ చేయించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి, ఇతర వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపించడానికి బదులు అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉండటం జరిగితే అసహజమని గుర్తించాలి. అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించక΄ోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ చేయాల్సి రావచ్చు.ఇతరత్రా కారణాలుండవచ్చు... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన అక్కర్లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే వైద్యులు ముందు ప్రైవేట్ పార్ట్స్ చుట్టుపక్కల ఉండే అవయవాలను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్ ఉన్నా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే...?సాధారణ ఆరోగ్యవంతులైన మహిళల కంటే అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. కుటుంబంలో అనువంశికంగా, తమ ఆరోగ్య చరిత్రలో క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లోని మహిళలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర వివరాలు తెలుసుకోవాలి. చికిత్స అవసరమయ్యేదెప్పుడంటే...ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితంలో ఏమీ లేదని తెలిసినప్పుడూ రక్తస్రావం కనిపించినప్పటికీ భయం అక్కర్లేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే చాలు.బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటే... దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొరమందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు లేదా హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. -
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నగరాలు, పట్టణాలు, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి. మహిళలే టార్గెట్‌గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... ‘చస్తే చావండి.. డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ... మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్‌లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్ చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు. అసలు లక్ష్యం పక్కదారి పట్టి.. స్పందన, కీర్తన, ఫిన్‌కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్ బ్యాంకు, ఆశీర్వాద్ బ్యాంకు, ఎఫ్‌ఎఫ్‌ఎల్, ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి. వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు తెలంగాణలోనూ పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే.. పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకే అంటూ.. 2008లోనూ ఇలాగే మైక్రో ఫైనాన్స్ వేధింపులు పెరిగిపోవడంతో.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్లపై కొంతకాలం మారటోరియం విధించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2010 అక్టోబర్ 14న ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్బీఐ నిబంధనలంటూ దందాకు శ్రీకారం చుట్టాయి. సంపాదన.. అప్పు, వడ్డీ కిందకే పోతోంది చిన్న వ్యాపారానికి పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.85 వేల రుణం తీసుకున్నాం. వారానికి రూ.1,400 చొప్పున 90 వారాలు చెల్లించాలి. రోజూ గిన్నెలు విక్రయించగా వచ్చే మొత్తంలో కొంత ఇంటి అవసరాలకుపోగా మిగతా అంతా ఫైనాన్స్‌కు చెల్లిస్తున్నా. ఒక్కోసారి వ్యాపారం సాగకపోయినా వాయిదా మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా జమానత్ ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ చిన్నపాటి వ్యాపారంతో సంపాదించిందంతా అప్పు, వడ్డీకే పోతోంది. – బానాల శంకర్, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా అటువంటి రుణాలతో మోసపోవద్దు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అధిక వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా భద్రత, సెక్యూరిటీ లేని సంస్థల నుంచి రుణాలు పొందేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లోన్లతో మోసపోవద్దు. సభ్యులను బ్యాంకు సిబ్బంది లేదా తోటి సభ్యులు ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. – పి.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దుబాసి సాయికృష్ణ (27). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఉండేవారు. ఆయన భార్య రజిత పేరిట మైక్రో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. ఆ వాయిదాలు చెల్లించలేకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నూతి అనిల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు అప్పు చేసి.. ఆ వాయిదాలు కట్టారు. కానీ ఈ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయికృష్ణను నిలదీసిన అనిల్.. అతడి సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లాడు. సాయికృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్ జైలుకు వెళ్లాడు. కానీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు బలవంతపు వసూళ్లు చేస్తున్నా చర్యలు లేవు.నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కిందే మరణించాడు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజులు, బొమ్మలు, దండలు అమ్ముతూ.. కొడుకు, కూతురును పోషించుకుంటోంది. ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.50 వేలు రుణం తీసుకుని వారానికి రూ.5 వేలు చెల్లిస్తోంది. గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైనా రుణం వాయిదా చెల్లించాల్సి వస్తోందని.. లేకుంటే జమానత్ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతోంది. ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్‌లో రుణం తీసుకుని కడుతున్నానని... సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్య
సూరత్ : ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని వార్డ్నెంబర్ 30లో బీజేపీ మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.అయితే, ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తన నివాసంలో దీపికా పటేల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్, కుటుంబసభ్యులు బాధితురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీపికా పటేల్ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.దీపికా పటేల్ మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న దీపికా పటేలా్ బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కాగా, దీపికా పటేల్ భర్త వ్యవసాయం చేస్తుండగా ఆమెకు ముగ్గురు పిల్లలు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మహిళ బర్త్‌డే కేక్ కటింగ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024 -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
వింటర్ వేర్ : గ్రాండ్ వెల్వెట్, ట్రెండీ వెల్వెట్
వింటర్ టైమ్ బ్రైట్‌గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్‌గా తప్పించుకోవాలన్నాఈ సీజన్‌కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్‌గా మదిని దోచేస్తున్నాయి. వెల్వెట్నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి. దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్‌తో డ్రెస్ డిజైనింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్‌కోట్స్, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్‌లో వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్‌గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్‌పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్‌కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్‌గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్‌తో మెరిసిపోయేవీ ఉన్నాయి. -
కోడ్ కూసే..టాలెంట్ నిద్రలేసే..
రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తోన్న ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ బిహార్‌లోని ఎంతోమంది గ్రామీణ యువతులకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తోంది. వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేలా చేస్తోంది...బిహార్‌లోని ఠాకురంజీ గ్రామానికి చెందిన రవీనా మెహ్తో ఒకప్పుడు వంటల్లో, ఇంటిపనుల్లో తల్లికి సహాయపడుతూ ఉండేది. ప్రస్తుతం రవీనా బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో పనిచేయనుంది. బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ప్రారంభించిన ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ లో కోడింగ్ నేర్చుకోవడానికి... ఉన్న ఊరు వదిలి కిషన్‌గంజ్‌కు వచ్చిన 67 మంది యువతులలో రవీనా ఒకరు. 21 నెలల పాటు సాగే ఈ కోర్సులో అరారియా నుంచి గయ వరకు బిహార్ నలుమూలల నుంచి అమ్మాయిలు చేరారు.తరగతులలో ప్రతి ఒక్కరూ తమ ల్యాప్‌టాప్‌లలో పైథాన్, జావాలతో తలపడుతుంటారు. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ‘ఇక్కడికి రావడానికి ముందు ల్యాప్‌టాప్ కూడా వాడని వారు వీరిలో ఉన్నారు. జీరో నుంచి శిక్షణ ప్రారంభించాం. తక్కువ టైమ్‌లోనే చాలా చక్కగా నేర్చుకుంటున్నారు’ అంటుంది ట్రైనర్లలో ఒకరైన ప్రియాంక దంగ్వాల్. గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన మహిళలు మన దేశంలోని ఐటీ పరిశ్రమలలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేయడానికి నవగురుకుల్, ప్రాజెక్ట్ పొటెన్షియల్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ను ప్రారంభించాయి.కాణీ ఖర్చు లేకుండా సంస్థలో ఉచితంగా కోర్సు నేర్చుకోవడానికి అవకాశం వచ్చినా రవీనాలాంటి వాళ్లకు ఇంటి పెద్దల నుంచి అనుమతి అంత తేలికగా దొరకలేదు. ‘తల్లిదండ్రుల నుంచి అనుమతి కోసం దాదాపు యుద్ధంలాంటిది చేశాను. మొదట అమ్మను, ఆ తరువాత అమ్మమ్మను చివరకు ఇరుగు పొరుగు వారిని కూడా ఒప్పించాల్సి వచ్చింది. నా జీవితాన్ని మార్చే అవకా«శం కోసం పోరాడాను’ అంటుంది రవీన. ‘బిహార్‌లో కేవలం 9.4 శాతం మంది మహిళలు మాత్రమే శ్రామిక శక్తి(వర్క్ ఫోర్స్)లో ఉన్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ రేటు ఇది. గ్రామీణ మహిళలకు ఉన్నతోద్యోగాలు చేయడానికి సహాయ సహకారాలు అందించడం, శ్రామిక శక్తిలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం మా ప్రధాన లక్ష్యం’ అంటున్నాడు ‘ప్రాజెక్ట్ పొటెన్షియల్’ వ్యవస్థాపకుడు జుబిన్ శర్మ.కిషన్‌గంజ్‌లో ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. రాయ్‌పూర్, దంతెవాడ, ధర్మశాలలో ఇలాంటి మరో ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి. ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా కూలి పనులు చేసుకునే శ్రామికుల అమ్మాయిలు, ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారి నెలకు పాతిక వేలకు పైగా సంపాదిస్తున్నారు. ‘స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మహిళల సంపాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పితృస్వామిక భావజాలాన్ని దూరం పెట్టడంలో సహాయపడతాయి. మహిళలలో ఆశయాల అంకురార్పణకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి దోహద పడతాయి. కార్పొరేట్ ఇండియా తమ సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి కార్యక్రమాలు పెంచితే, మహిళా సాధికారతలో తమ వంతు పాత్ర పోషించడానికి వీలవుతుంది’ అంటుంది ‘గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్’ ప్రొఫెసర్ విద్యా మహాబరే.రోజూ తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లే అమ్మాయిలు, తల్లితో పాటు ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు, తోచక కుట్లు, అల్లికలతో కాలం వెళ్లదీస్తున్న పల్లెటూరి అమ్మాయిలు... ఐటీ సెక్టార్లో పని చేయడం సాధ్యమా? ‘అక్షరాలా సాధ్యమే’ అని నిరూపిస్తోంది స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్.మొదట్లో కష్టం... ఇప్పుడు ఎంతో ఇష్టంవిద్యార్థులకు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు. వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘మొదట్లో కోడింగ్ నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు కోడ్లతో గేమింగ్‌ను కూడా క్రియేట్ చేస్తున్నాం’ అంటారు విద్యార్థులు. కోడింగ్ నేర్పించడం మాత్రమే కాదు విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడేలా ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’లో శిక్షణ ఇస్తున్నారు.అనగనగా ఒకరోజు...నేను ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు కిషన్‌గంజ్‌లో ఫ్రీ కోడింగ్ స్కూల్ లేదు. బెంగళూరులోని ‘నవగురుకుల్’కు వెళ్లాలనుకున్నాను. అయితే మా పేరెంట్స్ బెంగళూరుకు వెళ్లడానికి ససేమిరా అన్నారు. అయినా సరే వారితో వాదన చేసి రైలు ఎక్కాను. మా కుటుంబం నుంచే కాదు మా ఊరు నుంచి కూడా ఎవరూ బెంగళూరుకు వెళ్లలేదు. నేను బెంగళూరుకు వచ్చిన రోజు భారీ వర్షం కురిసింది. నాకు కన్నడ రాదు. అప్పటికి ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చు. చాలా భయం వేసింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేదు. ఇప్పుడు ఫారిన్ క్లయింట్స్‌తో టకటకా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాను. మూడేళ్ల క్రితం కోడింగ్ కోర్సు పూర్తి చేసిన కవిత ప్రస్తుతం కోల్‌కత్తాలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తోంది. – కవితా మెహ్తో(చదవండి: కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!) -
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
ఆస్టియోపోరోసిస్: 40 ఏళ్లు దాటాక.. ఈ జాగ్రత్తలు తప్పవు లేదంటే రిస్కే!
మామూలుగానే భారతీయుల్లో ఆస్టియో పోరోసిస్ కేసులు ఎక్కువ. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుందంటే దీని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. వారికి ముప్పుగా పరిణమిస్తూ, వారిలో ఇంత విస్తృతంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. మానవులందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకల పెరుగుదల సంభవిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఇవి బలంగానే ఉంటూ, ఆ తర్వాత క్రమంగా తమ బలాన్ని కోల్పోతూ పెళుసుగా మారి΄ోతుంటాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్– ఈస్ట్రోజెన్ తగ్గడం మొదలుకాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతుంది. ఇక రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయి, తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్‌కు కారణమవుతుంది. మహిళల్లోనూ ఈ ముప్పు ఎవరెవరిలో... వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ఈ రిస్క్ మరీ ఎక్కువ పోషకాహార లోపాలున్నవారికి... మన దేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో (మన దేశంలో మహిళల్లో వ్యాయామం చాలా తక్కువ) పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే టమద్యం తీసుకోవడం వల్ల శరీర కణాల (ప్రధానంగా ఎముక కణాల) అభివృద్ధి, పెరుగుదల ప్రభావితం అవుతాయి. ఫలితంగా మద్యం అలవాటు ఉన్నవాళ్లలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది టకుటుంబ చరిత్ర... కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో పోరోసిస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు దీని రిస్క్ ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ – నిర్ధారణ...రక్తపరీక్ష, ఎక్స్–రే, బీఎమ్‌డీ (బోన్ మాస్, డెన్సిటీ – అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధారణ చేయవచ్చు)చికిత్స ఇలా...ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వయసు రిస్క్ తగ్గుతుంది. క్యాల్షియమ్, విటమిన్ ‘డి’...డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్–డిని రోజూ 10 నుంచి 15 ఎంజీ ఇస్తారు. బిస్ఫాస్ఫోనేట్స్...ఇవి ఒక రకం మందులు. వీటినే బిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారి΄ోవడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా కాదా అన్నది డాక్టర్లే నిర్ధారిస్తారు. క్యాల్సిటోనిన్: ఈ మందులు ముక్కు ద్వారా పీల్చే మందుగా లభిస్తాయి. అయితే ఇవి తప్పనిసరిగా డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్: ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్స ప్రక్రియలో ఇది కూడా ఒక మందు. ఇది ఎముకలో పెళుసుబారిన చోట కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేలా దోహదపడుతుంది. ఫలితంగా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ మందును కడుపు ప్రాంతంలోగాని, తొడల ప్రాంతంలోగాని ఇంజెక్షన్ చేయడం ద్వారా శరీరంలోకి పంపుతారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఉపయోగించాల్సి ఉంటుంది. మంచి ప్రభావకారి అయినప్పటికీ ప్రస్తుతం దీని ఖరీదు ఎక్కువ. వికారం (నాసియా), తలనొప్పి, కాళ్లూచేతుల నొప్పి వంటి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా కనిపించే ఈ మందుల దీర్ఘకాల ప్రభావాలు ఇంకా తెలియదు.డోనోసుమాబ్స్: ఇది సరికొత్త మందు. చాలా వేగంగా పనిచేస్తుంది. చవకగా కూడా లభిస్తుంది. తీసుకోవడమూ సులభం.లక్షణాలు... ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. ఇది చాప కింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియో పోరోసిస్గా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు... ఒళ్లు నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్) టఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్) అలసట (ఫ్యాటిగ్నెస్)చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడంసీ, డీ, ఈ, ఎఫ్, జీ, ఎస్.. ఎముకలు వీక్ ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఉపయోగపడే అంశాలను చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ, డీ, ఈ, ఎఫ్, జీ గుర్తు పెట్టుకుంటే చాలు. ‘సి’ ఫర్ క్యాల్షియమ్– అంటే అది ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – అంటే శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – అంటే శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – అంటే శరీరం బరువు కాస్తంత పెరగాలి. అది ఎత్తుకు తగినట్లుగా ఉండాలి. -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
పోస్టాఫీసులకు పోటెత్తుతున్న మహిళలు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్ పోస్టాఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ పథకాల కోసమంటూ..టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్‌సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.అసలు సంగతి ఏమిటంటే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింక్ అయినంత మాత్రానా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింక్ చేస్తున్నా.. సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్ లింకేజీ, సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్ఓ ప్రతి ఏడు నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్) దినంగా పరిగణిస్తోంది.స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత, స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్లైన్ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్ఫెక్ట్గా లేదని తేలింది ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ (డబ్ల్యూపీఎస్)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్‌కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్ కనిపించింది. ఇక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్ వయొలెన్స్ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. ‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్ టాప్స్ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్ కామెంట్ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్‌లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’‘మా అమ్మాయి మంచి అథ్లెట్. కోచింగ్‌కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్‌లోనే స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మహామహులు వినేశ్ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’‘నా సీనియర్ మేల్ కొలీగ్ హెరాస్మెంట్ భరించలేక మేనేజర్‌కి రిపోర్ట్ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్ చేశాడు. దాంతో నా సీనియర్ కొలీగ్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్‌లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక జాబ్‌కి రిజైన్ చేశాను!’ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్‌ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్.. కోల్కత్తా డాక్టర్ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా.. ఆన్లైన్లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్ఓ! అందుకే ఏటా నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమె¯Œ అండ్ గర్ల్స్) దినంగా జరుపుతోంది. పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. మన దగ్గరున్న మహిళా చట్టాలు...గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి.గృహహింస అంటే..గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్)కి సంబంధం లేదు. గృహహింస కింద కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు (15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.ఈ ‘డే’ వెనుక చరిత్రకరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్ రిపబ్లిక్ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్ రిపబ్లిక్లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్ సిస్టర్స్‌గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి రఫైల్ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్‌లోనే పెట్టి, జీప్‌కి యాక్సిడెంట్ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్ రిపబ్లిక్ ప్రజలు "Las Mariposas.. ద బటర్‌ఫ్లైస్’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’కి లోగోగా బటర్ఫ్లైనే నిర్ణయించింది యూఎన్ఓ! ‘మీరాబాల్ సిస్టర్స్’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఆ మీరాబాల్ సిస్టర్స్ గౌరవార్థమే యూఎన్ఓ 1999లో నవంబర్ 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్.. 2020లో ‘హండ్రెడ్ విమెన్ ఆఫ్ ద ఇయర్’ సంచికలో చేర్చింది. పాఠ్యాంశం చేయాలికాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్‌క్రైమ్ ట్రోలింగ్ వద్దే ఆగడంలేదు. మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్‌ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస నార్మలైజ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్ చార్జ్లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులే అడిషనల్ చార్జ్‌లో ఉన్నారు.పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
ఓ హీరో కమిట్మెంట్ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్
సీనియర్ నటి ఖుష్బు సుందర్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. -
విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ
-
ఉన్నత విద్యలో యువతుల హవా
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతుల అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో 2017–18 నుంచి యువకులను యువతులు అధిగవిుంచారు. యువకుల జీఈఆర్ 28.4శాతం ఉండగా.. యువతుల జీఈఆర్ 28.5శాతంగా నమోదైంది. 2017–22 మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)–డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక–2024 వెల్లడించింది. సీఐఐ–డెలాయిట్ సంయుక్తంగా 2017–22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యా రంగం తీరుతెన్నులను విశ్లేషించాయి.ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ....» దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి.» ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017–18లో జీఈఆర్ 24.6శాతం ఉండగా... 2021–22 నాటికి 28.4శాతానికి పెరగడం విశేషం.» ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్ 2017–18లో 25.6శాతం ఉండగా 2021–22నాటికి 28.5శాతానికి పెరిగింది. » ఉన్నత విద్యా సంస్థల్లో యువకుల జీఈఆర్ 2017–18లో 24.6శాతం ఉండగా, 2021–22నాటికి 28.4 శాతానికి చేరింది. ఈ ఐదేళ్లలోను యువతుల జీఈఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.» ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017–18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా... 2021–22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. » ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017–18లో దేశంలో మొత్తం 1,61,412 మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరారు. 2021–22లో ఏకంగా 2,12,522 మంది పీహెడ్డీ కోసం ఎన్రోల్ చేసుకోవడం విశేషం. » పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సుల్లో 2017–18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా... 2021–22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2017–18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా, 2021–22 విద్యా సంవత్సరంలో 3.07కోట్ల మంది ప్రవేశంపొందారు. -
మహిళలు... మరాఠాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండూ చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానారకాలుగా చీలిపోయి కని్పస్తుండటం విశేషం. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో రెండుగా చీలిపోవడం తెలిసిందే.దాంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్ధవ్ వర్గం; అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం తహతహలాడుతున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా; ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహా వికాస్ అఘాడీగా మోహరించాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలనూ మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలావరకు తేల్చనున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలావరకు మహిళలు, మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ఓటింగ్లో మహిళల జోరుమహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. పలు ఎన్నికలుగా ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటెత్తారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కారు పలు పథకాలు, తాయిలాలు ప్రకటించింది. 21–65 ఏళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 అందించే లడ్కీ బహిన్ పథకం అందులో భాగమే. ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను, అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది.వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా రూ.3,000 నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలి్పస్తాని పేర్కొంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 అందిస్తామన్న హామీ కూడా యువతుల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. టేబుల్⇒ మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు ⇒ పురుషులు 4.93 కోట్లు ⇒ మహిళలు 4.6 కోట్లురెబెల్స్ కాకతిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కన్పిస్తున్నారు. ముఖ్యంగా మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కూటమి అభ్యర్థులపై ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు చీల్చే ఓట్లు చాలాచోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన మహాయుతి నేతలను వెంటాడుతోంది.ముఖ్యంగా 62 స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబెల్స్ బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్ చేసింది. వీరికి జంప్ జిలానీలు తోడయ్యారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి! వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కని్పస్తున్నారు.మరాఠా రిజర్వేషన్లుఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటినుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పాటిల్ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదేపదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కని్పంచడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. వారికోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది. రైతులు, నిరుద్యోగంవీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కని్పస్తోంది. ఇటీవలి అకాల వర్షాలు రాష్ట్రంలో సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. దాంతో షిండే సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఎగుమతులపై నిషేధం ఉల్లి రైతులను బాగా దెబ్బ తీసింది. ఇవన్నీ తన పుట్టి ముంచేలా కని్పస్తుండటంతో దాంతో రైతులను ఆకట్టుకునేందుకు మహాయుతి సర్కారు ఆపసోపాలు పడుతోంది. పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది. ఇక మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్న మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. -
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
గాజువాక మార్కెట్ లో మహిళల కొట్లాట
-
ఏమాత్రం సంపాదించారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లు నుంచి సెల్లు వరకూ..రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.సంక్షేమ పథకాల కోతకేనా!?కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై రోజుకు 48 అఘాయిత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.